అణచివేతకు వ్యతిరేకంగా మహిళలు శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. అనేక రకాల హింసలకు వ్యతిరేకంగా గొంతెత్తున్నారు. సమానత్వం కోసం అలుపెరుగని పోరు చేస్తూనే ఉన్నారు. అయినా చాలా విషయాల్లోనూ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆధిపత్య కత్తి మహిళలపై వేటు వేస్తూనే ఉంది. చెప్పిన మాట వినలేదన్న ఆగ్రహంతో పంచాయతీ పెద్దలు, పోలీసుల ఎదుటే కర్కశంగా కన్నబిడ్డనే కడతేర్చిన ఘటన కంట తడి పెట్టిస్తుంది.
20 ఏళ్ల కుమార్తె ‘తను’ ను పోలీసు అధికారులు, కుల పెద్దల ముందే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడో తండ్రి. తాను కుదిర్చిన వివాహం నచ్చలేదని సోషల్ మీడియా ద్వారా చెప్పినందుకే ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దిగ్భ్రాంతికరమైన హత్య జరిగింది. మంగళవారం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. పెళ్లికి నాలుగు రోజుల ముందు కూతుర్ని నాటు తుపాకీతో కాల్చి చంపాడుతండ్రి మహేష్ గుర్జార్. బంధువు రాహుల్ మహేష్‌కు తోడుగా నిలిచి, బాధితురాలపై కాల్పులు జరిపాడు.
పెద్దలు కుదర్చిన సంబంధాన్ని కాదని తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేయడమే ఆమె చేసిన నేరం. జనవరి 18న పెద్దలు కుదిర్చిన వివాహానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఇది ఇలా ఉంటే.. హత్యకు కొన్ని గంటల ముందు, తను ఒక వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిందిబాధితురాలు తను. తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకోవాలని బలవంతం చేసిందని ఆమె ఆరోపించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తనకేదైనా అయితే తన తండ్రి మహేష్, ఇతర కుటుంబ సభ్యులతే బాధ్యత అని కూడా పేర్కొంది. (డార్క్ గ్రీన్ గౌనులో స్టైలిష్‌గా,ఫ్యాషన్ క్వీన్‌లా శోభిత ధూళిపాళ)
52 సెకన్ల వీడియోలో ఇంకా ఇలా చెప్పింది. "నేను నా ఫ్రెండ్ విక్కీని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా కుటుంబం మొదట్లో అంగీకరించింది కానీ తరువాత నిరాకరించింది. వారు నన్ను రోజూ కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబమే బాధ్యత వహిస్తుంది". అని తెలిపింది. దీంతో వీడియో వైరల్ అయింది. సూపరింటెండెంట్ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఇద్దిర మధ్యా రాజీ కుదిర్చేందుకు మాట్లాడుతున్నారు. కమ్యూనిటీ పంచాయితీ పెద్దలు కూడా అక్కడే ఉన్నారు.
ఈ సమయంలో తను ఇంట్లో ఉండటానికి తను నిరాకరించింది, తనను వన్-స్టాప్ సెంటర్ ( హింసకు గురైన మహిళలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్)కు తీసుకెళ్లమని కోరింది. ఇంతలో ఆమె తండ్రి ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని పట్టుబట్టి, ఆమెను ఒప్పిస్తానని నమ్మబలికాడు. నాటు తుపాకీతో ఉన్న మహేష్, తన కుమార్తె ఛాతీపై కాల్చాడు. అదే సమయంలో, అక్కడే ఉన్న రాహుల్ కూడా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. (‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!)
కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్‌ను అరెస్టు చేశారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ రాహుల్ పిస్టల్‌తో తప్పించుకున్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా తను ప్రేమిస్తున్న వ్యక్తి "విక్కీ" ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నివాసి, గత ఆరేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment