marriage function
-
పెళ్లి బరాత్ లో జగనన్న పాట.. గూస్ బంప్స్
-
సిరిసిల్లలో పెళ్లికి సింగపూర్‌వాసులు.. వారితో స్థానికులు సెల్ఫీలు..
సిరిసిల్ల: సిరిసిల్లలో ఆదివారం జరిగిన ఓ పెళ్లికి సింగపూర్‌వాసులు హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిలర్ గూడూరి భాస్కర్ కూతురు వాణి వివాహం జేపీ నగర్‌కు చెందిన గౌడ లక్ష్మణ్ కుమారుడు బాలకృష్ణతో కల్యాణలక్ష్మి గార్డెన్స్‌లో జరిగింది. సింగపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన వరుడి ఆహ్వానం మేరకు సహోద్యోగులు ఆరుగురు పెళ్లికి హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా జరిగిన వివాహ క్రతువు, విధి విధానాలను చూసి, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫోన్లలో ఫొటోలు తీశారు. తెలంగాణ వంటకాల రుచి చూశారు. వారితో స్థానికులు సెల్ఫీలు దిగారు. -
ఇదేందయ్యా ఇది.. వరుడికి డిఫరెంట్‌గా స్వాగతం పలికిన అత్తామామ!
పెళ్లి వేడుక అనగానే కుటుంబ సభ్యులు, బంధువులతో కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఇక, వివాహ వేడుకలో వరుడు ఎంట్రీ ఏ రేంజ్లో ఉంటుందో సోషల్ మీడియాలో చాలా వీడియోలే చూసి ఉంటారు. కానీ.. వీరి పెళ్లిలో వరుడికి దక్కిన అరుదైన ఎంట్రీ చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వరుడికి సిగరెట్ వెలిగించి పెండ్లి వేడుకకు వధువు తల్లితండ్రులు ఆహ్వానిస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. కాగా, ఈ వీడియోలో వరుడు కూర్చుని ఉండగా అత్తా మామలు అతడికి సిగరెట్ అందించి వారే వెలిగించడం కనిపిస్తుంది. పెళ్లి వేడుకకు పెండ్లి కొడుకును స్వీట్లు, బీడీ, పాన్‌తో అత్తగారు స్వాగతిస్తారు. ఇక, ఈ వీడియోను పెళ్లికి హాజరైన జుహీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, తమ ప్రాంతంలోని ఆచారం కోసమే వరుడు, వధువు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. వరుడు సిగరెట్ తాగలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ ఆచారం దక్షిణ గుజరాత్‌లోని కొన్ని గ్రామాలు, బీహార్, ఒడిషాలోనూ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేం ఆచారంరా బాబు అంటూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. View this post on Instagram A post shared by Joohi K Patel (@joohiie) -
ఇదెక్కడి వింత.. ఫొటోల కోసం ఫైటింగ్.. వరుడికి తిక్కరేగి..
విందులో మాంసం పెట్టలేదని పెళ్లి రద్దు చేసుకునేదాకా వచ్చిన ఘటన ఇటీవలే చూశాం. పెళ్లి తరువాత ఫొటోల కోసం ఇరుపక్షాల బంధువులు కొట్లాడుకుని గాయాలపాలైన సంఘటన యూపీలో జరిగింది. వివరాల ప్రకారం.. యూపీ, డియోరియా జిల్లాలోని మాధవ్‌పూర్ గ్రామంలో అంగరంగవైభవంగా పెళ్లి జరుగుతోంది. వరమాల పూర్తవ్వగానే ‘మేం మొదట ఫొటోలు దిగుతాం’ అని అబ్బాయివారు, ‘లేదు మేమే ముందు దిగుతాం’ అని అమ్మాయి వాళ్ల మధ్య వాదన మొదలైంది. అసలే రాత్రిపూట పెళ్లి... విందులో మద్యం లేకుండా ఉండదు కదా! తాగి ఉన్న అబ్బాయి బంధువులు ‘మేమే ముందు తీసుకుంటా’మంటూ పట్టుబట్టారు. వాదన కాస్త భౌతిక దాడుల దాకా వెళ్లింది. కొందరు పెద్దలు వారించేందుకు ప్రయతి్నంచినా.. ‘తగ్గేదేల్యా’ అన్నారు బంధువులు. ఫలితం ఇరుపక్షాల వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. అబ్బాయి సోదరి కూడా గాయపడింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి అయితే వచ్చింది కానీ.. ఈ ఘటనలతో విసుగు చెందిన అబ్బాయి మాత్రం తాళి కట్టేందుకు ససేమిరా అన్నాడు. చివరకు మనసు మార్చుకుని తాళి కట్టడంతో కథ సుఖాంతమైంది. ఆ తరువాత ఫొటోలు ఎవరు ముందు దిగారో?. -
అయ్యో.. అత్యుత్సాహం ఎంత పని చేసింది?
వైరల్: మన దేశంలో బారాత్‌లు, వివాహ వేడుకలు, ఇతర ఫంక్షన్లలో మందు-చిందులు తప్పనిసరిగా మారాయి. అయితే.. ఒక్కోసారి ఆ వేడుకల్లో చేసే అతిచేష్టలు విపరీతాలకు దారి తీస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. మరో హఠాన్మరణం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన మరదలి పెళ్లికి హాజరైన ఓ వ్యక్తి(42).. సంతోషంగా చిందులేస్తూ గడిపాడు. అయితే.. ఆయన డ్యాన్స్ అక్కడి వాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో చప్పట్లతో ఆయన్ని మరింత ప్రొత్సహించారు. దీంతో రెచ్చిపోయి అలాగే చాలాసేపు డ్యాన్స్‌లోనే ఉండిపోయారు ఆయన. ఈ క్రమంలో.. తీవ్రంగా అలసిపోయి ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, సడన్ కార్డియాక్ అరెస్ట్‌తోనే ఆ వ్యక్తి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్ పాలిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. साली की शादी में डांस करते वक्त 42 साल के व्यक्ति की मौत| pic.twitter.com/ujOulHI6EY — Priya singh (@priyarajputlive) November 13, 2022 -
నమస్తే 'కరోనా'
కుత్బుల్లాపూర్: ఈ చిత్రంలోని వధూవరులను చూశారా. పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు షేక్ హ్యాండ్ ఇస్తున్న వారిని నివారిస్తూ సాదరంగా నమస్కరిస్తున్నారు. పైగా వధూవరులతో పాటు బంధువులు సైతం మాస్క్‌లు ధరించి వివాహ వేడుకకు హాజరయ్యారు. కొంపల్లిలోని చంద్రారెడ్డి గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన మణికాంత్‌రెడ్డి, పూజల వివాహ వేడుకలో ఈ సన్నివేశం కనిపించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారనడానికి ఈ చిత్రమే నిదర్శనంగా చెప్పవచ్చు. -
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి వివాహా వేడుక రాగ మయూరి రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, సాయిప్రసాద్ రెడ్డి, బాల నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్ ఖాన్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, చల్లా రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, బీవై రామయ్యతో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నేతలు హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి విజయవాడ బయల్దేరారు. కాగా అంతకు ముందు గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. -
నేడు భీమవరానికి సీఎం జగన్
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జిల్లాకు రానున్నారు. గురువారం సాయంత్రం 3.40 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరిహెలీకాప్టర్ ద్వారా 4.25 గంటలకు భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్‌కు చేరకుంటారు. 4.35 గంటలకు వీఎస్ఎస్ గార్డెన్లో జరిగే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహానికి హాజరవుతారు. 4.55 గంటలకు తిరిగి బయలుదేరతారు. 5.10 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని 5.45 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు, నాయకులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
పెళ్లి వేడుకలో రష్యన్ యువతులతో..
హైదరాబాద్,చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో కొందరు పాశ్చాత్య సంస్కృతికి శ్రీకారం చుట్టారు. పెళ్లి వేడుకలకు ఏకంగా రష్యన్ యువతులను రప్పించి బెల్లి డ్యాన్స్‌లు చేయించారు. ఆట పాటలతో హోరెత్తిస్తుండడంతో అసౌకర్యానికి గురైన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. యువతులను మాత్రం చాకచక్యంగా అక్కడినుంచి తప్పించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడలోని నూరీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి బార్కాస్ ప్రాంతానికి చెందిన బహమాద్ వంశస్తుల వివాహం జరిగింది. ఈ సందర్భంగా వారు ఎనిమిది మంది రష్యన్ యువతులను రప్పించి బెల్లి డ్యాన్స్‌లు చేయించారు. వారిపై నోట్లు విసురుతూ నానా రభసా చేయడంతో అసౌకర్యానికి గురైన స్థానికులు డయల్–100కు సమాచారం అందించారు. చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోగా నిర్వాహకులు సదరు యువతులను అక్కడి నుంచి తప్పించారు. పోలీసులు పెళ్లి కుమారుడు యాహ్యా బా అహ్మద్, అతని సోదరుడు అబ్దుల్ బా అహ్మద్, ఫంక్షన్‌హాల్ యజమాని ఈసా మిశ్రీ, మేనేజర్ తాహెర్ షా, ఆర్కెస్ట్రా నిర్వాహకుడు మహ్మద్ వసీం, అబ్దుల్లా అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్స్పెక్టర్ నవీన్ ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. -
వివాహా వేడుకలో మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి
పెండ్లిమర్రి : వెల్లటూరు దళితవాడకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏ.ఓబులేసు కుమారుడు ఓబులేసు, మణికుమారిల వివాహం శుక్రవారం వెల్లటూరు లోని ఎస్డీఏ చర్చిలో జరిగింది. మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్రారెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, సింగల్ విండో అధ్యక్షుడు నాగేంద్రారెడ్డిలు నూతన వధువరులను ఆశీర్వదించారు. పగడాలపల్లె, రెడ్డిపల్లె గ్రామాలకు చెందిన మల్లికార్జునరెడ్డి, తులసి, శివానందరెడ్డి, లక్ష్మి సుష్మితదంపతులను మాజీ ఎంపీ ఆశ్వీరదించారు. -
బ్యాండ్, బాజాలతో వచ్చిన వరుడికి షాక్
అమృత్సర్ : మరికొన్ని క్షణాల్లో పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందంలో... బ్యాండ్, బాజా, భజంత్రీలతో ఊరేగుకుంటూ పెళ్లి మండపానికి వచ్చిన వరుడికి ఊహించని షాక్ ఎదురైంది. పెళ్లి మండపం వద్ద కనీసం పెళ్లి ఏర్పాట్లే కాకుండా.. పెళ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు కూడా కనిపించలేదు. దీంతో పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందమంతా క్షణాల్లో ఆవిరైపోయింది. ఈ సంఘటన అమృత్‌సర్‌లో జరిగింది. స్థానిక ఆసుపత్రిలో పారామెడిక్ అయిన పర్గత్ సింగ్, తను పెళ్లి చేసుకోవాలనుకున్న సిమ్రాన్‌జిత్ కౌర్‌ను గత కొన్నినెలల క్రితమే కలిశాడు. ఉద్యోగం కోసం పర్గత్ సింగ్ ఆసుపత్రికి వచ్చిన సిమ్రాన్‌జిత్ కౌర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ పెళ్లికి వరుడు తరుఫు కుటుంబం ఎలాంటి షరతులు పెట్టకుండానే అంగీకరించింది. హమ్మయ్యా.. ఇక ఎలాంటి తలనొప్పులు లేవు. హ్యాపీగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి కోసం పర్గత్‌ను సిమ్రాన్‌జిత్, బల్జీత్ కౌర్ అనే మహిళకు పరిచయం చేసింది. ఆమెనే తమ పెళ్లి తేదీలను నిర్ణయిస్తుందని చెప్పింది. అంతేకాక తమ కుటుంబం కోసం పెళ్లి పనులన్నీ తానే చూసుకుంటుందని తెలిపింది. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాననే సంబురంలో అన్నింటికీ ఓకే చెప్పేశాడు పర్గత్. ఈ వేడుక కోసం పెళ్లి కూతురు వైపు వారు తాజ్ ప్యాలెస్ బాంకెట్ హాల్‌ను బుక్ చేసినట్టు చెప్పారు. పర్గత్ తన కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తంగా కలిపి 150 మందితో బ్యాండ్, బాజా, భజంత్రీలతో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. కానీ బాంకెట్ హాల్ వారు మాత్రం వారిని లోపలికి అనుమతించలేదు. అసలేమైంది అని కనుక్కుంటే, పెళ్లి కోసం అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగలేదని తెలిసింది. పెళ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండా పోయారు. పెళ్లి కూతురి తరుఫు బంధువులకు ఎంతమందికి ఫోన్లు చేసినప్పటికీ, ఒక్కరూ లిఫ్ట్ చేయకపోవడంతో, ఇక ఏం చేయలేని స్థితిలో పెళ్లి కొడుకు బ్యాచిలర్‌గానే తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఉద్యోగం కోసం సిమ్రాన్‌జిత్ కౌర్ కొన్ని నెలల కిత్రం తనను కలిసిందని, తన కోసం ఉద్యోగం ప్రయత్నిస్తున్న సమయంలో తామిద్దరం ప్రేమలో పడ్డామని పర్గత్ చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నట్టు తెలిపాడు. ఈ పెళ్లి కోసం బల్జీత్ కౌర్‌కు 70వేల రూపాయలు ఇచ్చినట్టు చెప్పాడు. బల్జీత్, సిమ్రాన్‌జిత్‌లు కలిసి తనను మోసం చేసినట్టు లబోదిబోమంటున్నాడు. పోలీసు స్టేషన్లో తన ఫిర్యాదును నమోదు చేశాడు. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం తాను లక్షన్నర ఖర్చు చేశానని, కానీ ఆఖరికి సిమ్రాన్‌జిత్ ఇలా చేస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పర్గత్ అసలు, సిమ్రాన్జిత్ను, బల్జీత్కౌర్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలువలేదని ఛేహార్తా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ చెప్పారు. కేవలం మొబైల్ ఫోన్లోనే వారితో సంభాషించినట్టు వెల్లడించారు. విచారణలో నిజనిజాలన్నీ బయటికి వస్తాయన్నారు. -
కొడుకు పెళ్లికి జైలులోనే లాలూ..?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం మాజీ మంత్రి చంద్రిక రాయ్ కూడా ఐశ్వర్య రాయ్ కూతురితో మే12న అంగరంగ వైభవంగా జరుగబోతోంది. పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో ఈ వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకకు కూడా లాలూ హాజరవుతారో లేదో ఇంకా క్లారిటీ లేదు. దాణా కుంభకోణ కేసులో ప్రస్తుతం రాంచి జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, కొడుకు నిశ్చితార్థానికి కూడా రాలేకపోయారు. డయాబెటీస్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో రాంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇటీవలే చికిత్స తీసుకున్న లాలూ... తక్షణ చికిత్స కోసం తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసుకున్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణను జార్ఖాండ్ హైకోర్టు మే 11కు వాయిదా వేసింది. మే 11నే తేజ్ ప్రతాప్ పెళ్లికి సంబంధించిన వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవేళ మే 11న కోర్టు బెయిల్ మంజూరు చేసిన రాంచి నుంచి పాట్నాకు ఒక్క రోజులో రావడం కొంచెం కష్టమే అంటున్నారు సన్నిహిత వర్గాలు. లాలూ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నిన్ననే జార్ఖాండ్ హైకోర్టు విచారించాల్సి ఉంది. కానీ న్యాయవాదుల బంద్‌తో ఈ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు. అయితే త్వరగా ఈ బెయిల్ పిటిషన్ విచారించాల్సిందిగా లాలూ వర్గాలు కోరుతున్నాయి. వచ్చే శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించాలని సీబీఐ వాదిస్తుందని, అయితే తమకు అనుకూలంగానే ఆదేశాలు వస్తాయని ఆర్జేడీ ఎంపీ, లాలూ సన్నిహితుడు జై ప్రకాశ్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న లాలూను రాజకీయ కుట్రతో సోమవారం రాంచి జైలుకు తరలించారని ఆరోపించారు. లాలూ అనారోగ్యంగా ఉండటంతో, తాము పెరోల్‌కు దరఖాస్తు చేయలేదని ఆర్జేడీ అధినేత న్యాయ వ్యవహారాలు చూసుకున్న వ్యక్తి చెప్పారు. తక్షణ చికిత్స కోసం బెయిల్‌ను కోరినట్టు తెలిపారు. సాధారణంగా పెరోల్‌ను పెళ్లి వేడుకలకు కానీ, అంత్యక్రియలకు కానీ దరఖాస్తు చేసుకుంటారు. 2014 తర్వాత లాలూ కుటుంబంలో జరుగబోయే అతిపెద్ద వేడుక తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లినే. ఆర్జేడీ చిన్న కూతురు రాజ్ లక్ష్మి పెళ్లి తర్వాత, ఇప్పుడు ఆ ఇంట్లో తేజ్ పెళ్లి జరుగుతోంది. -
కోలేటి దామోదర్ కూతురి పెళ్లిలో సీఎం కేసీఆర్
-
ఏమాత్రం పొరపాటు జరిగినా తల తెగేది
-
రోడ్డుపై పెళ్లికొడుకును చితకబాదిన భార్య
-
రోడ్డుపై పెళ్లికొడుకును చితకబాదిన భార్య
లుధియానా: పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుక వద్దకు పెళ్లికుమారుడిని ఊరేగింపుగా తీసుకు వెళ్తున్నారు. ఇంతలో ఓ మహిళ కుటుంబసభ్యులతో కలసి వచ్చి.. ఆయన తన భర్త అని, తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుంటున్నాడని రోడ్డుపై చితకబాదింది. వరుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, పట్టుకుని బంధించారు. వధువుపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ కథ పోలీస్ స్టేషన్‌కు చేరింది. శనివారం పంజాబ్‌లోని లుధియానాలో ఓ పెళ్లి వేడుకలో ఈ హైడ్రామా చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వివాహ వేడుక వద్దకు వెళ్లి పెళ్లికొడుకును అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు బంధువులను, ఆరోపణలు చేసిన మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 14 ఏళ్ల క్రితం తమకు పెళ్లయిందని, 13 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా, ఆయనకంటే 18 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పింది. బావ తరచూ వేధిస్తుండటంతో పుట్టింటికి వచ్చిందని ఆమె సోదరుడు చెప్పాడు. రెండు రోజుల క్రితం అతను రెండో పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం తెలియడంతో వెళ్లి నిలదీశామని తెలిపాడు. మొదట్లో ఆమె ఎవరో తెలియదని బుకాయించిన వరుడు.. తర్వాత తాను ఆమెకు విడాకులు ఇచ్చానని, తన దగ్గర ఆధారం ఉందని చెప్పాడు. విడాకులు ఇచ్చినట్టు తమకు చెప్పడంతో పెళ్లికి అంగీకరించామని వధువు కుటుంబ సభ్యులు చెప్పారు. రెండో పెళ్లి విషయంలో వివాదం ఏర్పడిందని, నివేదిక తయారు చేసి తదుపరి చర్యల కోసం కోర్టుకు పంపిస్తామని పోలీసులు చెప్పారు. -
వివాహ వేడుకలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
డీసీఎంఎస్ చైర్మ¯ŒS కుమార్తె వివాహానికి హాజరు కాకినాడ : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి గురువారం జిల్లాకు విచ్చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న ఆయన మాజీ ఎంపీ హర్షకుమార్ నివాసానికి వెళ్లారు. భోజన విరామం తరువాత కాకినాడ చేరుకుని జీఆర్టీ హోటల్లో బస చేశారు. రాత్రి 8 గంటలకు కాకినాడ ఎస్.ఆర్.ఎం.టి. ఫంక్ష¯ŒS హాలులో డీసీఎంఎస్ ఛైర్మ¯ŒS కె.వి.సత్యనారాయణ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. వధూవరులు శ్రేష్ఠ, వెంకటేశ్వరరెడ్డిలను ఆశీర్వదించారు. కాకినాడ రామారావుపేటలోని రోటరీ డిస్ట్రిక్ మాజీ ఛైర్మ¯ŒS లక్కరాజు సత్యనారాయణ్ (టిక్కు) నివాసానికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి జీఆర్టీ గ్రాండ్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. నేడు శేషారెడ్డి నివాసంలో అల్పాహారం శుక్రవారం ఉదయం ఆదిత్య విద్యా సంస్థల «అధినేత, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి నివాసానికి వెళ్లి అల్పాహారం అనంతరం అక్కడి నుంచి రాజమండ్రి మధురపూడి చేరుకుని హైదరాబాద్ వెళ్తారు. -
వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అంతకుముందు వైఎస్ జగన్‌కు పార్టీ గుంటూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. -
గుంటూరులో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం గుంటూరు చేరుకున్నారు. నగరానికి వచ్చిన వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నగరంలోని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహానికి ఆయన హాజరు అవుతారు. వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదిస్తారు. -
పెళ్లి బారాత్‌లో విషాదం
గుర్రం దాడి చేయడంతో యువకుడి మృతి హైదరాబాద్: పెళ్లి బారాత్‌లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు గుర్రపు బగ్గీకి ఉన్న ఓ గుర్రం మర్ఫా (డప్పు) కొడుతున్న.. ఓ యువకుడిని తన్నడంతో అతడు కింద పడి వుృతి చెందాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పాతనగరం బోయిగూడ కమాన్ ఘోడెవాడికి చెందిన మదార్ హుస్సేన్ (18) శుభకార్యాలలో మర్ఫా కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి గోల్కొండ ఫ్రన్ కాటేజ్‌కు చెందిన యూనుస్ అనే యువకుడి పెళ్లికి మదార్ హుస్సేన్ తన బృందంతో మర్ఫా కొట్టడానికి వచ్చాడు. రాత్రి 10 గంటలకు పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా బగ్గీ లాగుతున్న ఓ ఆడగుర్రం పక్కనే మర్ఫా కొడుతున్న మదార్ హుస్సేన్‌ను వెనుక కాలితో ఛాతీపై తన్నింది. దీంతో అతడు విలవిలలాడుతూ కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అతనిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా. చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడు. -
పెళ్లి వేదికను మార్చిన భూకంపం
-
పెళ్లిలో గొడవ: యువకుడి హత్య
గుమ్మిడిపూండి:పెళ్లి భోజనాల వద్ద జరిగిన గొడవలో ఓ యువకుడిని హత్యకు గురైన సంఘటన మాదరపాక్కంలో మంగళవారం జరిగింది. మాదరపాక్కం సమీపంలోని పాదిరివేడు దళిత కాలనికి చెందిన ఓ యువకుడికి ఈగువారిపాలెం సమీపంలోని కుమ్మనాయుడుపేటకు చెందిన యువతితో సోమవారం గుమ్మిడిపూండిలో వివాహం జరిగింది. భోజనాల వద్ద పాదిరివేడు, కుమ్మనాయుడు పేటకు చెందిన యువకుల మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు ఇరుగ్రామాలకు చెందిన పెద్దలు నచ్చచేప్పి పంపివేశారు. అయితే పాదిరివేడు గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ (21) ఒంటరిగా పాదిరివేడుకు వెళుతుండగా కుమ్మనాయుడుపేటకు చెందిన యువకులు కర్రలతో కొట్టి హత్య చేసి సమీపంలోని కల్వర్టు క్రింద పడవేశారు. ఈ విష యం తెలిసిన మాదరపాక్కం గ్రామస్తులు ఆగ్రహంతో కుమ్మనాయుడుపేట గ్రామంపై దాడి చేశారు. అరుణ్‌కుమార్‌ను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ..షాపులు మూసి ధర్నాకు దిగారు. రోడ్డుపై టైర్లు కాల్చి రాస్తారోకో చేశారు. దీంతో బస్సులు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న గుమ్మిడిపూండి డీఎస్పీ శివలింగం వచ్చి ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో చర్చలు జరిపారు. వారు వినకపోవడంతో జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వగా వెంటనే ఎస్పీ శాంసన్ మాదరపాక్కం గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో పాదిరివేడుకు చెందిన కొం దరు కుమ్మనాయుడు పేటకు చెందిన ఓ యువకుడిని చితక్కొట్టారు. దీంతో రెండు గ్రామాల్లో అలజడి రేగింది. నిందితులను అరెస్టు చేసేంత వరకు ఇక్కడినుంచి కదలమని భీష్మించుకుని కూచున్నారు. దీంతో జిల్లా ఎస్పీ శాంసన్, తహసీల్దార్ పాల్స్వామి అక్కడే ఉన్నారు. ఎట్టకేలకు సాయంత్రం గ్రామస్తులు శాంతించారు. -
విస్తృత అవకాశాలకు.. ఈవెంట్ మేనేజ్మెంట్
నేటి కార్పొరేట్ యుగంలో బర్త్ డే పార్టీ నుంచి మ్యారేజ్ ఫంక్షన్ వరకు అదిరిపోయే విధంగా నిర్వహించాలనుకునే వారికి ఠక్కున గుర్తొచ్చే పదం.. ఈవెంట్ మేనేజ్మెంట్! ఎడ్యుకేషన్ ఈవెంట్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ వరకు.. కార్పొరేట్ నుంచి ప్రొడక్ట్ మార్కెటింగ్-ప్రమోషనింగ్, సెమినార్లు, వర్క్‌షాప్స్, సినిమా అవార్డుల ప్రదానం.. ఇలా అనేక కార్యక్రమాలను నేటి కార్పొరేట్ యుగానికనుగుణంగా నిర్వహించడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దాంతో సంబంధిత రంగంలో కోర్సు పూర్తి చేసిన వారికి.. నేటి కార్పొరేట్ ప్రపంచం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది. ప్రవేశం: డిప్లొమాకు 10+2 లేదా ఇంటర్మీడియెట్పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పీజీ డిప్లొమా/ఎంబీఏ కోర్సుకు మాత్రం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. కోర్సు స్వరూపం: ఈవెంట్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో.. సంబంధిత పరిశ్రమ ఆశిస్తున్న నైపుణ్యాల్లో అభ్యర్థి పరిపూర్ణత సాధించేలా కోర్సు స్వరూపం ఉంటుంది. ఇందుకోసం నాలుగు రకాల లెర్నింగ్ మెథడ్స్‌ను ఉపయోగించి బోధిస్తారు. అవి.. క్లాస్ రూం సెషన్, గెస్ట్ లెక్చరర్స్-కేస్ స్టడీ, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇన్నోవేటివ్-ఇంటరాక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ. క్లాస్ రూం సెషన్లో.. రెగ్యులర్ లెక్చరర్స్‌తోపాటు ఒక ఈవెంట్‌కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా అభ్యర్థులు రూపొందించాలి. సదరు రంగంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన కల్పించడానికి వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. క్లాస్ రూంలో చర్చించిన అంశాలను మరింత విశ్లేషణతో కూడిన కేస్ స్టడీ రిపోర్ట్‌ను తయారు చేయాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో.. లైవ్ ఈవెంట్స్ నిర్వహణలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు. ఈవెంట్స్-స్పెషలైజేషన్స్: ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే.. స్థూలంగా పబ్లిసిటీ లేదా ఒక సంస్థ /ప్రొడక్ట్/సంబంధిత విభాగానికి బ్రాండింగ్ ఇమేజ్ ఇవ్వడం. కానీ గత కొంత కాలంగా ప్రమెషన్ ఈవెంట్సే కాకుండా మ్యారేజ్ వంటి సోషల్ ఈవెంట్స్ కూడా ఇందులో చోటు సంపాదించుకున్నాయి. దీంతో ఔత్సాహికులకు ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. అవకాశాలు: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం హవా నడుస్తోంది. మన దేశంలో పరిస్థితులు కూడా దీనికి భిన్నంగా లేవు. దేశంలో హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ పరిశ్రమ మల్టీ మిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు, కార్పొరేట్ హౌసెస్, స్టార్ హోటల్స్, రేడియో స్టేషన్స్, రిసార్ట్స్, క్లబ్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీలు, మీడియా హౌసెస్, మూవీ/టీవీ ప్రొడక్షన్ హౌసెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు, మ్యూజిక్ పరిశ్రమ, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఫ్యాషన్ హౌసెస్లలో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అనుభవం ఆధారంగా సొంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా స్థాపించుకోవచ్చు. ఎంట్రీ లెవల్: ఈ రంగంలో కెరీర్ ప్రారంభంలో.. జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయాలి. తర్వాత స్కిల్స్, అనుభవం ఆధారంగా సీనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ఈవెంట్ అసిస్టెంట్ వంటి వివిధ హోదాల్లో స్థిర పడొచ్చు. ఈ హోదాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ రంగంలో ఉన్నత స్థానమైన.. ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి కూడా చేరుకొవచ్చు. వేతనాలు: మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లతో పోల్చితే.. ఈవెంట్ మేనేజ్మెంట్ అభ్యర్థులకు వేతనాలు ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రారంభంలో జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు *15-20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం, హోదాను బట్టి నెలకు దాదాపు *30-50 వేల వరకు సంపాదించవచ్చు. ఈవెంట్ మేనేజర్/ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అందుకోవచ్చు. కావల్సిన స్కిల్స్: ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో రాణించాలంటే.. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, సమయస్ఫూర్తి అవసరం. ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. కోర్సులను ఆఫర్ చేస్తోన్న సంస్థలు ది ఇన్స్టిట్యూట్ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. వెబ్సైట్: www.naemd.com ఏపీజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ - న్యూఢిల్లీ. వెబ్సైట్: www.apeejay.edu ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ వెబ్సైట్: www.inlead.in మాస్కో మీడియా-నోయిడా, వెబ్సైట్: ఠీఠీఠీ.ఝ్చటటఛిౌఝ్ఛఛీజ్చీ.ఛిౌఝ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్-ముంబై వెబ్సైట్: www.niemindia.com ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ఫ్యూచర్ మేనేజ్మెంట్-చండీగఢ్ వెబ్సైట్: www.itftindia.com అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ -న్యూఢిల్లీ వెబ్సైట్: www.amity.edu/aiem -
తపాలా: నా పెళ్లి చూపులు...
అదో మధురమైన, మరపురాని రోజు. ఆ రోజు నా పెళ్లి చూపులు. చదువుకుంటూ, హాయిగా ఎంజాయ్ చేసే నాకు, ఆ రోజు ఓ బందిఖానాలా ఉంది. ఉదయం పది గంటల నుండి నన్ను ఇంట్లోనే ఉంచారు మా అమ్మా నాన్నలు. అప్పుడు టైమ్ 12 గంటలు. అయినా పెళ్లి వారి రాక లేదు. చాలా ఆత్రుతగా ఉంది, టెన్షన్‌గా కూడా ఉంది. పెళ్లికొడుకు ఎలా ఉంటాడో అని. ఈ ఎదురుచూపు ఉందే, చాలా కష్టమైనది. నాకు అస్సలు నచ్చడం లేదు. ఎవరికోసమో నేను ఎదురుచూడటం ఏంటి? చాలా కోపంగా ఉంది, ఇంకా రావటం లేదని. ఇక ఆ తర్వాత నన్ను రెడీ చేయడం కూడా పూర్తయ్యింది. టైమ్ ఒకటిన్నర అయినా ఇంకా రాలేదు. నాకు బోర్‌గా ఉంది. కానీ కాస్త ఎంజాయ్మెంట్గానూ, కాస్త ఇష్టంగానూ, ఇంకొంచెం అయిష్టంగానూ ఉంది. ఓ అరగంట ఎదురుచూపు తర్వాత రావలసినవారు రానే వచ్చారు. మరో అరగంట టీ, టిఫెన్ లాంటి మర్యాదలతో గడిచిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు నన్ను వారి ముందుకు తీసుకెళ్లారు. ఆయనతో పాటుగా మరో ముగ్గురు. వారి బాబాయి, వారి చెల్లెలు, ఇంకా ఆయనగారి బావమరిది. అమాయకంగా, మరింత అందంగా నేను వెళ్లి ఆయన కుడిపక్కన కూర్చున్నాను. ఆయన కుర్చీలో, నేనేమో నేలమీద! అంతా నిశ్శబ్దం. అందరి చూపులూ నాపైనే ఉన్నాయి. ఒక్క ఆయనవి తప్ప. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఓ పది నిమిషాల తర్వాత పెళ్లిమాటలు మొదలెట్టారు అందరూ. అదే సరైన సమయమని నేను ధైర్యంగా తలెత్తి ఆయన్ని చూశాను. బహుశా ఆయనా నన్ను చూడలేదు కాబోలు! ఇక నన్ను లోపలికి తీసుకెళ్లారు. ఏదో పందెంలో ఓడిపోయినప్పుడు కోపంగా అన్నీ విసిరిపారేస్తాం చూడండి! అలాగే నేను కూడా ఒంటిమీది చీర, నగలు తీసి వెంటనే డ్రెస్ తగిలించేశాను. ఏమో! ఆయన నాకు నచ్చలేదేమో! ఏమో! నచ్చాడా? లేదా? ఈ ఆలోచనల్లో ఉండగానే మళ్లీ పిలుపు. పెళ్లికొడుకు నన్ను చూడలేదట. మళ్లీ రావాలని. ఏం చేయను? నాకేమో చీర కట్టు రాదాయె! అయినా అంత ఓపిక కూడా లేదు. అందుకే అలాగే వెళ్లి ఆయనకెదురుగా కుర్చీలో కూర్చున్నాను. అప్పుడు నేను ఆయన్ని, ఆయన నన్ను సూటిగా చూసుకోగలిగాం. ‘ఆ క్షణం’ నా గుండెల్లో ‘గుడి గంటలు మోగడం’, ‘ఆకాశంలో మెరుపులు మెరవడం’, ‘నింగి నుండి పూల వర్షం కురవడం’... ఇలాంటి మ్యాజిక్లేవీ జరగలేదు, కానీ నాకనిపించింది, నా మనసు నాతో చెప్పింది, నా జీవిత భాగస్వామి ఈయనే అని. జీవితాంతం నాకు నీడై, నా తోడై ఉండేది ఇతడే అని! ఇక అప్పుడే ‘ఇతడే... నేకలగన్న నా ప్రియుడు’ అంటూ ఓ సాంగ్ పాడేసుకున్నాను. అంతే! ఇక కట్ చేస్తే, మా పెళ్లి అయ్యి ఇప్పటికి ఐదేళ్లు. మాకో పాప. పేరు ‘లోహిత’. ఇలాంటి మధురక్షణాల్ని నెమరువేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. - మిసెస్ అచ్చనపల్లి సురేష్ యర్రగుంట్ల, కడప ఆమాత్రం తెలియదా! పదిహేనేళ్ల క్రితం ఒకసారి విజయవాడలో ఎగ్జిబిషన్కెళ్లి ఒక టాయ్ సెల్‌ఫోన్ కొన్నాను. మీటనొక్కితే, ‘ఐ లవ్ యూ’ అంటుందది. దాన్ని మా మనవరాలికి ఇచ్చాను. అప్పుడు దానికి ఆరేళ్లు. గదిలోకి పోయి మాటిమాటికీ సెల్ నొక్కుతోంది. ‘‘మీ అమ్మాయి ప్రేమలో పడిందే, ఎవరో దానికి ‘ఐ లవ్ యూ’ చెపుతున్నారు’’ అన్నాను నవ్వుతూ. దానికి నా మనవరాలు కోపంగా చూసింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. బుజ్జగించి అడిగితే చెప్పింది, ‘‘సెల్ఫోన్లోది ఆడ గొంతుట. ‘అబ్బాయి కదా అనాల్సింది’’అంది. నా నోట మాట రాలేదు. - ఎం.దుర్గాభవాని, నేలకొండపల్లి -
పెళ్లి మంటపంలో విషాదం
-
కరెంట్ షాక్ తగిలి వధువు తల్లిదండ్రులకు తీవ్రగాయాలు
పెళ్లి మండపంపై విద్యుత్ తీగలు తెగిపడటంతో వధువు తల్లిదండ్రులతోపాటు మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన ఆనంతపురం జిల్లా అగళి మండలం డొక్కలపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దాంతో పెళ్లికి వచ్చిన బంధువులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మడకశిర ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆదివారం ఉదయం మండపంలో పెళ్లి జరుగుతున్న సమయంలో ఆ మండపంపైన ఉన్న విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దాంతో పెళ్లి కుమార్తె తల్లితండ్రులతోపాటు మరో అయిదుగురికి కరెంట్ షాక్ తగిలింది. దాంతో పెళ్లి ఆగిపోయింది. -
హెలికాప్టర్ కెమెరాతో పెళ్లి చిత్రీకరణ
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో తొలిసారిగా పెళ్లి వేడుక కోసం హెలికాప్టర్ కెమెరాను వినియోగించారు. మధురైలోని రాజాముత్తయ్య కల్యాణ మండపంలో బుధవారం ఓ పెళ్లి వేడుకను హెలికాప్టర్ ద్వారా చిత్రీకరించారు. సినిమా, టీవీ సీరియల్ షూటింగ్‌లకు వినియోగించే రూ. 7 లక్షల విలువైన అధునాతన కెమెరాను హెలికాప్టర్‌కు యంత్రాల సహాయంతో బిగించి చిత్రీకరణ చేశారు. మధురైలోని ప్రైవేట్ స్టూడియో యజమాని అయిన మహేంద్రన్ ఈ హెలికాప్టర్ కెమెరా గురించి మాట్లాడుతూ.. దీని సహాయంతో పెళ్లి వేడుకల్లోని ప్రతి ఘట్టాన్నీ, సంఘటనలనూ, మండపంలో అన్ని మూలలా ఉన్న వారి ముఖాలు సైతం స్పష్టంగా కనిపించేలా ఆకాశం నుంచే చిత్రీకరించవచ్చని చెప్పారు. హెలికాప్టర్ కెమెరా ద్వారా చిత్రీకరణకు రోజుకు రూ. 40 వేలు అద్దెవసూలు చేస్తామని చెప్పారు.