మన మంత్రిగారే అసలైన గోల్డ్ మెడలిస్ట్..
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ముగిసి మన క్రీడాకారులు రెండు పతకాలతో స్వదేశం చేరినా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ మాత్రం వారు సాధించిన ఘనతలను గుర్తు పెట్టుకోవడంలో తడబాటును కొనసాగిస్తూనే ఉన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకం, మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాలు సాధిస్తే.. వారు రియో గోల్డ్ మెడలిస్ట్లు అంటూ విజయ్ గోయల్ ట్వీట్ చేయడంపై నెటిజన్లు జోకుల వర్షం కురిపిస్తున్నారు. వీవీ సింధూ, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిసే క్రమంలో వారు రియో గోల్డ్ మెడలిస్ట్లు అంటూ విజయ్ గోయల్ ట్వీట్ చేయడం విమర్శలకు తావిచ్చింది.
ఆ పతకాల కోసం విజయ్ గోయల్ను రియోకు పంపుదామా?అంటూ ఒకరు విమర్శించగా, ఆ మంత్రి గారే అసలు సిసలైన గోల్డ్ మెడలిస్ట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. కామెడీ షోలో కపిల్ శర్మకు విజయ్ గోయల్ సరైన పోటీ అంటూ మరొకరు ట్వీట్ చేశారు.
మరోవైపు మహిళా జిమ్నాస్ దీపా కర్మాకర్ పేరును కూడా విజయ్ గోయల్ తప్పుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. దీపా కర్మాకర్ను 'దీపా కర్మనాకర్'అంటూ సంబోధించడం, అథ్లెట్లు ద్యుతీ చంద్ ఫోటోకు బదులు మరొ అథ్లెట్ స్రబాణి నందా ఫోటోను పోస్ట్ చేయడంలో విజయ్ గోయల్ ఇబ్బంది పడ్డారు.
అయితే విజయ్ గోయల్ మాత్రం తన తప్పును సరిదిద్దుకునే క్రమంలో వివరణ ఇచ్చారు. 'ఒక్కోసారి నాలుక తడబడి పొరపాట్లు జరగడం సాధారణం దీన్ని ప్రజలు ఏదో పెద్ద విషయంగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలుసు. వచ్చే ఒలింపిక్స్లో వారు స్వర్ణ పతకాలు సాధిస్తారేమో' అని విజయ్ గోయల్ పేర్కొనడం కొసమెరుపు.
Mr. Vijay Goel, is this sleeping or slipping!! https://t.co/0bG0l9kF0B
— Biswatosh Sinha (@biswatosh) 28 August 2016
Vijay Goel is the real gold medalist
Vijay Goel will give strong competition to Kapil Sharma in hosting a comedy show. #welcometocomedynightswithvijaygoel
— Nick Turrim (@mhanthung) 28 August 2016