Bride groom
-
అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా..
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని, బ్రహ్మదేవుని నిర్ణయం ప్రకారం ఎవరెవరి ఎప్పుడు, ఎవరితో వివాహం జరగాలో నిశ్చయమవుతుందని అంటారు. ఆలోచిస్తే ఇది కొందవరకూ నిజమేనని అనిపిస్తుంది. హర్యానావాసి అమిత్, ఫ్రాన్స్‌కు చెందిన సీసెల్ జంటను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..హర్యానాలోని పల్వాల్ జిల్లాలోని కలువా గ్రామానికి చెందిన అమిత్ నర్వార్(30) ఫ్రాన్స్ యువతి సీసెల్ను వివాహమాడటం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 12న వీరి వివాహం పాల్వాల్‌లోని విష్ణు గార్డెన్లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సందర్భంగా విదేశీ వధువును చూసేందుకు ఊరిజనమంతా తరలివచ్చారు. ఈ సందడిలో సదరు విదేశీ యువతి తన భర్త, అత్తామామలతో కలసి నృత్యం చేసి అందరినీ అలరించారు. అమిత్ నర్వార్ ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో 2019లో యోగా టీచర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో అతని దగ్గర యోగా నేర్చుకునేందుకు ఫ్రాన్స్ నుంచి సీసెల్ మార్లీ వచ్చారు. ఈ కోర్సు రెండు నెలల పాటు సాగింది. ఈ నేపధ్యంలో అమిత్, సీసెల్ ప్రేమలో పడ్డారు. యోగా కోర్సు ముగిసిన అనంతరం సీసెల్ తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఆ తరువాత వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకోసాగారు.ఇదిలా ఉండగా అమిత్ కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో వివాహం చేయాలనుకున్నారు. అయితే అమిత్ తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అమిత్ చేస్తున్న ఉద్యోగాన్ని, ఇంటిని విడిచిపెట్టి 2022లో ఫ్రాన్స్‌కు వెళ్లారు. అప్పటికే సీసెల్ అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. డబ్బుకు ఇబ్బంది లేకపోవడంతో అమిత్, సీసెల్ లివ్ ఇన్ రిలేషన్ షిప్లో 2022 నుంచి 2024 వరకు ఉన్నారు. ఇదే సమయంలో సీసెల్ తండ్రి క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత సీసెల్, అమిత్‌లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరు కుటుంబాలవారికీ చెప్పారు. వారు ఓకే చెప్పడంతో సీసెల్ తమ కుటుంబసభ్యులతో సహా భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 12న అమిత్, సీసెల్ల వివాహం ఘనంగా జరిగింది.ఇది కూడా చదవండి: Vallabhbahi Patel: ‘ఉక్కు మనిషి’ చివరి రోజుల్లో.. -
‘మామయ్యా’ అనే పిలుపు కోసం..
చాలామంది అన్నదమ్ములు తమ సోదరికి జన్మించిన సంతానాన్ని అమితంగా ప్రేమిస్తుంటారు. వారి చేత ‘మామయ్యా..’ అని పిలిపించుకోవాలని తపన పడిపోతుంటారు. అయితే ఈ మెట్లనన్నింటినీ దాటేసిన ఒక మేనమామ తన మేనకోడలికి పెళ్లిలో ఘనమైన కానుకను సమర్పించుకున్నాడు. హర్యానాలోని రేవాడీలో ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు ఇచ్చిన కానుక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన వితంతు సోదరి కుమార్తెకు కానుకగా ఇచ్చేందుకు అతను సోదరి ఇంట్లో రూ.500 నోట్ల కట్టలను కుప్పలుగా పోశాడు. మేనకోడలికి ఖరీదైన కానుకను అందించిన ఆ వ్యక్తి పేరు సత్బీర్. అతను క్రేన్ వ్యాపారి. సత్బీర్ తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు విలువైన నగలు కూడా బహూకరించాడు. సత్బీర్ మొత్తంగా ఒక కోటి, ఒక లక్షా పదకొండు వేల నూటొక్క రూపాయలను పెళ్లి కుమార్తెకు కానుగా ఇచ్చాడు. ఈ ఘటనలో నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసల్వాస్ రేవారి.. ఇది జైపూర్-ఢిల్లీ హైవేకి ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఈ ప్రాంతానికి చెందిన సత్బీర్ సోదరి వివాహం సిందర్‌పూర్‌లో జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి ఆమె భర్త మృతి చెందాడు. సత్బీర్ సోదరికి ఒక కుమార్తె ఉంది. తన మేనకోడలి పెళ్లి సందర్భంగా సత్బీర్ తన ఊరి ప్రజలతోపాటు తన సోదరి ఇంటికి చేరుకున్నాడు. పెళ్లిలో సత్బీర్ తన మేనకోడలికి ఇచ్చిన కానుకను చూసి స్థానికులు ఆశ్యర్యపోయారు. ఈ సంద్భంగా సోదరి ఇంటిని సత్బీర్ రూ.500 నోట్ల కట్టలతో నింపేశాడు. కోటి రూపాయలకుపైగా మొత్తాన్ని తన మేనకోడలికి బహూకరించాడు. ఇది కూడా చదవండి: ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే! भाई ने विधवा बहन के घर लगा दिया रुपयों का ढेर, करोड़ों का भात बना चर्चा का विषय#rewari #haryana #bhaat pic.twitter.com/SYi95UEREl — Punjab Kesari Haryana (@HaryanaKesari) November 27, 2023 -
పెళ్లింట విషాదం.. పెళ్లైన తెల్లారే ఇలా..
సాక్షి, సిద్దిపేట: పెళ్లి కట్టిన తోరణాలు వాడనే లేదు.. వివాహానికి వచ్చిన బంధువులు వెళ్లనే లేదు. అంతలోనే పెళ్లింట విషాదం నెలకొంది. వరుడు అకాల మరణం పొందాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే.. వరుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగిన మరుసటి రోజే విద్యుత్ షాక్‌తో వరుడు మృతి చెందాడు. వెంకటాపూర్‌కు చెందిన నిరంజన్ సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా సిద్దిపేట పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, నిరంజన్‌కు సోమవారం పెళ్లి రిసెప్షన్ జరగాల్సి ఉంది. కాగా, సోమవారం ఉదయం తాను ఉంటున్న ఇంటి వద్ద రిసెప్షన్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో లైటింగ్ తీగలు తగిలి కరెంట్ షాక్‌తో నిరంజన్ మృతిచెందాడు. దీంతో, ఎంతో ఆనందంగా ఉన్న పెళ్లింట విషాదం నెలకొనడంలో కుటంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. జీవితాంతం తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్త అకాల మరణంతో వధువు బోరున విలపిస్తోంది. ఇది కూడా చదవండి: తీవ్ర విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు.. -
నెల క్రితం పెళ్లి.. శ్మశానవాటికి సమీపంలోకి వెళ్లి
అన్నానగర్(చెన్నై): తిరువారూర్ జిల్లా ముత్తుప్పేట సమీపంలోని కోవిలూరు శ్మశాన వాటిక సమీపంలో సోమవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకుని యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రజలు ముత్తుపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుతురపూండి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు జరిపిన విచారణలో అతను ముత్తుపేట సమీపంలోని కోవిలూరు ఉత్తర అటవీ ప్రాంతానికి చెందిన మణికంఠన్ కుమారుడు సంతోష్ (20) అని తేలింది. మంగళూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. పెళ్లికి నిరాకరించడంతో యువతి ముత్తుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి రాజీ చేసి నెల క్రితం పెళ్లి చేశారు. ఈ క్రమంలో అతను సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే..
జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్లయిన వారిని సెటిల్ అయ్యారని కూడా అంటుంటారు. అయితే పెళ్లి విషయంలో వివిధ దేశాల్లో పలు రకాలైన సంప్రదాయాలున్నాయి. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకలు రోజుల తరబడి కూడా జరుగుతుంటాయి. అయితే ఆ దేశంలో పెళ్లి వేడుక అన్ని ప్రాంతాలకన్నా భిన్నంగా జరుగుతుంది. అక్కడ యువకులు ఒక్కరోజు కోసం పెళ్లికొడుకులుగా మారతారు. అమ్మాయి కూడా ఒక్కరోజు కోసం వధువుగా మారుతుంది. ఇంతకీ ఇలాంటి వింత వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? పూర్తి వివరాలు.. ఇటువంటి వింత వివాహం చైనాలో జరుగుతుంది. ఇటీవలి కాలంలో చైనాలో వింత వివాహాలు జరుగుతున్నాయి. గతంలో ఇటువంటి విధానం లేదు. తాజాగా ఒక్కరోజు కోసమే ఇక్కడ వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి వివాహాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లేమీ జరగవు. సాదాసీదాగా, రహస్యంగా ఈ వివాహాలు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా చైనాలో ఇటువంటి వివాహాల తంతు పెరిగిపోయింది. ఈమధ్య కాలంలొ చైనాలలోని యువకులకు వివాహం జరగడం అత్యంత కష్టదాయకంగా మారింది. పెళ్లికి అత్యధికంగా సొమ్ము ఖర్చుపెట్టాల్సి రావడంతో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చైనాలో పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా పరిగణిస్తారు. దీనిని అధిగమించేందుకే యువకులు ఒకరోజు పెళ్లికి సిద్దం అవుతున్నారు. తద్వారా తమ బ్రహ్మచర్యాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలోనైతే ఎవరైనా వ్యక్తి పెళ్లికాకుండా మరణిస్తే, ఆ మృతదేహానికి వివాహం జరిపిస్తారు. ఇటీవలి కాలంలో చైనాలో ఒక్కరోజు పెళ్లిపేరట భారీ వ్యాపారం జరుగుతోంది. పెళ్లికాని యువకులకు ఒక్క రోజు కోసం పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది. ఇలాంటి ఒక్కరోజు వధువులకు కూడా చైనాలో డిమాండ్ పెరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి.. -
పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన పాపులర్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీలో ఒక మహిళ తన వివాహంలో జరిగిన పెద్ద పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. పెళ్ళిలో తన భర్త సంతకం చెయ్యాల్సిన చోట మామగారు సంతకం పెట్టడంతో మామగారితోనే వివాహమైనట్టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వారు సర్టిఫికెట్ ఇచ్చారని, ప్రస్తుతం తనకు ఇద్దరు భర్తలని చెప్పుకొచ్చింది. ఆస్ట్రేలియా ప్రఖ్యాత బ్రేక్ ఫాస్ట్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీ కార్యక్రమంలో ఆరోజు ఫోన్ చేసిన వారందరినీ తమ జీవితంలో జరిగిన పేద పొరపాట్లగురించి చెప్పమని అడిగారు వ్యాఖ్యాత. దీంతో కిమ్ అనే ఒక మహిళ తాన్ పెళ్ళిలో జరిగిన విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. నా పెళ్ళికి సాక్షులుగా సంతకం చేయడానికి మా మామగారు అత్తగారు తప్ప ఇంకెవ్వరూ లేరు. సరిగ్గా పెళ్లి సమయానికి మా అత్తగారు మామగారితో పాటు సాక్షి సంతకం చెయ్యమని నా భర్తను కోరారు. దీంతో వారిద్దరూ ఒకే లైన్ సంతకం చేశారు. తీరా సర్టిఫికెట్లో చూస్తే వధువు అని ఉన్న చోట నా సంతకం ఉంటే వరుడు అని ఉన్నచోట మాత్రం నా భర్తతో పాటు మా మామగారి పేరు కూడా ఉంది. ఆ సర్టిఫికెట్ ను ఇంకా మార్చకుండా అలాగే భద్రం చేసుకున్నానని తెలిపింది. ఇది కూడా చదవండి: కిమ్ జోంగ్ చెరలో అమెరికా సైనికుడు.. బయటపడేనా..? -
భారీ వర్షాలు.. మండపానికి వెళ్లలేని పరిస్థితి.. ఆ ఐడియాతో వాళ్ల పెళ్లి జరిగిపోయింది!
పెళ్లి అంటే జీవితంలో ముఖ్యమైన రోజు. మరిచిపోలేని రోజు కూడా. అందుకే బంధువులు, స్నేహితులు, అతిథుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంటారు. కొందరు విమానంలో, పడవలో, చివరకు నీటి అడుగున ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు తమ వివాహాలను ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు.. కొందరి వివాహాలు మాత్రం తాము అనుకున్నట్లు కాకుండా పరిస్థితులు బట్టి మరోలా జరుగుతున్నాయి. తాజాగా ఓ జంట పెళ్లి మండపంలో కాకుండా ఆన్లైన్లో చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఉత్తర భారతంలో భారీ వర్షాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ రోడ్లు స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట మండపానికి వెళ్లడం కుదరలేదు. వేదమంత్రాలు, పెద్దల ఆశీస్సులతో పెళ్లి పీటలు ఎక్కాలని భావించిన ఓ జంటకు అనూహ్యంగా ప్రకృతి అడ్డుతగిలింది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కటి కావడానికి ఇవేవీ అడ్డంకి కాబోవని ఆ దంపతులు భావించారు. అందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వారి వివాహం జరుగుతోందని అందరికీ తెలియజేసి, పెళ్లికి సంబంధించిన ఆన్లైన్ లింక్‌ను అందరికీ పంపారు. అనంతరం వారి పెళ్లిని ఆన్లైన్లో నిర్వహించారు. ఈ ఆన్లైన్ వెడ్డింగ్‌లో ఇద్దరి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుని ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని ఆ నవ దంపతులకు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. పెద్దలు నిర్ణయించిన సరైన సమయానికి ఆన్లైన్లో పెళ్లి చేసుకుని తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. -
వైరల్ వీడియో: పెళ్లిలో ట్విస్ట్ ఇచ్చిన వరుడు.. చెట్టుకు కట్టేసి..
ప్రతాప్‌గఢ్: కాసేపట్లో వివాహ బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యేవారు. ఇంతలో వరుడి మదిలో మెదిలిన ఓ ఆలోచనే అతడిని చిక్కుల్లో పడేసింది. దీంతో, వరుడితో సహా అతడి కుటుంబ సభ్యులందరూ బందీలు మారారు. వరుడిని చెట్టుకి కాట్టేశారు వధువు తరఫు బంధువులు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్‌లోని మంధాతా కొత్వాలి ప్రాంతానికి చెందిన ఇద్దరికి వివాహం నిశ్చయించారు ఇరు కుటుంబా సభ్యులు. దీంతో, పెళ్లి వేడుక ప్రారంభమైంది. వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. వేడుకకు బంధువులంతా తరలివచ్చారు. కొద్ది క్షణాల్లో వధువు మెడలో జయమాల వేసే సమయం ఆసన్నమైంది. అంతలోనే పెళ్లి కొడుకు అదనపు కట్నం డిమాండ్ చేశాడు. దీంతో, వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం, అదనపు కట్నం విషయంలో ఎంతసేపు వరుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నాడు. వరుడి కుటుంబ సభ్యులు కూడా అతడివైపు మొగ్గుచూపారు. దీంతో, విసుగెత్తిన వధువు కుటుంబ సభ్యులు.. ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. వరుడితో సహా అతడి కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేశారు. అనంతరం, వరుడిని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వరుడు మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని వధువు తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. इस लइका का जयमाल हो गया था .. उसके बाद परिजन दहेज की डिमांड करने लगे। जिसके बाद लड़की के परिजन ने दूल्हे साहेब को पेड़ से बांध दिया। वीडियो यूपी के प्रतापगढ़ से है ।। pic.twitter.com/obOG9BpLMB — हम लोग We The People (@ajaychauhan41) June 15, 2023 ఇది కూడా చదవండి: చిన్న వర్షానికే వందే భారత్ రైలులో వర్షపు నీరు లీక్.. వీడియో వైరల్ -
గుర్రం మీద రావాల్సిన వరుడు అలా వచ్చేసరికి...
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఒక విచిత్ర వివాహం సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. వరుడు కల్యాణమండపానికి ప్రత్యేక రీతిలో వచ్చిన విధానం అందరినీ ఆకర్షించింది. దీనిని చూసినవారంతా పెళ్లికొడుకును అభినందించలేకుండా ఉండలేకపోయారు. చక్కగా అలంకరించిన కారులోనే లేదా గుర్రం మీదనో నూతన వరుడు కల్యాణమండపానికి చేరుకోవడాన్ని చూసేవుంటాం. వీటికి భిన్నంగా ఏ వరుడైనా ప్రవర్తిస్తే అందరూ అతనిని వింతగా చూస్తారు. ఇటువంటి ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. వరుడు తనదైన ప్రత్యేక రీతిలో వధువు ఇంటికి తన బంధుబలగంతో సహా చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటాలని భావిస్తూ వాధ్వానీ కుటుంబం ఈ వినూత్న ప్రయోగం చేసింది. ఇందుకోసం వారు సైకిళ్లను వినియోగించారు. కుటుంబ సభ్యులు కూడా.. వరునితో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులంతా సైకిళ్లపై ఊరేగింపుగా కల్యాణమండపానికి చేరుకున్నారు. ఈ ఊరేగింపు ఇండోర్‌లోని లాల్బాగ్ గార్డెన్ నుంచి ఖాల్సా గార్డెన్ ఖాతీవాలా ట్యాంక్ వరకూ సాగింది. దీనికి వారు ‘మినీ బారాత్’ అనే పేరుపెట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తేజాజీ నగర్ పరిధిలోని లింబూదీలో ఉంటున్న అన్మోల్ వాద్వానీకి ఇండోర్‌లోని డింపుల్‌తో జూన్ 11న వివాహం నిశ్చయమయ్యింది. తన వివాహ వేడుక ఎప్పటికీ గుర్తుండిపోవాలని, అందరికీ స్ఫూర్తినివ్వాలనే తన ఉద్దేశాన్ని వరుడు తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీనికి వారు సమ్మతించడంతో వారంతా సైకిళ్లపై ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నారు. పర్యావరణ హితం కోరుతూ వారంతా ఈ నిర్ణయానికి మద్దతు పలికారు. వీరిని చూసిన స్థానికులు నూతన వరుడిని అభినందనలతో ముంచెత్తారు. కాగా వరునితోపాటు అతని తరపువారంతా సైకిళ్లపై ఊరేగింపుగా రావడంతో ఆడపెళ్లివారు మొదట ఆశ్చర్యపోయినా, తరువాత వారి సదుద్దేశాన్ని తెలుసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్! -
భోజనం చేస్తుండగా.. వధూవరులు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు!
అన్నానగర్(చెన్నై): తిరువారూరు జిల్లా కొత్తూరులో నూతన దంపతులు చేసిన నృత్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొత్తూరుకు చెందిన శేఖర్, కొలంజి దంపతుల కుమారుడు విజయ్‌కి కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన వల్లియన్ –మలర్ దంపతుల కుమార్తె హంసవల్లికి గురువారం అక్కరైకోటలో ఉన్న మారియమ్మన్ ఆలయంలో పెళ్లి జరిగింది. అనంతరం వరుడి ఇంట్లో అతిథులకు భోజనం వడ్డించారు. వారు భోజనం చేస్తుండగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ నృత్యం చేయడం ప్రారంభించారు. ఈ వీడియోను వరుడు విజయ్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. చదవండి: అయితే నీతులు చెప్తారు, లేదా తప్పుని కప్పిపుచ్చు కోవడానికి కథలు చెప్తారు... -
వధువు పరార్... 13 రోజులు పెళ్లి దుస్తులతో వేచివున్న వరుడు.. ఎట్టకేలకు ఏమయ్యిందంటే..
మన దేశంలో పెళ్లిళ్లు ఎంతో వేడుకగా జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లిళ్లలో ఒక్కోసారి అనుకోని ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అటువంటి ఊహకందని ఉదంతం రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్ కుమార్తె మనీషాకు వారి బంధువైన శ్రవణ్ కుమార్‌తో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లి వేడుకలో భాగంగా వరుని తరుపు వారంతా మే 3న పెళ్లికుమార్తె ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. వారికి పెళ్లి కుమార్తె తరుపువారు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. మే 4న ఉదయం వివాహ తంతులో భాగంగా మండపంలోకి పెళ్లి కుమార్తెను తీసుకురావాలని పురోహితుడు కోరాడు. అయితే ఇందుకోసం కొద్దిసేపు వెయిట్ చేయాలని పెళ్లి కుమార్తె తరపువారు చెప్పారు. పెళ్లికుమార్తె మనీషా తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుకవెపు వెళ్లింది. తరువాత అక్కడే ఉన్న ఒక బంధువుతోపాటు ఆక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతసేపయినా పెళ్లి కుమార్తె తిరిగి రాకపోవడంతో బంధువులంతా హడలిపోయారు. ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లి ముస్తాబు చేసుకునేందుకు గదిలోనికి వెళ్లిందని, తరువాత కడుపు నొప్పి వస్తున్నదని చెప్పి టాయిలెట్‌కు వెళ్లిందన్నారు. తరువాత తన మామ కుమారుడు భరత్‌కుమర్‌తో బయటకు వెళ్లిపోయిందన్నారు. కాగా బంధువులు ఎంత నచ్చచెప్పినా ఆమె ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె 13 రోజుల పాటు ఇంటిలోనే మొండికేసి కూర్చుంది. అయితే ఆమెపై అమితమైన ప్రేమ కలిగిన వరుడు.. పెళ్లి అలంకరణలో భాగంగా తాను ధరించిన పగడీ కూడా తీయకుండా ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంతవరకూ పెళ్లి మండపాన్ని అలంకరణతోనే ఉంచారు. అయితే ఎట్టకేలకు బంధువులంతా ఒప్పించి పెళ్లి కుమార్తెను మే 15న కల్యాణ మండపానికి తీసుకురాగలిగారు. దీంతో మే 16 వారి వివాహం ఘనంగా జరిగింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
నిశ్చితార్ధం చెడగొట్టి ఆమెతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ముహుర్తం టైమ్‌కి..
సాక్షి, సంగారెడ్డి: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పి ఎంతో కష్టం మీద పెళ్లికి ఒప్పించారు. తీరా.. పెళ్లి సమయానికి వరుడు వివాహ వేడుక నుంచి పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కాగా, వరుడు వెళ్లిపోడానికి కారణం తెలిసి అక్కడున్న వారంత ఖంగుతిన్నారు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అతనికి తమ కూతురుని ఇవ్వడానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాకుండా.. ఈ ఏడాది జనవరిలో ఇదే జిల్లా కంగ్టి మండలానికి చెందిన ఓ యువకుడితో అమ్మాయికి నిశ్చితార్థం జరిపించారు. ఇక, తన లవర్ పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియుడు రంగంలోకి దిగాడు. నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తికి ఫోన్ చేసి తాను యువతిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు. దీంతో, ఈ విషయాన్ని పెళ్లి కూతురు పేరెంట్స్ చెప్పి అతను పెళ్లికి నిరాకరించాడు. దీంతో, వధువు పేరెంట్స్ చేసేదేమీ లేక.. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకున్నారు. అనంతరం, పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కొండాపూర్ మండలంలోని ఒక గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే, పెళ్లికి కొద్ది గంటలే సమయం ఉందనగా వరుడు ప్లేట్ ఫిరాయించాడు. తనకు కట్నంగా రూ.15 లక్షలు ఇస్తేనే తాళి కడతానని మొండికేసి కూర్చున్నాడు. దీంతో, అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. అనంతరం.. అందరి కళ్లుగప్పి పెళ్లి పీటలపై నుంచే పరారయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా, ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత వధువు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: త్వరలో సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య.. వందేభారత్ -
వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి!
లక్నో: పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే వేడుక. అయితే ఇటీవల చూస్తే.. పీటల వరకు వచ్చిన వివాహాలు ఏదో ఒక కారణంగా ఆగిపోతున్నాయి. తాజాగా ఓ వధువు పీటల వరకు వచ్చిన పెళ్లిని వద్దని వరుడుకి షాకిచ్చింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అంటూ తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో చౌబేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరివురి వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం వరుడు అతని బంధువులు ఊరేగింపుగా పెళ్లి మండపంలోకి చేరుకున్నారు. కాసేపటి తర్వాత వరడు, వధువు ఇద్దరూ కలిసి వేదికపైకి వెళ్లారు. పెళ్లి తతంగాలు మొదలు పెట్టారు ఇరువైపు బంధువులు. ఈ క్రమంలో వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో మద్యం సేవించిన వరుడి స్నేహితులు పెళ్లి కుమార్తె స్నేహితులను చూసి కేకలు వేస్తూ గోల చేశారు. దీంతో స్టేజీపై ఉన్న వారంతా ఆగ్రహానికి గురయ్యారు. వారితో పాటు వరుడు కూడా వింత పనులు చేస్తూన్నాడు. మాల వేస్తుండగా వరుడు మద్యం సేవించాడని వధువు గమనించింది. కోపంతో స్టేజి దిగి నేరుగా తన గదిలోకి పెళ్లికి నిరాకరించింది. కుటుంబ పెద్దలు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకారం తెలిపాయి. చదవండి: భానురేఖ మృతిపై.. విస్తుపోయేలా బెంగళూరు మహానగరపాలక సంస్థ రిపోర్టు -
పెళ్లి చేసుకోవాలిని ఒత్తిడి.. మండపంలో విషం తాగిన వధూవరులు
భోపాల్: పెళ్లి చేసుకుని నూరేళ్లు కలిసి జీవించాల్సిన వధూవరులు విషం తాగి అర్థాంతరంగా తమ జీవితాన్ని ముగించాలనుకున్నారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా, పెళ్లికుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ ఆలయంలో 21 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల యువతితో పెళ్లి జరుగుతోంది. అయితే వివాహం సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత పెళ్లికుమారుడు విషం తాగి ఈ విషయాన్ని వధువుకు తెలియజేశాడు. వరుడు విషం సేవించాడని తెలిసిన వెంటనే వధువు కూడా తాగింది. వధూవరుల బంధువుల వారిద్దరినీ హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు వరుడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. వధువు పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా తన పెళ్లి చేసుకోవాలని వధువు ఒత్తిడి చేస్తోందని వరుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కెరీర్ దృష్ట్యా తమ పెళ్లికి రెండేళ్లు గడువు కావాలని కోరడంతో యువతి వినక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ పెళ్లి జరుగుతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు! -
పెళ్లి మండపానికి వరుడు రాలేదని.. ఊహించని షాకిచ్చిన వధువు!
ఇటీవల పెళ్లి మండపాలలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ వరుడు తన పెళ్లి సంగతిని కూడా మరిచిపోయి మండపానికి వెళ్లలేదు. ఇక వరుడి రాక కోసం వేచి చూసి విసుగుచెందిన వధువు అతనికి ఊహించని షాకిచ్చింది. ఈ వింత ఘటన బీహార్‌లోని భాగల్పూర్లోని సుల్తాన్‌గంజ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఓ వరుడు తన పెళ్లి రోజు ఆనందంతో ఫుల్‌గా మందు తాగి ఆ మత్తులో మండపానికి వెళ్లాలన్న విషయాన్ని మరచి నిద్రపోయాడు. ఇరువర్గాల కుటుంబ సభ్యులు వివాహ వేదిక వద్ద వరుడి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎంత సేపు ఎదురుచూసిన అతను రాలేదు. వివాహం మరుసటి నాడు స్పృహలోకి రావడంతో వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే వరుడు నిర్లక్ష్యపు ధోరణి చూసిన ఆమెకు చిరాకు వచ్చింది. ఈ పెళ్లికి నిరాకరించింది. తన బాధ్యతలను కూడా సరిగా అర్థం చేసుకోని వ్యక్తితో తన జీవితాన్ని గడపలేనని తెగేసి చెప్పింది. దీంతో వాయిద్యాలు, డీజే సౌండ్లు హోరెత్తాల్సిన మండపం కాస్త సైలెంట్‌గా మారిపోయింది. పెళ్లి ఏర్పాట్లకు ఖర్చు చేసిన డబ్బును వరుడి కుటుంబీకులు తిరిగి ఇవ్వాలని వధువు కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వరుడి బంధువులు కొందరిని బందీలుగా చేయడంతో అక్కడి పరిస్థితి విషమించింది. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు. చివరికి ఈ కేసు సద్దుమణిగినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో.. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలోని తిర్వా కొత్వాలి ప్రాంతంలో వధువుకు 12వ తరగతి మార్కులు సరిపోవని భావించిన వరుడు తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. -
మండపంలోనే బోరున ఏడ్చేసిన వధూవరులు.. వీడియో వైరల్!
పెళ్లి.. పేరుకి రెండు అక్షరాలైన దీని బంధం మాత్రం నూరేళ్లు ఉంటుంది. వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు.. మూడు ముళ్ల బంధంతో.. నలుగురి సమక్షంలో ఒకటై జీవితాంతం జీవిస్తారు. అందుకే జీవితంలో ఇదొక మధురమైన క్షణంగా భావిస్తుంటారు. అంతటి ప్రత్యేక రోజు కనుకే పెళ్లి మండపంలో ఆనందంతో పాటు కాస్త హడావుడి, కాస్త గందరగోళం వాతావరణం ఉంటుంది. ఇటీవల వివాహ వేదికలపై ఏదో ఒక వింత ఘటనలు జరగడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి వేదికపై మరో వింత ఘటన చోటు చేసుకుంది. ఒకటే ఏడుపు... పెళ్లంటేనే సందడి. బంధు మిత్రుల హడావుడి, మర్యాదలు, ఆత్మీయుల కలయికలు ఇలాంటి వాటితో అక్కడ వాతావరణమంతా పండుగను తలపిస్తుంది. వధూవరుల తరపు కుటుంబ సభ్యులకు ఈ సమయంలో వారి ఆనందాన్ని అవధులు ఉండవు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే మాంగళ్య ధారణ జరిగే సమాయానికి వధూవరులు కుటుంబసభ్యుల కళ్లలో ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో బయటపెడుతుంటారు. ఇటీవల ఓ పెళ్లిలో.. వధూవరులు ఇద్దరూ వేదికపైనే ఏడ్వడం ప్రారంభించారు. వారిద్దరూ కలిసి ఒకటై జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అనే ఆనందం కాస్త కన్నీళ్లుగా మారి బయటపడ్డాయి. ఇద్దరు ఒకరి నొకరు చూసుకుంటూ ఏడ్వడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీనంతటిని వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. రిసెప్షన్ వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. View this post on Instagram A post shared by 𝗪𝗲𝗱𝗱𝗶𝗻𝗴_𝗰𝗼𝘂𝗽𝗹𝗲❤ (@wedding_couple_photography_20) -
ఇదేందయ్యా ఇది.. వరుడికి డిఫరెంట్‌గా స్వాగతం పలికిన అత్తామామ!
పెళ్లి వేడుక అనగానే కుటుంబ సభ్యులు, బంధువులతో కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఇక, వివాహ వేడుకలో వరుడు ఎంట్రీ ఏ రేంజ్లో ఉంటుందో సోషల్ మీడియాలో చాలా వీడియోలే చూసి ఉంటారు. కానీ.. వీరి పెళ్లిలో వరుడికి దక్కిన అరుదైన ఎంట్రీ చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వరుడికి సిగరెట్ వెలిగించి పెండ్లి వేడుకకు వధువు తల్లితండ్రులు ఆహ్వానిస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. కాగా, ఈ వీడియోలో వరుడు కూర్చుని ఉండగా అత్తా మామలు అతడికి సిగరెట్ అందించి వారే వెలిగించడం కనిపిస్తుంది. పెళ్లి వేడుకకు పెండ్లి కొడుకును స్వీట్లు, బీడీ, పాన్‌తో అత్తగారు స్వాగతిస్తారు. ఇక, ఈ వీడియోను పెళ్లికి హాజరైన జుహీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, తమ ప్రాంతంలోని ఆచారం కోసమే వరుడు, వధువు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. వరుడు సిగరెట్ తాగలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ ఆచారం దక్షిణ గుజరాత్‌లోని కొన్ని గ్రామాలు, బీహార్, ఒడిషాలోనూ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేం ఆచారంరా బాబు అంటూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. View this post on Instagram A post shared by Joohi K Patel (@joohiie) -
Crime: వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ, అంతలోనే..
క్రైమ్: పెళ్లి సంబురంలో ఉన్న ఆ వరుడికి ఒక్కసారిగా షాక్ తగిలింది. మెడలో కరెన్సీ నోట్ల దండతో గుర్రమెక్కి ఊరేగాలనుకుంటే.. ఆ ఫీట్ బెడిసి కొట్టింది. రయ్‌మని దూసుకొచ్చిన ఓ కుర్రాడు.. ఆ నోట్ల దండతో ఉడాయించాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఢిల్లీ మాయాపూరి ప్రాంతంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సరాసరి ఆ పెళ్లి బృందం నేరుగా పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల సాయంతో బృందాలను పంపించి.. సాయంత్రంకల్లా ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని 14 ఏళ్ల కుర్రాడికి గుర్తించారు. చోరీకి ముందు ఆ దండలో మొత్తం 329 నోట్లు ఉన్నాయట. అయితే.. పోలీసులు మాత్రం 500 నోట్లు 79 మాత్రమే రికవరీ చేయగలిగారు. -
ఆదిలాబాద్: కుప్పకూలిన పెళ్లి కొడుకు.. కన్నుమూత!
సాక్షి, ఆదిలాబాద్: మరి కొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. కానీ, విధి ఆ యువకుడి జీవితంతో ఆడుకుంది. కాళ్లకు రాసిన పారాణి ఆరిపోక ముందే అర్ధాంతంరంగా అతని జీవితం ముగిసిపోయింది. రెండు వైపులా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఉట్నూరుకి చెందిన సత్యనారాయణకు(34), జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నెల 27న అతని వివాహం జరగాల్సి ఉంది. ఆ ఇంటికి పెద్ద కొడుకు కావడంతో పెళ్లి వేడుకలు ఘనంగా చేయాలని భావించారు. సత్యనారాయణే.. తన పెళ్లి పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాకా పనులు చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఆపై అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతను కన్నుమూసినట్లు తెలుస్తోంది. కార్డియాక్ అరెస్ట్‌తోనే సత్యనారాయణ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే సత్యనారాయణ.. అదీ వివాహనికి కొద్ది గంటల ముందే కన్నుమూయడంతో ఆ ఊరు ఊరంతా విషాదంలో కూరుకుపోయింది. -
AP: లవ్ ఇన్ సింగపూర్.. మధురవాడలో పెళ్లి!
మధురవాడ(భీమిలి): వారి భాషలు.. మతాలే కాదు.. దేశాలు కూడా వేర్వేరు. అయినా వారి ప్రేమకు అవేమీ అడ్డుకాలేదు. సింగపూర్‌లో వారి పరిచయం ప్రేమగా మారగా.. మధురవాడలోని ఎంవీవీ సిటీలో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. మధురవాడలో స్థిరపడ్డ పెండిమి శ్రీనివాస్, ఫిలిప్పీన్స్‌కు చెందిన జమేలాహ్ వివాహం గురువారం హిందూ సంప్రదాయ పద్ధతిలో అంగరంగవైభవంగా జరిగింది. నగరంలోని శాలిపేటకు చెందిన శ్రీనివాస్ విశాఖ బుల్లయ్య కళాశాలలో డిగ్రీ పూర్తి తర్వాత పుణెలో ఎంబీఏ చదివారు. ఉద్యోగరీత్యా ఏడేళ్ల కిందట సింగపూర్ వెళ్లి అక్కడ హెచ్‌పీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సింగపూర్‌లోనే శాప్(సిస్టమ్ అప్లికేషన్ ప్రొవైడర్)లో పనిచేస్తున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన జమేలాహ్‌తో 4 ఏళ్ల కిందట పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించారు. మన దేశంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో మధురవాడలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా.. వీరిద్దరికీ కెనడాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. త్వరలోనే కెనడా వెళ్లనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. -
ఆ ఆటోడ్రైవర్ నిజాయితీకి ఫిదా.. ఏకంగా మనువాడింది
అతనొక ఆటోడ్రైవర్. అయినా ఆమె అతన్ని అర్థం చేసుకుని ఇష్టపడింది. అతని నిజాయితీ ఆమెను బాగా ఆకర్షించింది. స్వదేశీ-విదేశీ అభ్యంతరాలు, ఆస్తిపాస్తుల అంతరాల్ని పక్కన పెట్టింది. మనసులో మాట బయటపెట్టి.. అతన్ని ఒప్పించింది. ఐదేళ్లుగా వాళ్ల ప్రేమ ప్రయాణం సాగింది. డేటింగ్ పేరుతో ఎక్కడ మోసం చేస్తుందేమోనని ఆ కుర్రాడి కుటుంబం కంగారు పడింది. దేశం కానీ దేశం నుంచి అల్లుడు అనేసరికి ఆమె తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. కానీ, వాళ్ల ప్రేమ కొనసాగింది. చివరికి.. మనసైన వాడిని అతని సంప్రదాయ పద్ధతుల్లోనే వివాహం ఆడింది. బెల్జియంకు చెందిన కెమిల్ తన కుటుంబం పాటు ఐదేళ్ల కిందట కర్ణాటక విజయనగర జిల్లా హంపికి టూర్ మీద వచ్చింది. ఆ సమయంలో హంపి జనతా ప్లాట్‌కు చెందిన ఆటోడ్రైవర్ అయిన అనంతరాజుతో పరిచయం ఏర్పడింది. ఇక్కడ ఉన్నన్నిరోజులు వాళ్ల గైడ్‌గా ఉన్నాడు రాజు. ఎక్కడా మోసం చేయకుండా ప్రయాణికులతో, విదేశీయులతో అతను వ్యవహరించిన తీరు, నిజాయితీ ఆమెను విపరీతంగా ఆకర్షించాయి. పైగా తనకు వచ్చే సంపాదనలో అతను కొంత దానం చేస్తున్నాడని తెలిసి.. ఆ మంచి మనసును ఇష్టపడిందామె. ఈ క్రమంలో అతన్ని ప్రేమిస్తున్నట్లు తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. మొదట ఆలోచనలో పడ్డా.. కూతురి సంతోషం కోసం వాళ్లు అంగీకరించారు. పెద్దల సమక్షంలోనే ఆమె అతనికి ప్రపోజ్ చేసింది. తన ఇంట్లో వాళ్లను అడిగి.. ఆమె ప్రేమకు అంగీకారం తెలిపాడతను. అలా.. వాళ్ల ప్రేమ.. పెద్లల సమక్షంలోనే పెరిగి పెద్దైంది. అయితే.. కరోనా సమయంలో వాళ్ల వివాహం జరగాల్సి ఉంది. బెల్జియంలో గ్రాండ్‌గా పెళ్లి ప్లాన్ చేశారు ఆమె తల్లిదండ్రులు. ఈలోపు.. కరోనా పరిణామాలతో ఆ పెళ్లి వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కెమిల్ బెల్జియంలో సామాజిక వేత్త. ఈ గ్యాప్‌లో వాళ్ల బంధం మరింత బలపడింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాగైనా రాజునే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. చివరికి వాళ్ల ఇంట్లో వాళ్లు.. రాజు తల్లిదండ్రులతో మరోసారి పెళ్లి సంప్రదింపులు మొదలుపెట్టారు. చివరికి.. భారత్‌లోనే పెళ్లి బాజాలు మొగాయి. ఇవాళ(శుక్రవారం 25-11-2022) హంపీ విరూపాక్షేశ్వర ఆలయంలో పెద్దలు, బంధు మిత్రుల నడుమ ఘనంగా వివాహం జరిగింది. హంపీకి చెందిన అంజీనప్ప కుమారుడు అనంతరాజుకి, బెల్జియంకు చెందిన జీప్ పిలిఫ్ మూడవ కుమార్తె కెమిల్ ఏడగుడులతో ఒక్కటవ్వడం స్థానికంగా ఆకట్టుకుంది. -
40 రోజుల్లో 32 లక్షల వివాహాలు.. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా!
పెళ్లి.. ఇది రెండక్షరాలే, కానీ ఇద్దరు వ్యక్తులు ఒక్కటై జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దీని విశిష్టత ఇప్పటికీ అలానే ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో మాత్రం గతంతో పోలిస్తే చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. గతంలో వివాహాలు వరుడు లేదా వధువు ఇళ్లలో జరిగేవి, లేదంటే వారి ప్రాంతానికే పరిమితంగా ఉండేవి. అయితే మారుతున్న ట్రెండ్, డబ్బు సంపాదన పెరగడంతో ప్రతి ఒక్కరూ వివాహాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరిగే లక్షలాది జంటల వివాహ వేడుకల సందడి దేశ వ్యాపార లావాదేవీలకు మరింత ఊపు ఇవ్వనున్నాయి. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు, వాటి ద్వారా సుమారు రూ.3.75లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. సీఏఐటి.. దేశవ్యాప్తంగా 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లతో 35 నగరాల పరిధిలో కెయిట్ అనుబంధ రీసెర్చ్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఈ సీజన్లో కేవలం ఢిల్లీలోనే 3.5 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల ఢిల్లీలోనే దాదాపు ₹75,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని (సీఏఐటి)CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపు 25 లక్షల వివాహాలు, ₹3 లక్షల కోట్లు ఖర్చు అయినట్టు అంచనా. మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో, మార్కెట్లలో పెళ్లి కొనుగోళ్ల ద్వారా దాదాపు ₹3.75 లక్షల కోట్లు రానున్నట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ తదుపరి దశ జనవరి 14 నుంచి ప్రారంభమై జూలై వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. As per the latest survey conducted by the research wing of CAIT, about 32 lakh weddings will be solemnised between 4th Nov- 14th Dec 2022. Estimated business flow in this period is likely to be 3.75 lakh crore. About 75000 crore business expected in Delhi alone: @praveendel pic.twitter.com/dxJv4JPw0q — Confederation of All India Traders (CAIT) (@CAITIndia) November 7, 2022 చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
మార్కెట్లో పెళ్లి కొడుకుల విక్రయం.. ఎక్కడో కాదు మన దేశంలోనే!
పట్నా: పెళ్లైన కొత్తలో మూవీలో హైటెక్ మ్యారేజ్ బ్యూరో పేరుతో సునీల్ పెళ్లికొడుకులను విక్రయానికి పెడతాడు. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసినట్లు పెళ్లి కొడుకులను కొనుగోలు చేయటం వింటే వింతగా ఉంది కదా?. అయితే.. అలాంటి మార్కెట్ ఒకటి నిజ జీవితంలో ఉందని మీకు తెలుసా? బిహార్‌లోని మధుబని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్ నిర్వహిస్తారు. స్థానిక మార్కెట్ ప్రాంతంలోని చెట్ల కిందే ప్రతిఏటా 9 రోజుల పాటు ఈ పెళ్లి కొడుకుల విక్రయాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం సుమారు 700 ఏళ్ల నుంచి వస్తున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్ సభా అని పిలుస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందిన వారు తమ కుమార్తెలను తీసుకుని ఈ మార్కెట్‌కు వస్తారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ మార్కెట్లో వేల మంది పెళ్లి కొడుకులు వారి కుటుంబ సభ్యులతో వస్తారు. సంప్రదాయ ధోతి, కుర్తా లేదా షీన్స్, టీషర్ట్ ధరిస్తారు. వారి ఆస్తులు, విద్యా అర్హతలను బట్టి వారికి రేటు నిర్ణయిస్తారు. పెళ్లి కొడుకును కొనుగోలు చేసే ముందు అతడి అర్హతలు, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తారు ఆడపిల్లల కుటుంబ సభ్యులు. అలాగే జన్మదినం, పాఠశాల ధ్రువపత్రాల వంటివి అడుగుతారు. వరుడిని వధువు ఎంపిక చేసుకున్న తర్వాత ఇరువురి కుటుంబాలు మిగతా కార్యక్రమాలు చేపడతాయి. వివాహాన్ని ఆడపిల్ల కుటుంబమే నిర్వహిస్తుంది. కర్నాత్ వంశపాలన కాలం నుంచి ఈ సంప్రదాయం వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విభిన్న గోత్రాల ప్రజల మధ్య పెళ్లిళ్లు చేసేందుకు రాజా హరిసింగ్ దీనిని ప్రారంభించినట్లు వెల్లడించారు. మరోవైపు.. వివాహాలు కట్నం లేకుండా చేయటమే దీని లక్ష్యంగా మరికొందరు తెలిపారు. Groom market’ In this unique 700-year-old tradition, the aspiring husbands stand in public display, Village famous for its ” annual “groom market” in India’s Bihar state -in Madhubani district Dowry though illegal in India, is prevalent and has a high social acceptance pic.twitter.com/G5428fE2Kz — Elmi Farah Boodhari (@BoodhariFarah) August 4, 2022 ఇదీ చదవండి: కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు -
ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!
గత ఐదేళ్లుగా సరైన జోడి కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నా. కానీ, దొరకట్లేదు. సంబంధాల కోసం ఎంతో డబ్బు ఖర్ఛు చేశాం.. ఫలితం లేదు. ఏం చేయను.. తప్పట్లేదు అంటూ ఆ యువకుడు చేసిన పని ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తనకు నచ్చిన, తనను మెచ్చిన అమ్మాయిని వెతుక్కోవడం కోసం తమిళనాడులోని విల్లపురానికి చెందిన ఎమ్మెస్ జగన్ వినూత్న చర్యకు దిగాడు. ‘పేరు: ఎమ్మెస్ జగన్. వయస్సు: 27 ఏండ్లు. జీతం నెలకు నలభైవేలు. నాకు వధువు కావలెను’ అంటూ కులం, ఇతర వివరాలతో పాటు మధురై అంతటా రోడ్ల కూడళ్లలో బ్యానర్లు, వాల్ పోస్టర్లు వేశాడతను. ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేసే జగన్.. పార్ట్ టైంలో డిజైనర్‌గా కూడా పని చేస్తున్నాడు. నా పనిలో భాగంగా ఎంతో మంది కోసం.. ఎన్నో పోస్టర్లు డిజైన్ చేశా. నా కోసం ఎందుకు డిజైన్ చేసుకోకూడదు అనిపించింది. అందుకే ఇలా అంటున్నాడు ఆ యువకుడు. ఎంతో మంది అమ్మాయిని చూస్తామంటూ డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ, ఎవరూ సరిపోయే జోడిని తేలేకపోయారు. అందుకే ఈ ప్రయత్నం అంటున్నాడు అతను. అయితే.. పోస్టర్లు పెట్టాక ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? అంటే.. అబ్బే లేదంట. కేవలం.. మ్యారేజ్ బ్రోకర్లు మాత్రమే ఫోన్లు చేస్తున్నారట పాపం. నైంటీస్‌లో పుట్టిన తనకు ఇదొక టఫ్ టైం అంటున్నాడు ఎమ్మెఎస్ జగన్. ఇంటర్నెట్లో మీమ్స్‌తో పాటు కొంతమంది ఫోన్ కాల్స్ చేసి.. పాపం అతన్ని పెళ్లి చూపులంటూ ఏడ్పించారట కూడా. కానీ, ఎవరినీ పట్టించుకోకుండా ఈ ప్రయత్నం ఆపనంటున్నాడు అతను. ఒకవేళ.. త్వరలో మంచి సంబంధం గనుక కుదిరితే.. కృతజ్ఞతలతో మరొక పోస్టర్ తయారు చేస్తాడంట. -
పెళ్లి ఊరేగింపు: దోస్తును కాల్చి చంపిన పెళ్లికొడుకు
మన పెళ్లిళ్లకు హడావిడి మామూలుగా ఉండదు. అయితే.. ఆర్భాటాలు, దర్పం ప్రకటించుకునే క్రమంలో అతిపోకడలకు పోతుండడంతో.. అనర్థాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వివాహ వేడుకలో విషాదం నింపింది. తన స్నేహితుడినే కాల్చి చంపేశాడు ఓ పెళ్లి కొడుకు. పెళ్లి ఊరేగింపులో తన చిన్ననాటి స్నేహితుడినే కాల్చి చంపేశాడు పెళ్లి కొడుకు. అయితే అది పొరపాటుగానే జరిగింది. ఉత్తర ప్రదేశ్ సోన్‌భద్ర జిల్లా బ్రహ్మనగర్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఘటనలో టైంలో కొందరు వీడియోలు తీయగా.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనీష్ మదేషియా అనే వ్యక్తి వివాహంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మనీష్ స్నేహితుడు బాబూ లాల్ యాదవ్ ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి కొడుకు రథంపై ఊరేగింపు టైంలో.. తన దగ్గరి గన్నే మనీష్ చేతిలో పెట్టి గాల్లోకి కాల్పులు జరపమన్నాడు బాబూ లాల్. అయితే.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన మనీష్.. గన్ను కిందకు దించగానే ట్రిగ్గర్ నొక్కుకుపోయి బుల్లెట్ బాబూ లాల్ శరీరంలోకి దూసుకుపోయింది. బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఘటనకు సంబంధించి మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త పెళ్లి కొడుకు మనీష్ మేదషియాను అరెస్ట్ చేశారు. అలాగే మరో ఐదుగురిపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. నేరం రుజువైతే మనీష్‌కు రెండు నుంచి ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. మన దేశంలో వివాహ తదితర వేడుకలు, ప్రార్థన స్థలాలు సహా బహిరంగ ప్రాంతాల్లో లైసెన్స్ తుపాకులతో కాల్పులు జరిపినా.. చట్టరీత్యా నేరం. दूल्हे ने की हर्ष फायरिंग, आर्मी के जवान की हुई मौत। यूपी के @sonbhadrapolice राबर्ट्सगंज का #ViralVideo #earthquake #breastislife #fearwomen #Afghanistan pic.twitter.com/7laX9OUIqD — RAHUL PANDEY (@BhokaalRahul) June 23, 2022 थाना रॉबर्ट्सगंज पुलिस द्वारा हर्ष फायरिंग में हुई हत्या से सम्बन्धित 01 नफर अभियुक्त को किया गिरफ्तार, कब्जे से आलाकत्ल 01 अदद पिस्टल मय 04 अदद जिन्दा व 01 अदद फायरशुदा कारतूस बरामद । pic.twitter.com/8gfevb7r96 — Sonbhadra Police (@sonbhadrapolice) June 22, 2022