డ్యాన్స్‌ చేస్తూ కిందపడ్డ కొత్త జంట.. తగ్గేదేలే అంటూ వధువు వెంటనే లేచి.. | Viral Video: Groom Piggybacks Bride While Dancing | Sakshi
Sakshi News home page

Viral Video: డ్యాన్స్‌ చేస్తూ కిందపడ్డ కొత్త జంట.. తగ్గేదేలే అంటూ వధువు వెంటనే లేచి..

Published Tue, Sep 21 2021 7:58 PM | Last Updated on Tue, Sep 21 2021 9:30 PM

Viral Video: Groom Piggybacks Bride While Dancing - Sakshi

ఇంటర్నెట్‌ వాడకం పెరిగినప్పటి నుంచి సోష‌ల్ మీడియా యూజర్ల సంఖ్య నానాటికీ పెరిగుతోంది. ఈ క్రమంలో కొందరు నెట్టింట పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలలో కొన్ని నెటిజన్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంటాయి. ఆ వీడియోల‌కు నెటిజన్లకు న‌చ్చుతున్నాయంటే వాటిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉన్న‌ట్టే. తాజాగా.. ఓ నూత‌న వ‌ధూవ‌రుల‌కు చెందిన వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తూ విపరీతంగా వైర‌ల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. పెళ్లి రోజున ఏ జంటైనా సరదాగా, సంతోషంగా ఫుల్‌ జోష్‌తో ఉంటారు. ఫంక్షన్లు, బరాత్‌లు, అబ్బో బోలెడు కార్యక్రమాలంటూ ఆ పరిసరాలంతా ఒకటే హడావుడిగా ఉంటాయి. ఇక అక్కడ ఏ కార్యక్రమం జరిగిన అందులో వధూవరులే ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. అలా వెడ్డింగ్‌ ఈవెంట్‌లో ఓ జంట డ్యాన్స్ చేస్తూ వస్తారు. అంతలో వరుడు పెళ్లికూతురుని త‌న వెనుక ఎత్తుకుని డ్యాన్స్‌ చేయడం మొదలుపెడతాడు.

ఓ మనిషిని ఎత్తుకొని డ్యాన్సంటే కష్టమే కదా.. అలా ఆ వరుడు బ్యాలెన్స్ త‌ప్పడంతో వధువుతో పాటు ఇద్దరూ ప‌డిపోయారు. దీంతో అక్క‌డున్న అతిథులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. అయినా ఆ వధువు తగ్గేదేలా అనుకుంటూ.. వెంట‌నే లేచి మ‌ళ్లీ డ్యాన్స్ చేయ‌డం ప్రారంభించింది. అందుకే ఈ వీడియో ప్ర‌స్తుతం నెటిజన్లను నవ్విస్తోంది. ఈ వీడియోను చూసిన వారు నవ్వలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు.
 

చదవండి: వామ్మో! ఒకే మొక్కకి  839 టమాటాలా!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement