మంచినీరూ కరువే | Congress running personal campaign against Modi: Vijay Goel | Sakshi
Sakshi News home page

మంచినీరూ కరువే

Published Sat, Nov 23 2013 11:43 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

దేశరాజధానిని 15 ఏళ్లపాటు పాలించిన షీలా దీక్షిత్ ఒరగబెట్టిందేమీ లేదని, నగరవాసులకు కనీస అవసరమైన మంచినీరు కూడా సరఫరా చేయలేకపోయారని గుజరాత్ ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ: దేశరాజధానిని 15 ఏళ్లపాటు పాలించిన షీలా దీక్షిత్ ఒరగబెట్టిందేమీ లేదని, నగరవాసులకు కనీస అవసరమైన మంచినీరు కూడా సరఫరా చేయలేకపోయారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ద్వారకలో శనివారంసాయంత్రం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలపై నిప్పులు చెరిగారు. ‘షీలా దీక్షిత్ గుజరాత్ అభివృద్ధి నమూనాను తప్పుబడుతున్నారు. ఆమె తన కుమారుడు, కోడలితోపాటు మారుతి కారులో ప్రయాణిస్తూ గుజరాత్‌భారీ పైప్‌లైన్‌ను పరిశీలించవచ్చు. అది తొమ్మిది వేల గ్రామాలకు నీరు సరఫరా చేస్తోంది. యమునా నది శుద్ధీకరణ కోసం ఆమె ప్రభుత్వం కోట్లాది రూపాయలు కుమ్మరించినా అది ఇప్పటికీ మురికికూపంలాగే ఉంది. గుజరాత్ సబర్మతి తీరాన్ని ఒక్కసారి సందర్శించాలని నేను షీలా దీక్షిత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌గోయల్, ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్దన్ తదితరులు ర్యాలీకి హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement