Jilted lover
-
విశాఖలో కత్తి దూసిన ప్రేమోన్మాదం.. చేతులెత్తేసిన పోలీసులు
విశాఖపట్నం, సాక్షి: అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో బాలికను చిత్రవధ చేసి చంపి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది కత్తి దూశాడు. అయితే ఈ ఘటనలోనూ పోలీసుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వుడా కాలనీ సమీపంలో నివసించే శ్యామల అనే అమ్మాయిని సిద్ధూ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాలేజ్ వద్ద ఆ యువతితో సిద్ధూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు మైనర్ కావడంతో గాజువాక పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడ్ని అరెస్ట్ చేశాడు. అయితే బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సిద్ధూ.. శ్యామలపై కక్ష గట్టాడు. మంగళవారం రాత్రి ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. టపాసులు పేల్చి హ్యాపీ బర్త్‌డే అంటూ నానా హంగామా చేశాడు. ఆపై ఇంట్లోకి దూరి ఫర్నీచర్‌ను పగలకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను చంపాలని ప్రయత్నించాడు. అయితే అది గమనించి ఆమె పారిపోయింది. ఈ క్రమంలో ఆమె తల్లి సావిత్రి అడ్డురావడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. తల్లీకూతుళ్లు కేకలు వేయడంతో స్థానికులు రావడంతో సిద్ధూ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు సిద్ధూ కోసం గాలిస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు.. దాడి తరువాత పరారీ అయిన సిద్ధూ ఆచూకీని 24 గంటలు గడిచినా కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. అయితే.. ఈ ఫోటో లో వ్యక్తి కనిపిస్తే, సమాచారం ఇవ్వండి అంటూ ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. అటు అనకాపల్లి ఘటనలోనూ.. ఇటు ఇప్పుడు పోలీసులు నిందితుల విషయంలో ఇలా ఆలస్యంగా స్పందించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
ప్రేమోన్మాదం విషాదాంతం! పుట్టినరోజే పట్టాలపై..
హైదరాబాద్, సాక్షి: అంబర్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలుడు(16) ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదన్న కోపంతో బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు శవమై తేలాడు. విద్యానగర్ పట్టాలపై తల లేకుండా మొండంతో ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలికను ప్రేమించాలంటూ సదరు బాలుడు వెంటపడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అతని పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందుగానే ఆమె సమక్షంలో కేక్ చేయాలని ఆశపడ్డాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో గురువారం సాయంత్రం ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన ఆమె సోదరిని గాయపర్చాడు. దీంతో వాళ్లిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటన తర్వాత భయాందోళనకు గురైన బాలుడు.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. ఇదీ చదవండి: అయ్యో.. సునీత! -
ఉప్పల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం
హైదరాబాద్: ఉప్పల్ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి నిరాకరించిందని కక్ష పెట్టుకున్న అతను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన యువతి తప్పించుకుని పారి పోయి కుటుంబ సభ్యుల సహకారంతో అసుపత్రిలో చేరింది. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పోలీసులు తెలిపిన మేరకు..హబ్సిగూడ ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ(31) వివాహితుడు. షార్ట్ ఫిలింలతో పాటు వీడియో ఎడిటింగ్ చేస్తుంటాడు. రామంతాపూర్‌లో నివాసముండే బందువుల అమ్మాయి(22)కి లక్ష్మీనారాయణ వరుసకు మేన బావ. లక్ష్మీనారాయణతో కలిసి యువతి సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేసినట్లు సమాచారం. అదే చనువును ఆసరాగా చేసుకుని లక్ష్మీనారాయణ పెళ్లి ప్రపోజల్స్ తీసుకు వచ్చాడు. అతడికి పెళ్లి ఆయిన కారణంగా యువతి నిరాకరించింది. ఈ మధ్య కాలంలో యువతికి సినిమా ఫీల్డ్‌లో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి లక్ష్మీనారాయణను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో యువకుడు ఈ నెల 22న యువతిని తన కారులో ఎక్కించుకుని ఉప్పల్ భగాయత్‌కు తీసుకు వచ్చాడు. మళ్లీ పెళ్లి ప్రస్తావను తీసుకు వచ్చాడు. ఇద్దరి మద్య వాగ్వివాదం పెరిగింది. ముందుగానే పథకం వేసుకున్న లక్ష్మీ నారాయణ తన వెంట తెచ్చుకున్న కత్తితో కారులోనే యువతి గొంతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలైన యువతి తప్పించుకుని బయటకు వచ్చి చున్నీని మెడకు చుట్టుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరి్పంచారు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
‘ప్రేమోన్మాది కల్యాణ్‌ను కఠినంగా శిక్షిస్తాం’
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ఓ యువతిపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్య స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న వాసిరెడ్డి పద్మ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితుడు కల్యాణ్‌ను కఠినంగా శిక్షిస్తామన్నారు. ‘ఇది ఒక ప్రేమోన్మాది దాడి. కల్యాణ్ అనే యువకుడు ఒక పశువులా అర్ధరాత్రి ప్రవర్తించాడు. బాధిత యువతి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్స్ చేస్తోంది. పవర్ కట్ చేసి మరీ దాడికి పాల్పడ్డాడు. కరెంట్ పోవడంతో ఇంటిలోని వారు బయటకు వచ్చారు. యువతితో పాటు తల్లి, చెల్లి చేతులు, మెడపైన కత్తితో దాడి చేశాడు. వారి ట్రీట్మెంట్కు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఆ ప్రేమోన్మాదిపై చార్జ్‌షీట్ వేసి హత్యాయత్నం కింద కేసు పెట్టి రౌడీ షీట్ తెరవాలని ఎస్పీని కోరాం. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతుంది’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. -
హైదరాబాద్: మియాపూర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాదం మరోసారి పడగ విప్పింది. నగరంలోని మియాపూర్ ఆదిత్యానగర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. తనను దూరం పెడుతుందనే కోపంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఇక దాడి సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని తీవ్రంగా గాయపర్చాడు ఆ ప్రేమోన్మాది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం తాను గొంతు కోసుకుని ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. బాధితురాలిని వైభవిగా, తల్లి శోభగా గుర్తించారు. వాళ్లను చికిత్స కోసం కొండాపూర్ కిమ్స్‌కు తరలించారు. మరోవైపు ప్రేమోన్మాది సందీప్ అలియాస్ బబ్లూను చికిత్స కోసం గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది. బబ్లూ స్వస్థం రేపల్లెగా గుర్తించారు. రేపల్లెకు చెందిన సందీప్ కుమార్ అలియాస్ బబ్లూ, వైభవికి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే.. రెండేళ్ల నుండి బబ్లూని దూరం పెడుతూ వస్తోంది వైభవి. ఫోన్ నెంబర్ సైతం బ్లాక్ చేయడంతో.. వేరే నెంబర్లతో కాల్ చేసి తనతో మాట్లాడాలని వేధించసాగాడు బబ్లూ. మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లేదంటే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ మే నెలలో రేపల్లె నుండి హైదరాబాద్ వచ్చి ఆదిత్య నగర్ లో తన తల్లి, సోదరుడితో ఉంటోంది వైభవి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన సందీప్.. నేరుగా వైభవి ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. ఆ ఆవేశంలోనే వైభవితోపాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అదే కత్తితో గొంతు కోసుకున్నాడు సందీప్. -
తపస్వి కేసు: ప్రేమికుడు కాదు కేటుగాడు
సాక్షి, గుంటూరు: గుంటూరు తక్కళ్లెపాడులో సోమవారం ఘోర హత్యకు గురైన తపస్వి కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తపస్విని వేధించిన జ్ఞానేశ్వర్ అలియాస్ డింపు అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదని, పెయింటింగ్ పనులకు వెళ్లే కూలీ అని పోలీసులు ధృవీకరించారు. కులం విషయంలోనే కాదు.. తనకు మంచి జాబ్ ఉందంటూ తపస్విని అతను మోసం చేశాడని, అది బయటపడేసరికి.. ఆమె దూరం పెట్టడంతో ఇలా ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక విచారణ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. మన్నే జ్ఞానేశ్వర్ అలియాస్ డింపు మానికొండ వాసి. రెండేళ్ల కిందట ఇన్స్టాగ్రామ్ ద్వారా తపస్వితో పరిచయం చేసుకున్నాడు. ఆమె పెట్టే ప్రతీ పోస్ట్‌కి లైకులు కొడుతూ.. పరిచయాన్ని ముందుకు తీసుకెళ్లాడు. తన ఇంటి పేరును చూపించి.. తాను అగ్ర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినంటూ ఆ పరిచయాన్ని మరో ట్రాక్‌లోకి ఎక్కించాడు. అతని మాయ మాటలకు ఆమె మోసపోయింది. మూడు నెలల కిందట ఒకరినొకరు కలుసుకున్నారు. జ్ఞానేశ్వర్ పుట్టిన రోజుకి బంగారంతో పాటు కానుకలు కూడా ఇచ్చింది తపస్వి. ఈ క్రమంలో.. తపస్వికి జ్ఞానేశ్వర్ నిజం చెప్పాడు. ఓ నెల క్రితం.. తాను వేరే సామాజికవర్గానికి చెందిన వ్యక్తినని, జాబ్ కూడా లేదని నిజం చెప్పాడు. దీంతో తపస్వి.. జ్ఞానేశ్వర్‌ను అసహ్యించుకుంది. దూరం పెట్టడం ప్రారంభించింది. జ్ఞానేశ్వర్ ఉన్మాదిలా మారాడు. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో.. పోలీసులను ఆశ్రయించింది తపస్వి. ఆపై జ్ఞానేశ్వర్‌ను, అతని తండ్రిని పిలిచి పోలీసులు హెచ్చరించారు. కానుకలను తిరిగి తపస్వికి ఇప్పించి పంపించేశారు. ఇరవై రోజుల క్రితం గన్నవరంలో ఉంటున్న రూమ్ ను ఖాళీ చేసి కృష్ణాపురం వెళ్లిపోయింది తపస్వి. ఆపై పరీక్షల నేపథ్యంలో తక్కెళ్లపాడు(గుంటూరు) స్నేహితురాలు దగ్గరికి వెళ్లింది. తపస్వి మొబైల్ నంబర్, ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రామ్ ఐడీ ద్వారా ఆమె ఉన్న చోటును ట్రాక్ చేసిన జ్ఞానేశ్వర్.. ట్రాకింగ్ ద్వారా అక్కడికి వెళ్లి మరీ ఆమెను హతమార్చాడు. ఇదిలా ఉంటే.. జ్ఞానేశ్వర్‌కు గంజాయి, మద్యం అలవాటు ఉందని స్థానికులు చెప్తున్నారు. తరచూ మొబైల్స్ మారుస్తూ.. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లలో వేర్వేరు పేర్లతో ఐడీలు క్రియేట్ చేస్తుంటాడని స్నేహితులు చెప్తున్నారు. తపస్వి క్లోజ్ఫ్రెండ్ను విచారించిన పోలీసులు బీడీఎస్ విద్యార్థిని తపస్వి హత్య కేసును మరింత లోతుగా విచారించాలని పోలీసులు నిర్ణయించాయి. నిందితుడు అదుపులో ఉన్నప్పటికీ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయిన తపస్వి స్నేహితురాలి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తపస్వి బాల్య స్నేహితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల సమయం కావడంతో.. తపస్వి, తక్కెళ్లపాడులోని స్నేహితురాలి దగ్గరికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్.. తపస్విపై దాడి చేశాడు. ఆ సమయంలో తపస్విని రక్షించడానికి ఆమె ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఊహించిన ఆ దాడితో ఆమె షాక్‌కు గురైందట. ఇప్పటికే హత్యకు సంబంధించిన కొంత సమాచారం విభాగ చెప్పిందని పోలీసులు వెల్లడించారు. మరింత సమాచారం కోసమే ఆమెను పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. -
అయ్యో తపస్వి.. ఆ కిరాతకుడు ఎంత పని చేశాడు!
సాక్షి, కృష్ణా జిల్లా: గుంటూరు తక్కెళ్లపాడులో సోమవారం జరిగిన ఘోరం.. రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది డెంటల్ విద్యార్థిని తపస్వి(21). దగ్గర్లో పరీక్షలు ఉండడంతో స్నేహితురాలి ఇంటికి చదువుకోవడానికి వెళ్లిన తపస్విపై హఠాత్తుగా దాడికి దిగిన జ్ఞానేశ్వర్.. ఆమె గొంతు కోసి పైశాచికంగా హతమార్చాడు. ఈ ఉదంతంతో కృష్ణా జిల్లా పామిడిముక్కల మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టిన కొన్నిరోజులకే తపస్విని వృత్తిరిత్యా తల్లిదండ్రులు తన తాత-నానమ్మల దగ్గర వదిలేశారు వెళ్లారు. అలా పెరిగి ఐదో తరగతి దాకా కృష్ణాపురంలోనే చదువుకుంది తపస్వి. అనంతరం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇక్కడే ఇంటర్మీడియెట్ దాకా చదువుకుంది ఆమె. నాలుగేళ్ల కిందట సాఫ్ట్వేర్ ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులకు ముంబైకి బదిలీ అయ్యింది. దీంతో.. బీడీఎస్ చదివేందుకు విజయవాడ వచ్చి హాస్టల్లో ఉంటోంది తపస్వి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జ్ఞానేశ్వర్.. ఇన్స్టాగ్రామ్ ద్వారా తపస్వితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ, పెళ్లి అంటూ వేధింపులు మొదలుపెట్టాడు. సోమవారం సాయంత్రం ఇంట్లోకి ప్రవేశించి.. సర్జికల్ బ్లేడ్‌తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె స్నేహితురాలి అరిచి.. సాయం కోసం పరిగెత్తగా తలుపులు వేసి మరీ తపస్విని ఘోరంగా చంపాడు. ఇక తపస్వి ఘోర హత్యోదంతాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కళ్ల ముందే పుట్టి పెరిగిన బిడ్డ.. ఇలా విగత జీవిగా టీవీల్లో, ఫోన్లలో కనిపించడాన్ని స్వగ్రామం కృష్ణాపురం వాసులు తట్టుకోలేకపోతున్నారు. తపస్వి చాలా ధైర్యవంతురాలని.. తనకు ఎలాంటి సమస్యలు ఉన్నట్లు తమకేం చెప్పలేదని బంధువులు అంటున్నారు. ప్రేమ-వేధింపులు, తక్కెళ్లపాడులో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన విషయం కూడా తమకేమీ తెలియదని చెప్పారు. అలాగే.. ఇలాంటివి ఇంకెక్కడా జరగకుండా చూడాలని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తపస్వి బంధువులు ఆవేదనగా కోరుతున్నారు. ఇదీ చదవండి: పోలీసులు హెచ్చరించినా కూడా తపస్విపై.. -
గుంటూరు: మెడికో గొంతు కోసి చంపిన టెకీ
పెదకాకాని: ప్రేమను నో చెప్పిందనే కోపంలో యువతి గొంతుకోసి చంపేశాడు ఓ ప్రేమోన్మాది. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి (21) విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) తృతీయ సంవత్సరం చదువుతోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్‌తో రెండేళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా జ్ఞానేశ్వర్ ప్రేమిస్తున్నానంటూ ఆ యువతిని వేధిస్తుండటంతో ఇటీవల విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి.. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించి పంపించారు. అయినప్పటికీ జ్ఞానేశ్వర్ వేధింపుల్ని ఆపలేదు. దీంతో తపస్విని 10 రోజుల క్రితం తక్కెళ్లపాడు డెంటల్ కాలేజీ విద్యార్థిని అయిన తన స్నేహితురాలి రూమ్‌కు వెళ్లి అక్కడే ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్ సోమవారం రాత్రి సర్జికల్ బ్లేడు, కత్తి వెంట తీసుకుని తపస్వి ఉంటున్న ప్రాంతానికి చేరుకుని.. సర్జికల్ బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనంతరం తన చేతిని కూడా కోసుకున్నాడు. ఆమె స్నేహితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని జ్ఞానేశ్వర్‌కు దేహశుద్ధి చేసి తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. తపస్విని చికిత్స నిమిత్తం మొదట ప్రైవేట్ ఆస్పత్రికి, ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి తపస్వి (21) మరణించింది. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
అంకిత మైనర్!!.. ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవి
జార్ఖండ్ డుమ్కాలో ఓ ప్రేమోన్మాది ఒక స్టూడెంట్ను సజీవ దహనం చేసిన ఉదంతం మరో మలుపు తిరిగింది. బాధితురాలు మేజర్ కాదని.. మైనర్ అని చైల్డ్ వెల్ఫ్‌ఫేర్ కమిటీ నిర్ధారించింది. దీంతో పోక్సో చట్టం ప్రకారం కేసు, నిందితుడిపై అభియోగాలను నమోదు చేయాలని ఈ ప్యానెల్.. పోలీసులను ఆదేశించింది. రాంచీ: అకింతా సింగ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 12వ తరగతి చదువుతున్న బాధితురాలి వయసును తొలుత.. 19 ఏళ్లుగా రిపోర్ట్‌లో పొందుపర్చారు పోలీసులు. అయితే మీడియాకు మాత్రం వయసును 17ఏళ్లుగా చెప్పారు. అంకిత వయసుపై పోలీసులు చేస్తున్న వేర్వేరు ప్రకటనలపై ఆమె కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమె వయసును 15ఏళ్లుగా నిర్ధారిస్తూ ప్రకటన చేసింది. అంతేకాదు.. రికార్డెడ్ స్టేట్మెంట్లోనూ ఆమె వయసును సవరించాలంటూ స్థానిక ఎస్పీకి సూచించింది. మతోన్మాది ఘాతుకం! డుమ్కా ప్రాంతానికి చెందిన అంకితా కుమారి సింగ్‌ను.. పొరుగింట్లో ఉండే షారూఖ్ హుస్సేన్(19) ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు. పెద్దలు మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆగష్టు 23వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి.. నిప్పటించి పారిపోయాడు. 90 శాతం తీవ్ర గాయాలతో ఫులో జానో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆగస్టు 28వ తేదీన అంకిత కన్నుమూసింది. ఈ ఘటనలో బాధితురాలిని వేధింపులు.. మతం మారాలనే ఒత్తిడి చేసినట్లు తేలడంతో ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలను దారి తీసింది. బీజేపీతో పాటు భజరంగ్ దల్ కార్యకర్తలు బాధితురాలి న్యాయం కోసం పోరాటానికి దిగారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. ఆందోళనలు చేపట్టారు. మరోవైపు బీజేపీ ఒత్తిడితో బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించగా.. ఆమె తండ్రి సంజీవ్ సింగ్ ఆ పరిహారాన్ని తిరస్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక కేసులో సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఆ ఫొటోలు మార్ఫింగ్‌వి! ఇదిలా ఉంటే.. నిందితుడు షారూఖ్ హుస్సేన్‌తో సన్నిహితంగా ఉన్న బాధితురాలి ఫొటోలు కొన్ని నెట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై అంకిత కుటుంబం స్పందించింది. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, నిందితుడిని బయటపడేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయంటూ మండిపడింది. తమ కూతురికి సత్వర న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించింది అంకిత కుటుంబం. ఫొటోలు, వీడియోలు వైరల్ చేయకండి ఇదిలా ఉంటే.. డుమ్కా మైనర్ హత్యోదంతంపై జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ ఇవాళ(బుధవారం) డుమ్కాలో పర్యటించి.. వివరాలను సేకరించింది. అయితే.. బాధితురాలి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడంపై ఎన్సీడబ్ల్యూ లీగల్ కౌన్సెలర్ షాలిని సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది బాధితురాలి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, దానిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. Dumka, Jharkhand | People are circulating photos of victim on social media. Please ensure this is stopped, vital information is not misused & a woman's dignity is protected: Shalini Singh, Legal Counsellor, NCW pic.twitter.com/mj5jKRqMXo — ANI (@ANI) August 31, 2022 ఇదీ చదవండి: పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి...ఆ తర్వాత అతను -
పరిహారం ఏం చేస్కోవాలయ్యా.. అంకిత తండ్రి ఆవేదన
రాంచీ: చక్కగా చదువుకుంటున్న కూతురిని చూసి మురిసిపోతున్న ఆ తండ్రికి.. చివరకు శోకమే మిగిలింది. నిండా 20 ఏళ్లు పూర్తికాకుండానే పాడెకు ఎక్కింది ఆ బిడ్డ. ప్రేమ ముసుగులో ఓ ఉన్మాది ఘాతుకానికి బలైన అంకిత మృతి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమోన్మాది షారూఖ్ హుస్సేన్(19) చేతిలో బలైంది పదిహేడేళ్ల అంకితా కుమారి సింగ్. పొరుగింట్లోనే ఉండే షారూఖ్.. అంకితతో స్నేహం చేశాడు. అయితే తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఆమెను బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. అంకిత తండ్రి సైతం షారూఖ్ కుటుంబంతో ఈ విషయంపై మాట్లాడాడు కూడా. అయితే.. షారూఖ్ వేధింపులు మాత్రం ఆగలేదు. ఆగస్టు 23వ తేదీన డుమ్కా పట్టణంలోని తన ఇంట్లో నిద్రిస్తున్న అంకితపై కిటికీ గుండా పెట్రోల్ పోసి.. నిప్పటించి పారిపోయాడు షారూఖ్. తొంభై శాతం కాలిన గాయాలతో.. చికిత్స పొందుతూ చివరికి ఆదివారం కన్నుమూసింది అంకిత. ఈ ఘటన జార్ఖండ్‌నే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ఇదిలా ఉంటే.. జార్ఖండ్ ప్రభుత్వం సోమవారం అంకిత కుటుంబానికి పరిహారం ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి సోరెన్. అయితే ఈ ఆర్థిక సాయంపై అంకిత తండ్రి సంజీవ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘‘పరిహారం ఇప్పుడు ఏం చేస్కోవాలి. నా ఆర్థిక స్థితి నుంచి నా కూతురిపై దాడి జరిగిన రోజు నుంచి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా. ప్రభుత్వం గనుక ఇదే సాయాన్ని ముందు అందించి ఉంటే.. మెరుగైన చికిత్స అందించి నా కూతురిని రక్షించుకునేవాడ్ని. ఆమె బతికేది ఏమో’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఆ సాయాన్ని వద్దని తిరస్కరించారాయన. వాడు ప్రేమోన్మాది మాత్రమే కాదు.. మతోన్మాది కూడా. తనను వివాహం చేసుకోవాలని, ఇస్లాంలోని మారాలని, లేకుంటే జీవితాంతం నరకం చూపిస్తానని బెదిరించేవాడని అంకిత తమకు చెప్పి వాపోయిందని సంజీవ్ మీడియాకు వెల్లడించారు. తనకు పరిహారం అక్కర్లేదని.. తన కూతురి ఆత్మకు శాంతి కలిగేలా ఈ కేసులో న్యాయం కావాలని కోరుకుంటున్నారాయన. మరోవైపు అంకిత చికిత్స పొందుతుండగా.. తీసిన కొన్ని వీడియోలు.. తనపై జరిగిన దాడి తరహాలోనే నిందితులను చంపేయాలంటూ ఆమె కోరుకున్న వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. This is the last wish of #AnkitaSingh : She said "as i am dying now, Shahrukh & his accompalish should also get death like me." But I am very doubtful about our Supreme Court. Recently they stopped hanging of a Muslim who has raped & killed a 4 year old girl saying he has future pic.twitter.com/SLpQz4UoyY — Radharamn Das राधारमण दास (@RadharamnDas) August 29, 2022 #WATCH | Jharkhand: Accused Shahrukh who set ablaze a class 12 girl in Dumka for allegedly turning down his proposal, was arrested on 23rd August. The girl succumbed to her burn injuries yesterday, 28th August. (In video: The accused from the day of his arrest - 23rd August) pic.twitter.com/PwkQuM8plt — ANI (@ANI) August 29, 2022 మరోవైపు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తుండగా.. మీడియాను చూస్తూ నవ్వడం అతని ఉన్మాదస్థాయిని తెలియజేస్తోందని పలువురు మండిపడుతున్నారు. ఇంకోవైపు ఎంక్వైరీ ఆఫీసర్‌గా నూర్ ముస్తఫాను నియమించడంపై స్థానిక యువత తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నూర్ ముస్తాఫాపై తమకు నమ్మకం లేదని.. తన మతస్తుడికి మద్ధతుగా ఆమె దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉందంటూ ఆరోపిస్తూ తక్షణమే ఆమెకు ఇచ్చిన విచారణ బాధ్యతలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక బీజేపీ సైతం ఈ ఘటన ఆధారంగా జేఎంఎం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. అంకిత మృతదేహానికి బీజేపీ నేతలు, భజ్రంగ్ దల్ సభ్యులు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. మరోవైపు జస్టిస్ ఫర్ అంకిత హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విటర్‌ను కుదిపేస్తోంది. ఇదీ చదవండి: బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో కిడ్నాపైన పసికందు!! -
ఆ ప్రేమోన్మాది మరణశిక్ష టీవీల్లో లైవ్ ప్రసారం!
ప్రేమ, పెళ్లికి నిరాకరించడంతో ప్రేమోన్మాదులు.. పాశవికంగా దాడులకు పాల్పడుతున్నట్లు ఘటనలు చూస్తుంటాం. కానీ, చట్ట ప్రకారం కఠిన శిక్షలు లేకపోవడం, ఇలాంటివి పెరిగిపోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. యువతుల జీవితాలను చిదిమేయాలని ప్రయత్నించే వాళ్లకు గుణపాఠం చెప్పాలని, భావితరాలకు గట్టి సందేశం ఇవ్వాలని ఈజిప్ట్ కోర్టు ఒకటి నిర్ణయించుకుంది. ఉత్తర ఈజిప్ట్‌లోని మాన్సోరా యూనివర్సిటీలో చదువుతున్న మోహమద్ అడెల్.. తనతో పాటు చదువుకునే నయెరా అష్రాఫ్‌ను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాడనే కోపంలోనే అతను ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. జూన్ నెలలోనే ఈ ఘటన జరగ్గా. జూన్ 28వ తేదీన అతనికి మరణశిక్ష విధించింది మాన్సోరా కోర్టు. అయితే.. అతని మరణ శిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఈజిప్ట్ పార్లమెంట్‌కు ఓ లేఖ కూడా రాసింది. పూర్తిగా ఉరి తీయడం వీలు లేకున్నా.. కనీసం అతని ఉరి ఏర్పాట్లనైనా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆ లేఖలో కోర్టు పేర్కొంది. ఆ దుర్మార్గుడు ఆమెను అతికిరాతకంగా చంపాడు. అందుకే దేశం మొత్తం అతని శిక్షను చూడాలి. ఈ శిక్ష ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడాలనుకునేవాళ్లు వణికిపోవాలి. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే.. చట్టసభ అందుకు అనుమతించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. తీర్పు కిందటి నెలనే ఇచ్చినప్పటికీ.. జులై 24న తీర్పు కాపీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ అలం చేతిలో ఉంది. అయితే న్యాయపరంగా పోరాడేందుకు అడెల్కు ఇంకా అవకాశం ఉంది. రెండు నెలల పాటు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకునేందుకు హక్కు ఉందని అతని తరపు న్యాయవాది చెప్తున్నారు. ఇప్పటికే శిక్ష విధించి నెలరోజులు పూర్తైంది. ఇంకా నెలరోజులే మిగిలి ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయెరా అష్రాఫ్ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఘోరాతి ఘోరంగా చంపిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో.. ఇలాగే ఓ శిక్షను ప్రజలు చూసేలా ప్రసారం చేశారు అక్క్డడి అధికారులు. 1998లో రాజధాని కైరోలో ఓ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను దారుణంగా చంపిన ముగ్గురు నిందితులను.. ఉరి తీసే కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు అక్కడి టీవీ ఛానెళ్లలో. The killing of Egyptian student Nayera Ashraf has been met with condemnation and ignited a debate about violence against women. The suspect is a man who reportedly harassed her for months before the killing. Read more: https://t.co/nLFZHE2vqC pic.twitter.com/RXraAtTpH0 — Al Jazeera English (@AJEnglish) June 23, 2022 -
Crime News: ప్రేమించానంటూనే నరరూప రాక్షసుడిలా..
సాక్షి,బళ్లారి: ప్రేమించానన్నాడు. ప్రాణంగా చూసుకుంటానన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. పైగా ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. దీంతో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయినా సుఖంగా మాత్రం లేడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగలేదని, ఆమె వేరొకరి సొంతం కాకూడదని రగిలిపోయాడు. చివరికి.. నరరూప రాక్షసుడిలా మారిపోయి ఘోరానికి పాల్పడ్డాడు. మాజీ ప్రేయసి తల నరికి హత్య చేయడంతో పాటు.. మొండెం నుంచి ఆమె తలను వేరు చేశాడు ఓ ఉన్మాది. నేరుగా పోలీసు స్టేషన్‌కు ఆ తలను తీసుకెళ్లాడు. వెన్నులో వణుకుపుట్టించే ఈ ఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో సంచలనం రేకెత్తించింది. గురువారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కేబీ హట్టి (కన్నబోరయ్యనహట్టి) గ్రామంలో నిర్మలా (23) అనే అమ్మాయిని.. భోజరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. యువతి తలను పోలీసు స్టేషన్‌కు తీసుకుని వచ్చి లొంగిపోయారు. నిర్మల బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. పరీక్షలు ఉన్న కారణంగా స్వంత ఊరులో చదువుకోవడానికి వచ్చింది. మాట్లాడాలని పిలిచి ఆమెను కిరాతకంగా హత్య చేశాడు భోజరాజు. కొన్నాళ్ల కిందట ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని ఆమె వెంటపడ్డాడు. స్నేహం ముసుగులోని అతని ప్రేమను ఆమె ఒప్పుకోలేదు. పంచాయితీ పెట్టి పెద్దలతో పెళ్లి కుదర్చాలని ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వేరే యువతిని రెండు నెలల కిందట వివాహం చేసుకున్నాడు కూడా. అయితే.. నిర్మలను కిరాతకంగా హతమార్చిన ఉన్మాదిని నడిబజారులో ఉరితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై కూడ్లిగి తాలూకా ఖానాహొసళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లూరు కావ్య కేసు: సురేష్‌ది వన్‌సైడ్ లవ్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన కావ్య-సురేష్ రెడ్డి మృతి కేసులో పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. సురేష్‌ది వన్ సైడ్ లవ్ అని, పెళ్లి ప్రతిపాదనను కావ్య ఒప్పుకోని కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు నెల్లూరు ఎస్పీ విజయరావు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే కావ్యను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడాడంటూ తొలుత అంతా భావించారు. అయితే.. ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారాయన నెల్లూరు ఎస్పీ విజయరావు. సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉందని, అయితే తుపాకీపై మేడిన్ యూఎస్ఏ అని రాసి ఉందని ఎస్పీ తెలిపారు. అంతేకాదు.. ఘటన జరిగిన సమయంలో కావ్య సోదరి ప్రత్యక్ష సాక్షిగా ఉందని వెల్లడించారు. సురేష్ కావ్యపై కాల్పులు జరిపినప్పుడు.. మొదటి బుల్లెట్ నుంచి ఆమె తప్పించుకుంది. అయితే రెండో బుల్లెట్ తలలోంచి దూసుకెళ్లి ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. దాడి సమయంలో.. అడ్డుకునే ప్రయత్నం చేసిన కావ్య చెల్లెల్ని సురేష్ పక్కకి తోసేశాడని ఎస్పీ తెలిపారు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. వన్‌సైడ్ లవ్! కావ్య విషయంలో సురేష్‌ది వన్‌సైడ్ లవ్ అని నెల్లూరు ఎస్పీ విజయరావు మీడియాకు వివరించారు. కావ్య కుటుంబం వద్ద గత నెలలో సురేష్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. కానీ, సురేష్ ప్రపోజల్‌ను అమ్మాయి కుటుంబం తిరస్కరించింది. ఆ కోపంలోనే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారాయన. వయసు తేడా! ఇదిలా ఉంటే.. ఘటనపై కావ్య దగ్గరి బంధువు ఒకరు స్పందించారు. సురేష్ వయసు 35 సంవత్సరాలు. కావ్య వయసు 22 ఏళ్లు కావడంతోనే పెళ్లికి అంగీకరించలేదని తెలిపారు. కావ్యకు ఇష్టమైతే పెళ్లికి అభ్యంతరం లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అయితే.. అతను వయసు ఎక్కువ కావడం, పైగా ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే కావ్య అతని పెళ్లి ప్రపోజల్‌ను తిరస్కరించినట్లు ఆ బంధువు వెల్లడించారు. -
నెల్లూరు: యువతిని కాల్చి చంపి ప్రియుడి ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: ఒకే ఊరి వాళ్లు.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఈ క్రమంలోనే ఆ యువతితో పరిచయం పెరిగింది. అది ప్రేమగా తీసుకున్నాడు యువకుడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ యువకుడ్ని పెళ్లి చేసుకోవాలని యువతి అనుకోలేదు. దీనిపై ఇద్దరి మధ్య తరచు వాగ్వాదం జరుగుతూనే ఉంది. మరోసారి సోమవారం యువతి ఇంటికి వెళ్లిన యువకుడు మళ్లీ గొడవ పడ్డాడు. ఆ యువతిని రివాల్వర్‌తో కాల్చి చంపి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతిని తుపాకీతో కాల్చిన.. ఆపై తాను కాల్చుకుని అక్కడిక్కడే మృతి చెందాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని సురేష్‌గా గుర్తించారు. బాధితురాలిని కావ్యగా గుర్తించిన పోలీసులు.. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆమె మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. మృతులిద్దరూ తాటిపర్తి వాసులే కాగా.. చెన్నైలో ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించాడు. ఇది వన్‌సైడ్ లవ్ కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో విచక్షణ కోల్పోయి కాల్పుల ఘాతకానికి ఒడిగట్టాడు. -
సెటిల్ అవ్వగానే పెళ్లి చేస్తామన్నారు! ఇంతలోనే..
మంచిని మెదడుకి ఎక్కించుకోవడం మనిషికి కొంచెం కష్టమైన పనే. తెలిసీ తెలియని వయసులో కలిగిన ఆకర్షణను అర్థం చేసుకున్న ఆ పెద్దలు.. ముందు వాళ్లకు బాధ్యతలు గుర్తు చేద్దామనుకున్నారు. కొన్నాళ్లు ఆగాలంటూ ఇద్దరికీ సర్దిచెప్పబోయారు. అమ్మాయి అర్థం చేసుకుంది. కానీ, ఆ అబ్బాయే మూర్ఖంగా ఆలోచించాడు. ఫలితమే.. ఊహించని ఘోరం జరిగింది. లైఫ్‌లో సెటిల్ కాగానే పెళ్లి చేస్తామని హామీ ఇచ్చిన పెద్దల మాటల్ని ఆ యువకుడు నమ్మలేదు. ప్రేమించిన అమ్మాయిని.. వెంటనే పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడిని ఆమె తట్టుకోలేకపోయింది. ప్రియుడిని తిట్టిపోసింది. ఇగో దెబ్బ తిన్న ఆ ప్రియుడు.. కత్తితో ప్రియురాలిని కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీపా సింగ్, రింకూ ఇద్దరికీ ఎనిమిదేళ్ల పరిచయం. స్కూల్‌డేస్ నుంచే మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. బుధవారం పెద్దలను తీసుకుని దీప(20) ఇంటికి వెళ్లి మాట్లాడాడు రింకూ. అయితే డిగ్రీనే చదువుతుండడంతో దీప వాళ్ల ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారు. ఇద్దర్ని ముందు చదువులు పూర్తి చేయమని, జాబ్ల్లో సెటిల్ అయ్యాక తప్పకుండా పెళ్లి చేస్తామని మాటిచ్చారు. దీప అందుకు అంగీకరించింది. అయితే రింకూ మాత్రం అన్యమనస్కంగా తలూపాడు. గురువారం గురుద్వారా మార్కెట్‌కు వెళ్లిన దీపను రింకూ ఆటకాయించాడు. ఇప్పుడే పారిపోయి పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. కోపంతో ఆమె అతన్ని తిట్టిపోసింది. అది తట్టుకోలేక పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లి కత్తి తెచ్చుకున్నాడు. ఆమె గొంతు కోసి, ఇష్టమొచ్చినట్లు పొడిచి దారుణానికి పాల్పడ్డాడు.రక్తపు మడుగులో ఉన్న దీపను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఆమె కన్నుమూసింది. ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసిన రింకూ.. నేరుగా బాగ్పట్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తొలుత ఇది ప్రేమోన్మాది పని అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇద్దరూ ఇష్టపడ్డారని, పెద్దలు పెళ్లికి అంగీకరించారని, అయితే పెళ్లి వాయిదా పేరుతో తనని దీపకు దూరం చేస్తారనే ఆలోచనతోనే నిందితుడు రింకూ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ప్రైవేట్ కాలేజీలో అటెండర్‌గా పని చేస్తున్న దీప తండ్రి నైన్ సింగ్.. కూతురు జాబ్ చేసి కొన్నాళ్లు తమను పోషిస్తుందని, ఆపై ఇష్టపడ్డ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాట. కానీ, రింకూ ఆవేశంతో.. ఆ తండ్రి ఆశలు ఆవిరయ్యాయి. -
అరేయ్.. దాని గొంతు కోసేస్తా, నేనూ విషం తాగేస్తా రా!
ప్రేమోన్మాదం.. ఎలాంటి ఘాతుకాలకు దారితీస్తుందో చూస్తూనే ఉన్నాం. కానీ, కన్నతల్లి నిస్సహయంగా రోదిస్తుంటే.. ఒక ఆడబిడ్డ రాలిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. గుజరాత్లో సంచలనం సృష్టించిన గ్రీష్మా వెకారియా(21) హత్యోదంతంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. సోషల్ మీడియా వైరల్ అయిన ఈ వీడియో తల్లిదండ్రుల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి 12న కామ్రేజ్ పసోదరా ప్రాంతంలోని గ్రీష్మను ఆమె ఇంటికి వెళ్లి మరీ గొంతు కోసి చంపాడు ఫెనిల్ గొయాని. ఆ సమయంలో తల్లి, ఆమె బంధువులు కాపాడే యత్నం చేసినప్పటికీ.. వాళ్ల పైనా ఫెనిల్ దాడి చేశాడు. ఇక చుట్టుపక్కల కొందరు చూస్తూ.. వీడియోలు తీస్తూ ఉండిపోయారే తప్ప, ధైర్యం చేసి గ్రీష్మను కాపాడే యత్నం చేయలేకపోయారు. ఆపై ఆ అమ్మాయి గొంతు కోసేసి.. పాన్ నములుతూ ఎవరూ దగ్గరి రాకుండా బెదరించాడు ఫెనిల్. ఘటన జరిగిన నాలుగు రోజులకు నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. భద్రతపై భయాలు గ్రీష్మ హత్యోదంతం గుజరాత్‌ను వణికించింది. పట్టపగలు.. అదీ అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా గ్రీష్మను చంపడం, వెనక ఉన్న కొందరు అడ్డుకునేందుకు అవకాశం ఉన్నా.. ఆ దిశగా ఎవరూ సాహసం చేయకపోవడంపై సమాజం తీరును ప్రశ్నించింది. ఇక ఈ కేసులో సూరత్ పోలీసులు.. 2500 పేజీల ఛార్జ్‌షీట్‌ను కేసు తీవ్రత దృష్ట్యా తొమ్మిది రోజుల్లోనే రూపొందించి.. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు సమర్పించారు. ఇందుకోసం మొత్తం 190 మంది సాక్షుల్ని, 25 మంది ప్రత్యక్ష సాక్షుల్ని ప్రశ్నించారు పోలీసులు. దొంగతనం.. ఏకే 47 కోసం.. ఇదిలా ఉండగా.. నిందితుడు ఫెనిల్ ఈ-కామర్స్ పోర్టల్‌లో హత్యకు ఉపయోగించిన కత్తిని కొనుగోలు చేశాడు. అంతకు ముందు ఇంటర్నెట్లో ఏకే 47 కోనుగోలుకు సంబంధించి సెర్చ్ చేసినట్లు హిస్టరీ ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఫెనిల్ గోయాని.. పక్కా చిచ్చోర్గాడు. తాగి గ్యాంగ్ వార్లలో జోక్యం చేసుకునేవాడు. గతంలో ఓ కారు దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు కూడా. గ్రీష్మతో కలిసి చదువుకున్నప్పటికీ.. తర్వాత అటెండెన్స్ లేక డిబార్ అయ్యాడు. గ్రీష్మను తరచూ ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధిస్తూ పోయాడు. చివరికి.. విషయం గ్రీష్మ ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వాళ్లు ఫిర్యాదు దాకా వెళ్లారు. తమ కొడుకు మళ్లీ గ్రీష్మ జోలికి రాడని ఫెనిల్ పేరెంట్స్ మాట ఇవ్వడంతో గ్రీష్మ ఇంట్లో వాళ్లు వెనక్కి తగ్గారు. ఆపై మళ్లీ ఆమె కాలేజీకి వెళ్లి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె సీరియస్ వార్నింగ్ ఇవ్వగా, ఆమె బంధువులు సైతం బెదిరించారు. ఆ కోపంతోనే పాపం గ్రీష్మను బలితీసుకున్నాడు. విషం తాగేస్తా అంటూ.. ఇక గ్రీష్మను హత్య చేశాక.. నిందితుడు ఫెనిల్ కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కథనాలు వచ్చాయి. కానీ, అది నిజం కాదని పోలీసులు స్పష్టం చేశారు. గ్రీష్మ ప్రాణం పోయేదాకా ఎవరినీ దగ్గరి రాకుండా కత్తితో బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఆపై గాయపర్చుకుని డ్రామాలాడనని తెలిపారు. అయితే ఘాతుకానికి ముందు.. స్నేహితులతో మాట్లాడిన ఆడియో క్లిప్‌ను మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అవతలి వాడితో గ్రీష్మను గొంతుకోసి చంపేయాలనుకుంటున్నానని, ఆపై తాను విషం తాగి అక్కడే చనిపోతానని చెప్పినట్లు ఉందట. అయితే హత్యకు ముందు నలుగురు స్నేహితులతో కలిసి చర్చించిన ఫెనిల్.. తాను చావకూడదని ఫిక్స్ అయ్యాడు. ఘటన తర్వాత తనతో వచ్చిన ఆ నలుగురు తలొదిక్కు పారిపోయారు. ‘‘మహిళల భద్రతకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం ఎలా చెప్పుకుంటోంది. నా కూతురు అమాయకురాలు. ఆమె ఏ తప్పు చేయలేదు. అయినా హత్య చేశారు. నాకు న్యాయం కావాలి. నా కళ్లెదుటే నా కూతురు గొంతుకోశాడు. రక్తం ధారలుగా పారింది. ఇదంతా నా కళ్ల ముందే జరిగింది. దేశంలోని ఏ ఆడపిల్లకు కూడా గ్రీష్మ గతి పట్టకూడదు. అమ్మాయిలకు రక్షణ ఏది? రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతను కల్పిస్తేనే రాష్ట్రంలోని అమ్మాయిలు భద్రంగా ఉంటారు’’. : విలాస్ వెకారియా, గ్రీష్మ తల్లి -
ప్రేమను కాదన్నందుకు అతి కిరాతకంగా..
జైపూర్ : దేశంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించదనే నేపంతో ఓ యువతి గొంతు కోసి చంపడమే కాక అడ్డగించిన యువతి తల్లిని కూడా గాయపర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కి చెందిన షకీల్ ఖాన్(22) అనే వ్యక్తి సైన్ బోర్డ్ పేయింటర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఖుశన్‌సీబా అనే యువతిని ప్రేమించాడు. కానీ ఆమె అతని ప్రేమను ఒప్పుకోలేదు. కొన్నేళ్ల తరువాత షకీల్ దుబాయి వెళ్లాడు. గత నెల 20న ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరో సారి ఖుశన్‌సీబాను కలిసి తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం ప్రారంభించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఖుశన్‌సీబాపై కక్ష్య పెంచుకున్నాడు. ఈ క్రమంలో సదరు యువతిని చంపేయాలని భావించాడు. అందులో భాగంగా షకీల్ తన ఇంటి నుంచి కత్తి తీసుకుని ఖుశన్‌సీబా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో యువతి, ఆమె తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన షకీల్, ఖుశన్‌సీబాపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. కూతుర్ని కాపాడ్డానికి ప్రయత్నించిన తల్లిని కూడా గాయపర్చాడు. ఇంతలో ఇంటికి వచ్చిన సోదరుడు జరిగిన దారుణాన్ని గమనించి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశాడు. సోదరున్ని చూసి పారి పోతున్న షకీల్‌ని పట్టుకోవడానికి కొందరు యువకులు ప్రయత్నించారు. కానీ తప్పించుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం షకీల్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన షకీల్, ఖుశన్‌సిబాని తప్పక వివాహం చేసుకోవాలనే నిర్ణయించుకున్నాడని.. అందుకే ముందే ఆమె పేరు మీద ముందే దుబాయికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశాడని పోలీసులు తెలిపారు. -
సైకో లవర్ని చెప్పులతో కొట్టారు!
భోపాల : పెళ్లి చేసుకోవాలని ఓ మోడల్‌ను నిర్భంధించి వేధించిన యువకుడికి పోలీసులు తగిన బుద్ది చెప్పారు. దాదాపు 12 గంటల తర్వాత ఆ సైకోలవర్ చెర నుంచి యువతిని రక్షించారు. భోపాల్‌లోని మిస్ రోడ్ ప్రాంతంలోని ఓ భవనంలో రోహిత్ సింగ్ (30) అనే యువకుడు మోడల్‌ను నిర్బంధించి దారుణంగా హింసించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పోలీసులతో వీడియో కాల్లో మాట్లాడి తన డిమాండ్లు వెల్లడించాడు. అతడి బారి నుంచి యువతిని పోలీసులు చాకచక్యంగా విడిపించారు. అనంతరం భోపాల్ వీధుల్లో రోహిత్ సింగ్‌ను నడిపించి మహిళలతో చెప్పులతో కొట్టించారు. నిందితుడిని కోర్టు ముందు హాజరు పరిచామని, ఒకరోజు కస్టడీకి తీసుకున్నామని పోలీస్ అధికారి సంజీవ్ చౌసీ తెలిపారు. అతడిపై హత్యాయత్నం తదితర కేసులు కూడా నమోదుచేసినట్టు వెల్లడించారు. అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టరైన రోహిత్‌తో బాధితురాలికి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ఉరిశిక్ష విధించాలి: బాధితురాలు నిందితుడికి ఉరిశిక్ష విధించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ముంబైలో పరిచయమైన అతడు తొలుత తనను ఇబ్బంది పెట్టలేదని, గత నవంబరు నుంచి పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలుపెట్టాడని చెప్పుకొచ్చింది. బాండ్ పేపర్‌పై లిఖితపూర్వకంగా రాసివ్వాలని బలవంతం చేసినట్టు కూడా ఆమె ఆరోపించింది. రోహిత్‌ను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అతడ్ని జైలు పంపి ఉరిశిక్ష విధించాలని, లేకపోతే తనను చంపేస్తాడని వాపోయింది. ఆమెపై నిందితుడు కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. తనను వివాహం చేసుకోపోతే కాల్చి చంపి, తర్వాత నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని రోహిత్ బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి తుపాకి, రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను విడిచిపెడితే ఎలాంటి హాని తలపెట్టబోమని పోలీసులు సర్దిచెప్పడంతో యువతిని వదలడానికి అంగీకరించాడు. -
సైకోలవర్ చెర నుంచి యువతిని రక్షించిన పోలీసులు
-
ఎట్టకేలకు పెళ్లికి ఒప్పుకున్న మోడల్
భోపాల్ : దాదాపు 12 గంటలకు పైగా గృహనిర్బంధంలో ఉన్న మోడల్ ఎట్టకేలకు వివాహానికి అంగీకరించారు. దీంతో కథ సుఖాంతమైంది. అయితే ఆమెను అపార్ట్మెంట్లో కొన్ని గంటలపాటు బంధించడంతో పాటు నాటు తుపాకీని కలిగి ఉన్నాడన్న కారణాలతో పోలీసులు ఆ మోడల్ ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది. అసలేమైందంటే.. భోపాల్‌కు చెందిన 30 ఏళ్ల మోడల్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ముంబైలో రోహిత్ సైతం మోడలింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రేమ విషయం తెలుసుకున్న మోడల్ తల్లిదండ్రులు రోహిత్‌తో కూతురి పెళ్లికి నిరాకరించారు. దీంతో చేసేదేంలేక రోహిత్‌తో పెళ్లికి వెనకడుగు వేశారు. ఈ విషయంలో రోహిత్‌పై మోదల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అతడు కొంతకాలం జైలుశిక్ష అనుభవించి బయటకొచ్చాడు. ఈ క్రమంలో మరోసారి తనను పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు భోపాల్‌లోని మిస్రాడ్ ఏరియాలోని మోడల్ అపార్ట్‌మెంట్‌కు శుక్రవారం ఉదయం 6గంటల ప్రాంతంలో వెళ్లాడు రోహిత్. ఐదో అంతస్తులో నివాసం ఉంటున్న మోడల్ ఇంట్లోకి ప్రవేశించి డోర్ లాక్ చేశాడు. చుట్టుపక్కలవారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మోడల్‌ను కాపాడాలని భావించారు. అయితే మోడల్, తాను ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసులకు వీడియో కాల్ ద్వారా తెలిపారు రోహిత్. ఈ క్రమంలో 12 గంటలు గడిచిపోయాయి. పెళ్లి గురించి మరోసారి ఆరాతీయగా వివాహం చేసుకుంటానని ఆమె చెప్పారు. పెళ్లికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్టాంప్ పేపర్ మీద సంతకాలు సేకరించాడు. ఇంట్లో నుంచి బయటకురాగానే రోహిత్‌తో పాటు మోడల్‌ను అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్పీ రాహుల్ లోధా తెలిపారు. ఇద్దరికీ పోలీసుల కౌన్సెలింగ్ మోడల్(30), ఆమె ప్రియుడు రోహిత్(30)కి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరూ మేజర్లనీ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చునని సూచించాం. అవసరమైతే చట్టపరంగా వారికి సహకారం అందిస్తామని చెప్పినట్లు వివరించారు. అయితే ఆ సమయంలో నాటు తుపాకీతో ఆమెను ఏమైనా బెదిరించాడా అనే కోణంలోనూ రోహిత్‌పై విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. -
పెళ్లి చేసుకోవాలంటూ గృహ నిర్భందం
భోపాల్ : ఓ పైశాచిక ప్రేమికుడు తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను వారి ఇంటిలోనే బంధించాడు. కాపాడాటానికి వచ్చిన పోలీసులను ఒక స్టాంప్ పేపర్, ఫోన్ చార్జర్ కావాలని వింత కోర్కెలు కోరుతున్నాడు. వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్ ముంబైలో చిన్నపాటి మోడల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి అదే రంగంలో పనిచేస్తున్న భోపాల్‌కు చెందిన ఒక మోడల్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రోహిత్ ఆ మోడల్ని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో రోహిత్ ఆమెని వేధించటం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న మోడల్ తల్లిదండ్రులు రోహిత్ మీద పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో అతన్ని అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన రోహిత్ తిరిగి ఆ మోడల్ని వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో మోడల్ ఇంట్లో ప్రవేశించి, తాళం వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ రోహిత్ దగ్గర మోడల్ బందీగా ఉండటంతో వెంటనే చర్యలు తీసుకోలేకపోతున్నారు. పోలీసులు వచ్చారని తెలుసుకున్న రోహిత్ వీడియో కాల్ ద్వారా తమతో మాట్లాడుతున్నాడని పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. వీడియో కాల్ చేసినప్పుడు అతని దగ్గర ఒక తుపాకీ ఉన్నట్లు, యువతి చుట్టూ రక్తం ఉన్నట్లు గమనించామన్నారు. అందుకే ఈ వ్యవహారంలో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు పోలీసులు. అయితే మోడల్ తనను వివాహం చేసుకుంటానని చెప్పిందని అందుకే తాను ఆమె ఇంటికి వచ్చినట్లు రోహిత్ పోలీసులకు తెలిపాడు. యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా రోహిత్ నిర్భందించాడు. వీరిని ఇంటిలో నిర్భందించి ఇప్పటికే 12 గంటలు దాటింది. ఇంటిలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
పెళ్లికి నిరాకరించిందని రూ.5 లక్షలు తగలబెట్టాడు!
సెహోర్ : ఓ యువకుడు తాను ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం.. తాను పనిచేస్తున్న కంపెనీ నుంచే 6.74 లక్షలు రూపాయల నగదును దొంగతనం చేశాడు. కానీ ఆ అమ్మాయి, అబ్బాయి ప్రపోజల్‌ను తిరస్కరించడంతో, కోపోద్రిక్తుడైన అబ్బాయి రూ.5 లక్షల నగదును వెంటనే అక్కడిక్కడే తగుల పెట్టేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సోహోర్లో చోటుచేసుకుంది. జితేంద్ర గోయల్(22), ఓ ఫైనాన్స్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా జితేంద్ర ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సంస్థకు చెందిన లాకర్ నుంచి ఏప్రిల్ 18న రూ.6.74 లక్షల నగదు చోరి చేశాడు. చోరి చేసిన అనంతరం ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్లాడు. కానీ ఆమె అబ్బాయి ప్రపోజల్‌ను తిరస్కరించింది. వేరే అబ్బాయితో పెళ్లికి సిద్దమైంది. ఎవరి కోసమైతే ఈ దొంగతనం చేశానో వాళ్లే తనకు దక్కనప్పుడు ఈ నగదు ఎందుకు అని? తీవ్ర కోపోద్రోక్తంతో బ్యాగులో నుంచి రూ.5 లక్షలను తీసి కాల్చి బూడిద చేశాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో బయటపడ్డాయి. సంస్థ నుంచి నగదు చోరికి గురైందని ఆ సంస్థ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. జితేంద్ర స్వస్థలం హార్ద జిల్లా అని, ఈ దొంగతనం చేసిన 24 గంటల్లో జితేంద్రను తాము పట్టుకున్నట్టు సెహోర్ స్థానిక పోలీసు స్టేషన్ ఇన్-ఛార్జ్ నిరంజన్ శర్మ తెలిపారు. దొంగతనం ఎందుకు చేశాడో విచారించే సమయంలో ఇవన్నీ బయట పడినట్టు తెలిసిందని శర్మ చెప్పారు. కాల్చేసిన రూ.5 లక్షల నగదులో ఎక్కువగా రూ.500 నోట్లే ఉన్నాయని, మరో రూ.46వేలు, రూ.1,28,000 కప్‌బోర్డులో దొరికినట్టు పోలీసులు తెలిపారు. జితేంద్రకు వ్యతిరేకంగా ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
టీచర్ల ముందే తలనరికిన ఉన్మాది
-
టీచర్ల ముందే తలనరికిన ఉన్మాది
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉన్మాది యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. టీచర్లు, విద్యార్థుల ముందే ఆమెను తలనరికి కిరాతకంగా హతమార్చాడు. అనుప్పూర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోట్మా పట్టణానికి చెందిన 17 ఏళ్ల పూజా పనికా, నిగ్వాని రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఆమెకు పరీక్షలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లిన పూజను ఓ యువకుడు వెంబడించాడు. పాఠశాల గేట్ వద్దకు చేరుకోగానే అప్పటిదాకా తనతో దాచుకున్న తల్వార్‌ను తీసి ఆమెపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. పూజ వీపు, మెడ, గొంతు భాగంలో పొడిచాడు. కత్తి పోట్లకు ఆమె తల తెగిపడింది. ఆ దృశ్యాన్ని చూసిన టీచర్లు, విద్యార్థులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఇదంతా చూస్తున్న స్థానికులు పారిపోతున్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ‘బాలిక వెనకాలే అతను రావటం చూశాం. కానీ, ఆమె ఇంట్లో వ్యక్తి అయి ఉంటాడని భావించాం. చివరకు కత్తితో ఆమెపై దాడి చేశాడు. మేమంతా అప్రమత్తం అయ్యే లోపు ఘోరం జరిగిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అనుమానితుడి అరెస్ట్... కాగా, 2014లో యువతిని వేధించాడన్న కారణంగా దిలీప్ సాహూ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని బాలిక తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీస్ అధికారి విజయ్ సింగ్ తెలిపారు. స్కూల్ ఆవరణలోనే అందరి ముందు ఈ భయానక ఘటన చోటు చేసుకోవటంతో వారం రోజులు మూసివేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. -
‘నన్ను కాదంటావా.. అయితే చావు’
ఝాన్సీ (ఉత్తర్ ప్రదేశ్) : ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో యువతిని కాల్చిచంపాడో దుండగుడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగింది. రోహిత్ కుష్వా అనే 24 ఏళ్ల యువకుడు కొంత కాలంగా 21 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. దీనిపై బాధిత యువతి పలుసార్లు అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అయినా రోహిత్ మాత్రం ఆమె మాటలను పట్టించుకోలేదు. ఎప్పటిలానే శనివారం సాయంత్రం కూడా.. రోహిత్ ప్రేమిస్తున్నానంటూ యువతిపై వేధింపులకు దిగాడు. అంతేకాక లైంగిక దాడి కూడా మొదలు పెట్టాడు. దాంతో ఆగ్రహించిన యువతి.. రోహిత్‌ను చెప్పుతో కొట్టింది. ఆవమానంగా భావించిన రోహిత్ తనవెంట తెచ్చుకున్న తుపాకితో పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చి పారిపోయాడు. కొనప్రాణంతో కొట్టుకుంటున్న యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలోనే యువతి తుది శ్వాస విడిచింది. ఇదిలా ఉండగా.. రోహిత్‌ను హత్యానేరం కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.