మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక క్యాష్ ప్రైజ్‌మనీ క్రికెట్ టోర్నమెంట్ ఈనెల 19 నుంచి అంబర్‌పేట్ జీహెచ్‌ఎంసీ మైదానంలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.ధనుంజయ్ గౌడ్ తెలిపారు.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక క్యాష్ ప్రైజ్‌మనీ క్రికెట్ టోర్నమెంట్ ఈనెల 19 నుంచి అంబర్‌పేట్ జీహెచ్‌ఎంసీ మైదానంలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.ధనుంజయ్ గౌడ్ తెలిపారు.
అంబర్‌పేట్ ప్లేగ్రౌండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో తొలి మూడు స్థానాలను పొందిన జట్లకు మొత్తంగా లక్షా 50 వేల నగదు బహుమతులను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలను నాకౌట్ పద్ధతిలో టి20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఈనెల 10లోగా అంబర్‌పేట్ ప్లేగ్రౌండ్స్‌లో ఇవ్వాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 98855-55977, లేదా 99666-67798 లను సంప్రదించవచ్చు.