ఇదేందయ్యా ఇది.. వరుడికి డిఫరెంట్‌గా స్వాగతం పలికిన అత్తామామ! | Aunt Put Cigarette In Groom Mouth And Light It Viral Video | Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా ఇది.. వరుడికి డిఫరెంట్‌గా స్వాగతం పలికిన అత్తామామ!

Published Fri, Feb 17 2023 9:16 PM | Last Updated on Fri, Feb 17 2023 9:30 PM

Aunt Put Cigarette In Groom Mouth And Light It Viral Video - Sakshi

పెళ్లి వేడుక అనగానే కుటుంబ సభ్యులు, బంధువులతో కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఇక, వివాహ వేడుకలో వరుడు ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉంటుందో సోషల్‌ మీడియాలో చాలా వీడియోలే చూసి ఉంటారు. కానీ.. వీరి పెళ్లిలో వరుడికి దక్కిన అరుదైన ఎంట్రీ చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

వ‌రుడికి సిగ‌రెట్ వెలిగించి పెండ్లి వేడుక‌కు వ‌ధువు త‌ల్లితండ్రులు ఆహ్వానిస్తున్న వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. కాగా, ఈ వీడియోలో వ‌రుడు కూర్చుని ఉండ‌గా అత్తా మామ‌లు అత‌డికి సిగ‌రెట్ అందించి వారే వెలిగించ‌డం క‌నిపిస్తుంది. పెళ్లి వేడుకకు పెండ్లి కొడుకును స్వీట్లు, బీడీ, పాన్‌తో అత్త‌గారు స్వాగ‌తిస్తారు. ఇక, ఈ వీడియోను పెళ్లికి హాజరైన జుహీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, తమ ప్రాంతంలోని ఆచారం కోసమే వరుడు, వధువు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. వరుడు సిగరెట్‌ తాగలేదని క్లారిటీ ఇచ్చారు.  

మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ ఆచారం దక్షిణ గుజరాత్‌లోని కొన్ని గ్రామాలు, బీహార్‌, ఒడిషాలోనూ ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేం ఆచారంరా బాబు అంటూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement