MCD
-
ఢిల్లీలో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ తొలగించిన ఎంసీడీ
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశంలో ఎలక్షన్ కోడ్ అమలులో వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) తన 12 జోన్ల నుంచి 5,20,042 పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ (హోర్డింగ్‌లు, పోస్టర్లు, వాల్ పెయింటింగ్‌లు, జెండాలు) తొలగించింది. ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) మార్చి 16న ప్రకటించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమల్లోకి వచ్చింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో మే 25న ఢిల్లీలో ఓటింగ్ ఉంటుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ తొలగించిన మొత్తం పొలిటికల్ అడ్వర్టైస్మెంట్లలో.. 257280 హోర్డింగ్‌లు, 192601 వాల్ పెయింటింగ్‌లు & పోస్టర్లు, 40022 సంకేతాలు, 30139 జెండాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసే వరకు ఈ నియమం అమలులో ఉంటుందని ఎంసీసీ పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 24 గంటల్లోపు బహిరంగ ప్రదేశంలో ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడిని ప్రోత్సహించే పోస్టర్లు, హోర్డింగ్‌లు లేదా బ్యానర్లను తొలగించాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి ఎంసీడీ బ్యానర్లను ఎప్పటికప్పుడు తొలగిస్తోంది. -
ఢిల్లీ చరిత్రలోనే తొలిసారి.. ముచ్చటగా మూడోసా‘రీ’!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి భంగపాటు తప్పడం లేదు. ఎన్నికల్లో గెలిచినా మేయర్ పదవి ఊరిస్తూనే వస్తోంది. తాజాగా.. మేయర్ ఎన్నిక జరగకుండానే ఎంసీడీ హౌజ్‌ను సోమవారం వాయిదా వేస్తునట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) ప్రకటించారు . దీంతో ముచ్చటగా మూడోసారి ఎన్నిక వాయిదా పడినట్లయ్యింది. ఢిల్లీ చరిత్రలోనే మేయర్ ఎన్నిక ఆలస్యం కావడం ఇదే తొలిసారి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) యాక్ట్ 1957 ప్రకారం.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఫలితాలు వెలువడిన నెలలోపే అదీ తొలి సెషన్లోనే జరిగిపోవాలి. అది జరుగుతూ వస్తోంది కూడా. కానీ, ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్ పడినట్లయ్యింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా మేయర్ ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లను.. మేయర్ ఓటింగ్‌కు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ అనుమతించారు. దీంతో సోమవారం హౌజ్ ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం చెలరేగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం.. నామినేట్ సభ్యులుగానీ, పెద్దల కోటాలో ఎన్నికైన సభ్యులు గానీ మేయర్ ఎన్నికలో ఓటేయడానికి వీల్లేదు. కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ మాత్రం ఎల్జీ నామినేట్ చేసిన పది మందిని ఓటింగ్‌కు అనుమతించడం ద్వారా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆప్ సభ్యులు మండిపడ్డారు. ఈ తరుణంలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట, పోటాపోటీ నినాదాలతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభను వాయిదా(తదుపరి తేదీ చెప్పకుండానే) వేస్తున్నట్లు సత్య శర్మ ప్రకటించారు. #WATCH | MCD mayor election called off for the third time after ruckus in the Delhi Civic Centre. pic.twitter.com/irCfHIoycP — ANI (@ANI) February 6, 2023 ఇదిలా ఉండగా.. జనవరి 6, జనవరి 24వ తేదీల్లో సభ్యుల ఆందోళన వల్ల నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రెండుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ మూడోసారి కూడా వాయిదా పడింది. పదిహేనేళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఓడిపోగా.. విజయం సాధించిన ఆప్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై గంపెడాశలు పెట్టుకుంది. ఢిల్లీ మేయర్‌ను ఎన్నికల్లో నెగ్గిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఢిల్లీ పరిధిలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. తొలి దఫాలో.. ఏ పార్టీ అయినా సరే మహిళా అభ్యర్థికే ఢిల్లీకి మేయర్ పీఠం కట్టబెడుతారు.ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. -
ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్! పదిహేనేళ్ల బీజేపీ అధికారాన్ని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీపురుతో ఊడ్చేసింది. ఢిల్లీ దేశ రాజధాని మాత్రమే కాదు, ఓ చిన్న రాష్ట్రం కూడా. అక్కడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, గెలిచిన పార్టీ నేత సీఎం అవుతాడు. అయితే ఇతర రాష్ట్రాల సీఎంలకున్న అధికారాల్లో కొన్ని ఢిల్లీ సీఎంకు ఉండవు. దేశ రాజధాని కావడంతో ఢిల్లీపై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విశేషాధికారాలు అనివార్యంగా దఖలు పడతాయి. దేశ పాలనకు, విదేశాంగ కార్యకలాపాలకు రాజధాని కీలకం గనుక ఇలా కొన్ని విషయాల్లో కేంద్రం మాట, లేదా అధికారం చెల్లుబాటవడం అనివార్యం, ఆమోదనీయం కూడా. కేంద్రంలో, ఢిల్లీలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ పనితీరుకు ఆస్కారముంటుంది. ఏ విషయంలోనూ సమస్యకు చాన్సుండదు. చిక్కల్లా అక్కడో పార్టీ, ఇక్కడో పార్టీ అధికారంలో ఉంటేనే! ఇది ఒక్కోసారి రాజ్యాంగ సంక్షోభానికీ దారి తీస్తుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఆప్కూ కేంద్రంలో అధికారం చలాయిస్తున్న మోదీ బీజేపీకీ మధ్య ప్రస్తుతం జరుగుతున్నదదే! ఎంసీడీపై పట్టు బిగించడంతో కేజ్రీవాల్ ఇక మరిన్ని అధికారాల కోసం కేంద్రంపై మరింత దూకుడుగా పోరాడే అవకాశముంటుంది. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ కేంద్రం ఏజెంటైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కేజ్రీవాల్ ప్రభుత్వంపైకి మరింతగా ఉసిగొల్పే అవకాశం లేకపోలేదు. ఎల్జీ, సీఎం ఆధిపత్య పోరు ప్రక్షాళన నినాదంతో చీపురు చేతపట్టి రాజకీయ కదనరంగంలోకి దిగిన కేజ్రీవాల్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తర్వాత 2020లోనూ జయభేరి మోగించాడు. ఏడేళ్లుగా కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్నాడు. సీఎం అయిన మరుక్షణం నుంచే లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆయన పోరాటానికి తెర తీశాడు. నజీబ్‌జంగ్ నుంచి ప్రస్తుత వినయ్‌కుమార్ సక్సేనా దాకా ఎల్జీగా ఎవరున్నా ఆప్‌ను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో పలు ఆప్ సంక్షేమ పథకాలను వారు అనుమతించకపోవడం చాలాసార్లు వివాదానికి దారితీసింది. మొహల్లా క్లినిక్‌లు, పాఠశాల అభివృద్ధి వంటి వినూత్న పథకాలను ఎల్జీ అనుమానపు చూపులు వెంటాడాయి. కొన్నింటిపై విచారణకు ఆదేశించేదాకా వెళ్లింది! ఆప్ అగ్రనేతలే లక్ష్యంగా ఎల్జీ పావులు కదిపాడు కూడా. ఆప్ నేతలు కూడా ఎల్జీ అవినీతికి పాల్పడుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు. ధర్నాలకూ దిగారు. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండొద్దని, మంత్రులను లెక్కచేయాల్సిన అవసరం లేదని అధికారులను ప్రోత్సహిస్తున్నాడంటూ ఆరోపించారు. ఎల్జీతో తప్పనిసరి భేటీలకు కూడా కేజ్రీవాల్ దూరంగా ఉన్న సందర్భాలెన్నో! ఎందుకింత వివాదమంటే... ఢిల్లీపై పెత్తనం సీఎందా, ఎల్జీదా అన్నదానిపై స్పష్టత లేకపోవడమే!! ఎల్జీదే పెత్తనమని ఢిల్లీ హైకోర్టు తీరి్పస్తే సుప్రీంకోర్టు దానితో విభేదించింది. ఎన్నికైన ప్రభుత్వం సూచనల మేరకే ఎల్జీ నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. చివరికి కేంద్రం పార్లమెంటులో బిల్లు ద్వారా ఢిల్లీపై ఎల్జీ పెత్తనాన్ని ఖరారు చేసింది. ఈ పెత్తనాల వివాదం నేపథ్యమే ఎంసీడీ తాజా ఫలితాలను కీలకంగా మార్చేసింది! ఎంసీడీ... గేమ్ చేంజర్! రాష్ట్రాలకు సాధారణంగా ఉండే అధికారాలు ఢిల్లీకి పూర్తిగా దఖలు పడలేదు. కీలకమైన పోలీసు, భూ వ్యవహారాల వ్యవస్థ పూర్తిగా ఎల్జీ అ«దీనంలోనే ఉంటాయి. దేశ రాజధాని గనుక ఎయిమ్స్ వంటి పెద్దాసుపత్రులు, పెద్ద పార్కులు, ఢిల్లీ గుండా వెళ్లే హైవేలు, ఢిల్లీ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ వంటివేమో కేంద్రం అ«దీనంలో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కీలకమైనవన్నీ కేంద్రం కనుసన్నల్లోనే ఉంటాయి. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యమూ చేసుకోలేదు. విద్యుత్, జలవనరులు, రవాణా వ్యవస్థతో పాటు ప్రభుత్వాసుపత్రులు, పాఠశాలు, పార్కరులు, రోడ్ల వంటివి దాని చేతుల్లో ఉంటాయి. ఈ నామమాత్రపు అధికారాలతోనే రాష్ట్ర ప్రభుత్వం పాలన చేయాల్సి ఉంటుంది. అయితే ఎంసీడీకి మాత్రం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉండే సాధారణ అధికారాలన్నీ ఉంటాయి. అదిప్పడు ఆప్ వశమవడంతో కార్పొరేషన్ పరిధిలోని అన్ని అంశాలపైనా అధికారాలు కేజ్రీవాల్ సర్కారుకు దఖలు పడతాయి. ఆ లెక్కన కొన్ని అధికారాలు చేతులు మారతాయి. కీలకమైన బిజినెస్ లైసెన్సింగ్ కూడా ఎంసీడీ పరిధిలోనే ఉండటం ఆప్‌కు మరింత పై చేయినిస్తుంది. ఎంసీడీ ద్వారా వీలైనన్ని సంక్షేమ పథకాలను జనాలకు మరింత చేరువ చేసి ఇంకా ప్రజాదరణ పొందే అవకాశం ఆప్‌కు చిక్కుతుంది. ఎల్జీతో పోరాటం కొనసాగిస్తూనే ఢిల్లీపై పట్టు మరింత బిగించడానికి తాజా ఫలితాలు ఆప్‌కు ఉపయోగపడతాయి. కొసమెరుపు: ఎంసీడీ మేయర్ ఎన్నిక ఆప్, బీజేపీ బల ప్రదర్శనకు వేదికగా మారే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా 12 మంది కౌన్సిలర్లను నామినేట్ చేసే అధికారం ఎల్జీకి ఉంది. వారంతా బీజేపీకి చెందినవారే అయ్యే పక్షంలో ఆ పార్టీ బలం ఆ మేరకు పెరుగుతుంది. పైగా ఎమ్మెల్యేల మాదిరిగా కౌన్సిలర్లకు పార్టీ విప్ గానీ అనర్హత నిబంధన గానీ వర్తించవు. కనుక ఆప్‌తో పాటు కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లతో బీజేపీ బేరసారాలాడటం ఖాయం. అదే జరిగితే మేయర్ ఎవరవుతారన్నది చివరిదాకా సస్పెన్సే. ఆ పరిస్థితుల్లో మేయర్ పదవిని ఆప్ చేజిక్కించుకుంటుందా అన్నది ప్రశ్నార్థకమే! చేజిక్కించుకోలేకపోతే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది!! ఇదీ చదవండి: ఢిల్లీపై ఆప్ జెండా -
ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి సింగ్ స్వరూప్ తుపాకీతో డ్యాన్సులు చేస్తూ హల్చల్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ వీడియోలో సింగ్స్వరూప్ పసుపు రంగు టీషర్ట్ ధరించి కొంతమంది వ్యక్తులతో కలిసి డ్యాన్యులు చేస్తున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత ఉన్నటుండి సడెన్‌గా తుపాకీని తీసి తన సహచరులతో రౌడీ మాదిరిగా చిందులు వేశాడు. వాస్తవానికి డిసెంబర్ 4న 250 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ తరుణంలో ఆప్ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి ఇలా తుపాకీతో హల్చల్ చేయడంతో పార్టీ శ్రేణులంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. Joginder singh (yellow T- Shirt me) Ward 19N Swaroop Nagar se AAP ne MCD Election ka ticket diya hai.. @IamAjaySehrawat pic.twitter.com/oRcdogavP4 — Dev विराट (@Dev08364316) November 24, 2022 (చదవండి: వర్క్ ఫ్రం హోమ్ తెచ్చిన తంటా!..ఆఖరికి పెళ్లి పీటలపై కూడా) -
గల్లీలు ఊడుస్తున్న ఢిల్లీ మంత్రులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్మికులు తమ విధులను బహిష్కరించి రోడ్లెక్కడంతో వారి బాధ్యతలు నెరవేర్చేందుకు ఆప్ మంత్రులు తట్టాబుట్టా, చీపుర్లు పట్టుకుని ఢిల్లీ వీధులు శుభ్రం చేసే పనిలో పడ్డారు. వీరికి తోడు ఆప్ కార్యకర్తలు కూడా తోడవడంతో ఢిల్లీ వీధుల శుభ్రం చేసే కార్యక్రమం దండిగా సాగుతోంది. తమకు జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పీడబ్ల్యూడీ అధికారులు ప్రత్యేక టాస్క్ పోర్స్ ను ఉపయోగించి ఢిల్లీ వీధులను శుభ్రం చేయిస్తున్నారు. వీరితోపాటు ఆ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా పాల్గొంటున్నారు. ఇక ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ షాదారా ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా మంత్రులు కపిల్ మిశ్రా, ఇమ్రాన్ హుస్సేన్ కారవల్ నగర్, బల్లిమారన్ ప్రాంతంలో చెత్తచెదారం ఊడుస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్పార్పంజ్ ప్రాంతంలో వీధులు ఊడ్చే కార్యక్రమం చేపట్టనున్నారు. -
డిప్యూటీ సీఎం ఇంటి ముందు చెత్తవేసి మరీ...
-
ఎంసీడీసీ ‘డిమాండ్’పై కోర్టుకెక్కిన డీడీఏ
న్యూఢిల్లీ: నగర పరిధిలోని నజుల్ భూముల నుంచి రూ. 530 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ కార్పొరేషన్ డిమాండ్ నోటీసు జారీ చేయడంపై ఢిల్లీ అభివృద్ధి అథారిటీ(డీడీఏ) హైకోర్టును ఆశ్రయించింది. యూనియన్ ప్రభుత్వానికి చెందిన నజుల్ భూములను వివిధ అభివృద్ధి పనుల కోసం అప్పగిస్తారని పిటిషన్లో పేర్కొంది. దీనిపై జస్టిస్ బీడీ అహ్మద్, సిద్ధార్థ మ్రిదుల్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. న్యాయవాది గిరిరాజు సుబ్రమణ్యం ద్వారా డీడీఏ హైకోర్టుకు పిటిషన్‌ను దాఖలు చేసింది. వివిధ ప్రాంతాల్లో అభివృద్ధికి అప్పగించిన నజుల్ భూములపై రూ. 530 కోట్ల ఆస్తిపన్ను చెల్లించాలని అక్టోబర్ 20 వ తేదీన డీడీఏకు డిమాండ్ నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు. యూనియన్‌కు చెందిన నజుల్ భూములకు డీడీఏ రక్షణకు మాత్రమే పరిమితమని, యాజమాన్యహక్కులేవీ బదిలీ కాలేదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 285 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఆస్తిపన్నులో నజల్ భూములకు మినహాయింపు ఉందని, భారత ప్రభుత్వానికి చెందిన నజల్ భూములకు డీడీఏ ఏజెంట్ మాత్రమేనని తెలిపారు. రాజ్యాంగంలోని 285 ఆర్టికల్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ విధించే ఆస్తిపన్నులో మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్డీఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు జారీ చేసిన డిమాండ్ నోటీసు ఏకపక్షంగా ఉన్నదని, దీనిపై తాత్కాలికంగా నిషేధించాలిన డీడీఏ న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు. నజల్ భూములకు డీడీఏనే యజమాని అని మున్సిపల్ కార్పొరేషన్ దురభిప్రాయానికి వచ్చి డిమాండ్ నోటీసును జారీ చేసినట్లు డీడీఏ పిటిషన్లో పేర్కొన్నారు. -
ఒకటే ఎంసీడీ..
న్యూఢిల్లీ:కేవలం అహం కారణంగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంసీడీని మూడు కార్పొరేషన్లుగా విభజించారని, దీనిని రద్దు చేయాలని ఢిల్లీ బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనను పంపించాలని బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్లు భావిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ బుధవారం నిర్వహించే సమావేశంలో ఈ అంశంపై చర్చ నడిచే అవకాశముంది. ఎంసీడీ విభజన తరువాత నిధుల లేమి వల్ల కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టునూ చేపట్టలేకపోతున్నామని మేయర్లు అంటున్నారు. అందుకే విభజన రద్దుకు పోరాటం చేస్తామని చెబుతున్నారు. ‘టోల్‌ట్యాక్స్ వసూలు, ఈ-గవర్నెన్స్ వంటి విభాగాలు ఇప్పటికీ ఒకటిగానే ఉన్నాయి. ఎంసీడీని ఏకం చేయడంపై ప్రజల అభిప్రాయాలు కోరి తుది నిర్ణయం తీసుకోవాలి. విభజన వల్ల ఢిల్లీవాసులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు’ అని దక్షిణఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభా నాయకుడు సుభాష్ ఆర్య అన్నారు. ఎంసీడీని విడగొట్టడం వల్ల ఈ-గ వర్నెన్స్ పాలన ప్రాజెక్టు ఇప్పటికీ ప్రారంభం కాలేదని బీజేపీ నాయకులు అంటున్నారు. ‘ప్రతి దానికీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంతకుముందున్న ఎంసీడీ ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా నిధుల కొరత వల్ల పూర్తి కాలేదు’ అని ఉత్తరఢిల్లీ మేయర్ యోగేందర్ చందోలియా అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) విభజనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించినా షీలా దీక్షిత్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. ఢిల్లీ అభివృద్ధికి ఒకే మున్సిపల్ కార్పొరేషన్ ఉండడం మేలన్నది తన నిశ్చితాభిప్రాయమని చందోలియా స్పష్టీకరించారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి మేయర్లకు సర్వాధికారాలు ఉంటాయన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే తాను ఈ విషయంపై చర్చిస్తానన్నారు. ‘ఎంసీడీ విభజన గురించి మా పార్టీ మేనిఫెస్టోలోనూ ఉంది. కానీ అది పార్టీ నిర్ణయం కాబట్టి దానిని అనుసరించాల్సిందే. విభజనను రద్దు చేయాలని నా తరఫున పోరాడుతాను. విభజన వల్ల ఎంసీడీ ఉద్యోగులు కూడా చాలా నష్టపోయారు. చాలా ప్రాజెక్టులకు ఏకీకృత ఎంసీడీ సమయంలో ఆమోదం లభించింది. సంస్థ విడిపోయిన తరువాత ప్రాజెక్టుల్లో ఏర్పడిన సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు హర్దయాళ్ గ్రంథాలయం పాత ఢిల్లీలోని చాందినీచౌక్‌లో ఉంటుంది. దాని శాఖలు ఎంసీడీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. దీనివల్ల నిధుల కేటాయింపుల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా మంది ఉద్యోగులకు పింఛన్లు సరిగ్గా అందడం లేదు. విభజన లేకుంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయి ఉండేది కాదు’ అని చందోలియా అన్నారు. ఈయనకు ముందు మేయర్‌గా వ్యవహరించిన బీజేపీ నాయకుడు ఆజాద్‌సింగ్ స్పందిస్తూ బీజేపీ విజయం ఎంసీడీకి శుభసూచకమని అభిప్రాయపడ్డారు. యూపీయే ప్రభుత్వం ఎంసీడీపై సవతి తల్లి ప్రేమచూపిందని ఆరోపించారు. అప్పటి నాయకుల వల్ల నిల్చిపోయిన పనులన్నీ త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ‘ఇంతకుముందే మేం ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. ఇప్పుడైతే మేం హోంశాఖను కూడా సంప్రదించవచ్చు. ఎంసీడీ విభజన రద్దుకు సిఫార్సు చేయవచ్చు’ అని అన్నారు. విభజన రద్దే మేలు : మీనాక్షి జాతీయ రాజధానిగా ఏకీకృత మున్సిపల్ కార్పొరేషన్ ఉండడమే మేలని పశ్చిమఢిల్లీ మేయర్ మీనాక్షి అన్నారు. ఈ విషయంలో తాను చందోలియాతో ఏకీభవిస్తానని తెలిపారు. విభజన వల్ల సమస్యలు మూడురెట్లు పెరిగాయని ఆమె విమర్శించారు. ఒకే నగరానికి మూడు విధానాలు ఎలా అమలు చేస్తామని ప్రశ్నించారు. విభజన వల్ల నిధులు లేక పశ్చిమఢిల్లీ కార్పొరేషన్ చాలా ఇబ్బందులు పడుతున్నదని తెలిపారు. ఇంటి పన్ను వసూళ్లలో ఇతర కార్పొరేషన్ల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు. ఎంసీడీ విభజన ఏకపక్షంగా జరిగిందని, దీనిని రద్దు చేయాలని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఏర్పడే ప్రభుత్వాన్ని కోరతామని ఆమె ఈ సందర్భంగా అన్నారు. -
ట్రేడ్ లెసైన్సు జారీ ఇంకా సరళతరం
న్యూఢిల్లీ: ట్రేడ్ లెసైన్సు జారీ ప్రక్రియ ఇకపై ఇంకా సరళతరం కానుంది. బీజేపీ నేతృత్వంలోని నగరపాలక సంస్థలు బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. వ్యాపారులు అఫిడవిట్ సమర్పి స్తే వెంటనే వారికి లెసైన్సును జారీచేస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వెల్లడిం చారు. ఎంసీడీలోని పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అవసరమైన సేవలను వారి ముంగిట్లోనే అందిస్తే బాగుంటుందన్నా రు. ఇన్స్పెక్టర్ రాజ్, లెసైన్స్ రాజ్‌లకు ఇకనైనా తెరదించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు సం బంధించిన అన్ని అంశాల విషయంలో సత్వరమే తగు చర్యలు తీసుకునేందుకు అవసరమైన మార్గాలను నగరపాలక సంస్థలు అన్వేషిస్తాయన్నారు. ఎంసీడీల్లో పారదర్శకత కోసం కృషి చేస్తామన్నారు.