కాంగ్రెస్‌కి ఓటమి భయం పట్టుకుంది | Delhi polls: BJP chief Vijay Goel says his aim is to defeat Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కి ఓటమి భయం పట్టుకుంది

Published Sat, Nov 30 2013 11:20 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Delhi polls: BJP chief Vijay Goel says his aim is to defeat Congress

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సభలకు వస్తున్న మద్దతు చూసి ఢిల్లీ విధానసభ ఎన్నిక ల్లో తమ ఓటమి తప్పదన్న భయం కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతోందని బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఎన్నికల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపెట్టుకునేం దుకు సిద్ధమంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీఎం వ్యాఖ్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌కి బీ పార్టీ అన్న విష యం అర్థమైపోయిందన్నారు. నరేంద్ర మోడీ ర్యాలీలకు లక్షలాదిగా తరలివచ్చి మద్దతు తెలి యజేస్తున్న ఢిల్లీవాసులకు  విజయ్‌గోయల్ కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీల విజయవంతానికి కృషి చేస్తున్న పార్టీ నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు.‘మోడీ సభలకు వచ్చినంత జనం ఢిల్లీలో మరేపార్టీ నాయకులు నిర్వహించిన సమావేశాలకు రావడంలేదు. దీన్ని బట్టే బీజేపీకి ఢిల్లీవాసులు ఎంతమేరకు మద్దతు ఇస్తున్నారో అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే మద్దతు కొనసాగుతుంద’న్నారు. 
 
 కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన ర్యాలీ లు వెలవెలబోయాయన్నారు. సోనియాగాంధీ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులే బలవంతంగా జనాన్ని తరలించారంటూ మీడియా కథనాల్లోనూ వెల్లడైందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమావేశాల మధ్యనుంచే కొందరు జనం మోడీ ర్యాలీకి తరలివచ్చారన్నారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమన్నది అర్థమవుతోందని గోయల్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న తీరుపై బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోందన్నారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనను అంతమొందించాలని ఆయన ఢిల్లీవాసులకు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement