AAP’s MCD poll candidate Joginder Singh booked under Arms Act for 'brandishing pistol', says Police - Sakshi
Sakshi News home page

ఆప్‌ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్‌

Published Wed, Nov 30 2022 3:34 PM | Last Updated on Wed, Nov 30 2022 8:22 PM

Aam Aadmi Partys MCD Poll Candidate Allegedly Flaunting Pistol - Sakshi

ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల అభ్యర్థి సింగ్‌ స్వరూప్‌ తుపాకీతో డ్యాన్సులు చేస్తూ హల్‌చల్‌ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో పోలీసులు సీరియస్‌ అయ్యారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

ఆ వీడియోలో సింగ్‌స్వరూప్‌ పసుపు రంగు టీషర్ట్‌ ధరించి కొంతమంది వ్యక్తులతో కలిసి డ్యాన్యులు చేస్తున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత ఉన్నటుండి సడెన్‌గా తుపాకీని తీసి తన సహచరులతో రౌడీ మాదిరిగా చిందులు వేశాడు. వాస్తవానికి డిసెంబర్‌ 4న 250 వార్డులకు మున్సిపల్‌ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ తరుణంలో ఆప్‌ మున్సిపల్‌ ఎన్నికల అభ్యర్థి ఇలా తుపాకీతో హల్‌చల్‌ చేయడంతో పార్టీ శ్రేణులంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

(చదవండి: వర్క్‌ ఫ్రం హోమ్‌ తెచ్చిన తంటా!..ఆఖరికి పెళ్లి పీటలపై కూడా)
​ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement