
స్కూల్స్‌లోనూ, ఆఫీసుల్లోనూ ఉన్నతాధికారులు సడెన్ చెకింగ్‌లు చేయడం సాధారణమే. కానీ అక్కడ ఉన్న ఉద్యోగుల నైపుణ్యలను తెలుసుకునే భాగంలో వారిని వివిధ రకాలు పరీక్షలు పెడుతుంటారు. ఐతే ఆ సమయంలో సదరు ఉద్యోగి విజయవంతంగా గెలిస్తే పర్వాలేదు గానీ అనుకోని ఘటన జరిగితే ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక ఉన్నతాధికారి ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ఒక పోలీస్టేషన్‌ని తనిఖీ చేయడానికి వచ్చాడు.
అక్కడ ఉన్న ఒక పోలీసుని తుపాకీని లోడ్ చేయగలవా అని ఉన్నతాధికారి ప్రశ్నించారు. అంతేగాదు తుపాకినీ తీసుకువచ్చి లోడ్‌చేసి చూపించమంటే సదరు సబ్‌ఇన్‌స్పెక్టర్ చాలా తత్తరపాటుకు గురయ్యాడు. ఫిరంగి మాదిరిగా బుల్లెట్ పెట్టడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడతారు.
సదరు ఉన్నతాధికారి ఆ ఇన్‌స్పెక్టర్ పరిస్థితిని చూసి మొదటగా షాక్‌కి గురి అయ్యాడు. కానీ అతని స్థితిని చూసి నవ్వును ఆపుకుంటూ ఎలా చేయాలో వివరిస్తున్నాడు. చివరికీ ఆ అధికారి సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వమని అత్యవసర పరిస్థితుల్లో ఎలా నిర్వహించాలో నేర్చుకోమని సూచించారు. ఐతే సదరు ఇన్‌స్పెక్టర్‌పై ఏదైన చర్య తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
(చదవండి: ఒంటిపై అండర్‌వేర్ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు)
Comments
Please login to add a commentAdd a comment