సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్‌కు క్రేజ్ ఎక్కువ. సూపర్ హిట్ సాంగ్‌కు రీల్స్ చేసినా, డ్యాన్స్ చేసిన ఇక రచ్చ రచ్చే. తాజాగా కొచ్చిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పుష్ప -2 సినిమాలో హిట్ సాంగ్ కి చేసిన డ్యాన్సింగ్ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇన్‌స్టాలో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్‌ను సంపాదించింది.
కొచ్చిన్ (Cochin)యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో వేడుకలు ఘనంగా జరుగు తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థినిలు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. అప్పటిదాకా ప్రశాంతంగా చూస్తూ కూర్చున్న మహిళా ప్రొఫెసర్ విద్యార్థినిలతో జత కలిసి స్టెప్పులు వేయడం మొదలు పెట్టారు. తన చేతిలోని బ్యాగ్‌ను కుర్చీపై పెట్టి మరీ రంగంలోకి దిగి పోయారామె. అమ్మాయిలతో సమానంగా జోరుగా డ్యాన్స్ చేశారు. అదీ చీరలో.. సూపర్ స్టెప్స్‌తో తమకు పోటీగా మేడమ్ తమతో జత కట్టడం చూసిన విద్యార్థినులు మరింత ఉత్సాహంగా డాన్స్ ఇరగదీశారు.
ఏ పాటకో తెలుసా?
పుష్ప 2: ది రూల్ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్‌కు మైక్రోబయాలజీ ప్రొఫెసర్,డిపార్ట్‌మెంట్ హెడ్ (HOD), అయిన పార్వతి వేణు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మీ హెచ్‌ఓడీ మేడమ్ మీ కంటే ఎక్కువ వైబర్‌గా ఉన్నప్పుడు” అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియోను నెటిజన్లు ఉత్సాహంగా కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment