అయ్యో.. అత్యుత్సాహం ఎంత పని చేసింది? | Man Collapses While Dancing During Marriage Ceremony Dies Viral | Sakshi
Sakshi News home page

వీడియో: మరదలి పెళ్లి వేడుకలో అత్యుత్సాహం.. ఎంత ఘోరం జరిగింది

Published Mon, Nov 14 2022 1:28 PM | Last Updated on Mon, Nov 14 2022 2:54 PM

Man Collapses While Dancing During Marriage Ceremony Dies Viral - Sakshi

వైరల్‌: మన దేశంలో బారాత్‌లు, వివాహ వేడుకలు, ఇతర ఫంక్షన్‌లలో మందు-చిందులు తప్పనిసరిగా మారాయి. అయితే.. ఒక్కోసారి ఆ వేడుకల్లో చేసే అతిచేష్టలు విపరీతాలకు దారి తీస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

మరో హఠాన్మరణం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  తన మరదలి పెళ్లికి హాజరైన ఓ వ్యక్తి(42).. సంతోషంగా చిందులేస్తూ గడిపాడు. అయితే.. ఆయన డ్యాన్స్‌ అక్కడి వాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో చప్పట్లతో ఆయన్ని మరింత ప్రొత్సహించారు. దీంతో రెచ్చిపోయి అలాగే చాలాసేపు డ్యాన్స్‌లోనే ఉండిపోయారు ఆయన. ఈ క్రమంలో..

తీవ్రంగా అలసిపోయి ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌తోనే ఆ వ్యక్తి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్‌ పాలిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement