Chennai Crime News Telugu: Extra Marital Affair, Woman Commits Suicide In front Of Lover House - Sakshi
Sakshi News home page

Extra Marital Affair: ప్రియుడు దూరం పెట్టడంతో ఏకంగా ఇంటి ముందే..

Published Mon, Mar 14 2022 9:54 AM | Last Updated on Mon, Mar 14 2022 11:11 AM

Extra Marital Affair: Woman Commits Suicide Infront Of Lover House - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధాన్ని మధ్యలో వదిలి వేయడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మాహుతికి పాల్పడింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా చెన్నై శివారు ప్రాంతం మీంజూరు  సమీపం వాయిలూర్‌ ప్రాంతానికి చెందిన మురుగన్‌. ఇతని భార్య వసంతి. మురుగన్‌ కోయంబేడులోని గ్యాస్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడున్న టీ దుకాణంలో పనిచేస్తున్న రామనాథపురానికి చెందిన కామాక్షి(27)తో పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ క్రమంలో మురుగన్, కామాక్షి ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో వసంతి కాటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పారిపోయిన వివాహేతర జంట పాండిచ్చేరిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిని సముదాయించి కామాక్షిని ఆమె ఇంటికి, మురుగన్‌ను అతని ఇంటికి పంపించారు. మురుగన్‌ ప్రస్తుతం తన భార్యతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో తీవ్ర ఆవేదన చెందిన కామాక్షి గత రెండు రోజులకు ముందు మురుగన్‌ ఇంటి వద్దకు చేరుకుని తనతో రమ్మని కోరింది.
చదవండి: వనస్థలిపురంలో కలకలం.. ముళ్లపొదల్లో మృతశిశువు తల లభ్యం

తాను ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లు వాపోయింది. తిరస్కరించిన మురుగన్‌ ఆమెను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని సూచించాడు. దీంతో ఆవేదనతో ఆమె వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను చికిత్స కోసం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ శనివారం రాత్రి కామాక్షి మృతి చెందింది. కాటూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: ఫస్ట్‌ టైం క్రిమినల్స్‌: సినిమాలు, యూట్యూబ్‌ చూసి నేర్చుకుంటున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement