పెళ్లి మండపం వద్దే విషం తాగిన 'ప్రేమికుడు' | lover drinks poison, groom gets new girl | Sakshi
Sakshi News home page

పెళ్లి మండపం వద్దే విషం తాగిన 'ప్రేమికుడు'

Published Sat, Jan 24 2015 9:28 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

పెళ్లి మండపం వద్దే విషం తాగిన 'ప్రేమికుడు' - Sakshi

పెళ్లి మండపం వద్దే విషం తాగిన 'ప్రేమికుడు'

కృష్ణగిరి: తమిళనాడు రాష్ట్రంలోని ఓ వివాహ మండపం వద్ద చోటు చేసుకున్న క్లైమాక్స్ సన్నివేశం అచ్చంగా మసాల మూవీని తలపించింది. అది కృష్ణగిరిలో ఓ కల్యాణ మండపం.  కాసేపట్లో వధూవరులు రమేశ్(25), అనిత(19) లు పెళ్లి పీటలపై కూర్చునేందుకు సిద్దమయ్యారు.పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఆ జంట వివాహ మండపం పైకి వచ్చారు.

అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్. వధువును ప్రేమించానంటూ  మాదేశ్ అనే యువకుడు తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ యువతిని కిడ్నాప్ చేయడానికి యత్నించాడు. ఆ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న మంగళసూత్రాన్ని అ అమ్మాయి మెడలో కట్టబోయాడు. ఈ సంఘటన ఉలిక్కిపడిన వధువు బంధువులు ఆ యువకుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయినప్పటికీ అతగాడు ఏమాత్రం వెరవక తామిద్దరం ప్రేమించుకున్నామంటూ హల్ చల్ చేశాడు.ఆ అమ్మాయికి పెళ్లి జరిగితే తనతో జరగాలంటూ పట్టుబట్టాడు.

 

వధువు బంధువులు ...పెళ్లికి నిరాకరించటంతో  ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న  విషాన్ని తాగాడు. దాంతో రమేశ్ ,అనితల వివాహం ఆగిపోయింది.  ఈ ఘటన కారణంగా అక్కడ మరో వధువు రీప్లేస్ అయింది.  అదే వేదికపై దివ్య (20) అనే యువతితో రమేశ్ వివాహం జరిగిపోయింది.  కాగా, అసలు పెళ్లి మండపం వద్ద హడావుడి సృష్టించిన మాదేశ్ నిజంగానే అనితను ప్రేమించాడా?అనేది మాత్రం తేలాల్సి ఉంది. ప్రస్తుతం అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement