కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ మాండవియా | Mansukh Mandaviya appointed new sports minister | Sakshi
Sakshi News home page

కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ మాండవియా

Published Tue, Jun 11 2024 4:00 AM | Last Updated on Tue, Jun 11 2024 4:00 AM

Mansukh Mandaviya appointed new sports minister

న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ మాండవియా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన అనురాగ్‌ ఠాకూర్‌ స్థానంలో 52 ఏళ్ల మాండవియాకు అవకాశం దక్కింది.

 గుజరాత్‌లోని పోర్‌బందర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గత మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 

మాండవియాకు తోడు మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సేను క్రీడా శాఖ సహాయ మంత్రిగా కూడా నియమించారు. ఠాకూర్‌ క్రీడా మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ 7 పతకాలు గెలుచుకుంది. ఠాకూర్‌ మరోసారి ఎన్నికల్లో గెలిచినా... ఈ సారి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement