ఈ ఏడాది దసరా వెకేషన్‌కి స్కూల్‌కెళ్లే పిల్లల పేరెంట్స్ హాయిగా పోర్‌బందర్ బాట పట్టవచ్చు. గాంధీజీ పుట్టిన నెలలో గాంధీజీ పుట్టిన నేల మీద విహరించడంలోని సంతృప్తిని ఆస్వాదించవచ్చు. జాతిపితకు నివాళులర్పించనూ వచ్చు. పిల్లలకు ఇది మరిచిపోలేని పర్యటనగా మిగిలిపోతుంది.
ఈ టూర్‌లో బాపూ పుట్టిన ఇంటిని, ఆయన స్మారకార్థం నిర్మించిన కీర్తిమందిర్, అందులో ఆయన జీవితంలోని ముఖ్యఘట్టాలతో ఉన్న ఫొటో ఎగ్జిబిషన్, గాంధీజీ నూలు వడికిన రాట్నం... వీటన్నింటినీ చూసిన తర్వాత గాంధీజీకి చేతులెత్తి మొక్కుతాం. పిల్లల మనసులు గౌరవంతో నిండి΄ోతాయి. గాంధీజీ పుట్టిన ఇంటి నిర్మాణం ఆసక్తికరంగా ఉంటుంది.
ఉడెన్ కార్వింగ్, రాతి కిటికీలను పోలిన డిజైనర్ విండోలతో అక్కడక్కడా పర్షియన్ నిర్మాణశైలితో ఎగుమ మధ్యతరగతి కుటుంబాన్ని పోలి ఉంటుంది. ఇంటి లోపల ఏర్పాట్లను గమనిస్తే నిరాడంబర జీవనశైలి అనిపిస్తుంది. గోడల మీద ఆయిల్ పెయింటింగ్స్ కళాత్మకతను ప్రతిబింబిస్తాయి. ఇంట్లో గాంధీ పుట్టిన ప్రదేశం ప్రత్యేకంగా మార్క్ చేసి ఉంటుంది. బాపూజీ ఇంటి వెనుక వైపునున్న కస్తూర్బా గాంధీ ఇంటిని మర్చిపోకూడదు.
బాపూ మందిర్, కీర్తిమందిర్‌లను చూసిన తరవాత బయటకు వస్తే చౌరాస్తాలో గాంధీజీ విగ్రహం ఉంటుంది. ఆ సెంటర్‌ని గాంధీ చౌక్ అంటారు. ఈ టూర్‌లో గాంధీ స్మారకాలతోపాటు చూడాల్సినవి చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముని మందిరం, వాళ్ల గురువు సాందీపుని మందిరం, హుజూర్ ప్యాలెస్, బర్డ్ సాంక్చురీ, తారామందిర్ (ప్లానిటేరియం), భారత్ మందిర్(జామెట్రికల్ మాథ్స్ ప్రదర్శనాలయం), రామకృష్ణ మిషన్ ఉన్నాయి. చక్కటి ఎయిర్‌పోర్టు కూడా ఉంది. అరేబియా తీరంలో సూర్యాస్తమయం ఈ టూర్‌లో బోనస్.
Comments
Please login to add a commentAdd a comment