ట్రేడ్ లెసైన్సు జారీ ఇంకా సరళతరం
Published Wed, Jan 15 2014 11:20 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ట్రేడ్ లెసైన్సు జారీ ప్రక్రియ ఇకపై ఇంకా సరళతరం కానుంది. బీజేపీ నేతృత్వంలోని నగరపాలక సంస్థలు బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. వ్యాపారులు అఫిడవిట్ సమర్పి స్తే వెంటనే వారికి లెసైన్సును జారీచేస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వెల్లడిం చారు. ఎంసీడీలోని పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అవసరమైన సేవలను వారి ముంగిట్లోనే అందిస్తే బాగుంటుందన్నా రు. ఇన్‌స్పెక్టర్ రాజ్, లెసైన్స్ రాజ్‌లకు ఇకనైనా తెరదించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు సం బంధించిన అన్ని అంశాల విషయంలో సత్వరమే తగు చర్యలు తీసుకునేందుకు అవసరమైన మార్గాలను నగరపాలక సంస్థలు అన్వేషిస్తాయన్నారు. ఎంసీడీల్లో పారదర్శకత కోసం కృషి చేస్తామన్నారు.
Advertisement