LOAD
-
కోటా హాస్టల్స్‌లో ఆత్మహత్యల కట్టడికి కొత్త ఆలోచన
జైపూర్: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వీటిని అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టింది. హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 'స్బ్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల'ను అమర్చుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిని మార్చడానికి ప్రయత్నించాలి కానీ.. సీలింగ్ ఫ్యాన్లు కాదని నెటిజన్లు ఫైరవుతున్నారు. ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు నిలయంగా ఉంటుంది రాజస్థాన్‌లోని కోటా. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు అక్కడికి వచ్చి శిక్షణ పొందుతుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ సారి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థి(18) చనిపోయిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెలలో ఇది నాలుగో ఆత్మహత్య కావడం గమనార్హం. #WATCH | Spring-loaded fans installed in all hostels and paying guest (PG) accommodations of Kota to decrease suicide cases among students, (17.08) https://t.co/laxcU1LHeW pic.twitter.com/J16ccd4X0S — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 18, 2023 అయితే.. ఎక్కువగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చారు. ఏమాత్రం బరువు పడినా వెంటనే ఊడివచ్చేలా ఫ్యాన్లను అమర్చారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిగతులను మార్చాలని, అందుకు కౌన్సిలింగ్ వంటి చర్యలు చేపట్టాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆత్మనిర్భర్ స్ఫూర్తి.. దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు.. అదీ 45 రోజుల్లో! -
Viral Video: ఉన్నపలంగా లారీ డోర్ తీసాడు.. తర్వాత ఏమైందంటే..!
-
తుపాకీని లోడ్ చేయలేక హైరానా పడ్డ పోలీసు: కంగుతిన్న అధికారి
స్కూల్స్‌లోనూ, ఆఫీసుల్లోనూ ఉన్నతాధికారులు సడెన్ చెకింగ్లు చేయడం సాధారణమే. కానీ అక్కడ ఉన్న ఉద్యోగుల నైపుణ్యలను తెలుసుకునే భాగంలో వారిని వివిధ రకాలు పరీక్షలు పెడుతుంటారు. ఐతే ఆ సమయంలో సదరు ఉద్యోగి విజయవంతంగా గెలిస్తే పర్వాలేదు గానీ అనుకోని ఘటన జరిగితే ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక ఉన్నతాధికారి ఇన్స్పెక్షన్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ఒక పోలీస్టేషన్ని తనిఖీ చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఒక పోలీసుని తుపాకీని లోడ్ చేయగలవా అని ఉన్నతాధికారి ప్రశ్నించారు. అంతేగాదు తుపాకినీ తీసుకువచ్చి లోడ్‌చేసి చూపించమంటే సదరు సబ్ఇన్స్పెక్టర్ చాలా తత్తరపాటుకు గురయ్యాడు. ఫిరంగి మాదిరిగా బుల్లెట్ పెట్టడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడతారు. సదరు ఉన్నతాధికారి ఆ ఇన్స్పెక్టర్ పరిస్థితిని చూసి మొదటగా షాక్‌కి గురి అయ్యాడు. కానీ అతని స్థితిని చూసి నవ్వును ఆపుకుంటూ ఎలా చేయాలో వివరిస్తున్నాడు. చివరికీ ఆ అధికారి సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వమని అత్యవసర పరిస్థితుల్లో ఎలా నిర్వహించాలో నేర్చుకోమని సూచించారు. ఐతే సదరు ఇన్స్పెక్టర్పై ఏదైన చర్య తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఒంటిపై అండర్వేర్ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు) -
జిల్లా వాసులపై విద్యుత్ భారం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి విద్యుత్ చార్జీలు పెంచడానికి చర్యలు చేపట్టడంతో జిల్లా వాసులపై ఏడాదికి సుమారు రూ.40.30 కోట్ల మేరకు భారం పడనుంది. పేరుకు 0 నుంచి 2,700 యూనిట్ల వార్షిక విద్యుత్ వినియోగదారులకు చార్జీలు పెంచలేదన్న మాటే గానీ ప్రజలపైనే పెరిగిన చార్జీల భారం పరోక్షంగా పడనుంది. కాగా 2,700 యూనిట్లకు పైబడి యూనిట్ల విద్యుత్‌ను ఏడాదికి వినియోగించే గృహ వినియోగదారులపై ఆయా స్లాబులవారీగా విభజించి వారిపై సుమారు యూనిట్‌కు 10 నుంచి 26 పైసలు భారం మోపనున్నారు. జిల్లావ్యాప్తంగా కేటగిరి బి–2లో గృహేతర, వాణిజ్య వినియోగదారుల సర్వీసులపై వివిధ స్లాబులకు గాను 27 పైసల నుంచి 60 పైసల వరకు పెంచారు. మొత్తంగా 11.50 లక్షల సర్వీసుల్లో ఏడాదికి 2,700 యూనిట్ల విద్యుత్ వినియోగించే వినియోగదారులు సుమారు 9.50 లక్షలు ఉండగా, మరో లక్ష వ్యవసాయ వినియోగదారులున్నారు. వీరిని మినహాయించి సుమారు లక్ష వినియోగదారుల్లో 2,700 యూనిట్లకు పైబడి వినియోగించే వినియోగదారులు సుమారు 39 వేలు, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులు సుమారు 40 వేలు, మత్స్య పరిశ్రమకు సంబంధించి మరో 10 వేల సర్వీసులు ఉండగా సుమారు 10 వేల స్థానిక సంస్థల సర్వీసులు ఉన్నాయి. ఎగువ తెలిపిన 10.50 లక్షల వినియోగదారులను మినహాయించి సుమారు 1 లక్ష మంది వినియోగదారులపైనే మొత్తం రూ.40.30 కోట్ల భారం పడుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే వీధిలైట్లు, ప్రజలకు కుళాయిల ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు పంచాయతీలు, మున్సిపాలిటీలు వినియోగించే విద్యుత్ చార్జీలను కూడా పెంచడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా వాటి పరిస్థితి తయారవుతోంది. స్థానిక సంస్థలపై యూనిట్‌కు 19 నుంచి 27 పైసలు అదనపు భారం పడనుంది. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు చెల్లించడం లేదనే కారణంతో వీధిలైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండగా, ప్రస్తుతం పెంచిన భారంతో స్థానిక సంస్థలు పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చిన్న చిన్న ఆధ్యాత్మిక కేంద్రాలకు కంటి తుడుపు చర్యగా యూనిట్‌కు 5 పైసలు తగ్గించిన ప్రభుత్వం పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలపై 34 పైసల భారం మోపుతోంది. ఒక విద్యార్థులకు చదువులు చెప్పే పాఠశాలలు, కళాశాలలను కూడా ప్రభుత్వం విడిచిపెట్టకుండా వాటిపై కూడా 28 పైసల భారం వేసింది. కాగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నప్పటికీ ఈ ఏడాది పెంచిన చార్జీలు అసాధారణంగా ఉన్నాయి. గత ఏడాది పెంచిన చార్జీలతో పోల్చితే ఈ ఏడాది దాదాపు 120 శాతం పెరిగాయి. గత ఏడాది పెంచిన చార్జీల భారం జిల్లా ప్రజలపై సుమారు రూ. 17 కోట్లు మాత్రమే పడగా ఈ ఏడాది రూ. 40 కోట్లకు పైబడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.