vijay goel
-
11 నుంచి పార్లమెంటు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సిఫార్సు చేసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయెల్ చెప్పారు. డిసెంబర్ 11 నుంచి 2019, జనవరి 8 వరకు పార్లమెంటు సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేరళ, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా సమావేశాల మధ్యలో వారం రోజుల విరామం ఇస్తామన్నారు. మొత్తంమీద 20 రోజుల పాటు పార్లమెంటు జరుగుతుందన్నారు. ఈ సమావేశాలు ఫలప్రదమయ్యేందుకు వీలుగా సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలను కోరుతున్నామన్నారు. కాగా, ఈ శీతాకాల సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. అలాగే భారత వైద్య మండలి సవరణ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లు ఆర్డినెన్సులను ఆమోదింపజేసుకోవాలన్న కృతనిశ్చయంతో మోదీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్ 11నే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటం గమనార్హం. -
‘ఆయనలాంటి స్నేహితులు బీజేపీకి అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేస్తోందని వార్తలు ప్రచారం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆప్ అసంతృప్త ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రాను ఉద్దేశించి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘కపిల్ మిశ్రా వంటి స్నేహితుడి అవసరం బీజేపీకి ఉంది. ఆయన కోసం బీజేపీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకునే ఉంటాయని’ గోయల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా..‘ఆప్ నేతలతో విభేదాలు వచ్చినప్పటి నుంచి మేము ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాం. అయితే బీజేపీలో చేరాలా వద్దా అన్నదానిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని’ గోయల్ పేర్కొన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మే 30న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించిన ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్ధతు కోరే కార్యక్రమం)లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న గోయల్.. కపిల్ మిశ్రాపై ప్రశంసలు కురిపించారు. ‘పాజిటివ్ ఆటిట్యూడ్‌కు కపిల్ మిశ్రా ఒక ప్రతీక లాంటివారు. సామాజిక సేవ పట్ల ఆయనకున్న అంకిత భావం అమోఘం’ అంటూ గోయల్ ప్రశంసించారు. కాగా తూర్పు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన కపిల్ మిశ్రా తల్లి అన్నపూర్ణ మిశ్రా బీజేపీ సీనియర్ నేతగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. కారావాల్ నగర్ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా గత కొంత కాలంగా ఆప్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మిశ్రా పలుమార్లు విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
'భవిష్యత్ మన మహిళా క్రికెట్‌దే'
న్యూఢిల్లీ:భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్ అద్భుతాల్ని సాధించడం ఖాయమంటున్నారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్. మహిళల వన్డే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన భారత్ ను మంత్రి గోయల్ అభినందించారు. మహిళా భారత క్రికెట్ జట్టు కొత్త ఎత్తుల్ని అధిరోహించే సమయం ఎంతో దూరంలో లేదని గోయల్ పేర్కొన్నారు. 'వన్డే వరల్డ్ కప్ లో భారతమాత కూతుళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఫైనల్లో ఓడినా యావత్ భారతావని హృదయాలను వారు గెలుచుకున్నారు. మన మహిళలు తుదిపోరుకు చేరిన క్రమం అద్వితీయం. తుదిపోరులో పోరాడి ఓడారు.. అయినా అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇది భారత మహిళా క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తుంది. మన మహిళలకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం' అని గోయల్ పేర్కొన్నారు. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన వరల్డ్ కప్ టైటిల్ పోరులో భారత మహిళలు 9 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. -
పతకం గెలిచేందుకు మంచి అవకాశం
♦ ప్రపంచ చాంపియన్‌షిప్‌పై శ్రీకాంత్ ♦ గురుశిష్యుల్ని సత్కరించిన క్రీడల మంత్రి గోయెల్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచేందుకు భారత షట్లర్లకు మంచి అవకాశాలున్నాయని కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. గ్లాస్గోలో జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్ అర్హత సాధించారు. స్కాట్లాండ్లో ఆగస్టు 21 నుంచి 27 వరకు ఈ చాంపియన్‌షిప్ జరగనుంది. ఇండోనేసియా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్, కోచ్ గోపీచంద్‌లను కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ శనివారం తన నివాసంలో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గ్యారంటీ అని చెప్పను. కానీ భారత ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. మ్యాచ్ జరిగే రోజు 100 శాతం రాణిస్తే గెలుపు మాత్రం మనదే. అప్పుడు పతకాన్నీ ఆశించవచ్చు’ అని అన్నాడు. మంత్రి గోయెల్ మాట్లాడుతూ... ‘శ్రీకాంత్ జాతి గర్వించే విజయాలు సాధించాడు. కోచ్ గోపీచంద్ దేశం గర్వపడే క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వీళ్లతో పాటు ప్రతిభ గల ఆటగాళ్లకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. వాళ్లకు 24 గంటలు మా శాఖ అందుబాటులో ఉంటుంది’ అని అన్నారు. ‘సాయ్’, క్రీడాశాఖ తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని గోపీచంద్ పేర్కొన్నారు. -
పీసీబీతో బీసీసీఐ భేటీ అనవసరం
కేంద్ర క్రీడలమంత్రి విజయ్ గోయెల్ న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో భవిష్యత్‌లో బీసీసీఐ సమావేశం కావాల్సిన అవసరం లేదని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ అన్నారు. ‘ద్వైపాక్షిక సిరీస్‌లకు ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. దీనిపై కేంద్రం వైఖరి స్పష్టమైంది. సరిహద్దు వెంట ఉగ్రవాద కార్యకలాపాలు ఆగితేనే ఆటలని తేల్చిచెప్పింది. ఇలాంటి నేపథ్యంలో ఇరు బోర్డులు సమావేశం కావాల్సిన అవసరం ఏముంది’ అని గోయెల్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లాను ఆయన నివాసంలో కలుసుకున్న గోయెల్ ఫుట్‌బాల్ ఫీల్డ్ కోసం ఇప్పటికే రూ.4.5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. -
బీసీసీఐకి విజయ్ గోయల్ హెచ్చరిక!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తరువాతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ద్వైపాక్షిక సిరీస్ గురించి చర్చించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ను క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ తో క్రికెట్ జరగడం అనేది చాలా కష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి భారత్ ఎటువంటి విముఖత వ్యక్తం చేయడం లేదని బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి గోయల్ స్పందించారు. ఒకవేళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చర్చలు జరిపే ఉద్దేశం ఉంటే ముందుగా కేంద్రం అనుమతి తీసుకోవాలని గోయల్ వార్నింగ్ ఇచ్చారు. 'పాకిస్తాన్ తో సిరీస్ కు సంబంధించి బీసీసీఐ ఎటువంటి ముందడుగు వేయాలనుకున్నా గవర్నమెంట్ తో మాట్లాడటం మంచిది. పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ అనేది ఇప్పట్లో చాలా కష్టం. ఉగ్రవాదం-క్రికెట్ అనేవి ఒకే తాటిపై పయనించలేవు కదా. కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నది పాకిస్తానే. మరొకవైపు భారత సరిహద్దుల్లో కూడా పాక్ ఉగ్రవాద దాడులకు పాల్పడుతుంది. ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ జరిగే ప్రసక్తే ఉండదు'అని విజయ్ గోయల్ పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకూ వారితో ఎటువంటి క్రీడాసంబంధాలు ఉండవని ఆయన మరోసారి తెగేసి చెప్పారు. దాంతో చాంపియన్స్ ట్రోఫీలో పాక్ తో .చర్చలు జరపాలనుకున్న బీసీసీఐకి ఆదిలోనే చుక్కెదురైనట్లయ్యింది. -
'వారికి ప్రొ కబడ్డీ ఆహ్వానం లేదు'
కరాచీ: ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఊతమిచ్చినంత కాలం ఆ దేశంతో క్రీడా సంబంధాలు ఉండవని భారత క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ మరొకసారి స్పష్టం చేశారు. వచ్చే నెల్లో భారత్ లో ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ఆటగాళ్లను ఎంపిక చేసిన క్రమంలో వారికి ఎటువంటి ఆహ్వానం లేదని కుండబద్దలు కొట్టారు. ' ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ దాన్ని ఆపేంత వరకూ వారితో క్రీడా సంబంధాలు సాగించే ప్రసక్తే లేదు. దానిలో భాగంగానే జూన్ 25 నుంచి ఆరంభమయ్యే ప్రొ కబడ్డీకి సైతం పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎటువంటి ఆహ్వానం లేదు. ఒకవేళ ఎంపిక చేసిన పాక్ ఆటగాళ్లు ఇక్కడకు వచ్చినా ఆడే అవకాశం ఉండదు. పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రొ కబడ్డీ లీగ్ లో ఆడాలంటే భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ తో క్రీడా సంబంధాలు సాధ్యం కావు'అని గోయల్ తెలిపారు. -
'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్'
డబుల్ బెడ్రూమ్ పథకం భేష్: విజయ్ గోయల్ సిద్దిపేట: తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ పథకం అందరికీ ఆదర్శంగా ఉందని, పేదలకు ఉపయోగపడే చక్కని పథకాన్ని అమలుచేస్తున్న సర్కార్‌ను అభినందిస్తున్నట్లు కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చెప్పారు. కేంద్ర మంత్రి గోయల్ మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో పర్యటించారు. కేంద్ర మంత్రికి ఎర్రవల్లి సర్పంచ్ ఘన స్వాగతం పలికారు. మర్కుర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చక్కగా ఉన్నాయని, ఈ పథకం దేశానికే ఆదర్శంగా ఉందని గోయల్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. ఈ పథకంపై ప్రధాని మోదీతో చర్చించి దేశ వ్యాప్తంగా అమలయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినందుకు సీఎం కేసీఆర్ కు విజయ్ గోయల్ కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాద్‌లో ప్రాంతీయ క్రీడల కేంద్రం
కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రాంతీ య క్రీడల కేంద్రం (రీజినల్ స్పోర్ట్స్ సెంట ర్) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే పనులు చకచకా పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ క్రీడల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధమని ఈ సందర్భంగా మంత్రిని కేసీఆర్ కోరారు. సానుకూలంగా స్పందించిన గోయల్.. క్రీడల కేంద్రం ఏర్పా టుకు హామీ ఇచ్చారు. వరంగల్, లక్న వరంను మంగళవారం సందర్శిస్తానని చెప్పారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా పరిశీలిస్తానని తెలిపారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘శక్తిమాన్’ 35వ ఆలిండియా పోలీస్ ఎక్వెస్ట్రెస్ చాంపి యన్ షిప్ పోటీలను సోమవారం గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. శాంతి భద్రతల పరిరక్షణలో అశ్వక దళాల పాత్ర కీలకమని.. రామాయణం, మహాభారత కాలం నుంచే వాటి పాత్ర ఎనలేనిదన్నారు. అకాడమీ డైరెక్టర్ బహు గుణ మాట్లాడుతూ.. ‘శక్తిమాన్’ పోటీల్లో 18 బృందాలు, 460 మంది రైడర్లు, 290 గుర్రాలు పాల్గొంటున్నాయని తెలిపారు. -
బీసీసీఐ వ్యవహారంతో సంబంధం లేదు
హైదరాబాద్: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వ్యవహారంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ అన్నారు. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను తొలగిస్తూ సోమవారం సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించడం సరికాదని అభిప్రాయపడ్డారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ఆలిండియా పోలీస్ ఎక్విస్ట్రెయిన్ చాంపియన్ షిప్, మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్‌ను ఆయన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా క్రీడా సంఘాలను గాడిలో పెట్టేందుకు వాటి పనితీరుపై ఓ కమిటీ వేశామని మంత్రి తెలిపారు. ఆ కమిటీ తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని చెప్పారు. నేషనల్ పోలీస్ అకాడమీకి చీఫ్ గెస్ట్‌గా రావడం సంతోషంగా ఉందని అన్నారు. నిర్మించడం కంటే నిర్వహణ ముఖ్యమని మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పేవారని, మంచి నిర్వహణకు నేషనల్ పోలీస్ అకాడమీ ఉదాహరణగా నిలుస్తుందని ప్రశంసించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని చాలా మంది కలలు కంటారని, కొంతమంది మాత్రమే ఆ గమ్యాన్ని చేరుకుంటారని విజయ్ గోయల్ అన్నారు. -
పారాలింపిక్స్ విజేతలకు పద్మ అవార్డులు!
న్యూఢిల్లీ: రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్ల పేర్లను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల కోసం ప్రతిపాదించనున్నారు. ‘పారాలింపిక్స్ విజేతలను మేం గౌరవించదలుచుకున్నాం. అందుకే పద్మ పురస్కారాల కోసం వారి పేర్లను హోం మంత్రిత్వ శాఖకు పంపించనున్నాం’ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ పేర్కొన్నారు. ఈ పోటీల్లో తంగవేలు, దేవేంద్రలకు స్వర్ణాలు, దీపా మలిక్ రజతం, వరుణ్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. -
స్వదేశానికి తంగం
పీఎం అభినందనలు అమ్మకు కృతజ్ఞతలు రియో పారాలింపిక్స్‌లో మెరిసిన తమిళ తంగం(బంగారం) గురువారం స్వదేశంలో అడుగు పెట్టాడు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అభినందనలు అందుకున్న తంగం తమిళనాడులోకి అడుగు పెట్టనున్నాడు. సాక్షి, చెన్నై :రియో పారాలింపిక్స్ హైజంప్ విభాగంలో మారియప్పన్ తంగ వేలు బంగారం కైవశం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమాచారం తమిళనాట ఆనందోత్సాల్ని నింపాయి. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని పెరియవడగం పట్టి గ్రామంలో పేదరిక కుటుంబంలో జన్మించిన మారియప్పన్ ప్రస్తుతం తమిళనాట రియల్ హీరోగా, తంగ మారిగా అవతరించి ఉన్నాడు. తమిళనాడుకు , స్వస్థలానికి గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ తంగమారిని ఘనంగా ఆహ్వానించేందుకు సేలం పెరియవడగం పట్టిలో ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఎప్పుడెప్పుడు తమ వాడు స్వస్థలానికి వస్తాడో అన్న ఎదురు చూపుల్లో అక్కడి యువత ఉన్నారు. ఆ మేరకు గురువారం ఉదయం రియో నుంచి స్వదేశంలోకి ఈ తంగం అడుగు పెట్టాడు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ నేతృత్వంలో ఘన స్వాగతమే లభించింది. రియోలో పతకాలు సాధించిన ఇతర క్రీడా కారులతో కలిసి ఢిల్లీలో ప్రస్తుతం మారియప్పన్ ఉన్నాడు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అభినందనలు అందుకున్నాడు. ఈసందర్భంగా తమిళ మీడియాతో మారియప్పన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి , సీఎం జయలలితకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అమ్మ జయలలిత క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నారని, ఆమె సహకారం మరువలేనిదని వ్యాఖ్యానించాడు. తాను బంగారం సాధించడం కోచ్‌కు మహదానందంగా ఉందని, ఆయన ఇచ్చిన శిక్షణతో మున్ముందు మరిన్ని పతకాల సాధన, 2020లో జపాన్ టోకియలో జరిగే ఒలింపిక్స్‌లో బంగారం లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. ఇక, మారియప్పన్ స్వస్థలానికి ఎప్పుడు వస్తాడన్న సమాచారం సక్రమంగా అందక, అక్కడి వారు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉండొచ్చని లేదా, బెంగళూరులో ఓ రోజు ఉండి శనివారం రావొచ్చంటూ పెరియవడగం పట్టి యువత ఎదురు చూపుల్లో ఉన్నారు. కాగా, మారియప్పన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన కేంద్ర మంత్రి విజయ్ గోయల్ తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందించారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా సీఎం జయలలిత తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఇలాంటి ప్రోత్సాహంతో మరెందరో క్రీడాకారులు తమ ప్రతిభను చాటగలరని పేర్కొన్నారు. -
గోపీ అకాడమీలు అద్భుతం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలు అద్భుతమని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ కితాబిచ్చారు. శనివారం ఆయన గోపీచంద్‌కు చెందిన రెండు బ్యాడ్మింటన్ అకాడమీలను సందర్శించారు. అక్కడి కోర్టులు, ఆటగాళ్లకు ఏర్పాటు చేసిన సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన బ్యాడ్మింటన్ నేర్చుకునేందుకు ఈ అకాడమీలు చక్కని వేదికలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అకాడమీలను తీర్చిదిద్దిన గోపీచంద్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలాంటి అకాడమీలు మరిన్ని ఉంటే భారత క్రీడల ముఖచిత్రమే మారుతుందని అభినందించారు. ‘20 మంది గోపీలాంటివారుంటే మరెంతో మంది సింధులొస్తారు. దేశ క్రీడారంగం అభివృద్ధికి ఈ అకాడమీలు ఎంతగానో దోహదం చేస్తాయి’ అని మంత్రి గోయెల్ అన్నారు. అకాడమీలను సమర్థంగా నిర్వహిస్తున్న గోపీచంద్ భార్య లక్ష్మి, తల్లి సుబ్బరావమ్మలను ఆయన అభినందించారు. అనంతరం తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల సంఘం (టీఎస్‌జేఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ గోయెల్... గోపీచంద్‌ను ఘనంగా సన్మానించారు. తర్వాత టీఎస్‌జేఏ ప్రతినిధులు రాజీవ్ ఖేల్ రత్నా అవార్డీ పి.వి.సింధు, ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్‌లను సత్కరించారు. -
పారా అథ్లెట్లకూ ‘ఖేల్ రత్న’
• వచ్చే ఏడాది నుంచి అమలు • కేంద్ర క్రీడల మంత్రి వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశ అత్యున్నత క్రీడాపురస్కారమైన ‘రాజీవ్ ఖేల్త్న్ర’ అవార్డును ఇకపై పారాఅథ్లెట్లకూ అందజేస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ వెల్లడించారు. నగరంలోని గోపీచంద్ అకాడమీకి విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఈ అవార్డు కోసం పారాలింపియన్ల పేర్లను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రియో ఒలింపిక్స్‌పై సమీక్ష జరిపారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘కేంద్రం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగా త్వరలోనే కొత్త మార్గదర్శనంతో క్రీడలను ముందుకు తీసుకెళతాం. దీనిపై శ్రద్దపెట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని మంత్రి గోయెల్ అన్నారు. రియో ఒలింపిక్స్ ముగియగానే భారత క్రీడలపై లోతైన అధ్యయనం అవసరమని భావించినట్లు ఆయన చెప్పారు. -
మన మంత్రిగారే అసలైన గోల్డ్ మెడలిస్ట్..
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ముగిసి మన క్రీడాకారులు రెండు పతకాలతో స్వదేశం చేరినా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ మాత్రం వారు సాధించిన ఘనతలను గుర్తు పెట్టుకోవడంలో తడబాటును కొనసాగిస్తూనే ఉన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకం, మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాలు సాధిస్తే.. వారు రియో గోల్డ్ మెడలిస్ట్లు అంటూ విజయ్ గోయల్ ట్వీట్ చేయడంపై నెటిజన్లు జోకుల వర్షం కురిపిస్తున్నారు. వీవీ సింధూ, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిసే క్రమంలో వారు రియో గోల్డ్ మెడలిస్ట్లు అంటూ విజయ్ గోయల్ ట్వీట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఆ పతకాల కోసం విజయ్ గోయల్‌ను రియోకు పంపుదామా?అంటూ ఒకరు విమర్శించగా, ఆ మంత్రి గారే అసలు సిసలైన గోల్డ్ మెడలిస్ట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. కామెడీ షోలో కపిల్ శర్మకు విజయ్ గోయల్ సరైన పోటీ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. మరోవైపు మహిళా జిమ్నాస్ దీపా కర్మాకర్ పేరును కూడా విజయ్ గోయల్ తప్పుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. దీపా కర్మాకర్‌ను 'దీపా కర్మనాకర్'అంటూ సంబోధించడం, అథ్లెట్లు ద్యుతీ చంద్ ఫోటోకు బదులు మరొ అథ్లెట్ స్రబాణి నందా ఫోటోను పోస్ట్ చేయడంలో విజయ్ గోయల్ ఇబ్బంది పడ్డారు. అయితే విజయ్ గోయల్ మాత్రం తన తప్పును సరిదిద్దుకునే క్రమంలో వివరణ ఇచ్చారు. 'ఒక్కోసారి నాలుక తడబడి పొరపాట్లు జరగడం సాధారణం దీన్ని ప్రజలు ఏదో పెద్ద విషయంగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలుసు. వచ్చే ఒలింపిక్స్‌లో వారు స్వర్ణ పతకాలు సాధిస్తారేమో' అని విజయ్ గోయల్ పేర్కొనడం కొసమెరుపు. Mr. Vijay Goel, is this sleeping or slipping!! https://t.co/0bG0l9kF0B — Biswatosh Sinha (@biswatosh) 28 August 2016 Vijay Goel is the real gold medalist Vijay Goel will give strong competition to Kapil Sharma in hosting a comedy show. #welcometocomedynightswithvijaygoel — Nick Turrim (@mhanthung) 28 August 2016 -
సింధు, సాక్షి.. గోల్డ్ మెడళ్లు సాధించారా?
-
ఆ విషయంలో వేరే ఆప్షనే లేదు : కేంద్ర మంత్రి
ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆటగాళ్ల స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేది లేదని క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టంచేశారు. యాంటీ డోపింగ్ ప్యానెల్ నిషేధించిన ఆటగాళ్ల స్థానంలో వేరొకరికి చాన్స్ ఇవ్వడం లాంటివి ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. రియోకు అర్హత సాధించిన ఓ ప్లేయర్ ఎవరైనా డోపింగ్ టెస్టులో విఫలమైతే ఈ విషయంలో వేరే ఆప్షన్ ఉండదని మంత్రి గోయల్ పేర్కొన్నారు. ఒకవేళ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్లేయర్ తీవ్ర అస్వస్థతకు లోనైన ప్రత్యేక సందర్భాలలో మాత్రమే రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తారని చెప్పారు. ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని ఇతర ఆటగాడిని రియోకు పంపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలపారు. మరోవైపు నర్సింగ్ యాదవ్ స్థానంలో పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్ నుంచి ప్రవీణ్ రాణా బరిలోకి దిగనున్నాడని ప్రచారంలో ఉంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఈ విషయంపై సమాచారం అందించింది. -
బాధ్యతలు తీసుకున్న గోయెల్
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా విజయ్ గోయెల్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గోయెల్‌కు క్రీడా మంత్రిత్వశాఖను కేటాయించారు. ఈయన వాజ్‌పేయి హయాంలోనూ క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. రియోలో భారతీయ భోజనం భారత ఆటగాళ్ల కోరిక మేరకు రియోలో అథ్లెట్లందరికీ భారతీయ వంటకాలను అందిస్తారని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘రియో గేమ్స్ అధికారిక ఫుడ్ మెనూలో భారతీయ వంటకాలను భాగం చేసినట్లు రియో ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ నుంచి స్పష్టత వచ్చింది. ఈ మెగా ఈవెంట్ పూర్తయ్యేవరకు క్రీడా గ్రామంలో భారతీయ భోజనం అందుబాటులో ఉంటుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ యాదవ్ స్పష్టం చేశారు. -
బీజేపీ ఎంపీకి జరిమానా
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న సరి-బేసి ట్రాఫిక్ నిబంధనను బీజేపీ ఎంపీ విజయ్ గోయెల్ ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించారు. ట్రాఫిక్ పోలీసులు ఆయనకు 2 వేల రూపాయల జరిమానాను విధించారు. ఆప్ సర్కార్ రాజకీయ ఎత్తుగడకు నిరసనగా సరి-బేసి నిబంధనను ఉల్లంఘిస్తానని సోమవారం ఉదయం విజయ్ గోయెల్ చెప్పారు. ఢిల్లీ రవాణ శాఖ మంత్రి గోపాల్ రాయ్.. ఆయనకు రోజా పూలు ఇచ్చి నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరినా మెత్తబడలేదు. సరి-బేసి నిబంధనకు తాను వ్యతిరేకంగా కాదని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనం కోసం అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకమని గోయెల్ స్పష్టం చేశారు. సరి-బేసి నిబంధన ఉల్లంఘించినవారికి వేసే 2 వేల జరిమానా చాలా ఎక్కువని, దీన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. -
సీఎం.. ప్రకటనల పులి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనల పులిగా మారిపోయారని బీజేపీ విమర్శించింది. ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అలవికాని హామీలు ఇవ్వడం.. వాటిని నెరవేర్చలేకపోవడం.. కేజ్రీవాల్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్ల తర్వాత కూడా అనధికార కాలనీల గురించి, రేషన్ కార్డులు, అవినీతిపై ఆయన ఎందుకు మాట్లాడటంలేదని విమర్శించారు. ఆప్ ప్రభుత్వం ప్రకటనలు చేయడంపై చూపుతున్న శ్రద్ధ.. వాటి అమలుపై చూపడంలేదన్నారు. కొత్త పథకాలను ప్రకటించడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేర్రూ.వాల్ యత్నిస్తున్నారని గోయల్ విమర్శించారు. న గరవాసులు ఆప్ సర్కార్ పాలనపై సంతృప్తిగా ఉన్నారా.. అనే అంశంపై రాష్ట్ర పార్టీ సర్వే నిర్వహించనుందని చెప్పారు. జన్‌లోక్‌పాల్‌పై ఆయన మాట్లాడుతూ అది రాజ్యాంగబద్ధమా..కాదా అనే విషయం తమ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. అది రాజ్యాంగబద్ధం కాకపోతే బీజేపీ మద్దతు ఇవ్వడం కష్టమేనని తేల్చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు జన్‌లోక్‌పాల్ బిల్లుపై సీఎం కేర్రూ.వాల్ రాసిన లేఖలో వాడిన భాష ఆక్షేపణీయమని గోయల్ అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. వారికి ఎల్జీ తీరుపై ఏమైనా అనుమానాలుంటే రాష్ట్రపతిని కలిసి విన్నవించుకోవాలే తప్ప అటువంటి ప్రకటనలు చేయడం తగదన్నారు. ‘మీరు రాజ్యాంగాన్ని గౌరవించకపోతే.. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం మానేస్తారు..’ అని ఆప్ నాయకులను గోయల్ హెచ్చరించారు. అనుమతితో పనేలేదు నగరంలో చిన్న చిన్న స్థలాలు కలిగిన యజమానులకు శుభవార్త. 100 చదరపు మీటర్ల స్థలం కలిగిన వారు నిర్మాణ పనులను చేపట్టేందుకు ఇక పై ఆయా కార్పొరేషన్లనుంచి అనుమతి పొందరనవసరమే లేదు. బీజేపీ నేతృత్వంలోని నగరపాలక సంస్థలు శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ టికెట్‌పై గెలుపొం దిన మూడు కార్పొరేషన్లకు చెందిన కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొని పైవిధం గా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను పాటిస్తామంటూ సంబంధిత అధికారులకు ఓ అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుందన్నారు. ఆ తర్వాత వారికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావన్నారు. 40 లక్షలమంది నివసించే అనధికార కాలనీల్లో కౌన్సిలర్లు తమ నిధులను వెచ్చించేందుకు అనుమతించకపోవడంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఈ కాలనీల్లో కౌన్సిలర్లు తమ నిధులను వెచ్చించేం దు కు అనుమతించకుండా అభివృద్ధిని ఢిల్లీ ప్రభుత్వం అడ్డుకోవడంపైనా వారంతా చర్చించారన్నారు. అనధికార కాలనీల్లో కౌన్సిలర్లు నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుమతించకపోతే హైకోర్టు ఎదుట ధర్నాకు దిగుతామని ఆయనహెచ్చరించారు. ఈ అంశాన్ని ఎల్రూ. దృష్టికి తీసుకెళతామన్నారు. అనధికార కాలనీల్లో పారిశుధ్య పనులను పర్యవేక్షించేందుకుగాను తమ పార్టీ కార్యాలయంలో త్వరలో ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కాలనీల్లో పారిశుధ్యానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కార్పొరేటర్లకు ఆయన సూచించారు. ఎన్డీఎంసీ, ఎస్డీఎంసీ, ఈడీఎంసీల ఏకీకరణకు సంబంధించి ఎమ్మెల్యే నంద్ కిషోర్గార్గ్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశామని, సదరు కమిటీ తమకు సలహాలు, సూచనలు ఇస్తుందన్నామన్నారు. ‘ఏక్ నోట్-కమల్ పర్ ఓట్’ పేరిట కార్పొరేటర్లు తమ తమ పరిధిలోని అన్ని ఇళ్లకూ వెళ్లి యజమానులను కలుస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేయాలని వారంతా ఈ సందర్భంగా కోరతారన్నారు. -
బీజేపీ ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును అడ్డుకోలేకపోయినందుకు నిరసనగా ఢిల్లీ బీజేపీ శనివారం ప్రదర్శన నిర్వహించింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో దేనినీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేకపోయిందని విమర్శించింది. ఈ నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ధరల పెరుగుదలను నియంత్రిస్తామని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించిందని, కరెంటు చార్జీలు తగ్గడానికి బదులు ఎనమిది శాతం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిచార్జీలు సైతం పది శాతం పెరిగాయని విజయ్‌గోయల్ అన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా, పది గంటలు విద్యుత్ కోతలు విధిస్తామని హెచ్చరించాయని ఆయన చెప్పారు. ఆప్ సర్కారు విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా, విద్యుత్ కోతలను కూడా ఆపలేకపోయిందని ఈ సీనియర్ నేత మండిపడ్డారు. డిస్కమ్‌ల ఆడిటింగ్‌ను కొనసాగిస్తూనే, సరఫరా సంబంధిత సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం డిస్కమ్‌లతో చర్చలు జరపాలని విజయ్ గోయల్ అన్నారు. నీరు, విద్యుత్ ప్రజలకు అందించడంలో విఫలమైన సర్కారు తక్షణం గద్దెదిగాలని బీజేపీ నేత హర్షవర్ధన్ అన్నారు. -
37 మంది ఏకగ్రీవం.. రాజ్యసభకు పవార్, దిగ్విజయ్, వోరా
రాజ్యసభకు పవార్, దిగ్విజయ్, వోరా న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి 37 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన వారి పేర్లను ప్రకటించారు. వీరిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్, కేంద్ర మంత్రి శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, దిగ్విజయ్ సింగ్, మురళీ దేవ్రా, కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) నేత రాందాస్ అథవాలే తదితరులు ఉన్నారు. అథవాలేకు బీజేపీ మద్దతిచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న పవార్ మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ బీజేపీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయెల్ రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. పదేళ్లుగా పోటీ రాజకీయాలకు దూరంగా ఉన్న దిగ్విజయ్ మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. రాజ్యసభలో భర్తీ చేయాల్సిన మిగిలిన 18 స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 6, పశ్చిమ బెంగాల్లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి పోటీ పడుతున్న ప్రముఖుల్లో సంజయ్ సిన్హ్(కాంగ్రెస్), మిథున్ చక్రవర్తి(తృణమూల్ కాంగ్రెస్), తదితరులు ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారి వివరాలు.. మహారాష్ట్ర: మురళీ దేవరా, హుసేన్ దల్వాయ్(కాంగ్రెస్), శరద్ పవార్, మజీద్ మీనన్(ఎన్సీపీ), రాజ్‌కుమార్ దూత్(శివసేన), సంజయ్ కాకడే(స్వతంత్ర అభ్యర్థి), రాందాస్ అథవాలే(ఆర్పీఐ) రాజస్థాన్: విజయ్ గోయెల్, రామ్ నారాయణ్ దూడీ, నారాయణ్ పచారియా(బీజేపీ) బీహార్: రామ్‌నాథ్ ఠాకూర్, హరివంశ్, కకాశా ప్రవీణ్(జేడీయూ. వీరు రాజ్యసభకు ఎన్నికవడం ఇదే తొలిసారి), సీపీ ఠాకూర్, ఆర్కే సిన్హా(బీజేపీ) తమిళనాడు: ఎల్ శశికళ పుష్ప, విజిలా సత్యనాథ్, ముత్తుకురుప్పన్, ఏకే సెల్వరాజ్(అన్నాడీఎంకే), తిరుచ్చి శివ(డీఎంకే), టీకే రంగరాజన్(సీపీఎం) మధ్యప్రదేశ్: దిగ్విజయ్ సింగ్(కాంగ్రెస్), ప్రభాత్ ఝా, సత్యనారాయణ్ జతియా(బీజేపీ) ఛత్తీస్‌గఢ్: మోతీలాల్ వోరా(కాంగ్రెస్), రణవిజయ్ ప్రతాప్ సింగ్ జుదేవ్(బీజేపీ) హర్యానా: కుమారి సెల్జా(కాంగ్రెస్), రామ్‌కుమార్ కశ్యప్(ఇండియన్ నేషనల్ లోక్‌దళ్) గుజరాత్: మధుసూదన్ మిస్త్రీ(కాంగ్రెస్), శంభుప్రసాద్ తుండియా, చునీభాయ్ గోహిల్, లాల్సిన్హ్ వడోదియా(బీజేపీ.. ముగ్గురూ రాజ్యసభకు ఎన్నికవడం ఇదే తొలిసారి). జార్ఖండ్: ప్రేమ్‌చంద్ గుప్తా(ఆర్జేడీ), పరిమళ్ నథ్వానీ(స్వతంత్ర అభ్యర్థి) మణిపూర్: అబ్దుల్ సలామ్(కాంగ్రెస్), మేఘాలయ: వాన్సుక్ సయీమ్(కాంగ్రెస్), హిమాచల్‌ప్రదేశ్: విప్లవ్ ఠాకూర్(కాంగ్రెస్) -
ఏడుస్థానాలూ ఏకగ్రీవమే?
ముంబై: రాష్ట్రంలోని ఏడు రాజ్యసభ స్థానాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశముంది. శరద్‌పవార్, మజిద్మీనన్, (ఎన్సీపీ), మిలింద్ దేవరా, హుస్సేన్ దల్వాయి (కాంగ్రెస్), రాజ్‌కుమార్ ధూత్ (శివసేన), సంజయ్కాకడే (స్వతంత్ర)లతోపాటు బీజేపీ, శివసేనల మద్దతుతో ఆర్పీఐ నాయకుడు రాందాస్ అథవాలే తమ తమ నామినేషన్లను దాఖలుచేశారు. నామినేషన్ల దాఖలుకు తుదిగడువు మంగళవారంతో ముగిసిపోయింది. నామినేషన్లను బుధవారం పరిశీలిస్తారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈ నెల 31వ తేదీ. -
ఆమ్ ఆద్మీ కాదు ఖాస్ ఆద్మీ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ మహిళా వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఆప్ సర్కార్ ఆమ్ ఆద్మీ పార్టీ కాదని ఖాస్ ఆద్మీ పార్టీగా మారిందని బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆప్ సర్కార్ విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 24న మొత్తం 14 జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వెల్లడించారు. బుధవారం పండిత్పంత్ మార్గ్‌లోని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సహా ఆప్ మంత్రులు, ఆప్ కార్యకర్తల తీరుతో రెండు రోజులపాటు ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవినీతి కేసులు పెట్టకపోవడంతోనే కేజ్రీవాల్ సర్కార్‌కు మద్దతు కొనసాగిస్తోందని ఆరోపించారు. బీజేపీ శుక్రవారం నిర్వహించనున్న ధర్నాలో కొన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావించనుంది. దీనిలో ఆప్-కాంగ్రెస్ మధ్య ఉన్న చీకటి ఒప్పదం, రెండు రోజులపాటు ధర్నాతో ఆప్నాయకులు ప్రజలకు కలిగించిన ఇబ్బందులు ప్రధానంగా విమర్శించాలని నిర్ణయించారు. ఆప్ తన హామీల అమలులోనూ విఫలమైన తీరును ఎండగడతామని గోయల్ తెలిపారు. రిపబ్లిక్‌డే ఏర్పాట్లకు ఆటంకం కలిగించిన ఆప్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు. -
కాంగ్రెస్‌తో ఆప్ కుమ్మక్కు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం కాంగ్రెస్ కనుసన్నల్లో నడుస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ మాటలను ఆసరాగా చేసుకొని బీజేపీ కేజ్రీవాల్‌పై విమర్శల దాడిని పెంచింది. అవినీతి విషయంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కయి ఢిల్లీ ప్రజలను మోసం చేస్తున్నారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, ఇప్పుడు బిన్నీ మాటలతో అవి నిజమని తేలిందని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ అన్నారు. అవినీతిని ఊడ్చేస్తామంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ఆప్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా దర్యాప్తునకు సిద్ధపడకపోవడం ఆ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందన్న దానికి నిదర్శనమన్నారు. షీలా కుమారుడు సందీప్ దీక్షిత్‌కు కేజ్రీవాల్‌తో మంచి సాన్నిహిత్యం ఉందని బిన్నీ చేసిన వ్యాఖ్యలు వారి లోపాయికారీ ఒప్పందాన్ని బయటపెట్టాయన్నారు. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినా, కనీసం ఇప్పుడు ఈ విషయాన్ని ఆప్ పట్టించుకోవడం లేదు. దీనర్థం అవినీతితో ఆప్ పార్టీ రాజీకి వచ్చిందని తెలుస్తోంద’ని గోయల్ విమర్శించారు. రానున్న రోజుల్లో షీలాపై ఆప్ చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. ఆప్‌తో ఒరిగేదేమీ లేదని ఢిల్లీవాసులు తెలుసుకున్నారని, మోసపోయామని గ్రహించారని గోయల్ తెలిపారు. ఈ రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేనే వారి నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు టికెట్లు కేటాయించిన నలుగురు అభ్యర్థులే ఇప్పుడు లోక్‌సభ వ్యవహారాలను చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నామని మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కేజ్రీవాల్ అహంకార పాలన నడుస్తోందని ఘాటైన విమర్శలు చేశారు. గతేడాది ఓ అవినీతి కేసులో సాక్ష్యాన్ని లేకుండా చేశారని ప్రత్యేక సీబీఐ కోర్టు మంత్రి సోమనాథ్ భారతిని ప్రశ్నించినా, కేజ్రీవాల్ పట్టించుకోకుండా వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. న్యాయశాఖ మంత్రి పదవి నుంచి సోమనాథ్‌ను ఈ నెల 26లోపు తప్పించకపోతే నిరవధిక ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఢిల్లీ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆప్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. -
ట్రేడ్ లెసైన్సు జారీ ఇంకా సరళతరం
న్యూఢిల్లీ: ట్రేడ్ లెసైన్సు జారీ ప్రక్రియ ఇకపై ఇంకా సరళతరం కానుంది. బీజేపీ నేతృత్వంలోని నగరపాలక సంస్థలు బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. వ్యాపారులు అఫిడవిట్ సమర్పి స్తే వెంటనే వారికి లెసైన్సును జారీచేస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వెల్లడిం చారు. ఎంసీడీలోని పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అవసరమైన సేవలను వారి ముంగిట్లోనే అందిస్తే బాగుంటుందన్నా రు. ఇన్స్పెక్టర్ రాజ్, లెసైన్స్ రాజ్‌లకు ఇకనైనా తెరదించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు సం బంధించిన అన్ని అంశాల విషయంలో సత్వరమే తగు చర్యలు తీసుకునేందుకు అవసరమైన మార్గాలను నగరపాలక సంస్థలు అన్వేషిస్తాయన్నారు. ఎంసీడీల్లో పారదర్శకత కోసం కృషి చేస్తామన్నారు. -
రాజకీయ గిమ్మిక్కే
సాక్షి, న్యూఢిల్లీ: జనతాదర్బార్ పేరిట ఆప్ సర్కార్ ఢిల్లీవాసులను అవమానిస్తోందని బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. రాజకీ య గిమ్మిక్కుల కోసమే ఆప్ సర్కార్ యత్నిస్తోంద ని దుయ్యబట్టారు. వందలాది మంది ప్రజలు వస్తే ఏ ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపలేకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని విమర్శించా రు. ‘జనతాదర్బార్’ పేరిట ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సభ్యులు ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నారని ఆరోపించారు. ‘ఢిల్లీ లోని కోటీ అరవై లక్షల మంది సమస్యలు రోడ్లపై కూర్చు ని తీర్చడం సాధ్యం కాదనే కనీస విషయం జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. ఒక వేళ ప్రజల సమస్యలు పరిష్కరించాలని వారికి చిత్తశుద్ధి ఉంటే సచివాలయం లోపలే ఆయా విభాగాల వారీగా మంత్రులుతెలుసుకోవచ్చు. సమస్యలకు పరిష్కరిం చవచ్చు. కానీ సీఎం కేజ్రీవాల్ చేస్తోంది రాజకీయ జిమ్మిక్కులు’అంటూ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల గడువు ముంచుకొస్తుండడంతో వీలైనంత ఎక్కువ ప్రచారం పొందేందుకే ఇలాంటి పద్ధతులకు దిగుతున్నారని ఆరోపించారు. వలంటీర్ల పేరిట ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆప్ సర్కార్ యత్నిస్తోందన్నారు. ఇది పరిపాలనా ప్రక్రియకు అడ్డంకిగా మారుతుందన్న విషయాన్ని వారు గుర్తించాలన్నారు. వాస్తవానికి 10 రోజులుగా ఢిల్లీలో పాలన పూర్తిగా చిన్నాభిన్నంగా మారిందన్నారు. రాజకీయ ప్రయోజనాలు మానుకుని ప్రజాప్రయోజనాలు కాపాడే పనులు చేయాలని సూచించారు. -
వాళ్లిద్దరూ తోడుదొంగలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి అవినీతిని పారదోలుతామంటూ చెబుతున్న ఆప్ సర్కార్ అవినీతిలో ‘పెద్ద చేపలను’ వదులుతోందని బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. ఆమ్ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ పొత్తుతో ఏర్పడిన ప్రభుత్వం తో ఢిల్లీ వాసులకు ఒరిగిందేమీ లేదని విమర్శించా రు. ఆమ్ఆద్మీపార్టీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రాజ్‌ఘాట్‌లో శుక్రవారం నిర్వహించిన ధర్నాలో బీజేపీ శాసనసభాపక్షనాయకుడు డా.హర్షవర్ధన్‌తోపాటు పార్టీ జాతీయ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వి, విజయ్‌కుమార్ మల్హోత్రా,విజయేంద్రగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ..ఆమ్ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కి నఖలు వంటిది. రెండు పార్టీలు అవకాశవాదంతోనే పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అవి నీతిని అంతమొందిస్తామంటూ రోజు కో ప్రకటన చేస్తున్న ఆప్ మంత్రులు ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో పనిని మరిచి ఆప్ సర్కార్మీడియా జిమ్మిక్కులు ప్రదర్శిస్తోందని బీజేపీ శాసనసభ పక్షనేత డా.హర్షవర్ధన్ ఆరోపించారు. కాశ్మీర్‌పై ఆప్ నాయకులు చేసిన వ్యాఖ్యలతోనే ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ విధానం ఏంటో అర్థమవుతోందని గోయల్ దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఆప్ సర్కార్ దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ధర్నాలో బీజేపీ నాయకులంతా ‘మోడీ ఫర్ పీఎం’ అని రాసి ఉన్న కాషాయరంగు టోపీలను ధరించి కనిపించారు. దేశ ప్రజలం తా మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, ఆ సందేశాన్ని తెలియజెప్పేందుకే తాము ఈ టోపీలను ధరించి వచ్చినట్టు ఓ నేత పేర్కొన్నారు. ఆప్‌ది ప్రచారార్భాటం: అరుణజైట్లీ రాష్ట్రంలో కేజ్రీవాల్ సర్కారు మీడియాలో ఎలా ప్రచారం పొందాలన్న విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతోందని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విమర్శించారు. చిన్నచిన్న విషయాలపై దృష్టి పెట్టినట్లు నటిస్తున్న ఆ ప్రభుత్వం కాంగ్రెస్ అవినీతిపై దృష్టిపెట్టేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదని ఆయన ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ హయాంలో జరిగిన సీడబ్ల్యూజీ స్కాం, 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపులేకాక షీలా దీక్షిత్ సర్కారు అవినీతి ఆరోపణలపై కనీసం మాట్లాడేందుకు కూడా ఆప్ సర్కార్ ధైర్యం చేయలేకపోతోంద’ని అని ఎద్దేవా చేశారు. అధికార పార్టీగా మారిన ఆప్ పనితీరు అంత స్ఫూర్తివంతంగా లేదన్నారు. ఢిల్లీపై ఎలాగైనా తన పట్టు కొనసాగించేందుకే ఆప్‌తో కాంగ్రెస్ జతకలిసింద ని ఆయన ఎద్దేవా చేశారు. -
ఆప్ ది అవకాశవాదమే
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ అనుసరిస్తున్న ప్రజా, జాతీయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం రాజ్‌ఘాట్‌లో ధర్నా చేయనున్నట్లు బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో గోయల్‌తోపాటు మాజీ అధ్యక్షుడు విజయేంద్రగుప్తా పాల్గొన్నారు. కాశ్మీర్ సమస్యపై అనుచిత వ్యాఖ్యలు, బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం, ప్రస్తుతం అవినీతి పరులైన కాంగ్రెస్ నాయకులను వెనకేసుకురావడం ఆమ్ఆద్మీపార్టీ అవకాశవాదానికి తార్కాణమన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మాజీ మంత్రుల అవినీతిపై కాగ్ నివేదికలు, లోకాయుక్త వంటి ఎన్నో సంస్థలు ఆధారాలు చూపినా ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని వారు ప్రశ్నించారు. ఆమ్ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం మేరకే షీలాదీక్షిత్‌పై దర్యాప్తును ఆయన అటకెక్కించారని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌లోని పెద్ద చేపలను పట్టుకునేందుకు కేజ్రీవాల్ జంకుతున్నాడు. అతడికి చిత్తశుద్ధి ఉంటే ముందు అలాంటివారి అవినీతిపై స్పందించాలి. ఎవరో ఒకరు ఆధారాలు ఇచ్చేవరకు ఆగాల్సిన పనేం ఉంది. ఆప్ సర్కార్ ఏర్పడి పది రోజులవుతోంది. అయినా చర్యల్లోకి ఎందుకు వె ళ్లడం లేదు’అంటూ గోయల్ ప్రశ్నించారు. నిత్యావసర ధరలను అదుపు చేయడం, సీఎన్జీ రేట్లు తగ్గించడం వంటి అనేక వాగ్దానాలు నెరవేర్చడంలో ఆప్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఆప్ సర్కార్‌లోని మంత్రులు సైతం ఎంతో గర్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వీఐపీ సంస్కృతిని పోగొడతామని గొప్పలు చెప్పిన ఆప్ మంత్రులు ఒక్కొక్కటిగా ప్రభుత్వ సదుపాయాలు తీసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. -
వారి కలయిక అందుకే!
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నిత్యావసరాల ధరలను మరింత మండించేందుకేనని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. రెండు పార్టీలు పరస్పర మద్దతుతోనే వంటగ్యాస్, సీఎన్ జీ, నీటి చార్జీలను పెంచుతున్నాయని విమర్శిం చారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ధరలు పెంచుతుంటే వారికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ధరలు పెంచుతోంది. వెంటనే సీఎన్జీ,వంటగ్యాస్, నీటి బిల్లులు తగ్గించాలి’ అని ఆయన పేర్కొన్నారు. సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్లపై రూ.220 పెంచ డం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం పడనుందన్నారు. ఇందువల్ల నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయన్నారు. ప్రధానమంత్రి సైతం దీనిపై నిస్సహాయత వ్యక్తం చేయడం బాధాకరమన్నారు. ‘కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పరస్పరం సహకరించుకునేందుకే ధరలు పెంపు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ రెండు పార్టీల నాయకులు తమ ను ఎవరూ అడ్డుకోలేరనే విధంగా వ్యవహరిస్తున్నా రు.’అని విమర్శించారు. -
28న అభినందన ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించిన ఢిల్లీవాసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘అభినందన ర్యాలీ’ని నిర్వహించనున్నట్టు బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ తెలిపారు. ఈనెల 28న తల్కటోరా స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆప్ మధ్య రహస్య ఒప్పందం కుదరిందని ఆరోపించారు. ఇటీవల కాలంలో ఆమ్ఆద్మీపార్టీ, కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న రాజకీయ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ అంశాలన్నింటినీ త్వరలోనే ప్రజల ముందుకు తెస్తామన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉన్న అవినీతి కేసులు మాఫీ చేస్తామన్న ఒప్పందంతోనే కాంగ్రెస్ పార్టీ,ఆప్‌లు ప్రభుత్వ ఏర్పాటులో సహకరించుకుంటున్నాయి. అందుకు ఆప్ కూడా ఒప్పుకుంది’అన్నారు. -
మహిళల భద్రతకు టాస్క్‌ఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళల రక్షణపరమైన అంశాలను చూసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి శిఖారాయ్ నేతృత్వంలో ఆ కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. ‘నిర్భయ ఘటన జరిగి ఏడాది పూర్తయినా క్షేత్రస్థాయిలో మహిళల రక్షణకు చర్యలు ఏమీ తెలుసుకోలేదు’ అని అన్నా రు. నిర్భయ నిధి పేరిట రూ.వెయ్యి కోట్లు కేటాయించినా దాన్ని యూపీఏ ప్రభుత్వం ఖర్చు చేయ డం లేదని ఆరోపించారు. ఢిల్లీ పోలీసుల్లోనూ మహిళల సంఖ్యచాలా తక్కువగా ఉంటోందన్నారు. అన్ని డీటీసీ బస్సుల్లో జీపీఎస్ సదుపాయాన్ని విధిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భయంతోనే ఆప్ వెనుకడుగు: ఆమ్ఆద్మీ పార్టీ ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కష్టసాధ్యమని గ్రహించే ఆప్ నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జంకుతున్నారన్నారు. లేదంటే కాంగ్రెస్ ఎలాంటి షరతులు లేకుండానే మద్దతు ఇస్తామన్న ఆప్ నాయకులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని గోయల్ ప్రశ్నించారు. -
మళ్లీ పోరుకే సై
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మళ్లీ ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఒక అకాలీదళ్ సభ్యుడు, 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సుముఖత చూపడం లేదు. ఇక్కడ సర్కార్‌ని ఏర్పాటుచేయాలంటే 36 మేజిక్ ఫిగర్ ఉండాలి. అయితే బీజేపీ 31, దాని మిత్రపక్షమైన అకాలీదళ్ పార్టీ సభ్యుడితో కలిసి మొత్తం 32 స్థానాలున్నాయి. అయినా అధికార పీఠమెక్కాలంటే మరో నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇక్కడే చిక్కుముడి వచ్చి పడింది. ఢిల్లీవాసులు తమ మీద నమ్మకం ఉంచి నిజాయితీతో కూడిన పాలన అందిస్తారని అధిక సంఖ్యలో స్థానాలు ఇచ్చారని, అలాంటి వారి ముందు ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులకు తెరలేపి అభాసుపాలవటం కన్నా మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 28 స్థానాలతో రెండోస్థానంలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోమని, ఎవరికీ మద్దతును కూడా ఇవ్వమని ఇప్పటికే తేల్చిచెప్పిన నేపథ్యంలో ఎన్నికల సంగ్రామంలోకి దిగడమే మేలని యోచిస్తున్నారు. బీజేపీ అగ్రనేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఇవే మాటలు వినబడుతున్నాయి. అసెంబ్లీ పక్ష నేతగా హర్షవర్ధన్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అసెంబ్లీ పక్ష నేతగా డాక్టర్ హర్షవర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన రెండు రోజుల అనంతరం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. 31 మంది బీజేపీ, ఒక అకాలీదళ్ శాసనసభ్యుడు మద్దతు పలికారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా హర్షవర్ధన్ విలేకరులతో మాట్లాడారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సంఖ్యా బలం లేకపోవడం వల్ల తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్నారు. అవసరమైతే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించినా మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువగా ఉండటం వల్ల ఈ అనిశ్చితి నెలకొందన్నారు. అయితే అధికారం కోసం అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఆత్రుతపడడం లేదన్నారు. అసలు ఆ దిశగా ప్రయత్నమే చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసినా చేయకపోయినా, ప్రజలకు సేవచేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. కాగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. మెజారిటీ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటుచేయకూడదని నిర్ణయించామన్నారు. దొడ్డిదారిన వెళ్లి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తాము ప్రయత్నించడం లేదన్నారు. ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సంతోషిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి మద్దతూ కోరడం లేదని తెలిపారు. ప్రతిపక్షంలో కూర్చోవడానికి, లేకపోతే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. మళ్లీ ఎన్నికలు జరిగితే తమ పార్టీ పూర్తి మెజారిటీతో మరోమారు అధిక స్థానాలు గెలిచి అధికారాన్ని దక్కించుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా, అంశాల ప్రాతిపదికన బీజేపీకి మద్ధతిస్తామన్న ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమైనవా? వారి పార్టీ అభిప్రాయమా? అన్న దానిపై స్పష్టత లేదన్నారు. అలాంటి ప్రతిపాదనలపై తామెలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.ఏఏపీ నేతలు తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చుకోకుండా చూసుకోవల్సిన అవసరముందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కోలీపై లైంగిక వేధింపుల ఫిర్యాదుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారని, ఆ సంగతి వారు చూసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జి నితిన్ గడ్కారీ, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు కూడా సోమవారం అరవింద్ కేజ్రీవాల్‌ను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. -
గెలుపుమాదే: బీజేపీ ధీమా!
సాక్షి, న్యూఢిల్లీ: మోడీ నిర్వహించిన ప్రచారం, స్థానిక కార్యకర్తల కష్టం ఫలించి ఢిల్లీలో కమలం వికసించబోతోందంటూ ఆ పార్టీ నేతలు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ఢిల్లీవాసులు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఈమారు విధానసభ ఎన్నికల్లో ప్రజాతీర్పు తమకు అనుకూలంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఢిల్లీలో నిర్వహించిన ప్రచార సభలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటు ఢిల్లీవాసులకు భ రోసా కల్పించిందన్నారు. మోడీ సభలకు జనం పోటెత్తగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నిర్వహించిన సభలు వెలవెలబోయాని, డిసెంబర్ ఎనిమిది ఫలితాలకు ఇవే ఉదాహరణలు అన్నారు. బీజేపీ నగరశాఖ ఆధ్వర్యంలో పక్కా వ్యూహం ప్రకారం ఎనిమిది నెలల క్రితమే పార్టీ ప్రచారాన్ని ప్రారంభించామన్నారు. విద్యుత్, మంచినీరు, మహిళల భద్రతతోసహా అన్ని అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వడంతోపాటు బీజేపీ చేపట్టబోయే కార్యక్రమాలను ఢిల్లీవాసులకు చెప్పగలిగామన్నారు. ‘ఘర్ ఘర్ బీజేపీ’ కార్యక్రమంతో ఢిల్లీలోని ప్రతి ఇంటికి బీజేపీ ప్రచారం చేరుకోవడం సత్ఫలితాలిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. 11,763 పోలింగ్ బూత్‌లకు సంబంధిచిన ప్రతి బూత్‌కి 30 సభ్యుల బృందాల ఏర్పాటు, 280 కార్యకర్త సమ్మేళనాలు, నిర్వహించినట్టు తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేకతపై పలు రిపోర్టులు విడుదల చేశామని గోయల్ గుర్తుచేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ నాయకులు ఎల్కే అద్వానీ, నరేంద్రమోడీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, నితిన్‌గడ్కారీ సైతం నగరంలో ఏర్పాటు చేసిన పలు బహిరంగసభల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. -
కాంగ్రెస్‌కి ఓటమి భయం పట్టుకుంది
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సభలకు వస్తున్న మద్దతు చూసి ఢిల్లీ విధానసభ ఎన్నిక ల్లో తమ ఓటమి తప్పదన్న భయం కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతోందని బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఎన్నికల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపెట్టుకునేం దుకు సిద్ధమంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీఎం వ్యాఖ్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌కి బీ పార్టీ అన్న విష యం అర్థమైపోయిందన్నారు. నరేంద్ర మోడీ ర్యాలీలకు లక్షలాదిగా తరలివచ్చి మద్దతు తెలి యజేస్తున్న ఢిల్లీవాసులకు విజయ్‌గోయల్ కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీల విజయవంతానికి కృషి చేస్తున్న పార్టీ నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు.‘మోడీ సభలకు వచ్చినంత జనం ఢిల్లీలో మరేపార్టీ నాయకులు నిర్వహించిన సమావేశాలకు రావడంలేదు. దీన్ని బట్టే బీజేపీకి ఢిల్లీవాసులు ఎంతమేరకు మద్దతు ఇస్తున్నారో అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే మద్దతు కొనసాగుతుంద’న్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన ర్యాలీ లు వెలవెలబోయాయన్నారు. సోనియాగాంధీ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులే బలవంతంగా జనాన్ని తరలించారంటూ మీడియా కథనాల్లోనూ వెల్లడైందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమావేశాల మధ్యనుంచే కొందరు జనం మోడీ ర్యాలీకి తరలివచ్చారన్నారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమన్నది అర్థమవుతోందని గోయల్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న తీరుపై బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోందన్నారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనను అంతమొందించాలని ఆయన ఢిల్లీవాసులకు విజ్ఞప్తి చేశారు. -
చేసి చూపుతాం
సాక్షి, న్యూఢిల్లీ: మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని బీజేపీ స్పష్టంచేసింది. ఈ విషయమై ఆ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘మేనిఫెస్టోలో పేర్కొన్నవిధంగా 30 రోజుల్లో ధరలు తగ్గించి చూపుతాం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు’అని పేర్కొన్నారు. కాగా నెల రోజుల్లోగా ధరలను కిందికి తీసుకొస్తామంటూ బీజేపీ నాయకత్వం మంగళవారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి విదితమే. అయితే బీజేపీ హామీలు ఆచరణ సాధ్యం కాదంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ విమర్శించడంపై గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే ధరలను దించి చూపుతామన్నారు. ‘ధరల నియంత్రణపై మేము పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కి నమ్మశక్యంగా లేదట. ఆ హామీని తప్పక నిలబెట్టుకుంటాం’ అని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులను 30 శాతం వరకు ఏవిధంగా తగ్గించబోతున్నామనే విషయాన్ని ఇదివరకే వివరించామన్నారు. విద్యుత్ డిస్కంల మధ్య పోటీ పెంచడంతోపాటు వాటి పనితీరులో పారదర్శకతను పెంచుతామన్నారు. 15 నెలలు చాలు... కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో చేయలేకపోయిన పనులను 15 నెలల్లో చేసి చూపుతామని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, మహిళల భద్రత, విద్యుత్, నీటి బిల్లుల తగ్గింపు తదితర అంశాలను తమ పార్టీ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని పునరుద్ఘాటించారు. ఈ ఏడాది నగరంలో రోజుకు ఐదు అత్యాచార కేసులు, 10 లైంగిక వేధింపులు, పది అపహరణ కేసులు నమోదయ్యాయన్నారు. పూర్తి రాష్ర్ట హోదాతో శాం తిభద్రతలను మరింత మెరుగుపరుస్తామన్నారు. అందరి మద్దతుతో గెలుస్తా:అజయ్‌కుమార్ మల్హోత్రా నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారి మద్దతుతో తప్పక గెలుస్తానని గ్రేటర్‌కైలాశ్ అసెంబ్లీ నియోజకవర్గం, బీజేపీ అభ్యర్థి అజయ్‌కుమార్ మల్హోత్రా అన్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న పంజాబీలతోపాటు జాట్, గుజ్జర్లు, బెంగాళీ, బ్రాహ్మణ, వాల్మీకీ సమాజాలకు చెందిన వారి మద్దతు లభిస్తోందన్నారు. వరుస సమావేశాలతోపాటు పాదయాత్రలు, బహిరంగ సభలతో స్థానిక ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు అజయ్మల్హోత్రా. ఢిల్లీ విధానసభ ప్రతిపక్షనేత, తన తండ్రి విజయ్‌కుమార్ మల్హోత్రాకు స్థానికంగా ఉన్న పట్టు తనకు విజయాన్ని సాధించి పెడుతుందని చెబుతున్నారు. అధికారంలోకి వస్తే పార్కుల్లో పచ్చదనాన్ని మరింత అభివృద్ధి చేస్తాని హామీ ఇచ్చారు. -
దక్షిణాది రాష్ట్రాలవారి పండుగలకు ప్రాధాన్యమిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో దక్షిణాది రాష్ట్రాలవారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వారి పండుగలైన సంక్రాంతి, దసరా, ఓనం, పొంగల్‌ను అధికారికంగా నిర్వహిస్తామని ఢిల్లీ విధానసభ ఎన్నికల ఇన్చార్జి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఇకపై దక్షణాది రాష్ట్రాలకు చెందిన వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని శనివారం తన నివాసంలో దక్షిణ భారతదేశ మీడియా ప్రతినిధులతో నిర్వహించి సమావేశంలో పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులకు వరుస హామీలివ్వడం గమనార్హం. సంక్రాంతి, దసరా, ఓనం,పొంగల్ పండుగలను ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి వీటిలో పాల్గొనేలా స్థానికులను ప్రోత్సహిస్తామన్నారు. ఢిల్లీలో చాలా రాష్ట్రాల ప్రజలున్నారు: ఢిల్లీ దేశరాజధాని కావడంతో ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు అధికసంఖ్యలో నిర్వహిస్తున్నారని పార్టీ సీట్ల కేటాయింపుల్లో కాస్త ఇబ్బందులు తలెత్తడం సహజమేనన్నారు. ఎంసీడీ ఎన్నికల్లోనూ దక్షిణాదికి చెందిన వారికి నాలుగు కౌన్సిలర్ సీట్లు కేటాయించామని గడ్కరీ తెలిపారు. వారిలో ఒకరు గెలుపొందారని పార్టీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ అన్నారు. మున్ముందు మరింత ప్రాధాన్యం ఇస్తామన్నారు. దక్షిణాది రాష్ట్రాలవారు నివసించే ప్రాంతాల్లో ప్రచారం ముమ్మరం చేయనున్నట్టు పేర్కొన్నారు. గెలుపుమాదే: పార్టీ టిక్కెట్ల కేటాయింపులో అత్యధికంగా పార్టీ శ్రేణులు కోరుకునేవారికే టిక్కెట్లు ఇచ్చామని గడ్కరీ పేర్కొన్నారు. పార్టీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్, సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో ఢిల్లీలో తమపార్టీ గెలుపు ఖాయమన్నారు. స్థానిక సమస్యలను సైతం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నామన్నాని తెలిపారు. మేనిఫెస్టోలో సమస్యల ప్రస్తావనతోపాటు వాటి పరిష్కారానికి తీసుకోను న్న చర్యలను ప్రస్తావిస్తున్నట్టు గడ్కరీ వివరించారు. ఆమ్ఆద్మీ పార్టీని సీరియస్‌గా తీసుకోం: ఆమ్ఆద్మీ పార్టీని తాము ప్రత్యర్థిగా భావించడం లేదన్నారు. ఆ పార్టీ కాంగ్రెస్‌కి బీపార్టీ వంటిదని గడ్కరీ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నాయకత్వం వహిస్తుండగా, ఆమె కుమారుడు ఎంపీ సందీప్‌దీక్షిత్ ఆమ్ఆద్మీ పార్టీని వెనక నుంచి నడిపిస్తున్నారన్నారు. ఆమ్ఆద్మీ పార్టీగా చెప్పుకుంటున్నా, ఆ పార్టీ నుంచి పోటీపడే అభ్యర్థులంతా కోటీశ్వరులే అన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు. హరిత రాజధాని చేస్తాం: ఢిల్లీ నగరాన్ని (హరిత రాజధాని) గ్రీన్క్యాపిటల్గా మారుస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. యమునా నీటిని శుద్ధిచేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనలో విసిగిపోయిన ఢిల్లీవాసులంతా బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ మురళీధర్‌రావు, రఘు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మంచినీరూ కరువే
న్యూఢిల్లీ: దేశరాజధానిని 15 ఏళ్లపాటు పాలించిన షీలా దీక్షిత్ ఒరగబెట్టిందేమీ లేదని, నగరవాసులకు కనీస అవసరమైన మంచినీరు కూడా సరఫరా చేయలేకపోయారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ద్వారకలో శనివారంసాయంత్రం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలపై నిప్పులు చెరిగారు. ‘షీలా దీక్షిత్ గుజరాత్ అభివృద్ధి నమూనాను తప్పుబడుతున్నారు. ఆమె తన కుమారుడు, కోడలితోపాటు మారుతి కారులో ప్రయాణిస్తూ గుజరాత్భారీ పైప్‌లైన్‌ను పరిశీలించవచ్చు. అది తొమ్మిది వేల గ్రామాలకు నీరు సరఫరా చేస్తోంది. యమునా నది శుద్ధీకరణ కోసం ఆమె ప్రభుత్వం కోట్లాది రూపాయలు కుమ్మరించినా అది ఇప్పటికీ మురికికూపంలాగే ఉంది. గుజరాత్ సబర్మతి తీరాన్ని ఒక్కసారి సందర్శించాలని నేను షీలా దీక్షిత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌గోయల్, ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్దన్ తదితరులు ర్యాలీకి హాజరయ్యారు. -
ఆలస్యం అమృతమయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలోని ప్రతి అంకంలోనూ దూకుడుగా వ్యవహరించే బీజేపీ నాయకులు పార్టీ మేనిఫెస్టో విడుదలలో జాప్యం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న ఈ ఆలస్యం.. పార్టీకి కలిసి వస్తుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. గత ఎన్నికలను పరిశీలిస్తే ప్రతిసారీ అన్ని ప్రక్రియల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒకడుగు మందుగానే బీజేపీ ఉండేది. ఎంసీడీ ఎన్నికల్లోనూ అదే తరహాలో ముందుకు వెళ్లింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య ఉన్న విభేధాల కారణంగా ప్రచారంతో అన్నింట్లోనూ ఆలస్యం కనిపిస్తోంది. అయితే దీన్ని వ్యూహాత్మంగానే చూడాలంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదలలో తొందరపాటుతో చెలరేగిన అసంతృప్తులను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకుందని, అలా మరోమారు జరగకుండా తమ వ్యూహాలను బహిర్గతం చేయకుండా ప్రత్యర్థి పార్టీలైన ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు వచ్చిన తర్వాతే తమపార్టీ మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే తయారు చేసుకున్న జాబితాలో కాంగ్రెస్, ఆప్‌ల హామీలను కలగలుపుకుని మరింత ఆకర్షణీయంగా మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రధాన సమస్యలపైనే దృష్టి: ఢిల్లీవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపేలా మేనిఫెస్టో తయారు చేయాలని ఇప్పటికే బీజేపీ నాయకులు నిర్ణయించుకున్నారు. ప్రధానంగా ఆమ్ఆద్మీపార్టీ మేనిఫెస్టోకి ధీటుగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు. బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో దీన్ని రూపొందిస్తున్నారు. బీజేపీ ప్రధాన హామీ అయిన 30 శాతం విద్యుత్ చార్జీల తగ్గింపుతోపాటు నీటి సరఫరా, మహిళా భద్రతకు పెద్దపీట వేయనున్నారు. సంక్షేమ పథకాలు, అనధికారిక కాలనీలు, జుగ్గీజోపిడీల అభివృద్ధి, క్రమబద్ధీకరణ అంశాలను ప్రధానగా ప్రస్తావించనున్నట్టు సమాచారం. నేడు బీజేపీ మేనిఫెస్టో: ఢిల్లీ విధానసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో శుక్రవారం విడుదల చేయనున్నట్టు సమాచారం. పండిత్‌పంత్‌మార్గ్‌లోని బీజేపీ నగరశాఖ కార్యాలయంలో బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. -
కాలుష్యాన్ని తరిమేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని కాలుష్యాన్ని పారద్రోలి పచ్చదనం కలిగిన రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్ ప్రకటించారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హర్షవర్ధన్‌తోపాటు ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జి నితిన్ గడ్కరీ, బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే భారత్‌ను గొప్పస్థానంలో ఉంచాలని బీజేపీ భావిస్తోందని, అది ఢిల్లీతోనే ప్రారంభిస్తామన్నారు. అందుకోసం తీసుకోనున్న చర్యలు ఆయన వివరించారు. బీజేపీ అధికారంలోకి వ చ్చిన వెంటనే ఢిల్లీని పచ్చదనం కలిగిన రాజధానిగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. 2020 వరకు తాగునీరు, గాలి, నదులను శుద్ధి చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెడతామన్నారు. ప్రతి ఇంటికీ పైన సోలార్ విద్యుత్ ఉత్పాదక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమ్యే ఖర్చులో 30 శాతం ఢిల్లీ ప్రభుత్వం, 30 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు బదులుగా ప్రతి ఇంటి నుంచి కొంత కరెంట్‌ను గ్రిడ్‌కి విక్రయించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. 2015వరకు అన్ని ఇళ్లకు సోలార్ వ్యవస్థ ఏర్పాటు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పచ్చదనం పెం పొందించడం తదితర పనుల్లో భాగంగా ఢిల్లీలోని 50 వేల మంది యువతీయువకులకు అదనంగా ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రజా, ప్రైవేట్ రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలు వాడేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హర్షవర్ధన్ వివరించారు. -
‘ఆప్’ కాంగ్రెస్ ‘బీ’ టీం
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ నాలుగోసారి జరగనున్న ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) బీజేపీ ఓట్లను చీల్చబోతోందన్న వార్తలను తిప్పికొట్టేందుకు బీజేపీ నాయకులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. క్రమంగా ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఒకటే అన్న ప్రచారాన్ని ముందుకు తెస్తూ బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ మంగళవారం నిర్వహించి విలేకరుల సమావేశంలో ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్‌పార్టీకి ఆమ్ఆద్మీ పార్టీ ‘బీ టీం’ వంటిదిగా అభివర్ణించారు. కాంగ్రెస్ చెప్పుచేతల్లోనే ఆప్ నేతలు నడుచుకుంటున్నారని ఆరోపించారు. అన్నా హజారే పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రచారం చేస్తున్నారని అరవింద్కేజ్రీవాల్పై గోయల్ మండిపడ్డారు. ‘మేం ఆమ్ఆద్మీ పార్టీని కాంగ్రెస్ బీ టీంగానే పరిగణిస్తాం. కాంగ్రెస్ నాయకుల కనుసన్ననల్లో నడుస్తున్న కేజ్రీవాల్ అన్నాహజారే ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారు. ఇలా చేయడంతో ప్రజలను తప్పుదారి పట్టించాల నుకునేవారే చివరికి మూర్ఖులుగా మారడం ఖా యం’ అని పేర్కొన్నారు. జన్‌మంచ్ ద్వారా సామాజిక వేత్త అన్నహజారే పేరిట సేకరించిన రూ.85 లక్షల విరాళాలను అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై అన్నా సైతం ప్రశ్నించారని గుర్తు చేశారు. అవినీతి రహిత పార్టీగా చెప్పుకుంటున్న ఆప్ మొదట ప్రకటించిన అభ్యర్థుల్లో 11 మంది అవినీతిపరులు ఉన్నారని గోయల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
శ్వేతపత్రం విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ పిల్లర్లలో పగుళ్లు, మెట్రోరైలు ప్రయాణంలో తరచూ ఎదురవుతున్న ఇబ్బందులపై డీఎంఆర్సీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ రవాణా వ్యవస్థలో పెను మార్పులకు కారణమైన ఢిల్లీ మెట్రోరైలు తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చిదంటూ క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తుండడంతో బీజేపీ మెట్రోరైలు వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్టు కనబడుతోంది. సోమవారం బీజేపీ నేత విజయ్ గోయల్ విలేకరులతో ఈ విషయమై మాట్లాడారు. ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్లో ఢిల్లీ ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉన్నా ప్రయాణికులకు ఉన్నత ప్రమాణాల్లో సేవలందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మెట్రోరైలు వ్యవస్థలో తరచూ ఏర్పడుతున్న ఇబ్బందులు, వాటిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘సాంకేతిక కారణాలతో తరచూ మెట్రోరైళ్లు ఆగిపోతున్న ఘటనలకు బాధ్యులైన వారిపై ఏయే చర్యలు తీసుకున్నారు. మెట్రోఫిల్లర్లలో ఏర్పడుతున్న పగుళ్లకు, సాంకేతిక కారణాలకు బాధ్యులెవరో తేల్చాలి’అని డిమాండ్ చేశారు. మెట్రోరైలు మా హయాంలోనే వచ్చింది... ఢిల్లీ మెట్రోరైలును తొలుత 1998లో ప్రవేశపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే అని గోయల్ గుర్తు చేశారు. ఢిల్లీ మెట్రోరైలు మొట్టమొదటి లైన్‌ను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 2002, డిసెంబర్ 24న ప్రారంభించారని పేర్కొన్నారు. నేడు మెట్రోరైలు ఢిల్లీవాసుల దైనందిక జీవితాల్లో ఒకటిగా మారిపోయిందన్నారు. లక్షలాదిమంది ప్రయాణికులు ఆధారపడుతున్నా మెట్రోరైలు అధికారుల పనితీరు ఆశాజనకంగా లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఏదోఒక లోపాలు తలెత్తుతున్నాయన్నారు. జూలై 2012లో ఎయిర్‌పోర్టు మెట్రోఎక్స్ప్రెస్లైన్లో ఫిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. నోయిడా సిటీ సెంటర్ స్టేషన్లో ఏర్పడిన పగుళ్లను అధికారులు సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ఇదే తరహాలో ఏర్పడిన మరికొన్ని సంఘటనలను ఆయన ఉదహరించారు. లక్షల మంది ప్రయాణికుల రక్షణకు సంబంధించిన అంశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. -
విముక్తి కల్పిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఢిల్లీ వాసులకు విముక్తి కల్పించేందుకే ‘బద్లో దిల్లీ’కార్యక్రమాన్ని చేపట్టినట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ పేర్కొన్నారు. నగర బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బద్లోదిల్లీ’పాదయాత్రను బుధవారం లాల్‌బాగ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా.హర్షవర్ధన్ జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్టు విజయ్‌గోయల్ పేర్కొన్నారు. లాల్బాగ్ నియోజకవర్గంలోని ఎన్నో మురికివాడల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలోని మురికివాడలతోపాటు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పేద, నిమ్నవర్గాలకు కనీస సదుపాయాలు కల్పించడంలోనూ కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడంతోపాటు బీజేపీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం బీజేపీ మొదటి నుంచి హామీ ఇస్తున్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు 30 శాతం తగ్గిస్తామని గోయల్ పునరుద్ఘాటించారు. అడ్డగోలు నీటిబిల్లులకు సైతం చెక్ పెడతామన్నారు. పేదల సంక్షేమానికి అవసరమైన అన్ని పథకాలు తెస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ మోడల్‌టౌన్ అభ్యర్థి అశోక్‌గోయల్ పాల్గొన్నారు. గురువారం సంఘం విహార్ నుంచి యాత్ర మొదలవనుంది. -
కాంగ్రెస్ తర్వాతే బీజేపీ రెండో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికలకు సంబంధించి 70 స్థానాలకు గాను 62 (అకాళీదళ్కి కేటాయించిన నాలుగు స్థానాలతో కలిపి) మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ. మరో ఎనిమిది స్థానాలలో బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లు వెల్లడించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాతే ఎనిమిది మంది అభ్యర్థులెవరన్నది వెల్లడించనున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు చూశాక అవసరమైన మార్పులు, చేర్పులకు అనువుగా ఉండేందుకే ఈ స్థానాలను ప్రకటించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన స్థానాలకు సంబంధించి అసంతృప్త నేతలు ఒక్కరొక్కరుగా రోడ్డు ఎక్కుతుండడంతో రెండోవిడత జాబితా విడుదల జాప్యం చేస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్త కలహాలు ముదిరాక మిగిలిన సీట్లను ప్రకటిస్తే కాస్తయినా నష్టం కలగకుండా ఉంటుందన్నది బీజేపీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. అసంతృప్త నేతలు పార్టీ కార్యాలయంలో ఘర్షణలకు దిగుతుండడాన్ని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ లైట్ తీసుకున్నారు. ఇలాంటివి మామూలే అని, మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందంటూ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట
న్యూఢిల్లీ: షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు దఫాలుగా చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ విమర్శించారు. ‘అవి అబద్ధాల పుట్టలు. ఈ ఏడాది వారు చేసే హామీలకు ముందు పాత హామీల మాటేమిటని మేం ప్రశ్నిస్తాం..’ అని ఆయన అన్నారు. ఆయన ఆది వారం మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు అబ ద్ధాలు చెప్పి మభ్యపెట్టడంలో కాంగ్రెస్‌వారికి చాలా అనుభవం ఉంది..’ అని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ మేని ఫెస్టో అనే పదానికి అర్థాన్నే మార్చేసిం ది..’ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘నగరంలో రుకేగీ నహీ మేరీ ఢిల్లీ అనే స్లోగన్‌తో వారు చాలా పెద్ద హోర్డింగ్ ఏర్పాటుచేశారు. అది కూడా అబద్ధమే.. నగరంలో చాలా ఏళ్లుగా అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడంలేదు..’ అంటూ ఆయన విమర్శించారు. 2003, 2008 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో పేర్కొన్న సుమారు 21 అంశాలను ఆ ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం ముట్టుకోలేదు..’ అంటూ ఆయన ఆరోపించారు. ‘ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదాను తీసుకొస్తామని 2003 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది.. ఆ తర్వాత తొమ్మిదిన్నర ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీయే ఢిల్లీలోనూ, కేంద్రంలోనూ అధికారాన్ని చెలాయిస్తోంది.. ఇప్పటివరకు ఆ అంశంపై అతీగతీ లేదు.. ఈసారి కూడా మేనిఫెస్టోలో అదే హామీని ఆ పార్టీ ఇవ్వబోతోందా..’ అంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే 2003, 08 మేనిఫెస్టోల్లోనే ఢిల్లీని విద్యుత్ ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించే రాష్ర్టంగా మారుస్తామని హామీ ఇచ్చిందని, కాని వాస్తవం దానికి విరుద్ధంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. గోయల్ మాట్లాడుతూ మరో 10-12 రోజుల్లో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనుందని తెలిపారు. తాము చేయగలిగే పనులనే అందులో పొందుపరుస్తామన్నారు. పార్టీ టికెట్లు దొరకలేదని రాజీనామాలు చేస్తున్నవారిపై మీ వైఖరేమిటనే ప్రశ్నకు గోయల్ సమాధానమిస్తూ ఎన్నికల సమయంలో ఇలాంటివి మామూలేనన్నారు. సవాళ్లను తాము ఎదుర్కోగలమనే ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తర్వాతే మిగిలిన ఎనిమిది సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇదిలాఉండగా ఇస్లాం మతగురువు మౌలానా తౌకీర్ రజాఖాన్‌ను కేజ్రీవాల్ కలవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. అటువంటి పార్టీకి ప్రజలు మద్దతు పలకబోరని ఆ పార్టీ నాయకుడు అరుణ్ జైట్లీ విమర్శించారు. -
బీజేపీ అభ్యర్థులు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: భారీ కసరత్తు అనంతరం విధానసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బీజేపీ బుధవారం ప్రకటించింది. తీవ్ర చర్చోపచర్చలకు తెరదించుతూ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షత కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఎల్కే.అద్వానీ, డా.మురళీ మనోహర్జోషి,ఎం.వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీ, సుష్మాస్వరాజ్,అరుణ్‌జైట్లీతోపాటు కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. 70 నియోజకవర్గాలకుగాను మొదటి విడతలో మొత్తం 62 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో నాలుగు టికెట్లను అకాలీదళ్‌కు కేటాయించారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా.హర్షవర్ధన్ వరుసగా నాలుగుమార్లు గెలిచిన కృష్ణానగర్ నుంచే బరిలోకి దిగనున్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఢిల్లీప్రదేశ్ మాజీ అధ్యక్షుడు విజేంద్రగుప్తాను బరిలోకి దించాలని కమలదళం నిర్ణయించింది. కాగా మొదటి విడత అభ్యర్థుల జాబితాలో బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్గోయల్కి చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు అంతంతమాత్రంగానే ఉండడంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు. నాలుగుస్థానాల్లో పోటీ చేయనున్న అకాలీదళ్ న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని ఎస్ఏడీ నగర శాఖ అధ్యక్షుడు మంజిత్‌సింగ్ బుధవారం వెల్లడించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకుని నగర పరిధిలోని రాజౌరి గార్డెన్, షహధర, కల్కాజీ, హరినగర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు. అభ్యర్థుల పేర్లను తమ పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందన్నారు. టికెట్లు పొందినవారి జాబితా: క్ర.సం. నియోజకవర్గం అభ్యర్థిపేరు 1 నరేలా నీల్ధామన్ఖాత్రి 2 బురాయి శ్రీకృష్ణత్యాగి 3 బదాలీ విజయ్‌భట్ 4 రిటాలా కుల్వంత్రాణా క్ర.సం. నియోజకవర్గం అభ్యర్థిపేరు 5 ముండ్కా మనోజ్ షకీన్ 6 కిరారీ అనిల్‌ఝా 7 సుల్తాన్పుర్మజారా(ఎస్సీ) సుశీలాబగాడి -
ఛట్ పూజకు ఏర్పాట్లు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఛట్‌పూజ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేయాలని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ తరఫున చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఆయన సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ), మూడు మున్సిపాలిటీల మేయర్లకు ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఛట్‌పూజ నాడు సెలవు ప్రకటిస్తామని వెల్లడించారు. లక్షల మంది భక్తులు పాల్గొనే ఛట్‌పూజకు ఢిల్లీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేస్తున్న ధాఖలాలు కనపడడం లేదని ఎల్జీకి పంపిన ఉత్తరంలో పేర్కొన్నారు. పండుగ ఏర్పాట్లలో భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘గణేశ్ చతుర్థి సందర్భంగా ఢిల్లీలో ఎన్నో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఎంతోమంది యువకులు యమునానదిలో ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పాల్గొనే ఈ పండుగ సందర్భంగా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’ అని అన్నారు. స్నానాల ఘాట్ల వద్ద భద్రతాచర్యలు, సరిపడా పోలీసులు, గజ ఈతగాళ్లు, అంబులెన్స్‌లు, రవాణా సదుపాయాల కల్పన, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవడం, మహిళల భద్రతకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం సహా పలు అంశాలను లేఖలో ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. వలంటీర్లుగా ఆయా ప్రాంతాల్లో అవసరమైన సేవలందించాలని బీజేపీ కార్యకర్తలకు గోయల్ సూచించారు. ఛట్‌పూజ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఏటా ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులను పలువురు ప్రతినిధుల ముందుంచారు. వీటన్నిం టికీ పరిష్కారం కనుగొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కొన్ని ప్రతిపాదనలను ఎల్జీకి పంపిన ఉత్తరంలో ఆయన పొందుపర్చారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లకు సైతం గోయల్ కొన్ని సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీలైనన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. -
దీపావళి తర్వాతే!
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన విషయంలో బీజేపీ సైతం కాంగ్రెస్ బాటలోనే నడుస్తోంది. దీపావళి తర్వాతే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ స్పష్టం చేశారు. ఆశావహుల్లో మరింత ఉత్కంఠను పెంచుతూ గురువారం మధ్యాహ్నం గోయల్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ..ఉత్తమ పనితీరు కనబర్చిన ఎమ్మెల్యేలకు మరలా టికెట్లు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ టికెట్ల పంపిణీలో అన్ని సామాజిక వర్గాల వారికి సమప్రాధాన్యం ఇస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తీసుకుంటున్న ప్రాధమ్యాలను వివరిస్తూ ‘క్షేత్రస్థాయిలో పనితీరు, ఎలాంటి ఆరోపణలు లేకపోవడం, పార్టీ విధివిధానాలను పాటించడంతోపాటు గెలుపు అవకాశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి చర్యలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడంతోపాటు వీలైనంత ఎక్కువ మందికి చేరువయ్యేందుకు నిర్ణయించిన ‘ఘర్ ఘర్ బీజేపీ’ కార్యక్రమం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించనున్నట్టు గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని మొత్తం 11,763 పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రతి బూత్‌కి సంబంధించి 32 మంది సభ్యుల బృందాలను నియమించినట్టు తెలిపారు. ఇప్పటికే 14 జిల్లాల్లోని 280 మండలాల్లో కార్యకర్త సమ్మేళనాలు నిర్వహించినట్టు చెప్పారు. గడపగడపకు ప్రచారం, బహిరంగ సభలు, స్థానికంగా ఉన్న ఆర్‌డబ్ల్యూఏలతో సమావేశాల రూపంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఢిల్లీని అవినీతి రహితంగా చేయడంతోపాటు పారదర్శక పాలన అందిచాలన్న ధ్యేయంతో బీజేపీ కృషి చేస్తోందన్నారు. 15 ఏళ్ల ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పాలనకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో చరమగీతం పాడనున్నామని ధీమా వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో ప్రజలు ఇప్పటికే ఎంతో విసిగిపోయారని, బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రతి ఢిల్లీవాసి కోరు కుంటున్నారన్నారు. మీ పరిధిలో చూసుకోండి: హర్షవర్ధన్ రాజధాని నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామంటూ బదర్ పురాలో బుధవారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చేసిన ప్రసంగాన్ని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా. హర్షవర్ధన్ తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను షీలాదీక్షిత్ మోసగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో కన్నాట్‌ప్లేస్ పునరుద్దరణ పనులు సైతం పదిహేనేళ్లలో చేపట్టలేకపోయారనిఎద్దేవా చేశారు. ఏళ్ల తరబడి పనులు కొనసాగుతుండడంతో గోతుల్లో ఎంతో మంది పడి గాయాలపాలైన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిస్థితి మారుమూల గ్రామంలా ఉందని ఎద్దేవా చేశారు. పదమూడు మురికివాడల్లోని 30 వేల మంది ప్రజలకు నేటికీ తాగునీరు అందని దుస్థితి ఉందన్నారు. వాల్మీకి బస్తీల్లోని 15 వేల మంది అత్యంత దయనీయమైన జీవనాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గ పరిధిలోనే దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక మైన రాష్ట్రపతి భవనం, పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసం, కేంద్ర మంత్రులు, ఎంపీల నివాసాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు కన్నాట్‌ప్లేస్, జన్‌పథ్, గోల్ మార్కెట్, కాలిబడీమార్గ్, పంచ్కున్యారోడ్, ఖాన్‌మార్కెట్, జోర్‌బాగ్, సుజన్‌సింగ్ పార్క్, పండారారోడ్డు, లక్ష్మిబాయినగర్, కిద్వాయి నగర్, సరోజిని నగర్, సఫ్దర్‌జంగ్ వంటి అత్యంత కీలకమైన ప్రాంతాలున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు షీలాదీక్షిత్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు. 2009 మార్చి నుంచి 2012 వరకు ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.8.85 కోట్లు ఖర్చుచేశారన్నారు. దీనిలో ఎక్కువగా 30.9 శాతం నిధులు పోర్టాక్యాబిన్లు (తాత్కాలిక షెల్టర్లు), మంత్రులు, ఎంపీల ఇళ్లకు ప్రహ రీ గోడల నిర్మాణానికి 13.7 శాతం, 14.2 శాతం నిధులు రోడ్ల నిర్మాణానికి, 12.4 శాతం నిధులు మెట్లు నిర్మిచేందుకు, 5.3 శాతం నిధులు ఇతర పనులకు వినియోగించినట్టు హర్షవర్ధన్ వెల్లడిం చారు. నేటికీ ముఖ్యమంత్రి నిధుల్లో రూ.కోటీ 75 లక్షలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి పనులను పట్టించుకోని సీఎం ఢిల్లీ నగరాన్ని అభివృద్ధిబాట పట్టించామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
'అక్షర యుద్ధాలు'
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 20 ఏళ్ల వరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్టు ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ తెలిపారు. పదిహేనేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశరాజధాని మురికి నగరంగా,అత్యాచారాల రాజధానిగా అపప్రద మూటగట్టుకుందన్నారు. నగరాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్, మంచినీటి సరఫరా, విద్య, ఆరోగ్యం, అర్బన్‌ప్లానింగ్, ఇళ్ల నిర్మాణం, మహిళల రక్షణ తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు పేర్కొన్నారు. ‘ఢిల్లీలోని అనధికారిక కాలనీల్లో రూ.2,800 కోట్లు ఖర్చుచేసినట్టు ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. అయినా అనధికారిక కాలనీవాసులకు మంచినీరు, విద్యుత్ సరఫరా సక్రమంగాలేదు. రోడ్లు లేవు. రూ.3000 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నా డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగానే ఉంది. రోడ్ల దుస్థితి అంతే ఉంది. ట్రాఫిక్‌జాంలు, రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి’అని గోయల్ విమర్శించారు. ఢిల్లీలోని ప్రధాన రోడ్లన్నీ గోతులమయంగా మారాయన్నారు. సమస్యను పరిష్కరంచాల్సిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని, రోడ్లు బాగుపడాలంటే వానలు రాకుండా వానదేవుణ్ణి ప్రార్థించాలని ప్రజలకు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన మంచినీరు అందించడంలోనూ ఢిల్లీ జల్ బోర్డు చైర్మన్‌గా కొనసాగుతున్న ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. విద్యుత్ సరఫరా పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందన్నారు. 1,500 మంది దరఖాస్తు: హర్షవర్దన్ డిసెంబర్ నాలుగున జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారని ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్దన్ బుధవారం తెలిపారు. ‘వీరిలో అభ్యర్థులను వడబోసే ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపిక విధానానికి చాలా సమయం తీసుకుంటుంది. అయితే ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిటీ వివిధ సమావేశాలు నిర్వహిస్తోంద’న్నారు. అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుందని, అయితే కేంద్ర ఎన్నికల కమిటీనే తుదినిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఢిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
లిస్టులో ఫస్టెవరో!!
సాక్షి, న్యూఢిల్లీ:ఎన్నికల పరుగులో లక్ష్యాన్ని ముద్దాడాలంటే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. మొదటి అడుగు మరింత కీలకం. ఇలా చూస్తే ఎన్నికల్లో మొదటి అంకం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం. అసలు కథంతా ఇక్కడే దాగి ఉంటుంది. సరైన అభ్యర్థిని బరిలోకి దింపితేనే అధికార పీఠం దక్కుతుంది. వివిధ కారణాల రీత్యా అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు పార్టీలు తాత్సారం చేస్తున్నాయి. ఎదుటి పార్టీ నిలబెట్టే అభ్యర్థిని బట్టి తాము బరిలోకి దింపాలన్న యోచనతో ఉన్నాయి. ఎన్నికలకు మరో 35 రోజులే గడువున్నా ప్రధాన పార్టీలు జాబితాలు విడుదల చేయడం లేదు. బీజేపీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును ప్రకటించడంతో బీజే పీ స్పీడుకి బ్రేకులు పడ్డాయి. నేర చరితులు లేకుండా, కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న నియమాలు తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జనలు పడుతోంది. ఇరుపార్టీల అభ్యర్థులు తెలిస్తేకానీ రంగంలోకి దిగొద్దని బీఎస్పీ కాసుకూచ్చుంది. అన్నింటికి పరోక్షంగా ఆప్ అనుసరిస్తున్న వ్యూహమూ కారణమవుతోంది. దీంతో అన్ని పార్టీల్లోని ఆశావహులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉన్నదంతా ఖర్చుచేసుకుని మరి తమవంతు ‘ప్రయత్నాలు’చేసుకుంటున్నారు. అభ్యర్థు జాబితా విడుదలలో తాత్సారం ఏ క్షణాన ఎవరి కొంప ముంచుతుందో తెలియక తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వర్గపోరుతో నెమ్మదించిన బీజేపీ బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్‌ను కాదని సచ్చీలుడైన వ్యక్తి కావాలంటూ డా.హర్షవర్ధన్ పార్టీ సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ స్పీడు కాస్త తగ్గింది. అంతకముందు తాను సీఎం అభ్యర్థిని అన్న ఉత్సాహంతో పార్టీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ అంతా తానై నడిపించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేయడంతోపాటు తన వర్గంలోని వారికి టిక్కెట్లు వచ్చేలా ప్రణాళిలకు రూపొందించి పెట్టుకున్నారు. ఆఖరి నిమిషంలో పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వడంతో గోయల్ తెల్లబోయారు. సీఎం అభ్యర్థి హర్షవర్ధన్‌తో పైకి సఖ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అభ్యర్థుల ఎంపికలో తన ముద్ర ఉండేలా ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిత్వంలో ఇప్పటికే పార్టీ బుజ్జగింపులకు తలొగ్గిన విజయ్‌గోయల్...పార్టీ టిక్కెట్ల విషయంలో పట్టుబట్టేలా కనిపిస్తోంది. దీంతో దీపావళికి ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని బహిరంగంగా ప్రకటనలు చేసిన బీజేపీ కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. సీఎం అభ్యర్థిని ప్రకటించడంలో చేసినట్టే అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్జన భర్జనల్లో కాంగ్రెస్... కాంగ్రెస్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ వర్గపోరునకు మించి ఇతర అర్హతలు ఆశావహుల తలరాతలు మారుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలలో వీలైనంత ఎక్కువ మందికి మరోమారు అవకాశం ఇవ్వాలని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఇప్పటికే 31 మందికి ఆమోదం తెలిపినట్టు సమాచారం. నేర చరిత్ర, వయస్సును పరిగణనలోకి తీసుకుని కొందరిని పక్కన పెట్టాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను దీపావళి తర్వాత విడుదల చేయాలన్న యోచనలో కాంగ్రెస్‌పార్టీ అధిష్టాన వర్గం ఉన్నట్టు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలను ‘ఆప్’తున్న కేజ్రీవాల్.. తొలిసారిగా ఢిల్లీ విధానసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆమ్ఆద్మీపార్టీ కొత్త పంథాలో వెళుతూ ఇతర పార్టీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థుల ఎంపికలో ఆమ్ఆద్మీపార్టీ నిజాయితీ కలిగిన అభ్యర్థులకే సీట్లు వచ్చేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. గత రెండు నెలలుగా పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు పార్టీ వెబ్సైట్ ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. దీంతో ఇతర పార్టీలు సైతం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నంతలో కాస్త నిజాయితీ కలిగిన నాయకులకు టికెట్ ఇవ్వాలన్న ధోరణిలో ఉన్నాయి. ఈ సరికొత్త విధానం ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా విడుదలలో ఓ కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీఎస్పీ సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. డిసెంబర్ నాలుగున జరగనున్న ఎన్నికల్లో పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తుండగా, ఇప్పటికే 63 స్థానాలు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైనట్టు బీఎస్పీ ఢిల్లీప్రదేశ్ నాయకుడు ఎమ్.ఎల్.తోమర్ పేర్కొన్నారు. కాంగ్రెస్,బీజేపీ జాబితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. -
రాహుల్‌కు విజయ్ గోయల్ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ నగరాన్ని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారంటూ కితాబిచ్చిన కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని వాస్తవాలు తెలుసుకునేందుకు నగర పర్యటనకు రావాలంటూ ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆహ్వానించారు. పండిత్ పంత్ మార్గ్‌లోని కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ సీఎం షీలా ప్రజలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రసంగం వింటే అతనికి నగరంపై పూర్తిగా అవగాహనలేదనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నగరంలో స్వయంగా పర్యటిస్తేనే పదిహేనేళ్ల కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలనలో ఢిల్లీవాసులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుస్తాయన్నారు. రాజధాని నగరాన్ని స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్‌పై సైతం ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయంటూ దుయ్యబట్టారు. ‘ఢిల్లీ నగరాన్ని అభివృద్ధి చేశానంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఢిల్లీవాసులనేకాదు ఆపార్టీ అధిష్టానాన్ని మోసం చేస్తోంది. ముఖ్యమంత్రి చూపుతున్న అభివృద్ధి చిత్రాలను చూసి నగరం మొత్తం ఇలాగే ఉందన్న భావనలో రాహుల్‌గాంధీ ఉన్నట్టున్నారు. వాస్తవాలు తెలియాలంటే ఆయన నగరంలో స్వయంగా పర్యటించాల’ని అన్నారు. నగరానికి అధికారాలు విస్తరించాలంటూ ముఖ్యమంత్రి కొత్త ప్రతిపాదలను చేస్తూ అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ రాష్ట్ర ప్రతిపత్తిపై బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం 2004లో పంపితే ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తిరస్కరించారన్నారు. సోనియా, మన్మోహన్ క్షమాపణ చెప్పాలి: హర్షవర్ధన్ నరేంద్ర మోడీ పాట్నాలో నిర్వహించిన హూంకర్ ర్యాలీ సమీపంలో బాంబుపేలుళ్ల్లు జరగడంపై ఆయా పార్టీల నాయకులు చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ తీవ్రంగా ఖండించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేలుళ్లపై కాంగ్రెస్, జేడీయూ నాయకులు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నాయకుల మాటలు దేశం పరువుతీసేలా ఉన్నాయన్నారు. ముందస్తు పథకం ప్రకారమే బాంబు పేలుళ్లు జరిపారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. పార్టీ సీనియర్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పేలుళ్లలో గాయపడిన వారికి, మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాట్నాలో హూంకర్ ర్యాలీ నిర్వహించనున్నట్టు కొన్ని నెలల ముందే బీహార్ ప్రభుత్వానికి బీజేపీ నాయకులు సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు. సంఘ విద్రోహ శక్తులు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హత్యకు కుట్రచేస్తున్నా నితీశ్‌సర్కార్ చూస్తూ కూర్చుందన్నారు. నెల క్రితమే ర్యాలీలో బాంబులు పేల్చేందుకు ఉగ్రవాదులు పథక రచన చేసినట్టు కేంద్ర హోంశాఖ బీహార్‌ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు హోంమంత్రి షిండే పేర్కొన్నారన్నారు. అయిన్పటికీ ర్యాలీ మైదానం సమీపంలో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయలేదన్నారు. కనీసం అంబులెన్స్‌లను సైతం ర్యాలీ ప్రదేశంలో ముందస్తుగా ఉంచలేదన్నారు. దాదాపు ఏడు లక్షల మందికిపైగా ప్రజలు ఒక్కచోట చేరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. అదే రాహుల్‌గాంధీ ప్రచారానికి భద్రత కల్పిస్తున్న ప్రభుత్వాలు బీజేపీ విషయంలో వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. రాహుల్ ర్యాలీ విఫలం ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మరికొందరు కేంద్రమంత్రులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని భారీగా ఏర్పాట్లు చేసినా మంగోలిపురిలో రాహుల్‌గాంధీ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి స్పందన రాలేదని వ్యాఖ్యానించారు. దీనిద్వారా రాహుల్‌కి ప్రజల్లో ఏమాత్రం గుర్తింపు ఉందో మరోమారు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ పూర్తిగా విఫలమైందన్నారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్‌గాంధీకి ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తధ్యమన్నారు. -
లోక్‌సభకు విజయ్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: అధిష్టానం ఒత్తిడికి తలొగ్గి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసు నుంచి వైదొలగిన విజయ్ గోయల్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి పోటీచేసే అవకాశముంది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయరని, లోక్‌సభ కు పోటీచేయవలసిందిగా పార్టీ చేసిన ప్రతిపాదనకు అంగీకరించారని ఆయన అభిమానులు తెలిపారు. ఆయన ఢిల్లీ బీజేపీ అధ్యక్షపదవినుంచి వైదొలగరని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసు నుంచి విజయ్‌గోయల్ రెండు రోజుల కిందటే వైదొలగారని వారు తెలిపారు. బుధవారం ఉదయం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన విజయ్ గోయల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా డా. హర్షవర్ధన్‌కు మద్దతునివ్వాలని తన అభిమానులను కోరారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపికచేయకపోవడంపై అసంతృప్తి ఏమీలేదని విజయ్ గోయల్ ప్రకటించారు. క్రమశిక్షణగల కార్యకర్తగా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయానికి తలొగ్గుతానని ఇదివరకే చెప్పానని ఆయన తెలిపారు. పార్లమెంటరీ బోర్డు నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా డా. హర్షవర్ధన్‌కు అందరూ సహకరించాలని తాను పార్టీ కార్యకర్తలకు చెప్పానని గోయల్ తెలిపారు. పార్టీ ఒక్కతాటిపై ఉందని ఆయన ప్రకటించారు. పార్టీని గెలిపించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. గడచిన ఎనిమిది నెలలుగా పార్టీ నిర్మాణానికి కష్టపడి పనిచేశామని ఆయన చెప్పారు. 40 ఏళ్లుగా పార్టీలో తాను క్రమశిక్షణగల కార్యకర్తగా సేవలందిస్తున్నానని ఈ సందర్భంగా గోయల్ ప్రకటించారు. కొన్నిసార్లు పార్టీ నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉండనంత మాత్రాన బాధపడాల్సిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాననేది మీడియా సృష్టేనని ఆయన ఆరోపించారు. తాను రాజీనామా చేయలేదని, చేయబోనని, పార్టీ కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. నష్టం తెచ్చిన ఒంటెత్తు పోకడ అధ్యక్షుడిగా నియంతృత్వ ధోరణి, ఒంటెత్తు పోకడల వల్లే బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ సీఎం అభ్యర్ధిత్వం నుంచి తొలగాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని నెలల కిందట ఆర్ఎస్ఎస్ ఆశీస్సులతో ఆ పార్టీ నాయకుడు ఆర్తీ మెహ్రా ఇచ్చిన విందులో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీలో జిల్లా, రాష్ర్ట కార్యవర్గాల నియామకాల తీరుపై చర్చ రాగా, పలువురు స్థానిక నేతలు గోయల్‌పై ఫిర్యాదులు చేశారు. కార్యవర్గాల ఎంపికలో ఆయన ఒంటెత్తు పోకడకు పోయాడని, స్థానిక నాయకులెవరినీ పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు గుప్పించారు. దాంతో పార్టీకి నష్టం కలిగించే విధంగా గోయల్ చర్యలు ఉంటున్నాయన్న భావనతో ఆర్ఎస్ఎస్ సైతం సీఎం పదవికి తగిన అభ్యర్థిగా హర్షవర్ధన్ వైపు మొగ్గు చూపినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సీఎం అభ్యర్థిపై అధిష్టానానికి గోయల్ విజ్ఞప్తి
ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్షవర్దన్‌ను ఎంపిక చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో తిరుగుబాటు ధోరణి కనబర్చిన విజయ్‌గోయల్ హఠాత్తుగా చల్లబడ్డారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో లేనని, సదరు అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ప్రకటించారు. అయితే హర్షవర్ధన్ అభ్యర్థిత్వంపై సంపూర్ణ వ్యతిరేకతను కనబరస్తున్న గోయల్ ఈ విషయమై పార్టీ అగ్రనేతలను కూడా కలిసినట్లు సమాచారం. సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వివాదంతో సంక్షోభంలో చిక్కుకున్న ఢిల్లీ బీజేపీ నష్టనివారణ చర్యలు తీసుకోవడంలో సఫలీకృతం కానట్లే కనిపిస్తోంది. ఆదివారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో డాక్టర్ హర్షవర్ధన్ పేరు ముఖ్యమంత్రి పదవికి ఖరారైనట్లు తెలుసుకున్న గోయల్ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘హర్షవర్ధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే పార్టీ అధ్యక్షుడిగా ఇదే అంకిత భావంతో పనిచేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘అటువంటి నిర్ణయమే తీసుకుంటే నేను సంతోషించను’ అని బాహాటంగానే తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తానే ముందున్నానని తొలుత ప్రకటించి వివాదాన్ని సృష్టించిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్.. తాను ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో లేనని, సదరు అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి అర్హులైన నలుగురు అభ్యర్థుల పేర్లను పార్టీ పరిశీలిస్తోందన్నారు. వర్ధన్ ముఖ్యమంత్రి రేసులో ముందున్నాడన్న విషయాన్ని కూడా గోయల్ అంగీకరించలేదు. డాక్టర్ హర్షవర్దన్‌ను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రటిస్తే తాను అధ్యక్ష పదవిని వీడుతానంటూ వచ్చిన వార్తలనూ ఆయన ఖండించారు. ఆదివారం నాటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయానన్న వార్తల్లోనూ వాస్తవం లేదని, తాను ఆ కమిటీలో సభ్యుడిని కానందునే అక్కడి నుంచి యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లానని వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఆమె కోటరీ ఈ పుకార్లను వ్యాపింపజేస్తోందని గోయల్ ఆరోపించారు. ఇదిలాఉండగా కానీ పార్టీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్, నరేంద్ర మోడీ, సుష్మాస్వరాజ్‌లను కలిసి వర్ధన్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన పది సర్వేల్లో ముఖ్యమంత్రి పదవికి తానే అర్హుడనని మెజార్టీ ప్రజలుఅభిప్రాయపడిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఏదో ఉంది... అయితే గోయల్ ఇచ్చిన ఈ వివరణ విలేకరులను సంతృప్తి పరచలేకపోయింది. ఆయన ఎప్పటి మాదిరిగా ఢిల్లీ బీజేపీ కార్యాలయంలోగాక ఈ సమావేశాన్ని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించడంపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. బీజేపీలో సమస్య ఏమీ లేదని గోయల్ అంటున్నా సంక్షోభం కొనసాగుతోందన్న విషయాన్ని ఆయన మాటలు సూచించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్దన్‌ను ప్రకటించాలని ఆదివారం సమావేశమైన పార్లమెంటరీ బోర్డు అభిప్రాయపడిందని, బోర్డు అధ్యక్షుడు అరుణ్ జైట్లీ విదేశాల నుంచి ఢిల్లీకి వ చ్చిన తరువాత ఈ ప్రకటన వెలువడుతుందని ఊహాగానాలు వినిపించాయి. పార్టీ కోసం గత ఎనిమిది నెలలుగా శ్రమించిన తనను కాదని హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించడాన్ని సహించలేని గోయల్ రాజీనామాకు సిద్ధపడ్డట్టు పుకార్లు వచ్చాయి. ఈ కోపంతోనే ఆయన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయారని భావించారు. గోయల్ అధ్యక్ష పదవిని వీడితే ఆయన స్థానంలో ఆర్తిమెహ్రా, విజయ్ జోలీ, విజేంద్ర గుప్తా పేర్లను అధిష్టానం పరిశీలిస్తోందని కూడా వార్తలు వచ్చాయి. గోయల్ మాత్రం అధ్యక్ష పదవిని వీడబోవడం లేదని ఆదివారమే స్పష్టం చేశారు. అయితే సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు గోయల్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారం సంచలనం సృష్టించింది. ఆయన తిరుగుబాటు ప్రకటించడం తథ్యమన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. అయితే గోయల్ మాత్రం ఎప్పటి మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘నేను ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో లేను. ఈ విషయంపై మా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. నేను పదవికి రాజీనామా చేయడం లేదు. ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడానికే ఆదివారం నేను బీజేపీ కార్యాలయానికి వెళ్లాను’ అని వివరణ ఇచ్చారు. హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత కూడా ఇప్పటి మాదిరిగానే దూకుడుగా పనిచేస్తారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. సమస్య ఏమీ లేదంటూ గోయల్ వాదించే ప్రయత్నం చేస్తున్నా ఢిల్లీ బీజేపీ కార్యాలయాన్ని వదిలి కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం గోయల్ ఆంతర్యాన్ని వెల్లడిస్తోందని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే బహిరంగంగా తిరుగుబాటు చేయడంవల్ల కలిగే నష్టాన్ని గోయల్ గుర్తించారనే వాదనలూ వినిపిస్తున్నాయి. గతంలో పార్టీని ధిక్కరించిన వారందరికీ పట్టిన గతిని ఆయన గుర్తించే తిరుగుబాటు ఆలోచనను విరమించుకున్నారని అంటున్నారు. -
త్వరలోనే హర్షవర్దన్ పేరు ప్రకటన
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్ధన్‌కు అవకాశం రాకుండా గోయల్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టానం మాత్రం ఆయనవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపే హర్షవర్ధన్ పేరును లాంఛనంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఆదివారం నాటి పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో అధిష్టానం ఈ మేరకు సంకేతాలు పంపింది. అయితే బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ విదేశీ పర్యటన కారణంగా ఈ సమావేశానికి రాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 31న నిర్వహించే పార్లమెంటు బోర్డు భేటీలో హర్షవర్ధన్ పేరును అధికారికంగా ప్రకటిస్తారని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతోపాటు సీనియర్లు ఎల్కే అద్వానీ, జైట్లీ, ఆర్ఎస్ఎస్ కూడా హర్షవర్ధన్వైపే మొగ్గుచూపడమే ఈ పరిస్థితికి కారణం. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, మరో సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా హర్షవర్ధన్‌కు మద్దతు ప్రకటించడంతో గోయల్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. రాజీనామా చేసినా దానిని ఆమోదిస్తామని అధిష్టానం గోయల్‌ను హెచ్చరించడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై గందరగోళం
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై గందరగోళం కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయెల్ తాను ఏ పదవికీ అభ్యర్థిని కాదని సోమవారం చెప్పారు. ముందుగా అభ్యర్థిని ఎంపిక చేయడం వల్ల పార్టీలో విభేదాలు వస్తాయని, దీనివల్ల ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హర్షవర్ధన్ పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో హర్షవర్ధన్‌తో పోటీపడుతున్నారా అన్న ప్రశ్నకు.. తాను ఏ పదవికీ పోటీదారుడు కాదని గోయెల్ బదులిచ్చారు. ఈ విషయంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది కార్యకర్తల అభీష్టం మేరకు ఎంపిక చేస్తుందని తెలిపారు. హర్షవర్ధన్‌ను ఎంపిక చేస్తే పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తానని వచ్చిన వార్తలను గోయెల్ ఖండించారు. పార్టీ అగ్రనేతలు రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీలతో ఆయన ఇటీవల సమావేశమయ్యారు. -
‘చీకటి ఒప్పందం బయటపడింది’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌శాఖ కార్యదర్శి భార్య పేరున విదేశీ ఖాతాల్లో డబ్బున్న వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం వెంటనే ఎన్నికల కమిషన్‌ను కలిసి ఢిల్లీ విద్యుత్‌శాఖ కార్యదర్శిని విధుల్లోంచి తప్పించే లా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ సూచించారు. అధికారుల ఖాతాల్లోకి అడ్డగోలుగా డబ్బుల ప్రవాహాన్ని చూస్తే ప్రభుత్వం, విద్యుత్ కంపెనీల మధ్య చీకటి ఒప్పందం కుదిరినట్టు తేటతెల్లమవుతోందని ఆరోపించారు. పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనలో విద్యుత్ చార్జీలు 300 శాతం పెరగడానికి ఇవే ప్రధాన కారణమని ఆయన దుయ్యబట్టారు. తాము అధికారంలో వస్తే కరెంటు చార్జీలను 30 శాతం వరకు తగ్గిస్తామని ప్రకటిం చారు. ‘విద్యుత్‌శాఖ కార్యదర్శి భార్య పేరిట విదేశీబ్యాంకు ఖాతాల్లో లెక్కకు మించి డబ్బు జమయింది. గృహిణి అయిన ఆమె పేర ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎలా జమచేయగలిగా రు ? ఆ డబ్బు ఎలా వచ్చింది. భారీస్థాయిలో విద్యుత్ కుంభకోణం జరి గిందనడానికి ఇదే ఆధారం. ఈ విషయం బయటికి వచ్చిన తర్వా త 24 గంటలపాటు ఎదుదురు చూశాం. అయి నా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాం’ అని గోయల్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ కార్యదర్శి ఫోన్‌కాల్స్ వివరాలను బయటపెట్టాలని గోయల్ డిమాండ్ చేశారు. కాల్‌డేటా బయటపెడితే కార్యదర్శి, కాంగ్రెస్ నాయకులకు మధ్య ఉన్న సంబంధాలు బయటికి వస్తాయన్నారు. ప్రస్తుతం ఢిల్లీ విద్యుత్‌శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారిని ఇటీవలే గోవాకి బదిలీ చేశారని, మళ్లీ ఆయననే గోవా నుంచి ఢిల్లీకి పిలి పించారని పేర్కొన్నారు. వీట న్నింటిపై సమగ్ర విచారణ చేయాలని విజయ్ గోయల్ డిమాండ్ చేశారు. -
సీఎం అభ్యర్థి ఎంపికపై అయోమయం
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వివాదం బీజేపీకి ముచ్చెమటలు పుట్టిస్తోంది. హర్షవర్దన్‌ను ఎంపిక చేస్తారంటూ వచ్చిన వార్తలతో అప్రమత్తమైన గోయల్ మద్దతుదారులు పార్టీ కార్యాలయం ఎదుట గురువారం బలప్రదర్శనకు దిగారు. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్ గడ్కరీ ప్రకటించారు. అభ్యర్థి పేరును ప్రకటించడంలో ఆలస్యం చేయడం వల్ల పార్టీ ఘోరంగా నష్టపోతుందని, కాంగ్రెస్, ఆప్‌లు లాభపడుతాయని కార్యకర్తలు అంటున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పేరును ఖరారు చేయడం ఢిల్లీ బీజేపీకి కత్తిమీద సాములా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తాజాగా వచ్చిన ఊహాగానాలతో సీనియర్ నాయకుడు విజయ్ గోయల్ తిరుగుబాటు చేయడం అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ విషయంలో గోయల్, ఆయన మద్దతుదారుల ఒత్తిడి దృష్ట్యా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో నాన్చు డు ధోరణిని వీడాలని కార్యకర్తలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టంభన తమ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందనే కలవరమూ వారిలో మొదలయింది. 2008లో అంతర్గత విబేధాలే పార్టీని అధికారానికి దూరం చేశాయని, ఈ ముసలమే ఈసారి కూడా ముప్పు తెస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్దన్ని ప్రకటించే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు మంగళవారం ఊపందుకోవడంతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు గోయల్ వర్గం అప్రమత్తమయింది. అభ్యర్థి రేసులో తానే ముందున్నానని, ప్రజాభిప్రాయం తనకు అనుకూలంగా ఉంద ని గోయల్ బుధవారం ప్రకటించారు. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటూ గోయ ల్ మద్దతుదారులు ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్ గడ్కరీ కార్యాలయం ఎదుట గురువారం బలప్రదర్శనకు దిగారు. హర్షవర్దన్ పేరును తాము అంగీకరించబోమని స్పష్టీకరించారు. దీనికితోడు 1998నాటి పొరపాటును పునరావృతం చేయరాదని గోయల్ హెచ్చరించడం వంటి పరిణామాలు బీజేపీ అధిష్టానానికి చిరాకు కలిగిస్తున్నా యి. ఎన్నికలు సమీపిస్తుండగా ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసే వ్యూహాలు, ప్రచారంపై దృష్టి సారించకుండా తమ నేతలు స్వప్రయోజనాల గురించి పాకులాడడంపై కార్యకర్తలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మూడుసార్లు అధికారాన్ని దక్కించుకుని, నాలుగోసారి కూడా తమ ప్రభుత్వమే ఏర్పడుతుం దన్న ధీమాతో కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మరోవైపు అవినీతి, కరెంటు, నీటి చార్జీల పెంపు, ధరల పెరుగుదల వంటి సమస్యలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఆమ్ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ‘ఈ రెండు పార్టీలు ఓట్లపై దృష్టి సారిస్తుండగా, మా నేతలు మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. సరైన నాయకత్వం లేమివల్లే బీజేపీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలకు చూపించకలేకపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని అవకాశంగా తీసుకుని ముందుకు దూసుకుపోతోంది. ఢిల్లీ బీజేపీలో ఐక్య త లేదన్న విషయం గోయల్ తిరుగుబాటు మరోసారి నిరూపించింది’ అని బీజేపీ నాయకుడు ఒకరు అన్నారు. మొదటి నుంచీ అసమ్మతే.. నిజానికి గోయల్‌ను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచి పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఆయన ఒంటెత్తు పోకడలు సహించలేని పలువురు సీనియర్ నేతలు గోయల్‌ను పదవి నుంచి తొలగించాలని అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. తనను షీలాదీక్షిత్ ప్రత్యర్థిగా చూపుకోవడానికి గోయల్ చేస్తున్న ప్రయత్నాలు వారికి రుచించడం లేదు. గోయల్‌కు బదు లు వివాదరహితుడైన హర్షవర్దన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఒత్తిడి తెచ్చారు. హర్షవర్దన్ అభ్యర్థిత్వాన్ని సుష్మాస్వరాజ్, అద్వానీ, నరేం ద్రమోడీ, అనంత్‌కుమార్ వంటి సీనియర్లు కూడా బలపరుస్తున్నారని అంటున్నారు. మచ్చచలేని వ్యక్తిగా ముద్రపడినవారినే ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా భావి స్తోంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే గోయల్ పార్టీ విజ యావకాశాలను దెబ్బతీయవచ్చన్న భయం అధిష్టానానికి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని ప్రకటించే విషయంలో నాన్చుడు ధోరణి అనుసరించాలని భావిస్తోంది. నిర్ణయాధికారాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీకి అప్పగించారని తెలిసింది. అయితే వారు ఈ విషయంపై ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేకపోయారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్లమెంటరీ బోర్డు త్వరగా సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చాలని కార్యకర్తలు కోరుతున్నారు. అయితే పార్లమెంటరీ బోర్డు సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని, ఆదివారం సమావేశం కావచ్చని సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. గోయల్ మద్దతుదారుల బలప్రదర్శన ముఖ్యమంత్రి అభ్యర్థిగా గోయల్ పేరును ప్రకటించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీ బీజేపీ కార్యాలయం ఎదుట గుమిగూడిన గోయల్ మద్దతుదారులు గోయల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మద్దతుదారులతోపాటు విజయ్‌గోయల్‌ను ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్ గడ్కరీ లోపలికి పిలిచించి మాట్లాడారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని గడ్కరీ వారికి చెప్పారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని నితిన్ గడ్కరీ తెలిపారు. 1998లో చేసిన పొరపాటును పార్టీ తిరిగిచేయరాదని ఈ సందర్భంగా గోయల్ అన్నారు. గోయల్ గురువారం టీవీ చానెల్‌తో మాట్లాడుతూ బలప్రదర్శన చేయవలసిన అవసరం తనకు లేదని, గత ఎనిమిది నెలలుగా తాను చేసిన పని పార్టీ నేతలకు కని పిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తానొక్కడినే లేనన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అభ్యర్థి విషయమై పార్టీలో నెలకొన్న ప్రతిష్టంభన వల్ల పార్టీకి నష్టమేమీ ఉండబోదన్నారు. ఇది లా ఉంటే కృష్ణాగనర్ నియోజకవర్గంలో గురువారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన హర్షవర్దన్ ఈ వివాదంపై మాట్లాడడానికి నిరాకరించారు. -
బీజేపీ సీఎం అభ్యర్థిత్వంపై విజయ్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ : సీఎం అభ్యర్థికి తానే సరైన నాయకుడినని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ పరోక్షంగా నొక్కిచెప్పారు. ఎన్నికల ప్రచారంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడినే సీఎం అభ్యర్థిగా అధిష్టానం ప్రకటిస్తుందనుకుంటున్నానని బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సీఎం అభ్యర్థిత్వం విషయానికి వస్తే పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించే వాడినే ప్రకటిస్తారని భావిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న గోయల్ ఆ గౌరవం తనకే దక్కుతుందన్న సంకేతాలను ఇచ్చారు. ఇప్పటికే గోయల్‌పై సీనియర్ నాయకులు ఫిర్యాదులు చేయడంతో హర్షవర్ధన్ పాటిల్ పేరును అధిష్టానం సీఎం అభ్యర్థిత్వానికి పరిశీలిస్తుందన్న వార్తల నేపథ్యంలో గోయల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఇప్పటివరకు తాము నిర్వహించిన ప్రచారాలు, ర్యాలీలను మీరు చూశారు. అన్నింట్లో విజయవంతమయ్యామని, సమర్థంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామ’ని గోయల్ చెప్పుకొచ్చారు. పార్టీ సీఎం అభ్యర్థిత్వాన్ని వివాదం చేసి తనకున్న క్లీన్ ఇమేజ్ను చెడగొట్టొద్దని విలేకరులను వేడుకున్నారు. గత 40 ఏళ్ల నుంచి ఇప్పటివరకు తనపై ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. తన క్లీన్ ఇమేజ్ను చెడగొట్టొద్దని విలేకరులపై రుసరుసలాడారు. ప్రజల తో సత్సంబంధాలు కలిగిన నేతను తానని, ఇప్పటికే వచ్చిన ఒపీనియన్ పోల్‌లను చూస్తే సీఎం పదవిలో చూడాలనుకుంటున్న ప్రజల్లో తానొక మంచి గుర్తింపు ఉన్న నేతనని తెలిపారు. ఒపీనియన్ పోల్ చూస్తే తనకే ఛాన్స్ ఈ ముఖ్య అభ్యర్థిత్వం కోసం హర్షవర్ధన్ పేరును ప్రకటించేందుకు అగ్రనేతలు ఎల్కే అద్వానీ, నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్ సానుకూలంగానే ఉన్నారని పార్టీ వర్గాలు తెలి పాయి. అయితే ఈ పదవికి తానే సరైన వ్యక్తినంటూ గోయల్ ప్రకటన చేశారు. తనపై ఉన్న ప్రజాదరణ వివిధ ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైందన్నారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా సరైన వ్యక్తిని తానేనని తేలిందన్నారు. ‘మా పార్టీ ముందుంది. తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం రేసులో కూడా ముందున్నాన’ని తెలిపారు. పార్టీని కింది స్థాయి నుంచి పటిష్టపరిచేలా పనిచేశానని చెప్పా రు. పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని బీజేపీ పార్లమెం టరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుదని తెలిపారు. అనేక సర్వేల్లో తానే ముందున్నానని తెలిపాయని చెప్పారు. ఈ వివరాలను నితిన్ గడ్కారీకి పంపానని తెలిపారు. ఆ పదవికి పేరును ఖరారు చేసే వ్యక్తిపై తన సంతోషమనేది ఆధారపడి ఉంటుందని గోయ ల్ అన్నారు. ఒకవేళ వేరొక అభ్యర్థిని ఎంపిక చేస్తే మీరు ఇదే పద్ధతిలో పార్టీ కోసం పనిచేస్తారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, అయితే పార్టీ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, గడ్కారీ, ప్రధాన కార్యదర్శి రామ్లాల్లను గోయల్ వేర్వేరుగా కలిశారు. 14 జిల్లాల పార్టీ అధ్యక్షులు గడ్కారీని కలిసి సీఎం అభ్యర్థిత్వానికి గోయల్ పేరును ప్రతిపాదించాలని కోరారు. ఒకవేళ గోయ ల్ సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే పార్టీకి ఎంతమేర నష్టం కలిగిస్తాడో అని పార్టీ నాయక్తవం భయపడుతోందని స్థానిక బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కోట్లల్లో బొక్కేశారు పేదలకు అందాల్సిన కోట్ల రూపాయల రేషన్ సరుకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొట్టారని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ధ్వజమెత్తారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కి భాగస్వామ్యం ఉందని ఆయన విరుచుకుపడ్డారు. పీడీఎస్(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం)స్కాంకి సంబంధించి ఇటీవల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో పలు వాస్తవాలు బయటికి వచ్చాయంటూ ఆయన ఓ నివేదిక విడుదల చేశారు. నకిలీ రేషన్ కార్డులను తయారు చేసిన ప్రభుత్వ పెద్దలు వందల కోట్ల రూపాయల రేషన్ సరుకులను కాజేశారంటూ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ రేషన్‌కార్డులతో జమచేసిన ధాన్యాన్ని బయట ఫ్లోర్ మిల్లులకు విక్రయిస్తున్నట్టు ఆధారాలున్నాయన్నారు. కొన్ని కార్డుల్లో వినియోగదారుల పూర్తి చిరునామా సైతం లేదన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా 1.68 కోట్లు ఉండగా కోటి 80 లక్షల మందికి రేషన్‌కార్డులు ఉన్నట్టు వెల్లడించిందన్నారు. 2011 ఎకానమిక్ సర్వే ఆఫ్ ఢిల్లీప్రకారం 33.4 లక్షల కుటుంబాలకు 32.26 లక్షల రేషన్‌కార్డులు మంజూరయ్యాయన్నారు. నివేదికల ప్రకారం పరిశీలిస్తే 2008 నుంచి నగర ప్రభుత్వం 1.7 లక్షల నకిలీ రేషన్‌కార్డులు మంజూరు చేసినట్టు తేటతెల్లమవుతుందన్నారు. నివేదికలు బయటపడడంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రేషన్‌కార్డులను తగ్గించడం ప్రారంభించిందని, దీనిలో నిజమై న లబ్ధిదారులు సైతం కార్డులు పోగొట్టుకున్నారని గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆహార, పౌర సరఫరాల విభాగానికి సంబంధించి కాగ్ వెల్లడించిన నివేదికల్లో 82వేల రేషన్‌కార్డులు అవసరానికి మించి ప్రింట్ చేసినట్టు పేర్కొందని గోయల్ చెప్పారు. దాదాపు 92వేల మంది లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం వద్ద లేదని కాగ్ నివే దికల్లో వెల్లడైందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలోనే ఇన్ని లోటుపాట్లు ఉన్నాయని, ఇక ఆహారభద్రత బిల్లు కింద పేదలకు ఏ విధంగా లబ్ధి చేకూరుంతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల విధానాలతో పేదల ఆహారానికి భద్రత లేకుండా పోతోందన్నారు. -
సీఎంకు 15 ప్రశ్నలు సంధించిన గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: 15 ఏళ్ల పాలనలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పరిపాలన వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ సీఎం షీలాదీక్షిత్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ సవాల్ విసిరారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించి 15 ప్రశ్నలను ఆయన సంధించారు. ‘నేను అడిగే ప్రశ్నలకు ముఖ్యమంత్రి వద్ద సమాధానం లేదు. అందుకే ఆమె తన ముగ్గురు మంత్రులతో తప్పుడు నివేదికలు విడుదల చేయిస్తున్నారు’అంటూ గోయల్ విరుచుకుపడ్డారు. ‘ఎలాంటి అవకతవకలు జరగకపోతే ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలి కదా’ అని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కి గోయల్ సంధించిన 15 ప్రశ్నలు ఇవే: = నగరవాసుల ఆర్థిక జీవనంలో ఎంతో మార్పు వచ్చిందని షీలా సర్కార్ చెబుతోంది. అలాంటప్పుడు 1999-2000 మధ్య 3.6 శాతంగా ఉన్న నగరంలో నిరుద్యోగుల సంఖ్య ఇప్పుడు నాలుగు శాతానికి ఎలా పెరిగింది? = దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం నగరంలో ఉందని చెబుతున్నారు. మరి అటువంటపుడు నగరంలోని 72 శాతం మందికి ఆహార భద్రత కల్పించాల్సిన అవసరం ఏమిటి? = ప్రైవేటు కంపెనీలకు విద్యుత్ సరఫరా ఇస్తే విద్యుత్ చార్జీలు తగ్గుతాయని నమ్మబలికారు. 15 ఏళ్ల పాలనలో 300 శాతం విద్యుత్ చార్జీల్లో పెరుగుదల ఎందుకు వచ్చింది. = నగరంలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. రాష్ట్ర బడ్జెట్లో ప్రజారోగ్యానికి కేటాయించిన నిధుల్లో 29 శాతం నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదు. = నగరంలోని ఆస్పత్రుల సంఖ్యతోపాటు వాటిలోని పడకల సంఖ్య గణనీయంగా పెంచామంటున్నారు. ఢిల్లీ హ్యూమన్ డెవలప్మెంట్ నివేదిక ఇందుకు భిన్నంగా ఎందుకు ఉంది. = స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేటి కీ అత్యవసర పరిరకాల కొరత ఉన్నట్టు కాగ్ తన నివేదికలో పేర్కొంది. = నగరంలో ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించామని, ప్రపంచ స్థాయిలో రవాణా వ్యవస్థను రూపు దిద్దినట్టు చెబుతున్నా.. ఎన్నో ప్రాంతాల్లో రహదారుల దుస్థితిలో ఎటువంటి మార్పూ ఎందుకు లేదు. = పర్యావరణ పరిరక్షణకు డీటీసీ బస్సుల్లో సీఎన్జీ వాడుతున్నట్టు అధికారికంగా పేర్కొంటున్నారు. ఆరువేల డీటీసీ బస్సుల్లో కేవలం రెండు వేల బస్సులు మాత్రమే సీఎన్జీతో నడుపుతున్నారు. = తాగునీటి సరఫరాను మెరుగుపరిచినట్టు ప్రభుత్వం తన నివేదికల్లో పేర్కొంటోంది. కాగ్ పేర్కొన్న ప్రకారం 40 శాతం నగర వాసులకు జల్‌బోర్డు నీరు నేటికీ ఎందుకు అందుబాటులోకి రాలేదు? = ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువులో రాణిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం. 80 ప్రభుత్వ పాఠశాలలను మూసివేడయంతోపాటు పాఠశాలల్లోని 12వేల మంది సిబ్బంది నియామకాలను ఎందుకు పెండింగ్‌లో ఉంచింది. = అణగారిన వర్గాల వారి పిల్లల చదువుకు ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొంటున్నా వారికోసం కేటాయించిన 15 వేల సీట్లు ఖాళీగానే ఎందుకు ఉంచుతున్నారు. = నగరంలోని ఐదు లక్షల మందికి లబ్ది చేకూర్చేందుకు ఉద్దేశించిన లాడ్లీ పథకం 42శాతం సత్ఫలితాలు ఇవ్వలేకపోతున్నట్టు కాగ్ నివేదికలతో వెల్లడైంది. = నగరంలోని మహిళలు, వృద్ధులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారనడానికి ‘క్రైం క్యాపిటల్’అన్న పేరే నిదర్శనం. = నగరంలో పర్యావరణం, పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. మరి గత పదేళ్ల కాలంలో కాలుష్యం 21శాతం పెరిగినట్టు కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన నివేదికల్లో ఎందుకు పేర్కొంది? -
అంతర్గత కుమ్ములాటలతో కమలం డీలా
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత కలహాలు బీజేపీ ఉత్సాహాన్ని నీరుగార్చేశాయి. శాసనసభ ఎన్నికలకు సంబంధించిన కమిటీని ఆగస్టు 25వ తేదీనే ఎంతో ఉత్సాహంగా, ముందుగానే ప్రకటించిన ఆ పార్టీ.... అభ్యర్థుల ఎంపికకొచ్చేసరికి డీలాపడిపోయింది. ఇందుకు కారణం అంతర్గత కుమ్ములాటలేనని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు అసంతృప్తికి లోనవుతారోననే ఆందోళన కూడా ఇందుకు మరో కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి సెప్టెం బర్ 15 నాటికి తొలి జాబితా, అదే నెల చివరినాటికల్లా రెండో జాబితా ప్రకటిస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ గతంలో ప్రకటించారు. అయితే ఎన్నికల కమిటీ ఏర్పాటై 50 రోజులు గడిచిపోయినా ఇప్పటిదాకా కనీసం ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగేందుకు మొత్తం 1,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో సీనియర్ నేతల బంధువులు, కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు అసంతృప్తికి గురై తిరుగుబాటు జెండా ఎగురవేస్తారోననే ఆందోళన కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో జాప్యానికి మరో కారణమైంది. విజయావకాశాలు ఉన్న సీట్ల కోసం ప్రముఖ నేతలు పోటీపడడం పార్టీ అధిష్టానానికి మింగుడుపడడం లేదు. ఉదాహరణకు గ్రేటర్ కైలాశ్ స్థానం కోసం విజయ్ మల్హోత్రాతో పాటు విజయ్ జోలీ పోటీ పడుతున్నారు. తనకు కాకుంటే కనీసం తన కుమారుడికైనా ఆ స్థానం ఇప్పించాలని విజయ్‌కుమార్ మల్హోత్రా పట్టుదలతో ఉన్నారు. విజయ్ జోలీ దీనిపై తన అభ్యంతరాన్ని ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే షాలిమార్ బాగ్ టికెట్‌ను తనకు గానీ లేదా తన భార్య పల్లవి గోయల్కుగానీ ఇవ్వాలని విజయ్ గోయల్ కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ తనయుడు జగ్ ప్రవేశ్ కూడా ఈ సీటు నుంచి పోటీచేయాలనుకుంటున్నారు. నేతల కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చినట్లయితే కార్యకర్తల్లో నిరాశానిస్పృహలు అలుముకునే ప్రమాదం ఉందంటున్నారు. ఇర ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం కూడా అభ్యర్థుల ఎంపికలో నెల కొన్న అయోమయానికి మరింత ఊతమిచ్చేదిగా పరిణమించింది. శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు కోసం ఆగస్టు 25నే ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. ఏడుగురు ఆహ్వానితులతో 24 మంది సభ్యులతో ఎలక్షన్ కమిటీని, 54 మంది తో ఎలక్షన్ కోర్ గ్రూపును ఏర్పాటుచేసిన తరువాత సెప్టెంబర్ నెలాఖరునాటికల్లా అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తామంటూ విజయ్ గోయల్ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ అనుకున్నట్లుగా సెప్టెంబర్ 15 న తొలిజాబితా వెలువడలేదు. సెప్టెంబర్ 29న నరేంద్ర మోడీ ర్యాలీ ఉన్నందువల్ల ఆ ఏర్పాట్లలో తలమునకలయ్యామని, ఆ ర్యాలీ తరువాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఈ ర్యాలీ జరిగి 10 రోజులు దాటిపోయినా అభ్యర్థుల జాబి తా ఇంకా వెలువడనేలేదు. ఈ వారంలో కూడా ఎన్నికల కమిటీ సమావేశం కాలేదు. అంతర్గత కలహాల కారణంగా అభ్యర్థుల జాబితాను ఇప్పట్లో విడుదల చేసే పరిస్థితి లేదని, ఈ నెలాఖరునాటికి లేదా వచ్చే నెల ఆరంభంలో అభ్యర్థుల జాబితా వెలువడొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొందరపడొద్దు మరోవైపు త్వరపడి అభ్యర్థుల జాబితాను ప్రకటిం చొద్దని, దీనిపై ఉత్కంఠను వీలైనంతకాలం పొడిగించమని ఆర్ఎస్ఎస్ ఢిల్లీ శాఖ బీజేపీకి సలహా ఇచ్చిం దని అంటున్నారు. ఈ పేర్లను ఇప్పుడే ప్రకటించినట్లయితే తిరుగుబాటు అభ్యర్థులు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందువల్ల అఖరి నిమిషందాకా అభ్యర్థుల జాబితాను వెల్లడించకుండా ఉండాలని ఆర్ఎస్ఎస్ సలహా ఇచ్చినట్లు సమాచారం. -
అధికారంలోకొస్తే బాగోతం బయటపెడతాం : విజయ్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: జవాబుదారీ కమిటీ (అకౌంటబిలిటీ కమిషన్) వేసి 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని వెలికితీస్తామని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ పేర్కొన్నారు. విధానసభ ఎన్నికల్లో తమ పార్టీ లేవనెత్తే ప్రధాన అంశం కాంగ్రెస్ నాయకుల అవినీతేనని ఆయన వెల్లడించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ‘అకౌంటబిలిటీ కమిషన్ అనేది ప్రజాధనాన్ని దోచుకున్న కాంగ్రెస్ నాయకుల బండారం బయట పెడుతుంది. ఆ సొమ్ము స్వాధీనం చేసుకునే వరకు పనిచేస్తుంది. అవినీతి కుంభకోణంలో ఉన్నట్టు తేలితే ఎవరినీ ఉపేక్షించేది లేదు’అని గోయల్ హెచ్చరించారు. ఎన్నో పథకాలు పెట్టి కాంగ్రెస్‌పార్టీ నాయకులు జేబు నింపుకోవడం మినహా ఎక్కడా ప్రజలకు మేలు చేయలేదన్నారు. రాజీవ్త్న్ర ఆవాస్ యోజన వంటి పథకాలు ఇదే తరహాకి చెందినవన్నారు. పేదలను మోసగించేందుకు పలు తప్పుడు పథకాలు పెట్టారని గోయల్ ఆరోపించారు. రవాణా ,యమునా నది శుభ్రపరచడం, జేజేకాలనీలు, పునరావాస కాలనీల నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ తదితరాలకు సంబంధించిన కుంభ కోణాలన్నింటినీ బయటపెడతామన్నారు. వాస్తవాలను ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మొదటి నుంచి వక్రీకరిస్తున్నందునే జవాబుదారీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు. ముఖ్యమంత్రితో సహా ఆమె కేబినెట్లోని ప్రతి మంత్రి కాగ్, పీఏసీ, లోకాయుక్త తదితర సంస్థల నుంచి దర్యాప్తులు ఎదుర్కొంటున్నవారేనన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తన ప్రభుత్వ అవినీతికి ఆధారాలు చూపాలని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లోకాయుక్త, పీఏసీ, కాగ్ చేసిన అన్ని సూచనలు తమ కమిటీ పరిగణనలోకి తీసుకుం టుందన్నారు. వీటన్నింటితోపాటు ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ విభాగంలో రికార్డులను కూడా తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందన్నారు.‘కాంగ్రెస్ నాయకుల అవినీతి బయటపెట్టిన తర్వాత పూర్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఆ సొమ్మును ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తాం’అని గోయల్ ప్రకటించారు. బీజేపీ ‘సంవాద్’ వెబ్సైట్ ప్రారంభం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు మరింత దగ్గరయ్యేందుకు తమ పార్టీ నాయకులు, అభ్యర్థుల సమాచారాన్ని భారతీయ జనతా పార్టీకి చెందిన ‘సంవాద్ సెల్’ ఆదివారం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. నగర బీజేపీ కార్యాలయంలో సంవాద్ సెల్ సమావేశం నిర్వహించారు. పార్టీ జనరల్ సెక్రటరీ (నిర్వహణ) విజయ్ శర్మ ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శర్మ, ఢిల్లీ బీజేపీ జెనరల్ సెక్రటరీ శిఖారాయ్, సెక్రటరీ ఎస్కే శర్మ తదితరులు ఓటర్లతో వెబ్సైట్ద్వారా మమేకమయ్యారు. ఈ వెబ్సైట్ పార్టీకి, ఓటర్లకు మధ్య అనుసంధాన కర్తగా ఉపయోగపడుతుందని శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంవాద్ సెల్ కన్వీనర్ ఖేమ్‌చంద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ పదవుల నుంచి తప్పుకుంటున్న విజయ్ గోయల్ సన్నిహితులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్‌కు అత్యంత సన్నిహితుడైన సుధాంశు మిట్టల్ రాజీనామా ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆమీర్ రజా హుస్సేన్ తప్పుకోవడం, తాజాగా మిట్టల్ రాజీనామా చేయడం ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు బహిర్గతం చేస్తున్నాయి. కొద్ది కాలంలోనే ఎన్నికలున్న సమయంలోనే కీలక వ్యక్తుల రాజీనామాలు పార్టీ విజయంపై ప్రభావం చూపే అవకాశముందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ ఎన్నికల సెల్ కన్వీనర్ పదవికి రాజీనామా చేసిన మిట్టల్ ఆ లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు మంగళవారం సాయంత్రం అందజేశారు. అయితే రాజీనామాకు గల కారణాలు మిట్టల్ వెల్లడించలేదు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నా విజయ్ గోయల్‌కు అత్యంత సన్నిహితుడైన మిట్టల్ రాజీనామా పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ గద్దెనెక్కాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో మిట్టల్ తప్పుకోవడం కిందిస్థాయి కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్లినట్టవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా తప్పుకుంటున్న గోయల్ మద్దతుదారులు సుధాంశు మిట్టల్ ఢిల్లీ బీజేపీ ఎన్నికల సెల్ కన్వీనర్‌గా పనిచేస్తూ ఎలక్షన్ వార్ రూమ్ మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఆయన గోయల్‌కు సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. గోయల్‌కు సన్నిహితుడైన ఆమీర్ రాజా హుస్సేన్ కూడా కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ అల్లర్లకు నరేంద్ర మోడీ బాధ్యుడని, ఆయనను తన నేతగా గుర్తించనని అన్నందుకు హుస్సేన్ రాజీనామా చేయవలసి వచ్చిందన్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా మిట్టల్ రాజీనామా వెనుక కూడా మోడీకి సన్నిహితుడైన జాతీయ నేత హస్తముందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మిట్టల్‌ను ఎలక్షన్ సెల్ కన్వీనర్‌గా నియమించినప్పుడే ఆయన వ్యతిరేకించారని అంటున్నారు. ఢిల్లీ బీజేపీలో జాతీయ నేతల జోక్యాన్ని, అంతఃకల హాలను తట్టుకోలేక మిట్టల్ రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకున్నారు: గోయల్ వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ఎన్నికల సెల్ కన్వీనర్ పదవికి మిట్టల్ రాజీనామా చేశారని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ అన్నారు. రాష్ట్ర బీజేపీలో 40 ఎన్నికల విభాగాలు ఉన్నాయని, అందులో ఇదొకటి మాత్రమేనని వ్యాఖ్యానించారు. గోయల్ బలాన్ని తగ్గించే యత్నం ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ గోయల్ నమ్మినబంటులను పార్టీ అధిష్టానం కావాలనే తప్పిస్తోందని పార్టీలోని ఓ వర్గం వాదిస్తోంది. ఆయన పనితీరుపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో గోయల్ బలాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటోంది. అందుకే అతని సన్నిహితులను ప్రధాన పదవుల నుంచి తప్పిస్తోందని వాదిస్తోంది. దీనికి మొన్న ఆమీర్ రజా హుస్సేన్, ఇప్పుడు సుధాంశు మిట్టల్ రాజీనామాలనే ఉదంతాలుగా చెబుతోంది. గోయల్, మిట్టల్ ఇతర నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే అన్ని నిర్ణయాలు తీసుకోవడంతో అసంతృప్తి చెందిన కొంత మంది నాయకులు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతోనే అధిష్టానం నుంచి ఆదేశాల మేరకు మిట్టల్ రాజీనామా చేశారని గోయల్ వ్యతిరేకీయులు అంటున్నారు. త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని, ఆ తర్వాత గోయల్ ప్రాధాన్యత మరింత తగ్గే అవకాశముంటుందని చర్చించుకుంటున్నారు.