Watch Video: Spring Loaded Fans To Be Installed In Kota, To Prevent Suicides Among Students - Sakshi
Sakshi News home page

కోటా హాస్టల్స్‌లో ఆత్మహత్యల కట్టడికి కొత్త ఆలోచన

Published Fri, Aug 18 2023 4:38 PM | Last Updated on Fri, Aug 18 2023 6:11 PM

Spring Loaded Fans To Prevent Suicides In Kota  - Sakshi

జైపూర్: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వీటిని అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టింది. హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 'స్బ్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల'ను అమర్చుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిని మార్చడానికి ప్రయత్నించాలి కానీ.. సీలింగ్ ఫ్యాన్లు కాదని నెటిజన్లు ఫైరవుతున్నారు. 

ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు నిలయంగా ఉంటుంది రాజస్థాన్‌లోని కోటా. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు అక్కడికి వచ్చి శిక్షణ పొందుతుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ సారి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థి(18) చనిపోయిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెలలో ఇది నాలుగో ఆత్మహత్య కావడం గమనార్హం. 

అయితే.. ఎక్కువగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చారు. ఏమాత్రం బరువు పడినా వెంటనే ఊడివచ్చేలా ఫ్యాన్లను అమర్చారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిగతులను మార్చాలని, అందుకు కౌన్సిలింగ్ వంటి చర్యలు చేపట్టాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.      

ఇదీ చదవండి: ఆత్మనిర్భర్ స్ఫూర్తి.. దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు.. అదీ 45 రోజుల్లో!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement