సాక్షి, న్యూఢిల్లీ: భారీ కసరత్తు అనంతరం విధానసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బీజేపీ బుధవారం ప్రకటించింది. తీవ్ర చర్చోపచర్చలకు తెరదించుతూ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షత కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఎల్‌కే.అద్వానీ, డా.మురళీ మనోహర్‌జోషి,ఎం.వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీ, సుష్మాస్వరాజ్,అరుణ్‌జైట్లీతోపాటు కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. 70 నియోజకవర్గాలకుగాను మొదటి విడతలో మొత్తం 62 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో నాలుగు టికెట్లను అకాలీదళ్‌కు కేటాయించారు.
ఢిల్లీ విధానసభ ఎన్నికల బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా.హర్షవర్ధన్ వరుసగా నాలుగుమార్లు గెలిచిన కృష్ణానగర్ నుంచే బరిలోకి దిగనున్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఢిల్లీప్రదేశ్ మాజీ అధ్యక్షుడు విజేంద్రగుప్తాను బరిలోకి దించాలని కమలదళం నిర్ణయించింది. కాగా మొదటి విడత అభ్యర్థుల జాబితాలో బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్‌కి చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు అంతంతమాత్రంగానే ఉండడంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు.
నాలుగుస్థానాల్లో పోటీ చేయనున్న అకాలీదళ్
న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని ఎస్‌ఏడీ నగర శాఖ అధ్యక్షుడు మంజిత్‌సింగ్ బుధవారం వెల్లడించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకుని నగర పరిధిలోని రాజౌరి గార్డెన్, షహధర, కల్కాజీ, హరినగర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు. అభ్యర్థుల పేర్లను తమ పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందన్నారు.
టికెట్లు పొందినవారి జాబితా:
క్ర.సం. నియోజకవర్గం అభ్యర్థిపేరు
1 నరేలా నీల్‌ధామన్‌ఖాత్రి
2 బురాయి శ్రీకృష్ణత్యాగి
3 బదాలీ విజయ్‌భట్
4 రిటాలా కుల్వంత్‌రాణా
క్ర.సం. నియోజకవర్గం అభ్యర్థిపేరు
5 ముండ్‌కా మనోజ్ షకీన్
6 కిరారీ అనిల్‌ఝా
7 సుల్తాన్‌పుర్‌మజారా(ఎస్సీ) సుశీలాబగాడి