ప్రియురాలికి లేఖ రాసి ప్రియుడి ఆత్మహత్య | Boyfriend Commits Suicide After Letter to Lover | Sakshi
Sakshi News home page

తప్పు చేశా.. క్షమించు!

Published Tue, Feb 26 2019 12:37 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

Boyfriend Commits Suicide After Letter to Lover - Sakshi

అన్నానగర్‌: ప్రేమించిన యువతికి ద్రోహం చేశానని, అందుకు తనను క్షమించాలని కోరుతూ ప్రియుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఈరోడ్‌ సమీపంలో సోమవారం జరిగింది. వివరాలు.. ఈరోడ్‌ సమీపం కాలింగరాయన్‌ కాలువ బ్రిడ్జ్‌కి సమీపంలోని పట్టాలపై సోమవారం ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు ఈరోడ్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.

అక్కడ 35 ఏళ్ల వయసున్న ఓ యువకుడి మృతదేహం పడి ఉంది. యువకుడి ప్యాంట్‌ ప్యాకెట్‌లో ఓ లేఖ ఉంది. అందులో ‘తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు, ఆ అమ్మాయికి ద్రోహం చేసినట్లుగా తెలిపి, క్షమాపణ కోరాడు. వచ్చే జన్మలో ఆ మహిళకి బిడ్డగా పుడతాను. నా చావుకి ఎవరు కారణం కాదు. అమ్మా నన్ను క్షమించు’అని రాసి ఉంది. ఆ లేఖ ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement