సాక్షి, పోర్‌బందర్ : గుజరాత్‌లోని పోర్‌బందర్ వద్ద భారతీయ వాయుసేనకు చెందిన డ్రోన్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. గురువారం ఉదయం పదిగంటలకు పోర్‌బందర్ ఎయిర్‌బేస్‌లో టేక్‌ఆఫ్ అయిన కొద్దిసేపటికే డ్రోన్ నేలకొరిగింది. డ్రోన్ ప్రమాదం చోటుచేసుకుందని అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత నేవీ నిర్ధారించింది.
ఇంజన్ వైఫల్యం కారణంగానే డ్రోన్ కుప్పకూలినట్టు ప్రాధమికంగా తెలియవచ్చిందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం, ప్రాణనష్టం లేకపోవడంతో వాయుసేన వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment