porbandhar
-
ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!
ఈ ఏడాది దసరా వెకేషన్‌కి స్కూల్‌కెళ్లే పిల్లల పేరెంట్స్ హాయిగా పోర్బందర్ బాట పట్టవచ్చు. గాంధీజీ పుట్టిన నెలలో గాంధీజీ పుట్టిన నేల మీద విహరించడంలోని సంతృప్తిని ఆస్వాదించవచ్చు. జాతిపితకు నివాళులర్పించనూ వచ్చు. పిల్లలకు ఇది మరిచిపోలేని పర్యటనగా మిగిలిపోతుంది.ఈ టూర్లో బాపూ పుట్టిన ఇంటిని, ఆయన స్మారకార్థం నిర్మించిన కీర్తిమందిర్, అందులో ఆయన జీవితంలోని ముఖ్యఘట్టాలతో ఉన్న ఫొటో ఎగ్జిబిషన్, గాంధీజీ నూలు వడికిన రాట్నం... వీటన్నింటినీ చూసిన తర్వాత గాంధీజీకి చేతులెత్తి మొక్కుతాం. పిల్లల మనసులు గౌరవంతో నిండి΄ోతాయి. గాంధీజీ పుట్టిన ఇంటి నిర్మాణం ఆసక్తికరంగా ఉంటుంది.ఉడెన్ కార్వింగ్, రాతి కిటికీలను పోలిన డిజైనర్ విండోలతో అక్కడక్కడా పర్షియన్ నిర్మాణశైలితో ఎగుమ మధ్యతరగతి కుటుంబాన్ని పోలి ఉంటుంది. ఇంటి లోపల ఏర్పాట్లను గమనిస్తే నిరాడంబర జీవనశైలి అనిపిస్తుంది. గోడల మీద ఆయిల్ పెయింటింగ్స్ కళాత్మకతను ప్రతిబింబిస్తాయి. ఇంట్లో గాంధీ పుట్టిన ప్రదేశం ప్రత్యేకంగా మార్క్ చేసి ఉంటుంది. బాపూజీ ఇంటి వెనుక వైపునున్న కస్తూర్బా గాంధీ ఇంటిని మర్చిపోకూడదు.బాపూ మందిర్, కీర్తిమందిర్లను చూసిన తరవాత బయటకు వస్తే చౌరాస్తాలో గాంధీజీ విగ్రహం ఉంటుంది. ఆ సెంటర్‌ని గాంధీ చౌక్ అంటారు. ఈ టూర్లో గాంధీ స్మారకాలతోపాటు చూడాల్సినవి చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముని మందిరం, వాళ్ల గురువు సాందీపుని మందిరం, హుజూర్ ప్యాలెస్, బర్డ్ సాంక్చురీ, తారామందిర్ (ప్లానిటేరియం), భారత్ మందిర్(జామెట్రికల్ మాథ్స్ ప్రదర్శనాలయం), రామకృష్ణ మిషన్ ఉన్నాయి. చక్కటి ఎయిర్‌పోర్టు కూడా ఉంది. అరేబియా తీరంలో సూర్యాస్తమయం ఈ టూర్లో బోనస్.(చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవియా
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవియా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన అనురాగ్ ఠాకూర్ స్థానంలో 52 ఏళ్ల మాండవియాకు అవకాశం దక్కింది. గుజరాత్‌లోని పోర్బందర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గత మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. మాండవియాకు తోడు మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సేను క్రీడా శాఖ సహాయ మంత్రిగా కూడా నియమించారు. ఠాకూర్ క్రీడా మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు గెలుచుకుంది. ఠాకూర్ మరోసారి ఎన్నికల్లో గెలిచినా... ఈ సారి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు -
రైల్వేస్టేషన్లలో ‘పోర్బందర్’ మోడల్!
సాక్షి, విశాఖపట్నం: రైల్వేస్టేషన్లలో ‘పోర్ బందర్ మోడల్’ను ప్రవేశపెట్టనున్నారు. గుజరాత్‌లోని పోర్బందర్ స్టేషన్లో అక్కడి రైల్వే అధికారులు స్వచ్ఛత, భద్రతలో భాగంగా పట్టాలు దిగువన ఉండే సిమెంట్ స్లీపర్లకు అటూ ఇటూ తెలుపు, మధ్యలో ఎరుపు రంగులు వేయించారు. రైల్వే ఉన్నతాధికారులు ఆ స్టేషన్‌కు వార్షిక తనిఖీలకు వెళ్లినప్పుడు ఇవి విశేషంగా ఆకట్టుకున్నాయి. అవి అందరినీ ఆకర్షించడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రతి స్టేషన్లో ప్లాట్‌ఫారాల ఆరంభం నుంచి చివరి దాకా దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వీటిని వేస్తారు. ఇలా రంగులు వేయడం వల్ల సిమెంట్ స్లీపర్లకు ఉన్న పెండ్రాల్ క్లిప్‌ల పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమై ప్రమాదాలను నివారించడానికి, పరిశుభ్రతను తెలుసుకోవడానికి వీలుంటుంది. సాధారణంగా స్టేషన్లలో వ్యర్థాల విడుదల, గ్రీజు, ఆయిల్ వంటి పదార్థాలతో ఈ పెండ్రాల్ క్లిప్పులు సరిగా కనిపించవు. దీంతో అవి ఉన్నాయో? లేదో? వాటి స్థితి ఎలా ఉందో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా అప్పుడప్పుడు స్టేషన్లలోనే పట్టాలు తప్పడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు అందానికి అందం, భద్రతకు భద్రత ఉండే ‘పోర్బందర్’ మోడల్‌ను అమలు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. దీనిపై కొద్దిరోజుల క్రితం అన్ని రైల్వే డివిజన్లకు సర్క్యులర్లు జారీ చేశారు. ఇలా వాల్తేరు డివిజన్లోని 112 రైల్వేస్టేషన్లలో పోర్బందర్ మోడల్ అమలుకు టెండర్లు పిలిచి పనులకు కొన్నాళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు దాదాపు 40 రైల్వేస్టేషన్లలో రంగుల పక్రియ పూర్తయింది. మిగిలిన అన్ని స్టేషన్లలో నెల రోజుల్లో ఈ పోర్బందర్ మోడల్లో రంగులు వేసే పనిని పూర్తి చేయడానికి రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గుజరాత్లో కుప్పకూలిన నేవీ డ్రోన్
సాక్షి, పోర్బందర్ : గుజరాత్‌లోని పోర్బందర్ వద్ద భారతీయ వాయుసేనకు చెందిన డ్రోన్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. గురువారం ఉదయం పదిగంటలకు పోర్బందర్ ఎయిర్‌బేస్‌లో టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే డ్రోన్ నేలకొరిగింది. డ్రోన్ ప్రమాదం చోటుచేసుకుందని అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత నేవీ నిర్ధారించింది. ఇంజన్ వైఫల్యం కారణంగానే డ్రోన్ కుప్పకూలినట్టు ప్రాధమికంగా తెలియవచ్చిందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం, ప్రాణనష్టం లేకపోవడంతో వాయుసేన వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
'బోటులో వచ్చింది ఉగ్రవాదులే'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి పోరుబందర్ తీరం సమీపానికి మరబోటులో వచ్చింది టెర్రరిస్టులేనని భారత కోస్ట్ గార్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేఆర్ నౌతియాల్ చెప్పారు. డిసెంబర్ 31 రాత్రి అనుమానాస్పద బోటును గమనించామని, వెంటనే వారిని వెంటాడినట్టు తెలిపారు. తమను గమనించిన ఉగ్రవాదులు బోటుకు నిప్పుపెట్టుకున్నారని చెప్పారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో బోటు సముద్రంలో మునిగిపోయినట్టు నౌతియాల్ వెల్లడించారు. ఇదిలావుండగా, కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు కొన్ని కీలక ఫోన్ కాల్స్‌ను రికార్డు చేశారు. ఉగ్రవాదులు ఆయుధాలు అందుకున్నట్టు ఫోన్ సంభాషణల్లో వెల్లడైంది. ఈ ఘటన అనంతరం పాక్ నుంచి కాల్స్ వచ్చినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. మరణించిన ఉగ్రవాద కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తామంటూ కొందరు ఫోన్లో మాట్లాడినట్టు వెల్లడైంది.