gun video
-
Pooja khedkar: కూతురే కాదు తల్లి కూడా అదే దందా.. వీడియో వైరల్
ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రొహిబిషన్ సమయంలో పూర్తి స్థాయి అధికారిగా హల్చల్ చేసిన ఆమె.. ఉన్నతస్థాయి అధికారుల ఆగ్రహానికి గురైన బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంచలనంగా మారిన ఈమె వ్యవహారంలో మరో రచ్చ మొదలైంది. కూతురే కాదు.. ఆమె తండ్రి, తల్లి చేసిన అరాచకాలు కూడా బయటపడుతున్నాయి.తాజాగా పూజా ఖేద్కర్ తల్లికి చెందిన ఓ వీడియో వివాదస్పదంగా మారింది. అయితే ఇది పాత వీడియోనే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దిలీప్ ఖేద్కర్... కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పుణే జిల్లాలోనే ముల్షీ తాలుకాలో ఓ 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు.అయితే పక్కనే ఉన్న రైతుల భూముల్నీ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ స్థలం వద్దే పెద్ద గొడవైంది. రైతులు వ్యతిరేకించడంతో ఎమ్మెల్యే ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్ తన సెక్యూరిటీ గార్డులతో అక్కడకు చేరుకున్నారు. చేతిలో తుపాకీ తీసుకొచ్చిఇ రైతులను బెదిరించారు.గన్ చూపిస్తూ "ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కుడున్నాయో చూపించు" అని బెదిరించింది. అందుకు ఆ వ్యక్తి తన పేరుపైనే ల్యాండ్ రిజిస్టర్ అయ్యుందని, ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని చెప్పాడు. "కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో చూసుకో...నాకే రూల్స్ చెప్పకు" అని తుపాకీతో అతడికి వార్నింగ్ ఇచ్చింది.IAS officer Pooja Khedkar's father, Dilip Khedkar, has allegedly amassed wealth and bought 25 acres in Mulshi tehsil, Pune. The family reportedly tried to encroach on neighboring land, and Pooja's mother, Manorama Khedkar, allegedly threatened farmers with a pistol. Attempts… pic.twitter.com/KlETPBXBmb— Sneha Mordani (@snehamordani) July 12, 2024కాగా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా పోలీస్ కేసు పెడదామని చూసినా ఎవరూ సహకరించలేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు పూజే ఖేడ్కర్‌కి 5 ప్లాట్లున్నాయి. వీటితో పాటు మహారాష్ట్రలో రెండు అపార్ట్మెంట్లు ఉన్నట్లు తేలలింది. వీటి విలువ రూ.22కోట్లు. అహ్మద్‌నగర్‌లో రూ.45 లక్షల విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది.నింగ్‌లో ఉండగానే గొంతెమ్మ కోరికలు కోరి వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె వినియోగించే ఖరీదైన ఆడీ కారుపై ఉన్న 21 చలాన్లు కట్టకుండా పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.26,000. అమె రిక్రూట్‌మెంట్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా లోపం ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ చూపించినట్టు తేలింది. మెడికల్ టెస్ట్‌లు జరగకుండా మేనేజ్ చేసి రిక్రూట్ అయింది. -
పెళ్లి రిసెప్షన్లో యువకుల హల్చల్.. తుపాకీ, తల్వార్‌తో డ్యాన్స్‌లు
సాక్షి, కామారెడ్డి: పెళ్లి రిసెప్షన్లో కొందరు యువకుడు వీరంగం సృష్టించారు. తుపాకీలు, కత్తులు చేతపట్టి డ్యాన్స్ చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 10వ తేదీ రాత్రి మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో పెళ్లి కొడుకుతోపాటు మరికొందరు యువకులు తల్వార్, గన్లతో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ వీడియోలను కొందరు ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. చివరికి ఈ విషయం పోలీసులకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవ వరుడితోపాటు స్నేహితులనుఅదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
‘ఆమెది భరించలేని మోసం.. గుండెలోతుల్లో ఆ బాధను అనుభవించా!’
-
‘ఆమె నా జీవితాన్ని తలకిందులు చేసింది, అందుకే..’
సమస్యలు లేని మనిషంటూ ఉండడు. కానీ, అనుజ్ సింగ్ మాత్రం తన సమస్యలను మోయలేని భారంగా భావించాడు. చిన్నవయసు నుంచి కాలేజీ రోజుల దాకా ఎదురైన పరిస్థితులతో మానసికంగా కుంగిపోయాడతను. ఆ టైంలోనే స్నేహ చౌరాసియా పరిచయం అయ్యింది. ఆమె ప్రేమలో జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుందని ఫీలయ్యాడతను. కానీ, అది అతనికి ఎంతో కాలం దక్కలేదు. ఆఖరికి.. ఆ ప్రేమ వెనుక మోసం దాగుందని గుర్తించి మాజీ ప్రేయసిని చంపడంతోనూ పాటు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకున్నాడా యువకుడు. గురువారం(మే 18) గ్రేటర్ నోయిడా(యూపీ) పరిధిలోని శివ్ నాడార్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్న స్నేహ చౌరాసియాను.. అదే సెక్షన్‌కు చెందిన అనుజ్ సింగ్ కసితీరా పిస్టోల్‌తో కాల్చి చంపాడు. ఆపై హస్టల్ గదికి చేరుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. అఘాయిత్యానికి పాల్పడే ముందు రికార్డ్ చేసినట్లు భావిస్తున్న ఓ వీడియోను అనుజ్ జీమెయిల్ అకౌంట్ నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అందులో స్నేహ చౌరాసియా తన జీవితాన్ని ఎలా మార్చేసింది, తన మనసును ఎంత క్షోభ పెట్టిందనేది 23 నిమిషాలపాటు మాట్లాడాడతను. వీడియోలో ఏముందంటే.. ‘‘నా పేరు అనుజ్. నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరినీ బాధపెట్టలేదు. ఒకప్పుడు నా జీవితం అల్లకల్లోలంగా ఉండేది. మానసికంగా కుమిలిపోయేవాడిని. జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు చవిచూశా. నేను అమ్మాయిలకు దూరంగా ఉండేవాడిని. నా గతంలో జరిగినవే అందుకు కారణం. నా సోదరిని ఆమె భర్త తగలబెట్టి చంపేశాడు. మా మామయ్య ఆయన భార్య వదిలేసి వెళ్లిపోయిందని గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆడవాళ్ల వంక చూడకూడదని నిర్ణయించుకున్నా. కానీ.. ఆమె పరిచయం నాలో సంతోషాన్ని నింపింది.. నాలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే ఆమె లవ్ ప్రపోజ్‌ను అంగీకరించా. ఇద్దరం ఏడాదిన్నరకాలం ఎంతో ఆనందంగా గడిపాం. హఠాత్తుగా ఒకరోజు తాను మానసికంగా కుమిలిపోయానని, కాబట్టి తనకు దూరంగా ఉండమని బ్రేకప్ చెప్పేసింది స్నేహ. అది నమ్మి ఆమె సంతోషం కోసం దూరంగా ఉన్నా. కానీ, కాలేజీలో పని చేసే ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తర్వాతే తెలిసింది. ఆమె వల్ల నా జీవితం తలకిందులు అయ్యింది. నాకు ఎంతో టైం లేదు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా. చేసిందానికి ఆమె ప్రతిఫలం అనుభవించాల్సిందే. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా.. స్నేహ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అనుజ్ ఆ వీడియోలో చెప్పాడు. హస్టల్ సీసీటీవీ ఫుటేజీలు, ఆమె సెల్‌ఫోన్ ఛాటింగ్‌లను పరిశీలిస్తే.. స్నేహ అఫైర్ నిజమో కాదో తెలుస్తుందని చెప్పాడతను. ‘‘తన(స్నేహ) ప్రవర్తన మీద మొదటి నుంచి అనుమానాలు ఉండేవి. ఫోన్‌ను ఇచ్చేది కాదు. వాట్సాప్ ఛాటింగ్ నేను చూస్తానని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేది. గట్టిగా అడిగితే.. నమ్మకం లేదా? అనేది. కానీ, ఒకానొక టైం వచ్చేసరికి విడిపోదామని చెప్పేసింది. బాధేసినా.. తను బాగుండాలని సరేనన్నా. కానీ, స్నేహ చేసిన మోసం నన్ను గుండెల్లోతుగా బాధించింది. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా. స్నేహ తల్లిదండ్రులకు నా క్షమాపణలు.. మీ కన్నకూతురు బతకడానికి అర్హురాలు కాదు. మొన్న నన్ను.. ఇవాళో రేపో ఆ వ్యక్తిని, ఆపై మరొకరిని.. మోసం చేస్తుందని నా నమ్మకం. అలాంటి అమ్మాయికి బతికే హక్కు కూడా లేదు అంటూ వీడియోలో అనుజ్ మాట్లాడాడు. మధ్యాహ్నం 1గం.30ని. సమయంలో క్యాంపస్‌లోనే స్నేహ చౌరాసియాను నాటు తుపాకీతో కాల్చి చంపాడు అనుజ్ సింగ్. అయితే ఘటనకు ముందు వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతేకాదు యూనివర్సిటీ డైనింగ్ హాల్ వద్ద ఇద్దరూ కౌగిలించుకుని కూడా కనిపించినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాతే తనతో తెచ్చిన పిస్టోల్‌ను బయటకు తీసి.. స్నేహను కసితీరా కాల్చి చంపాడు అనుజ్. ఆపై హస్టల్ గదికి వెళ్లి తనను తాను కాల్చుకుని అక్కడిక్కడే చనిపోయాడు. అది వీడియోగా వైరల్ అయ్యింది కూడా. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. ఇప్పటిదాకా స్నేహ తల్లిదండ్రులు ఆమె మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అలాగే క్యాంప్‌లో విచారణ కోసం వెళ్లిన పోలీసులను.. స్నేహ స్నేహితురాళ్ల మౌనం సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో.. అనుజ్‌కు దేశీవాళీ తుపాకీ ఎలా వచ్చింది? దానిని క్యాంపస్‌లోకి ఎలా తీసుకొచ్చాడు అనే కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
గురి తప్పకూడదు..
శ్రీకాకుళం: పోలీసు వృత్తిలో ఫైరింగ్ నైపుణ్యం కీలకమని ఎస్పీ జీఆర్ రాధిక అన్నారు. ఎచ్చెర్ల సమీపంలోని చినరావుపల్లిలోని ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం వార్షిక ఫైరింగ్ సాధన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి అధునాతన ఆయుధం గురించి తెలుసుకోవాలని సూచించారు. -
తుపాకీని లోడ్ చేయలేక హైరానా పడ్డ పోలీసు: కంగుతిన్న అధికారి
స్కూల్స్‌లోనూ, ఆఫీసుల్లోనూ ఉన్నతాధికారులు సడెన్ చెకింగ్లు చేయడం సాధారణమే. కానీ అక్కడ ఉన్న ఉద్యోగుల నైపుణ్యలను తెలుసుకునే భాగంలో వారిని వివిధ రకాలు పరీక్షలు పెడుతుంటారు. ఐతే ఆ సమయంలో సదరు ఉద్యోగి విజయవంతంగా గెలిస్తే పర్వాలేదు గానీ అనుకోని ఘటన జరిగితే ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక ఉన్నతాధికారి ఇన్స్పెక్షన్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ఒక పోలీస్టేషన్ని తనిఖీ చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఒక పోలీసుని తుపాకీని లోడ్ చేయగలవా అని ఉన్నతాధికారి ప్రశ్నించారు. అంతేగాదు తుపాకినీ తీసుకువచ్చి లోడ్‌చేసి చూపించమంటే సదరు సబ్ఇన్స్పెక్టర్ చాలా తత్తరపాటుకు గురయ్యాడు. ఫిరంగి మాదిరిగా బుల్లెట్ పెట్టడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడతారు. సదరు ఉన్నతాధికారి ఆ ఇన్స్పెక్టర్ పరిస్థితిని చూసి మొదటగా షాక్‌కి గురి అయ్యాడు. కానీ అతని స్థితిని చూసి నవ్వును ఆపుకుంటూ ఎలా చేయాలో వివరిస్తున్నాడు. చివరికీ ఆ అధికారి సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వమని అత్యవసర పరిస్థితుల్లో ఎలా నిర్వహించాలో నేర్చుకోమని సూచించారు. ఐతే సదరు ఇన్స్పెక్టర్పై ఏదైన చర్య తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఒంటిపై అండర్వేర్ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు) -
Hyderabad: గన్ చూపించి కారును ఆపిన ఎస్సై.. అవాక్కైన వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: మీర్‌చౌక్ ఏసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున పాతబస్తీ ఎతేబార్‌చౌక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు ఓపెన్ టాప్ కారులో ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ అడ్డుకుని దానిని ఆపడానికి కారు ముందుకు వెళ్లాడు. దీనిని గమనించిన విధి నిర్వహణలో మీర్‌చౌక్ ఎస్సై వెంటనే స్పందించి తన పౌచ్‌లో ఉన్న గన్ను చేతిలోకి తీసుకుని కారు కిందకు దిగండి అంటూ బిగ్గరగా ఆరిచాడు. దీంతో ఎస్సై చేతిలో గన్ను చూసిన కారులోని యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎస్సై ఆవేశంతో ఆగ్రహంగా గన్‌తో యువకుల వద్దకు చేరుకోవడాన్ని చూసిన వాహనదారులు కొద్దిసేపు నిర్ఘాంత పోయారు. దీంతో సదరు యువకులు కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించారు. డిక్కీతో పాటు వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాతబస్తీలో ఓ ఎస్సై గన్ చూపించి సినిమా ఫక్కీలో హల్చల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాతబస్తీలో ఇప్పటి వరకు ఓ ఎస్సై గన్ చూపించి తనిఖీలు నిర్వహించిన సందర్భం, సంఘటనలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ శబ్ధ కాలుష్యానికి పాల్పడిన వాహన యజమానికి మీర్‌చౌక్ పోలీసులు ఫైన్ విధించి పంపించారు. How can SI take out his service revolver gun to stop vehicle during cheking in mirchowk old city ? @CPHydCity @DCPSZHyd sir kindly take action on this... On small small issues a police officer can't take out his firearm @TelanganaDGP pic.twitter.com/SPWBZKphTk — Mohammed Inayath ulla sharief (@InayathShafi) December 27, 2022 చేతిలో వెపన్ తప్పులేదు: డీసీపీ సాయి చైతన్య వాస్తవానికి అర్ధరాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించేటప్పుడు చేతిలో వెపన్లతో సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ఎస్సై స్థాయి అధికారి వాహనాల తనిఖీల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ వెపన్ చేతిలోనే ఉంటుందన్నారు. (క్లిక్ చేయండి: కేసీఆర్ ఫాంహౌస్ సినిమా అట్టర్‌ఫ్లాప్) -
ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి సింగ్ స్వరూప్ తుపాకీతో డ్యాన్సులు చేస్తూ హల్చల్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ వీడియోలో సింగ్స్వరూప్ పసుపు రంగు టీషర్ట్ ధరించి కొంతమంది వ్యక్తులతో కలిసి డ్యాన్యులు చేస్తున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత ఉన్నటుండి సడెన్‌గా తుపాకీని తీసి తన సహచరులతో రౌడీ మాదిరిగా చిందులు వేశాడు. వాస్తవానికి డిసెంబర్ 4న 250 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ తరుణంలో ఆప్ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి ఇలా తుపాకీతో హల్చల్ చేయడంతో పార్టీ శ్రేణులంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. Joginder singh (yellow T- Shirt me) Ward 19N Swaroop Nagar se AAP ne MCD Election ka ticket diya hai.. @IamAjaySehrawat pic.twitter.com/oRcdogavP4 — Dev विराट (@Dev08364316) November 24, 2022 (చదవండి: వర్క్ ఫ్రం హోమ్ తెచ్చిన తంటా!..ఆఖరికి పెళ్లి పీటలపై కూడా) -
రూ.3 కోట్ల బెంట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన పేరెంట్స్.. తుపాకీతో కొడుకు హల్చల్!
చండీగఢ్: తల్లిదండ్రులు బెంట్లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంతోషంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన పంజాబ్‌లోని మొహాలీలో జరిగింది. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.యువకుడిని మొహాలీలోని ఖరార్ ప్రాంతానికి చెందిన శుభమ్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. రూ.3 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన క్రమంలో చుట్టూ జనం ఉన్నప్పటికీ అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని గన్ లైసెన్స్ ఉందా? ఉంటే ఎవరి పేరుపై ఉంది అనే విషయాలపై దర్యాప్తు చేపట్టామన్నారు. వీడియో ప్రకారం.. బెంట్లీ కారు ముందు నిలుచున్న యువకుడు తుపాకీతో గాల్లోకి రెండు సార్లు కాల్పులు జరిపాడు. అతడి చుట్టూ పలువురు ఉన్నారు. వారంతో ఫోన్లలో వీడియో తీసుకోవటంలోనే నిమగ్నమయ్యారు. ఈ వీడియోను ఫ్రీ ప్రెస్ జర్నల్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘తల్లిదండ్రులు బెంట్లీ కారు ఇచ్చిన సంతోషంలో మొహాలీ యువకుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.’ అని పేర్కొంది. సమావేశాలు, మతపరమైన ప్రాంతాలు, వివాహాల వంటి సందర్భాల్లో వేడుకలో భాగంగా ఫైరింగ్ చేయటం క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. లైసెన్స్ గన్‌తోనూ కాల్పులు చేయకూడదు. ఎవరికి ఎలాంటి గాయం కానప్పటికీ శిక్షార్హమే. ఆయుధాల చట్ట సవరణ ప్రకారం.. ప్రజా కార్యక్రమాల్లో ఆయుధాలు ఉపయోగించకూడదు. చాలా సందర్భాల్లో ఇలాంటి కాల్పులు మరణాలకు దారి తీశాయి. #Punjab: Elated after being gifted a Bentley car from his parents, Mohali youth opens fires in the air; booked after video went viral on social media.#Viral #bentley #Car #Gift #Boy #Mohali #India #ViralVideo #fire pic.twitter.com/wjGAFkJEVo — Free Press Journal (@fpjindia) October 18, 2022 ఇదీ చదవండి: బాణసంచా కొన్నా, కాల్చినా 6 నెలల జైలు! -
బర్గర్ తినటమే ఆ యువకుడు చేసిన నేరం.. పోలీసు కాల్పుల్లో..!
వాషింగ్టన్: కారులో కూర్చుని బర్గర్ తినటమే ఆ యువకుడు చేసిన నేరం. అదీ నడి రోడ్డుపై కాదు, పార్కింగ్ ప్రాంతంలోనే కారు నిలిపి ఉంచాడు. బర్గర్ తింటున్న యువకుడిపై ఓ పోలీసు అధికారి పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. పోలీసు ఇష్టారీతిన కాల్పులు జరుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన అమెరికాలోని సాన్ ఆంటోనియా ప్రాంతంలో జరిగింది. వీడియో వైరల్ కావటంపై సదరు పోలీసు అధికారే షాక్‌కు గురైనట్లు స్థానిక మీడియా తెలిపారు. ఆదివారం సాయంత్రం ఎరిక్ చాంటు(17) అనే యువకుడు మెక్‌డొనాల్డ్స్ పార్కింగ్ ప్రాంతంలో కారులో కూర్చుని బర్గర్ తింటున్నాడు. అక్కడికి వచ్చిన సాన్ ఆంటోనియా పోలీసు అధికారి జేమ్స్ బ్రెన్నాండ్.. కారు డోరు తీశాడు. పార్కింగ్ ప్రాంతంలో తినటంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. వాహనం నుంచి కిందకు దిగాలని కోరాడు. తాను ఎందుకు దిగాలని యువకుడు ప్రశ్నించాడు. ఈ క్రమంలో అతడిని బయటకు లాగేందుకు పోలీసు ప్రయత్నించాడు. కారు డోరు తెరిచి ఉండగానే రివర్స్ చేశాడు బాధితుడు. ఈ క్రమంలో యువకుడిపై పోలీసు అధికారి పలు రౌండ్ల కాల్పులు జరిపాడు. కారు వేగం పెంచిన యువకుడు డోర్ మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పోలీసు కాల్పుల్లో యువకుడు గాయపడ్డాడు. కారు వెనుక సీట్లో 17 ఏళ్ల ఓ బాలిక ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసు అధికారితో యువకుడు గొడవకు దిగాడని, పోలీసుపై దాడి చేసినట్లు తొలుత ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత పోలీసు అధికారి బాడీ క్యామ్ వీడియో బయటకు రావటంతో అసలు విషయం తెలిసింది. పోలీసు కాల్పుల్లో గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రాణ రక్షణ కోసం మాత్రమే తుపాకీ వాడాలనేది అక్కడి నిబంధన కాగా.. అలాంటి పరిస్థితి ఏమీ కనిపించలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. Earlier this week, a San Antonio cop abruptly confronted a teen eating in a McDonalds parking lot & demanded the teen exit his vehicle. When the teen asked why, the cop immediately assaulted & then shot him MULTIPLE TIMES. Cop tried to (falsely) claim the teen had struck him 1st pic.twitter.com/ATNKj4fVgi — Kendall Brown (@kendallybrown) October 7, 2022 ఇదీ చదవండి: షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు! -
వీడియో: గన్ పేలుతుందనగా మెరుపులా దూసుకొచ్చి..
తల్లాహస్సీ: పక్కడో ఏమైనా పర్వాలేదు.. మనం బాగుంటే చాలనుకునే సమాజం ఇది. అయితే అడపా దడపా జరిగే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మానవత్వం.. సాయ గుణం మనిషిలో ఇంకా మిగిలే ఉందని అనిపిస్తుంటుంది. తన ప్రాణాలను అడ్డుపెట్టి.. తల్లీకూతుళ్లను ఓ దొంగ నుంచి కాపాడాడు ఇక్కడ ఓ హీరో. ఫ్లోరిడా ఫోర్ట్ వాల్టన్ బీచ్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఆ ఓనర్‌ను తుపాకీ చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆమె తన చంటిబిడ్డను ఎత్తుకుని ఉంది. భయంతో కేకలు వేసింది. ఇక ఆమెను షూట్ చేయబోతున్నాడగా.. మెరుపు వేగంతో దూసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఆ దొంగ మీదకు దూకి పక్కకు నెట్టేసి.. ఆ కాల్పుల ఘటనను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అంతలో ఆ తల్లి అరుపులతో చుట్టుపక్కల వాళ్లు కొందరు గుమిగూడడంతో దొరికిపోవడం ఆ దొంగ వంతు అయ్యింది. సమాచారం అందుకున్న ఒకలూసా కౌంటీ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు బ్యాటరీ దొంగతనం కోసమే అతను ఆ ఘాతుకానికి యత్నించినట్లు తేలింది. In reference to the FWB Chick-fil-A employee who ran to help a woman with a baby who was being carjacked, we want to say a sincere thank you to Ms. Kelner for providing video of a portion of the encounter. (see prior post). A major shout-out to this young man for his courage! pic.twitter.com/2Lcwe46azv — OkaloosaSheriff (@OCSOALERTS) September 14, 2022 ఇక కాపాడిన వ్యక్తి అక్కడే ఓ రెస్టారెంట్లో పని చేసే మైకేల్ గోర్డాన్‌గా గుర్తించారు. అక్కడే మరో కారులో కూర్చున్న వ్యక్తి.. ఆ ఘటనను వీడియో తీయడంతో ఆ సూపర్ హీరో ఉదంతం వెలుగు చూసింది. తల్లీబిడ్డలను కాపాడడంతో పాటు తమ రెస్టారెంట్‌కు మంచి పేరు తెచ్చినందుకు ఆ యాజమాన్యం.. గోర్డాన్‌ను అభినందించింది. సూపర్ హీరోలు ఎక్కడో ఉండరు.. ఇలా మన మధ్యే మంచి మనసున్న మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటారు. -
ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థినిని తుపాకీతో కాల్చి పరార్!
పాట్నా: తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది 15 ఏళ్ల బాలికను దారికాచి తుపాకీతో కాల్చాడు. మెడపై తూటా దిగటంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది బాధితురాలు. ఈ దుశ్చర్య బిహార్ రాజధాని పాట్నాలో బుధవారం జరిగింది. బాలికపై తుపాకీ పేల్చుతున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. కూరగాయలు విక్రయించే వ్యక్తి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రేమించాలని వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను తిరస్కరించిందనే కోపంతో తుపాకీతో వచ్చాడు. బాలిక అతడితో మాట్లాడకుండా వెళ్లగా వెనక నుంచి మెడపై కాల్చాడు. తూటా దిగటంతో బాలిక అక్కడే పడిపోయింది. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా పోలీసులు తెలిపారు. Bihar| A vegetable vendor’s daughter shot yesterday in Indrapuri locality of Sipara area of Beur PS in Patna. Injured girl who was shot in the neck is undergoing treatment in a private hospital. Matter is being said to be a love affair: Patna Police (Visuals: CCTV footage) pic.twitter.com/kHbddcU2L1 — ANI (@ANI) August 18, 2022 ఇదీ చదవండి: లఖింపుర్‌లో 72 గంటల ఆందోళన.. యూపీకి 10వేల మంది రైతులు -
కాల్పుల వీడియోపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందన
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్: తెలంగాణ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో జనం మధ్య ఆయన హుషారుగా తుపాకీతో కాల్పులు జరిపారు. పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకుని మరీ ఆయన గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసుల ఎస్ఎల్ఆర్ వెపన్తో గాల్లోకి ఫైర్ చేసిన ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని ఆయన ప్రకటన ఇచ్చారు. ‘‘నేను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్‌ను. క్రీడా శాఖమంత్రిగా నాకు ఆ అర్హత కూడా ఉంటుంది. కానీ, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీని సరైన సమాచారం తెలుసుకోవాలి. ఎస్పీ ఇస్తేనే నేను కాల్చాను. ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారు. నేను నిజమైన బుల్లెట్ కాల్చినట్లే అయితే రాజీనామా చేస్తా! అని రాజకీయ, సోషల్ మీడియా విమర్శలకు తీవ్రంగా స్పందించారాయన. @TelanganaCMO @KTRTRS @TelanganaDGP @CPHydCity @AmitShah తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు.. పోలీసు తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి.... Minister firing.... pic.twitter.com/d8iiHwBeZb — Aravind Sharma (@MAravindSharma1) August 13, 2022 -
పెళ్లి ఊరేగింపు: దోస్తును కాల్చి చంపిన పెళ్లికొడుకు
మన పెళ్లిళ్లకు హడావిడి మామూలుగా ఉండదు. అయితే.. ఆర్భాటాలు, దర్పం ప్రకటించుకునే క్రమంలో అతిపోకడలకు పోతుండడంతో.. అనర్థాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వివాహ వేడుకలో విషాదం నింపింది. తన స్నేహితుడినే కాల్చి చంపేశాడు ఓ పెళ్లి కొడుకు. పెళ్లి ఊరేగింపులో తన చిన్ననాటి స్నేహితుడినే కాల్చి చంపేశాడు పెళ్లి కొడుకు. అయితే అది పొరపాటుగానే జరిగింది. ఉత్తర ప్రదేశ్ సోన్‌భద్ర జిల్లా బ్రహ్మనగర్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఘటనలో టైంలో కొందరు వీడియోలు తీయగా.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనీష్ మదేషియా అనే వ్యక్తి వివాహంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మనీష్ స్నేహితుడు బాబూ లాల్ యాదవ్ ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి కొడుకు రథంపై ఊరేగింపు టైంలో.. తన దగ్గరి గన్నే మనీష్ చేతిలో పెట్టి గాల్లోకి కాల్పులు జరపమన్నాడు బాబూ లాల్. అయితే.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన మనీష్.. గన్ను కిందకు దించగానే ట్రిగ్గర్ నొక్కుకుపోయి బుల్లెట్ బాబూ లాల్ శరీరంలోకి దూసుకుపోయింది. బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఘటనకు సంబంధించి మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త పెళ్లి కొడుకు మనీష్ మేదషియాను అరెస్ట్ చేశారు. అలాగే మరో ఐదుగురిపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. నేరం రుజువైతే మనీష్‌కు రెండు నుంచి ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. మన దేశంలో వివాహ తదితర వేడుకలు, ప్రార్థన స్థలాలు సహా బహిరంగ ప్రాంతాల్లో లైసెన్స్ తుపాకులతో కాల్పులు జరిపినా.. చట్టరీత్యా నేరం. दूल्हे ने की हर्ष फायरिंग, आर्मी के जवान की हुई मौत। यूपी के @sonbhadrapolice राबर्ट्सगंज का #ViralVideo #earthquake #breastislife #fearwomen #Afghanistan pic.twitter.com/7laX9OUIqD — RAHUL PANDEY (@BhokaalRahul) June 23, 2022 थाना रॉबर्ट्सगंज पुलिस द्वारा हर्ष फायरिंग में हुई हत्या से सम्बन्धित 01 नफर अभियुक्त को किया गिरफ्तार, कब्जे से आलाकत्ल 01 अदद पिस्टल मय 04 अदद जिन्दा व 01 अदद फायरशुदा कारतूस बरामद । pic.twitter.com/8gfevb7r96 — Sonbhadra Police (@sonbhadrapolice) June 22, 2022 -
విద్యార్థిని కిడ్నాప్... రూ.20 లక్షలు డిమాండ్ చేసి రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ
న్యూఢిల్లీ: కొన్ని నేరాలు చూస్తే ఎవర్ని నమ్మాలి అనే సందేహం కలుగుతుంది. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు తమ బంధువులు లేదా పరిచయమున్న వ్యక్తుల చేతిలోనే మోసపోవడం లేదా వేధింపులకు గురవడం వంటివి జరుగుతుండటం బాధకరం. అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీలో ఎంబీఏ విద్యార్థి ఫినైల్ సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..."ఆ ఎంబీఏ విద్యార్థితో ఒక నిందితుడు పథకంలో భాగంగా సన్నిహితంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ నిందితుడు అతన్ని అక్టోబర్ 23, 2020న కిడ్నాప్ చేసి గదికి తీసుకెళ్లారు. అంతేకాదు తుపాకీ వీడియోతో నగ్న వీడియోల తోపాటు తుపాకీ, గంజాయి, పిస్టల్ని పట్టుకుని ఉన్న వీడియోలను కూడా తీశారు. ఈ మేరకు ఆ నిందుతుడు తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ ఆ విద్యార్థిని బెదిరించి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబం రూ.5 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఆ నిందితుడి ఆ విద్యార్థి నగ్న వీడియోలను అతని కాలనీలోని వాళ్లకు, బంధువులకు పంపిచాడు. మళ్లీ ఫిబ్రవరి 1న ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఇక ఆ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ధర్మపాల్ అనే కానిస్టేబుల్ కూడా ఆ విద్యార్థిని బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ విద్యార్థి మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు." అని పోలీసులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు ప్రధాన కారకుడైన నిందుతుడిని అరెస్టు చేయడమే కాక ఇతర నిందుతుల ఆచూకి కోసం విచారించడం ప్రారంభించారు. అంతేగాక ఆ విద్యార్థి కుటుంబాన్ని కలిసి నిందుతులు పట్టుకుని అరెస్ట్ చేయడమే కాక సదరు కానిస్టేబుల్ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: హెల్మెట్ ధరించమని అన్నందుకే దారుణంగా కొట్టి, జీప్ ఎక్కించి....) -
అవాక్కయేలా చేద్దాం అనుకుంటే అరెస్ట్ అయ్యాడు!
సోషల్ మీడియోలో ఫేమస్ అవ్వడం కోసం ఇటీవల చాలా విన్నూతనమైన రీతిలో వీడియోలు చేసి పెడుతుంటారు. అలాంటి ఒక్కోసారి వినోదంగానే కాక విషాదమైన ఉదంతాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని పనులు మన ఊహకు కూడా అందకుండా కటకటాల పాలు చేస్తాయి. అట్లాంటి సంఘటనే ఒక దేశంలో జరిగింది. (చదవండి: ఎర్త్‌షాట్ ప్రైజ్ గెలుచుకున్న భారత్) ఇక్కడొక వ్యకి ఒక దుకాణం దగ్గర కెళ్లి కొన్ని వస్తువులు కొనుగోలు చేసి నేరుగా తన స్నేహితుడి కారు వద్దకు వస్తూ షర్ట్లోంచి ఒక తుపాకీ తీసి రకరకాలుగా ప్రదర్శిస్తాడు. ఆ తర్వాత కొన్ని డబ్బులు జేబులోంచి తీసి వాటిని రోడ్డుపై ఒక్కొక్కొటిగా విసిరుతాడు. అంతే ఒక్కసారిగా పోలీసులు వచ్చి గన్లు పట్టుకుని చుట్టుముట్టేస్తారు. వెంటనే అతను చేతులు పైకెత్తి లొంగిపోవడం తదనంతరం పోలీస్ అధికారి వచ్చి సంకెళ్లు వేయడం అంతా చకచకా జరిగిపోతాయి. అచ్చం సినిమాలోని సీన్ల మాదిరిగా వెంటవెంటనే జరిగిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు వినోదం కాస్త వికటించడం అంటే ఇదేనేమో అంటూ రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని) View this post on Instagram A post shared by Say Cheese TV 👄🧀 (@saycheesetv) -
లొంగిపోయిన ఆశిష్ పాండే
సాక్షి, న్యూఢిల్లీ: తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన బీఎస్పీ మాజీ ఎంపీ కుమారుడు రాకేశ్ పాండే కుమారుడు అశిష్ పాండే గురువారం పాటియాలా హౌస్ కోర్టులో లొంగిపోయారు. ఆయనను న్యాయస్థానం ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగించింది. నాలుగు రోజులు కస్టోడియల్ రిమాండ్‌కు ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. అశిష్ పాండేను లక్నో తీసుకెళ్లాల్సిన అవసరముందని, తుపాకీ స్వాధీనం చేసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. పాండేను రిమాండ్‌కు ఇవ్వాలన్న వాదనను ఆయన తరపు న్యాయవాది వ్యతిరేకించారు. విచారణకు పాండే సహకరిస్తున్నారని, తుపాకీని కూడా పోలీసులకు అప్పగించామని తెలిపారు. తన క్లైయింట్ తండ్రి రాజకీయ నాయకుడు కావడం వల్లే ఈ ఘటనపై మీడియా అత్యుత్సాహం చూపించిందన్నారు. (ప్రాథమిక వార్త: తుపాకీతో మాజీ ఎంపీ కొడుకు హల్చల్!) మీడియా బాధితుడిని: పాండే తాను బాధ్యత గల పౌరుడినని, నేరస్తుడిని కాదని అశిష్ పాండే అన్నారు. ప్రసార సాధనాలు ఏకపక్షంగా వ్యవహరించాయని, తాను మీడియా విచారణనకు బాధితుడిని అయ్యాయని వాపోయారు. సీసీ టీవీ ఫుటేజీని లోతుగా పరిశీలించాలని, హోటల్ సెక్యురిటీ సిబ్బంది నుంచి వివరాలు సేకరించాలని పోలీసులను కోరారు. కాగా, తనకు దారివ్వలేదన్న కోపంతో ఓ జంటను తుపాకీతో బెదిరించినట్టు పాండే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇన్ స్టా'గన్' ట్రాజెడీ!
గన్‌తో వీడియో.. బాలుడి ప్రాణాలు తీసింది వాషింగ్టన్: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలన్న కాంక్షతో కొంతమంది చేస్తున్న అల్లరి పనులు వారి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. తాజాగా అమెరికాలో ఓ పదమూడేళ్ల బాలుడు గన్‌తో తాను ఉన్న లైవ్ వీడియో క్లిప్‌ను సామాజిక మాద్యమం ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయాలన్న కోరిక అతడి ప్రాణాలు పోయేలా చేసింది. మాలాచీ హెంపిల్ అనే బాలుడు తన తల్లి, సోదరితో కలసి అమెరికాలోని జార్జియా నగరంలో నివసిస్తున్నాడు. బాలుడి స్నేహితుల్లో ఒకరు అతన్ని తుపాకీతో ఫోజులిస్తు వీడియో ఎందుకు పెట్టకూడదు అని అడిగారు. దీంతో వెంటనే ఆ బాలుడు మరొకరి వద్ద నుంచి తుపాకీని తీసుకుని ఇన్‌స్ట్రాగామ్‌లో లైవ్ వీడియో పెడుతుండగా పొరపాటున అది పేలింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ వీడియోను చూస్తున్న దాదాపు 50 మంది యూజర్లు బాలుడి ఇంటికి వచ్చినట్లు బాలుడి సోదరి తెలిపింది. ఇప్పటికైనా తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పిల్లలు వ్యవహరిస్తున్న తీరుపై నిఘా ఉంచాలని చెబుతున్నారు. బాలుడికి తుపాకీ ఎవరు ఇచ్చారనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.