ప్రేమోన్మాదం విషాదాంతం! పుట్టినరోజే పట్టాలపై.. | Hyderabad Amberpet Minor Boy Killed Self After Attack On Girl For Rejecting Love - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ అంబర్‌పేటలో దారుణం.. ప్రేమోన్మాదం విషాదాంతం! పుట్టినరోజే పట్టాలపై..

Published Fri, Jan 19 2024 10:31 AM | Last Updated on Fri, Jan 19 2024 12:54 PM

Hyderabad Amberpet Minor Boy Killed Self After Attack Girl - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: అంబర్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్‌ బాలుడు(16) ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదన్న కోపంతో బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు శవమై తేలాడు. విద్యానగర్‌ పట్టాలపై తల లేకుండా మొండంతో ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలికను ప్రేమించాలంటూ సదరు బాలుడు వెంటపడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అతని పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందుగానే ఆమె సమక్షంలో కేక్‌ చేయాలని ఆశపడ్డాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో గురువారం సాయంత్రం ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన ఆమె సోదరిని గాయపర్చాడు. దీంతో వాళ్లిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. 


మరోవైపు ఘటన తర్వాత భయాందోళనకు గురైన బాలుడు.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు.

ఇదీ చదవండి: అయ్యో.. సునీత!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement