
ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్, హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ వ్యవస్థాపక సీఈవో ఆత్మహత్య కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మూడులక్షలకుపైగా అభిమానులను సొంతం చేసుకున్న మిషా సరిగ్గా తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవడం ఆమె అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.
కామెడీ స్కిట్‌లు, వీకెండ్ కామెడీ అంటూ కామెడీ కంటెంట్‌తో పాపులర్‌అయిన మిషా అగర్వాల్ ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది.మిషా సోదరి ముక్తా అగర్వాల్తోపాటు ఈ హృదయ విదారక వార్తను ఆమె కుటుంబ సభ్యులు మిషా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లోని పోస్ట్ ద్వారా ధృవీకరించారు. మానసిక ఒత్తిడికారణంగానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిషా మానసిక ఆరోగ్యం బాగాలేదని సూచిస్తుందని కూడా ఆమె ఎత్తి చూపారు. లా చదువుకుని, ది మిషా అగర్వాల్ షో అనే కామిక్ షోను స్థాపించి తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.
అసలేం జరుగుతుందో అర్థం కావడంలేదు.. ఆన్‌లైన్‌లో ఎపుడు యాక్టివ్‌గా ఉండే,ఏప్రిల్ 4 నుండి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు, అసలు ఈ విషయాన్ని తాము గమనించనే లేదు, మిషా ఇక లేదంటే నమ్మశక్యంగా లేదు అంటూ మిషా ఫ్రెండ్ మీనాక్షి భెర్వానీ విచారం వ్యక్తం చేసింది.
ఎవరీ మిషా అగర్వాల్
2000 ఏప్రిల్ 26, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగర్జ్‌లో జన్మించింది మిషా. బిషప్ జాన్సన్ స్కూల్ , కాలేజీ, ప్రయాగర్జ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తరువాత లా డిగ్రీ పూర్తి చేసింది. 2017 నుంచి ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియో కంటెంట్ సృష్టికర్తగా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పనిచేయడం ప్రారంభించింది. అదే సంవత్సరంలో, ఆమె ది మిషా అగర్వాల్ షో అనే కామెడీ షో మొదలు పెట్టి స్టాండ్-అప్ కామెడియన్‌గా ఎదిగింది. షోలోని హాస్యభరితమైన కంటెంట్ ప్రధానంగా కామెడీతోపాటు, జీవనశైలి , ట్రెండింగ్ అంశాలపై దృష్టి పెట్టి కంటెంట్ ఇచ్చిఏది. ప్రతిసారీ, వీడియోలను ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ
హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ ఫౌండర్ కూడా
డిజిటల్ కంటెంట్ సృష్టికర్త మాత్రమే కాదు, 2024లో తన హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ సీఈవోగా తన కస్టమర్లకు వారి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అధిక-నాణ్యత గల హెయిర్ కేర్ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో మిషా ఈ బ్రాండ్‌ను, టీంను అభివృద్ధి చేసింది. ఐస్లే, గోయిబిబో, ఇన్ఫినిక్స్, సఫోలా, మై ఫిట్‌నెస్ మరియు మరిన్ని వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లకు సోషల్ మీడియా మార్కెటర్‌గా కూడా పనిచేసింది.
చదవండి: సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో