న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి పోరుబందర్ తీరం సమీపానికి మరబోటులో వచ్చింది టెర్రరిస్టులేనని భారత కోస్ట్ గార్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేఆర్ నౌతియాల్ చెప్పారు. డిసెంబర్ 31 రాత్రి అనుమానాస్పద బోటును గమనించామని, వెంటనే వారిని వెంటాడినట్టు తెలిపారు. తమను గమనించిన ఉగ్రవాదులు బోటుకు నిప్పుపెట్టుకున్నారని చెప్పారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో బోటు సముద్రంలో మునిగిపోయినట్టు నౌతియాల్ వెల్లడించారు.
ఇదిలావుండగా, కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు కొన్ని కీలక ఫోన్ కాల్స్ను రికార్డు చేశారు. ఉగ్రవాదులు ఆయుధాలు అందుకున్నట్టు ఫోన్ సంభాషణల్లో వెల్లడైంది. ఈ ఘటన అనంతరం పాక్ నుంచి కాల్స్ వచ్చినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. మరణించిన ఉగ్రవాద కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తామంటూ కొందరు ఫోన్లో మాట్లాడినట్టు వెల్లడైంది.
'బోటులో వచ్చింది ఉగ్రవాదులే'
Published Fri, Jan 2 2015 8:18 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement