sports minister
-
Vinesh Phogat Row: రాజకీయ రగడ
ఢిల్లీ: ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత అంశం.. రాజకీయ రగడకు దారి తీసింది. ఈ అంశంపై లోక్‌సభలో చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనతో సంతృప్తి చెందని విపక్షాలు అభ్యంతరం చెబుతూ సభ నుంచి వాకౌట్ చేశాయి.వినేశ్ ఫోగట్ అనర్హతపై కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘అనర్హత అంశంలో తగు చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషాను ప్రధాని మోదీ ఆదేశించారు. ఈరోజు ఆమె బరువు 50 కిలోలు 100 గ్రాములు ఉన్నట్లు గుర్తించి అనర్హత వేటు పడింది. భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష పారిస్‌లో ఉన్నారు. ప్రధాని మోదీ ఆమెతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు’అని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఆమెకు వ్యక్తిగత సిబ్బందితో సహా ప్రతి సౌకర్యాన్ని అందించిందని చెప్పారు. మరోవైపు.. క్రీడామంత్రి వివరణ ఇస్తున్న సమయంలో ఈ అంశంలో పూర్తి వివరణ ఇవ్వాలని పట్టుపట్టారు. అనంతరం నిరసనలు తెలుపుతూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.#WATCH | Union Sports Minister Mansukh Mandaviya speaks on the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024He says, "…Today her weight was found 50 kg 100 grams and she was disqualified. The Indian Olympic Association has lodged a strong… pic.twitter.com/7VkjoQQyIM— ANI (@ANI) August 7, 2024మరోవైపు.. రాజ్యసభలో కూడా వినేశ్ ఫోగట్ అనర్హత అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుపట్టారు. ఇదీ చదవండి: వినేష్ ఫోగట్ అనర్హత.. కుట్రా? కఠిన వాస్తవమా?ఫోగట్‌కు న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. అనంతరం రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.#WATCH | Delhi | INDIA bloc MPs stage protest at Makar Dwar of Parliament seeking justice for wrestler Vinesh Phogat after disqualification from Paris Olympics pic.twitter.com/8qZ6GqjbeT— ANI (@ANI) August 7, 2024కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు ఏం చేశారు: పంజాబ్ సీఎంవినేశ్ ఫోగట్ అనర్హతపై పంజాబ్ సీఎంభగవంత్ మాన్ సింగ్ స్పందించారు. ఆమె బరవును చెక్ చేయాల్సిన పని కోచ్, ఫిజియోథెరపిస్టులది. ఇప్పుడు అనర్హత పడింది. ఈ అన్యాయాన్ని ఆపాలి. ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులకు లక్షల్లో జీతం ఇస్తున్నారు. వారేమైనా సెలవుల కోసం అక్కడికి వెళ్లారా?’ అని మండిపడ్డారు.#WATCH | Charkhi Dadri, Haryana | On Vinesh Phogat's disqualification, Punjab CM Bhagwant Mann says," To check her weight was the work of her coaches and physiotherapists. Now, the decision has come. This injustice should have been stopped...Did they (The Centre) fix anyone's… pic.twitter.com/0UmPHc7s4Q— ANI (@ANI) August 7, 2024 వినేశ్‌పై అనర్హత విచారకరం: రాహుల్ గాంధీ ప్రపంచ చాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన వినేశ్ భారత్‌కు గర్వకారణం. సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం విచారకరం. భారత ఒలింపిక్ సంఘం ఈ నిర్ణయాన్ని గట్టిగా సవాలు చేస్తుందని ఆమెకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం’అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో అన్నారు. పట్టు వదలకుండా ఆమె మళ్లీ రంగంలోకి దిగుతుందనే నమ్మకం ఉంది. వినేశ్ దేశం గర్వించేలా చేశావు. దేశం మొత్తం మీకు మద్దతుగా నిలుస్తోంది తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హావినేశ్ ఫోగట్ చాలా అర్హత నిబద్ధత గల క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళ. ఆమె ఒక ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించారు. ఫైనల్స్‌లో మరొక ప్రపంచ ఛాంపియన్‌తో బరిలోకి దిగాల్సింది. ఆమె అనర్హత భారతీయులందరికీ, వినేష్ ఫోగట్ మద్దతుదారులందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని అన్నారు.#WATCH | On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, TMC MP Shatrughan Sinha says, "She is a very deserving and committed athlete. She became the first Indian woman to reach the wrestling finals in the Olympics. She defeated a world champion and… pic.twitter.com/3dFMnLKOAT— ANI (@ANI) August 7, 2024అనర్హత వేటు నేపథ్యంలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. భారత దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొంటున్నారు.ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో వినేశ్ ఫొగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు. వినేశ్. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్. భారత్‌కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరే స్పూర్తి. ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.వినేశ్ ఫోగట్ అనర్హత విషయంలో ఆమెకు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలు అండగా నిలుస్తున్నారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.సంబంధిత వార్త: వినేశ్ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ కీలక ఆదేశాలు -
క్రీడా మంత్రిగా మన్సుఖ్ బాధ్యతల స్వీకరణ
కేంద్ర ప్రభుత్వంలో కొత్త క్రీడల మంత్రిగా నియమితులైన మన్సుఖ్ మాండవియా మంగళవారం న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా ప్రపంచంలో భారత్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని వ్యాఖ్యానించారు. 52 ఏళ్ల మన్సుఖ్ గుజరాత్‌లోని పోర్బందర్ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. గత ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ ఈసారి ఎన్నికల్లో నెగ్గినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. -
కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవియా
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవియా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన అనురాగ్ ఠాకూర్ స్థానంలో 52 ఏళ్ల మాండవియాకు అవకాశం దక్కింది. గుజరాత్‌లోని పోర్బందర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గత మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. మాండవియాకు తోడు మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సేను క్రీడా శాఖ సహాయ మంత్రిగా కూడా నియమించారు. ఠాకూర్ క్రీడా మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు గెలుచుకుంది. ఠాకూర్ మరోసారి ఎన్నికల్లో గెలిచినా... ఈ సారి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు -
అంపైర్లపై సంచలన ఆరోపణలు చేసిన మనోజ్ తివారి.. తాగొచ్చేవారంటూ కామెంట్స్..!
టీమిండియా మాజీ క్రికెటర్, ఇటీవలే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి దేశవాలీ అంపైర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం జరిగిన కార్యక్రమంలో అతను మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆటగాళ్లు డోప్ పరీక్షలకు వెళ్లవలసి వస్తే, దానిని దేశీయ అంపైర్లకు కూడా విస్తరించాలి. నేను చాలాసార్లు అంపైర్లు నిద్రపోతున్నట్లు చూశాను. అలా అంపైర్లను చూసిన సందర్భాల్లో.. సార్ నిన్న రాత్రి మీరు ఏమి తాగారని వారిని అడిగేవాడిని. అందుకు వాళ్లు నవ్వుతూ.. నేను విస్కీని ఇష్టపడతానంటూ సమాధానం ఇచ్చేవారు. అలా జరగకుండా దేశీయ అంపైర్లలో సీరియస్‌నెస్ రావాలంటే బీసీసీఐ తగిన చర్యలు తీసుకుని, వారికి కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని తివారి అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేయకముందు తివారి దేశవాలీ క్రికెట్‌పై, ముఖ్యంగా రంజీలపై, టీమిండియాలో తన కెరీర్ అర్దంతరంగా ముగియడంపై, ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాగా రాణిస్తున్నా టీమిండియాలో తనను తొక్కేశారంటూ ధోనిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత క్రికెటర్ల మాదిరి తనకూ ప్రోత్సాహం లభించి ఉంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలా ఉన్నత శిఖరాలకు చేరుకునేవాడినని అన్నాడు. కాగా, రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తివారి తన 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 148 మ్యాచ్‌లు ఆడిన తివారి.. 10,195 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ లో 169 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 5581 రన్స్ చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 183 టీ20ల్లో 3436 పరుగులు సాధించిన తివారి.. 2008-2015 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడి 287, 15 పరుగులు చేశాడు. వన్డేల్లో తివారి అత్యధిక స్కోరు 104 నాటౌట్‌గా ఉంది. -
చైనా కవ్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు
ఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించడంపై భారత్ మండిపడింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమని స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్.. చైనా కవ్వింపు చర్యలను ఖండించారు. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు.. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భారత 'వుషు' ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్‌ను రద్దు చేసింది. ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన మిగిలిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్జౌకు విమానంలో బయలుదేరింది. భారత్ మండిపాటు.. ఈ వ్యవహారంలో చైనా తీరుపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడం వంటి వివక్షను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది. అరుణాచల్ మాదే.. ఆసియా గేమ్స్‌ను నిర్వహించే అత్యున్నత కమిటీ దీనిపై స్పందించింది. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కమిటీకి తీసుకువెళ్లినట్లు తెలిపింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశించింది. భారత ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడంపై చైనా విదేశాంగ శాఖ మంత్రి మావో నింగ్ స్పందించారు. అన్ని దేశాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం గుర్తించలేదు. ఆ భూభాగం చైనాకు చెందిన జియాంగ్ ప్రాంతంలోనిదేనని ఆయన అన్నారు. అది చైనాలో అంతర్భాగమని తెలిపారు. ఇటీవల చైనా విడుదల చేసిన మ్యాప్ విమర్శలకు దారితీసింది. భారత్‌లోని అరుణాచల్‌ని చైనా తమ అంతర్భాగంలోనిదేనని చూపుతూ ఇటీవల మ్యాప్ రిలీజ్ చేసింది. దీనిపై భారత్ విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ అప్పట్లో స్పందించారు. చైనా కవ్వింపు చర్యలు సహించరానివని అన్నారు. అరుణాచల్ భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, భూభాగాలను ఎప్పుడూ కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..? -
కెరీర్ కు భయపడి ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు: బాధితురాలు
-
క్రీడాకారిణికి మంత్రి పేషీ ఉద్యోగి వేధింపులు
-
క్రికెట్‌కు మనోజ్ తివారీ వీడ్కోలు
కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఈ బెంగాలీ క్రికెటర్ 2008 నుంచి 2015 వరకు అంతర్జాతీయ కెరీర్లో 12 వన్డేలు, మూడు టి20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. కానీ మూడు టి20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్ అవకాశం దక్కగా 15 పరుగులే చేశాడు. దేశవాళీ క్రికెట్లో 141 మ్యాచ్‌ల్లో 48.56 సగటుతో 9908 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్ పుణేలకు ఆడాడు. 2012లో మనోజ్ తివారీ విన్నింగ్ షాట్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేబినెట్లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. -
హెచ్‌సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. హెచ్‌సీఏలో అవినీతి పెరిగిపోయిందని.. సెలక్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ తీరును ప్రభుత్వం గమనిస్తుందని త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ''ఉప్పల్ స్టేడియంకు సంబంధించిన లీజ్ త్వరలో ముగిసిపోతుంది. ఉప్పల్ స్టేడియం లీజ్‌పై ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. హెచ్‌సీఏ అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ స్టేడియాన్ని స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించే యోచనలో ఉన్నాం.'' అని వెల్లడించారు. చదవండి: చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. ఈసారి..
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసన చేస్తున్న తెలిసిందే. ఇటీవలే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు కూడా. ఆయనతో చర్చల అనంతరం రెజ్లర్లు తమ విధుల్లోకి చేరారు. ఐతే ఆందోళన మాత్రం విరమించడం లేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్ల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, దానికోసం రెజ్లర్లను మరోసారి ఆహ్వానించానని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ఈ ఆహ్వానాన్ని రెజ్లర్లు కూడా మన్నించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ని అరెస్టు చేయడం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు నిర్వహించి కొత్త చీఫ్ ఎన్నుకోవాలని డిమాండ్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. అలాగే క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా తాము ఎవర్నీ రక్షించాలనుకోవడం లేదని రెజ్లర్లకు ఈ సందర్భంగా తెలిపారు. The government is willing to have a discussion with the wrestlers on their issues. I have once again invited the wrestlers for the same. — Anurag Thakur (@ianuragthakur) June 6, 2023 ఇదిలా ఉండగా గత శనివారం అమిత్ షాతో రెజ్లర్ల సమావేశం అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ అమిత్ షాతో సమావేశం అనంతరం తిరిగి విధుల్లో చేరడం కాస్త చర్చనీయాంశంగా మారింది. కానీ రెజ్లర్లు మాత్రం న్యాయం కోసం జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు ఒలింపిక్స్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పునియా అమిత్ షాతో జరిగిన భేటీ గురించి మాట్లాడుతూ..ఆయనతో జరిగిన సమావేశం గురించి మాట్లాడవద్దని ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని అమిత్‌షా తెలిపారు. ఐతే నిరసన ఉద్యమం మాత్రం ఆగిపోలేదని, అది కొనసాగడమే గాక ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై వ్యూహ రచన చేస్తున్నామని పునియా చెప్పారు. ప్రభుత్వ ప్రతిస్పందనతో తాము సంతృప్తి చెందలేదని తేల్చి చెప్పారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని తెలిపారు. కాగా, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఒక మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. అతడిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి సత్వర చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. VIDEO | Wrestler Sakshi Malik arrives at Union Minister Anurag Thakur's residence in Delhi. pic.twitter.com/htPQYKWjOR — Press Trust of India (@PTI_News) June 7, 2023 (చదవండి: అమిత్ షా ఇంటి వద్ద మణిపూర్ మహిళలు నిరసన) -
Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి!
నెలల తరబడి రెజ్లర్లంతా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయడమే గాక తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తామని హెచ్చరించారు కూడా. ఐనా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నోరు మెదపలేదు. అలాంటిది తొలిసారిగా ఆ విషయమైన సాక్షాత్తు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడటం విశేషం. రెజ్లర్లు రోజుకో డిమాండ్‌తో వస్తున్నారని ఆరోపణలు చేశారు. క్రీడను, క్రీడాకారులను బాధించే ఎటువంటి చర్య తీసుకోవద్దని పునరుద్ఘాటించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసన చేసిన ప్రాంతానికి రాజకీయ నాయకులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారని మండిపడ్డారు. అయినా ఇది రాజకీయాలు చేయడానికి వేదిక కాదని రెజ్లర్లే చెప్పారు కానీ వారంతా వచ్చారు. ఐనా తాను దీని గురించి పెద్దగా వ్యాఖ్యానించనన్నారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముగిసే వరకు వేచి ఉండమని మాత్రమే అథ్లెట్లను కోరుతున్నా. ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలియజేసేలా ఎఫ్ఆర్ దాఖలు చేశారు దర్యాప్తు వరకు పూర్తి అయ్యింది. దయచేసి క్రీడకు, ఆటగాళ్లకు హాని కలిగించే ఏ చర్య తీసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. అలాగే ఈ సమస్యపై విచారకు కమిటీ వేయాలన్న రెజ్లర్ల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. వారు నిరసన వ్యక్తం చేస్తున్న ఫెడరేషన్ చీఫ్‌ని కూడా తొలగించారు. అంతేగాదు క్రీడాకారుల శిక్షణ, క్రీడా మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది. ఇప్పుడు కూడా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పనిచేస్తోంది అని అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ టైంలో నిరసనకు యత్నించిన రెజ్లర్లపై పోలీసుల చర్యకు సంబంధించిన దృశ్యాలు యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేశాయి. ఆ తదనందర ఈ అంశంపై మొట్టమొదటిసారగా ప్రభుత్వం వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎలాంటి శిక్షను స్వీకరించడానికైనా సిద్ధమేనని అన్నారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానని చెప్పారు. రెజ్లర్లను ఉద్దేశిస్తూ.. మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకి సమర్పించండి అని సవాలు కూడా విసిరారు సదరు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్. (చదవండి: కొందరు నేతలు ఆ వ్యాధితో బాధపడుతున్నారు.. ప్రధాని మోదీ కూడా!: రాహుల్) -
చీరలు విసిరేసి.. కర్ణాటక మంత్రి ఇంటిపై దాడి
సాక్షి, బెంగళూరు: ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ.. కన్నడనాట సిత్ర విచిత్రాలు దర్శనమిస్తున్నాయి. అయితే.. తాజాగా కర్ణాటక క్రీడాశాఖ మంత్రి కేసీ నారాయణగౌడ ఇంటిపైకి దళితులు ఆగ్రహంతో దూసుకొచ్చారు. గత రాత్రి మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు స్థానికంగా కొందరికి చీరలు పంపిణీ చేశారు. అయితే.. ఆ చీరలను ఈ ఉదయం మంత్రి ఇంటి ముందు విసిరేసిన దళితులు నిరసన తెలిపారు. ఆపై వాళ్లు మంత్రి నివాసంపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో మంత్రి ఇంట్లోనే ఉన్నారా? లేదా? అనే సంగతిపై స్పష్టత కొరవడింది. ఆటో నడిపిన పీసీసీ చీఫ్.. మరిన్ని సిత్రాల కోసం క్లిక్ చేయండి -
ఆర్థిక సంక్షోభం.. పాక్ క్రికెటర్‌కు మంత్రి పదవి
పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. రోజువారి నిత్యావసర ధరలు ఆకాశన్నంటగా.. అంతర్జాతీయంగా పాక్ రూపాయి ధర మరింత దిగజారింది. దీనికి తోడు విద్యుత్ కొరతతో దేశం తీవ్రంగా సతమతమవుతుంది. అయితే ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడం కోసం పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం పలు మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో పాక్ సీనియర్ క్రికెటర్ వహాబ్ రియాజ్‌ను క్రీడాశాఖ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లోని తాత్కాలిక క్యాబినెట్లో పాక్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్‌ను క్రీడా మంత్రిగా నియమించింది. విశేషమేమిటంటే ప్రస్తుతం వహాబ్ రియాజ్ అందుబాటులో లేడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. దీంతో ఉన్నపళంగా పాక్‌కు తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశించింది. బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వహాబ్ రియాజ్ మంత్రిగా ప్రమాణం చేయనున్నాడు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను కొందరు రాజకీయ నిపుణులు తప్పుబట్టారు. ఇక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వహాబ్ రియాజ్ పాకిస్థాన్ తరఫున 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఫాస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు పొందిన వహాబ్ రియాజ్.. 91 వన్డేల్లో 120 వికెట్లు, 27 టెస్టుల్లో 83 వికెట్లు,36 టి20ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ జట్టులో వహాబ్ సభ్యుడుగా ఉన్నాడు. అయితే 2020 తర్వాత వహాబ్ రియాజ్ పాకిస్థాన్ జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటినుంచి టి20 లీగ్స్‌లో బిజీ అయిన వహబ్ రియాజ్ మొత్తంగా 400 వికెట్లకు పైగా సాధించాడు. ప్రస్తుతం బీపీఎల్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆడుతున్న అతను 9 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' మాట మార్చిన పాక్ క్రికెటర్.. అయినా కోహ్లితో నాకు పోలికేంటి?! -
‘కేసు వాపస్ తీసుకుంటే నెలకి రూ.1 కోటి ’.. మహిళా కోచ్ సంచలన ఆరోపణ
చండీగఢ్: హరియాణా క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన జూనియర్ మహిళా అథ్లెటిక్ కోచ్ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. కేసు వాపసు తీసుకోవాలని లేదంటే చంపేస్తామని తనను బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, తాను చావుకు భయపడనని, సందీప్ సింగ్‌కు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తనను దేశం విడిచి వెళ్లిపోవాలని, అందుకు నెలకి రూ.1 కోటి చొప్పున ఇస్తామని బేరమాడినట్లు వెల్లడించారు. ‘నా నోరు మూయించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను చావుకు భయపడను. బెదిరింపులు వస్తున్నా వెనక్కి తగ్గను. నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నాకు నచ్చిన దేశానికి వెళ్లిపోతే నెలకి రూ.1 కోటి అందుతాయని ఆఫర్ చేశారు. నా ఫిర్యాదును వెనక్కి తీసుకుని, వేరే దేశానికి వెళ్లమని నన్ను అడిగారు. నాకు తెలుసు ఆయన(సందీప్ సింగ్) మంత్రివర్గం నుంచి తొలగించబడతాడు, జైలుకు వెళతాడు, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.’అని మహిళా కోచ్ తెలిపినట్లు ఏఎన్ఐ నివేదించింది. అలాగే.. ఈ కేసును హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మంగళవారం మాట్లాడారు సీఎం ఖట్టర్. క్రీడాశాఖ మంత్రిపై వచ్చిన లైంగిక ఆరోపణలు అంసబ్ధమైనవని, ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన దోషిగా మారడని స్పష్టం చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా! -
అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా!
హర్యానా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. జూనియర్ మహిళా అథ్లెటిక్స్ కోచ్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో సందీప్‌సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది తన ఇమేజ్ను చెడగొట్టేందుకే కొందరు చేస్తోన్న ప్రయత్నమని రాజీనామా చేసిన అనంతరం సందీప్‌సింగ్ అన్నారు. సందీప్‌సింగ్ మాట్లాడుతూ.. "నా ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతుందని నాకు సృష్టంగా తెలుసు. నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. విచారణ నివేదిక వచ్చే వరకు ముఖ్యమంత్రికి క్రీడా శాఖ బాధ్యతలు అప్పగిస్తాను" అని అతను పేర్కొన్నాడు. ఏం జరిగిందంటే? గురువారం(డిసెంబర్ 29) ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రీడామంత్రి సందీప్ సింగ్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా కోచ్ ఆరోపణలు చేసింది. తనను తొలుత జిమ్ లో మంత్రి చూశాడని... ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తనకు మెసేజ్ లు పెట్టేవాడని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడని ఆమె పేర్కొంది. ఈ క్రమంలోనే శుక్రవారం (డిసెంబర్ 30) చండీగఢ్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ)ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం సెక్షన్లు 354, 354A, 354B, 342, 506 కింద క్రీడా మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని మంత్రి ఖండించారు. అయినప్పటికీ ప్రతిపక్షాల తీవ్ర ఒత్తడి చేయడంతో మంత్రి తన పదవికి విడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. కాగా సందీప్‌సింగ్ గతంలో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. చదవండి: పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్‌కు సత్కారం.. ఎప్పుడంటే? -
మహిళా అథ్లెట్ కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడామంత్రిపై కేసు
హర్యానా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ జూనియర్ మహిళా అథ్లెటిక్స్ కోచ్ ఆరోపణలు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా మంత్రి సందీప్ సింగ్ తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం వెంటనే క్రీడాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఎన్ఎల్డి డిమాండ్ చేసింది. విషయంలోకి వెళితే.. తనను క్రీడామంత్రి సందీప్ సింగ్ లైంగికంగా వేధించాడంటూ బాధితురాలు ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనను తొలుత జిమ్ లో మంత్రి చూశాడని... ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తనకు మెసేజ్ లు పెట్టేవాడని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించారు. తాను స్పందించకపోవడంతో తనకు రావాల్సిన నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ ను పెండింగ్ లో ఉంచాడని... దీంతో ఆయనను తాను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశానని చెప్పారు. ఆ సందర్భంగా తనతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. మరోవైపు దీనిపై మంత్రి సందీప్ సింగ్ స్పందిస్తూ... ఆమె చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని ఖండించారు. చదవండి: ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం -
గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ విజేత మను గండాస్
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2022 గోల్ఫ్ టోర్నీలో న్యూఢిల్లీకి చెందిన మను గండాస్ విజేతగా నిలిచాడు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో 126 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. విజేతకు రూ.6 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. హైదరాబాద్‌కు చెందిన మిలింద్ సోనికి ‘బెస్ట్ అమెచ్యూర్’ అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు. చారిత్రక గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందని, భవిష్యత్తులో గోల్ఫ్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. -
నామినేషన్ దాఖలు చేసేందుకు పరుగులు పెట్టిన యూపీ క్రీడా మంత్రి
యూపీ క్రీడా మంత్రి ఫెఫ్నా నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి పరుగులు పెడుతు వెళ్తున్నట్లు కనపించారు. అయినా ఫిబ్రవరి 11 చివరితేది అయినప్పటికీ యూపీ క్రీడా మంత్రి ఉపేంద్ర తివారి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గడవు కావలని అడిగేందుకు పరుపరుగున బల్లియా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. భారతీయ జనతాపార్టీ(బీజేపీ) తివారీని ఫెఫ్నా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిగా ప్రకటించింది. ఉత్తరప్రేదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు చేయడానికి ఒకరోజు గడువు ముగియడంతో క్రీడల మంత్రి ఉపేంద్ర తివారీ పరుపరుగున బల్లియా కలెక్టరేట్ కార్యాలయానికి దూసుకుపోయారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. పైగా ఆ వీడియోలో కాషాయారంగు తలపాగ పార్టీ కండువ, దండ ధరించి పరుగుపరుగున వెళ్తున్నట్లు కనిపించారు. #WATCH | UP Sports Minister Upendra Tiwari sprinted to Collectorate Office in Ballia y'day as he was running late to file his nomination. Y'day nominations were scheduled to be filed by 3 pm & the minister was running late, nomination process still ongoing#UttarPradeshElections pic.twitter.com/99HSIPHwoA — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 5, 2022 (చదవండి: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి పై నెలకొన్న ఉత్కంఠ!) -
ఎక్కువ పిల్లల్ని కనండి.. లక్ష గెల్చుకోండి!
న్యూఢిల్లీ: ఓవైపు పెరిగిపోతున్న జనాభా దేశ ఆర్థిక అవసరాలను సంక్లిష్టంగా మారుస్తూ వస్తోంది. ఈ తరుణంలో చాలా రాష్ట్రాలు, జనాభా నియంత్రణ పాలసీలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈశాన్య రాష్ట్రం మిజోరం నుంచి అందుకు విరుద్ధమైన ప్రకటన వెలువడడం చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా ఓ కొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాలకు లక్ష రూపాయల ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. దీంతో ఈ మంత్రి ప్రకటన సంచలనంగా మారింది. అస్సాంకి కౌంటర్? మిజోరంకి పోరుగున్న ఉన్న అస్సాం.. జనాభా నియంత్రణలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదని ప్రకటించింది కూడా. ఇక ఈమధ్యే మరో జీవో విడుదల చేసింది. ఇద్దరు సంతానం లోపు ఉన్న కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాల లబ్ధి దక్కుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి హిమాంత బిస్వా ప్రకటన చేశారు కూడా. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే.. మిజోరం మినిస్టర్ స్టేట్మెంట్ను కౌంటర్ ఇచ్చాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు మంత్రి రాబర్ట్. కొడుకు సొమ్మే.. ‘‘మిజోరాం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సరిపోయే స్థాయిలో మిజోరం జనాభాలేదు. మిజోలు లాంటి చిన్న చిన్న తెగల విషయంలో ఇదో పెద్ద సమస్యగా మారింది’’ అని మంత్రి రాబర్ట్ వ్యాఖ్యానించారు. ఫాదర్స్ డే నాడు సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. తల్లిదండ్రుల్లో ఎవరోఒకరికి రూ. లక్ష రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. లబ్ధిదారుడికి నగదు ప్రోత్సాహకంతో పాటూ ఓ ట్రోఫిని కూడా పొందుతారు. గరిష్టంగా, కనిష్టంగా ఎంత మంది పిల్లలు అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ స్కీమ్‌ను తన సొంత కొడుకు కంపెనీ నుంచే ఇస్తానని ప్రకటించడంతో విమర్శలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తపడ్డాడు ఆయన. చదవండి: వీపున మామ.. ఎలా మోయగలిగావ్ తల్లీ! -
క్రీడా శాఖ మంత్రిగా మనోజ్ తివారి
మాజీ క్రికెటర్ మనోజ్ తివారికి కొత్తగా ఏర్పడిన బెంగాల్ కేబినెట్లో చోటు దక్కింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అతను ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్ చేశాడు. తివారి శివ్పూర్ నియోజకవర్గంనుంచి విజయం సాధించాడు. భారత్ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారి... 16 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 50.36 సగటుతో 8965 పరుగులు చేశాడు. 2012లో ఐపీఎల్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో మనోజ్ తివారి కూడా సభ్యుడు. -
ఇకపై యోగా కూడా ‘క్రీడ’
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రాచీన చరిత్ర ఉన్న యోగాసనాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా గుర్తింపునిచ్చింది. ఇక నుంచి యోగాసనాలను అధికారికంగా పోటీ క్రీడగా పరిగణించనున్నట్లు గురువారం తెలిపింది. జాతీయ స్థాయి టోర్నీ ఖేలో ఇండియా క్రీడల్లోనూ యోగాసనాలను భాగం చేస్తామని క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘జాతీయ వ్యక్తిగత యోగాసన క్రీడా పోటీల’ను పైలట్ చాంపియన్‌షిప్‌గా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సంప్రదాయక, ఆర్టిస్టిక్, రిథమిక్, వ్యక్తిగత ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్, టీమ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. భారత జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్‌వైఎస్‌ఎఫ్‌ఐ)కు ఆర్థికంగా దన్నుగా నిలుస్తామని స్పష్టం చేశారు. -
ఒక కిడ్నీతోనే పతకాలు సాధించా
కొచ్చి: స్టార్ ఒలింపియన్ అంజూ బాబీ జార్జి భారత అథ్లెటిక్స్కే వన్నె తెచ్చింది. లాంగ్‌జంప్‌లో తన పతకాలతో చరిత్ర సృష్టించింది. ఇంత చేసిన ఆమె పయనం నల్లేరుపై నడకలా సాగలేదని ఇన్నేళ్ల తర్వాత తాజాగా వెల్లడించింది. తాను సుదీర్ఘ కాలం కిడ్నీ సమస్యలతో సతమతమయ్యానని 43 ఏళ్ల అంజూ చెప్పింది. పోటీల్లో తలపడే సమయానికే ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో కేవలం ఒకే కిడ్నీతో ఆమె ఒంట్లో ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే బయట ఈవెంట్లలో ప్రత్యర్థులతో పోటీ పడినట్లు పేర్కొంది. ‘మీరు నమ్మినా నమ్మకపోయినా... ఒకే కిడ్నీతో ప్రపంచ క్రీడల్లో పోటీపడిన అతికొద్ది మందిలో నేనుంటాను. అలర్జీ, కాలి నొప్పి చాలా ఆరోగ్య సమస్యలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నా భర్త, కోచ్ బాబీ జార్జి ప్రోద్బలంతోనే వీటన్నింటిని అధిగమించి పతకాలు నెగ్గాను’ అని ప్రస్తుతం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) చైర్‌పర్సన్‌గా ఉన్న అంజూ ట్వీట్ చేసింది. కేరళకు చెందిన అంజూ 2003 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్ (2005)లో స్వర్ణం గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. అయితే మరియన్ జోన్స్ (అమెరికా) డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. అంతకుముందు 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఆమె బంగారు పతకం సాధించింది. అంజూ ట్వీట్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘నీ కఠోర శ్రమ, నిబద్దతతో భారత్ ప్రతిష్ట పెంచావు’ అని కొనియాడారు. -
లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో టాప్–10పైనే దృష్టి
న్యూఢిల్లీ: లాస్ ఏంజెలిస్ –2028 ఒలింపిక్స్ నాటికి పతకాల జాబితాలో తొలి 10 స్థానాల్లో నిలిచేలా భారత్ గట్టి పోటీనిస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకే ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం జూనియర్ స్కీమ్’ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 10–13 వయస్సున్న చురుకైన క్రీడాకారులను ఎంపిక చేసి 2028నాటికి ఒలింపియన్లుగా తయారుచేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోచ్‌లతో వారికి శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ మేరకు సుశిక్షితులైన స్వదేశీ కోచ్‌ల పదవీకాలాన్ని పొడిగించామని పేర్కొన్నారు. భారత్‌ను క్రీడాశక్తిగా చూడాలనుకున్న ప్రతీ ఒక్కరి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. -
2011 ఫైనల్ ఫిక్సయింది!
కొలంబో: శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌పై ఆరోపణలు గుప్పించారు. భారత్, శ్రీలంకల మధ్య జరిగిన టైటిల్ పోరు ఫిక్సయిందన్నారు. దీనిపై అప్పటి లంక సారథి కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోపణలపై ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందనంద మాట్లాడుతూ ‘మీకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. 2011 లేదంటే 2012 ఏడాదో సరిగ్గా గుర్తుకు రావడం లేదు కానీ... ఫైనల్ మ్యాచ్ మేం గెలవాల్సింది. అయితే ఇది తెలియజేయడం నా బాధ్యతని చెబుతున్నా... ఆ మ్యాచ్ ఫిక్సయింది. ప్రజలు దీనిపై కలత చెందారని తెలుసు. దీనిపై ఏ చర్చకైనా నేను సిద్ధం’ అని అన్నారు. అయితే ఈ ఫిక్సింగ్‌లో లంక ఆటగాళ్లెవరూ పాల్గొనలేదని, కొన్ని వర్గాలు ఇందులో భాగమయ్యాయని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆయన క్రీడల మంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి ఆరోపణలపై జయవర్ధనే ట్విట్టర్లో స్పందించాడు. ‘ఎన్నికలొస్తే చాలు... ఇలాంటి సర్కస్ చేష్టలకు కొదవుండదు. మరి ఫిక్సర్ల పేర్లు, ఆధారాలు చూపాలిగా’ అని చురకలంటించాడు. ఆ ఫైనల్లో అతను సెంచరీ సాధించాడు. అప్పటి సారథి సంగక్కర సాక్ష్యాధారాలు చూపాలని డిమాండ్ చేశాడు. ‘మాజీ మంత్రి వద్ద ఉన్న ఆధారాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి, అవినీతి నిరోధక విభాగానికి సమర్పిస్తే విచారణ చేపట్టేందుకు వీలవుతుంది’ అని అన్నాడు. -
ఏప్రిల్ 15 వరకు ఆటల్లేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా (కోవిడ్–19) వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా జాతీయ స్పోర్ట్స్ సమాఖ్యలకు (ఎన్ఎస్ఎఫ్) క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 15 వరకు దేశంలో ఎటువంటి టోర్నమెంట్లను, సెలెక్షన్ ట్రయల్స్‌ను నిర్వహించరాదని స్పష్టం చేసింది. దాంతో పాటు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు ఒలింపిక్స్ సన్నాహక క్యాంపుల్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ ఒలింపిక్స్ కోసం సిద్ధమయ్యేలా చూడాల్సిన భాద్యతను ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు అప్పగించింది. వారిని క్యాంపుతో సంబంధం లేని కోచ్‌లు గానీ, ఏ ఇతర సిబ్బంది గానీ కలవకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ‘మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒలింపిక్స్ కోసం సన్నద్ధం అవుతున్న క్రీడాకారులు మాత్రమే ప్రస్తుతం శిక్షణ శిబిరాల్లో ఉన్నారు.’ అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో టోర్నమెంట్లు ముగించుకుని దేశానికి వస్తున్న అథ్లెట్లపై నిఘా ఉంచామని రిజిజు అన్నారు. వారు దేశంలో అడుగుపెట్టిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 15 తర్వాతే ఐపీఎల్‌పై నిర్ణయం ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ భవితవ్యంపై అడిగిన ప్రశ్నకు స్పందించిన రిజిజు... ఏప్రిల్ 15 తర్వాతే ఐపీఎల్‌పై స్పష్టమైన నిర్ణయం రావచ్చన్నారు. అంతేకాకుండా ఐపీఎల్ అనేది బీసీసీఐ చేతుల్లో ఉందని... అది ఒలింపిక్ క్రీడ కాదన్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో తాము ఆటగాళ్ల, ప్రేక్షకుల ఆరోగ్య భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
మా ద్వీపంలో విహరించండి
కొలంబో: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ... అందరినీ ఆకర్షించిన ‘ఫైవ్‌స్టార్’ సెలబ్రిటీ జోడీ. వారి ప్రేమ నుంచి పెళ్లి దాకా... పుకార్లు, షికార్లు అన్నీ ఇన్నీ కావు. ఏదేమైనా ఓ షాంపూ యాడ్‌తో ఒక్కటైన ఈ జోడీ గతేడాది ఇటలీలో ఏడడుగులు వేసింది. తమ పెళ్లి పుస్తకంలోని తొలి పేజీ ‘హనీమూన్’ను స్విట్జర్లాండ్‌లో జరుపుకుంది. కోహ్లి ఏ మాత్రం తీరిక దొరికినా తన ప్రియసఖితో గడిపేందుకే సమయం కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టి20 సిరీస్ నుంచి కోహ్లి తప్పుకున్నాడు. ఇది సింహళ దేశంలోని కోహ్లి అభిమానులను బహుశా బాధించిందేమో! దీంతో ఆటలోని లోటును విహారంతో భర్తీ చేయాలని సాక్షాత్తూ ఆ దేశ క్రీడల మంత్రే స్వయంగా ఆహ్వానించారు. తమ దేశ అతిథిగా తమ ద్వీపంలో గడపాలని మంత్రి దయసిరి జయశేఖర ఆహ్వానం పలికారు. ‘కోహ్లిని ఆడేందుకు పిలవట్లేదు. వివాహం తర్వాత ఇక్కడ పర్యటించని కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి విహరించాలని ఆహ్వానిస్తున్నా. లంక ద్వీపంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. వాటిని చూస్తూ సేదతీరొచ్చు’ అని జయశేఖర పేర్కొనట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. ప్రస్తుతం విరుష్క జంట ముంబైలోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో కాపురం పెట్టింది. దీని అద్దె నెలకు రూ. 15 లక్షలు. రెండేళ్లు ఉండే విధంగా అగ్రిమెంట్ చేసుకొని రూ. కోటి 50 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అయితే ఆటతో పాటు బ్రాండింగ్‌తో కోట్లకు పడగలెత్తిన కోహ్లికి కిరాయి ఇంట్లో ఉండే ఖర్మేమిటనే సందేహం కలుగక మానదు. నిజమే! కానీ అతను 2016లోనే ముంబైలోని ఖరీదైన ప్రాంతం వర్లీలో ఓ ఫ్లాట్ కొన్నాడు. 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటోంది ఈ జంట. -
పారదర్శకత పాటిస్తే...
న్యూఢిల్లీ: దేశంలో క్రీడా రంగ ప్రగతికి నిధులు ఇచ్చేందుకు కార్పొరేట్ రంగం సిద్ధంగానే ఉందని, వాటిని పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లు హామీ ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ‘నిధుల కోత గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. ఇది మా పరిధిలోనిదే. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇచ్చేందుకు సిద్ధం. కానీ... సమాఖ్యలు సొంతంగా నిలదొక్కుకోవాలన్నదే మా ఆలోచన. లీగ్‌ల ద్వారా రెజ్లింగ్, హాకీ, బ్యాడ్మింటన్ సమాఖ్యలు డబ్బు సమీకరిస్తున్నాయి. అయినా వీటికి కేంద్రం సాయం చేస్తోంది కదా?’ అని చెప్పుకొచ్చారు. ప్రతిపాదిత ‘జాతీయ క్రీడాభివృద్ధి నియమావళి’ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకొచ్చేదిగా ఉంటుందని మంత్రి వివరించారు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌ను అనుమతించడాన్ని కాలమే నిర్ణయిస్తుందని రాజ్యవర్ధన్ అన్నారు. కామన్వెల్త్ పోటీల్లో భారత క్రీడాకారులు ఎన్ని పతకాలు గెలవగలరన్న సంఖ్యను చెప్పేందుకు ఇష్టపడని మంత్రి... సన్నాహాలకు చక్కటి వసతులు సమకూర్చుతున్నామని, దేశ ప్రతినిధులుగా వారు క్రమశిక్షణతో కూడిన ఆటను ప్రదర్శించాలని ఆకాంక్షించారు. -
మన మంత్రిగారే అసలైన గోల్డ్ మెడలిస్ట్..
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ముగిసి మన క్రీడాకారులు రెండు పతకాలతో స్వదేశం చేరినా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ మాత్రం వారు సాధించిన ఘనతలను గుర్తు పెట్టుకోవడంలో తడబాటును కొనసాగిస్తూనే ఉన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకం, మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాలు సాధిస్తే.. వారు రియో గోల్డ్ మెడలిస్ట్లు అంటూ విజయ్ గోయల్ ట్వీట్ చేయడంపై నెటిజన్లు జోకుల వర్షం కురిపిస్తున్నారు. వీవీ సింధూ, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిసే క్రమంలో వారు రియో గోల్డ్ మెడలిస్ట్లు అంటూ విజయ్ గోయల్ ట్వీట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఆ పతకాల కోసం విజయ్ గోయల్‌ను రియోకు పంపుదామా?అంటూ ఒకరు విమర్శించగా, ఆ మంత్రి గారే అసలు సిసలైన గోల్డ్ మెడలిస్ట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. కామెడీ షోలో కపిల్ శర్మకు విజయ్ గోయల్ సరైన పోటీ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. మరోవైపు మహిళా జిమ్నాస్ దీపా కర్మాకర్ పేరును కూడా విజయ్ గోయల్ తప్పుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. దీపా కర్మాకర్‌ను 'దీపా కర్మనాకర్'అంటూ సంబోధించడం, అథ్లెట్లు ద్యుతీ చంద్ ఫోటోకు బదులు మరొ అథ్లెట్ స్రబాణి నందా ఫోటోను పోస్ట్ చేయడంలో విజయ్ గోయల్ ఇబ్బంది పడ్డారు. అయితే విజయ్ గోయల్ మాత్రం తన తప్పును సరిదిద్దుకునే క్రమంలో వివరణ ఇచ్చారు. 'ఒక్కోసారి నాలుక తడబడి పొరపాట్లు జరగడం సాధారణం దీన్ని ప్రజలు ఏదో పెద్ద విషయంగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలుసు. వచ్చే ఒలింపిక్స్‌లో వారు స్వర్ణ పతకాలు సాధిస్తారేమో' అని విజయ్ గోయల్ పేర్కొనడం కొసమెరుపు. Mr. Vijay Goel, is this sleeping or slipping!! https://t.co/0bG0l9kF0B — Biswatosh Sinha (@biswatosh) 28 August 2016 Vijay Goel is the real gold medalist Vijay Goel will give strong competition to Kapil Sharma in hosting a comedy show. #welcometocomedynightswithvijaygoel — Nick Turrim (@mhanthung) 28 August 2016 -
సింధు, సాక్షి.. గోల్డ్ మెడళ్లు సాధించారా?
-
క్రీడా భారత్‌గా మారుస్తాం
క్రీడల మంత్రి సోనోవాల్ గువాహటి: దేశంలో క్రీడల అభివృద్ధిపై కేంద్ర క్రీడా శాఖ దృష్టి సారించింది. దీంట్లో భాగంగా గ్రామీణ, పట్టణ క్రీడా మౌలిక సౌకర్యాలను మరింతగా మెరుగుపరిచేందుకు పలు పథకాలను అమలుపరుచనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడలవైపు ఆకర్షితులయ్యేలా చూడడమే తమ ముఖ్య ఉద్దేశమని క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. ‘మనిషి జీవితంలో క్రీడలు కూడా భాగం కావాలి. దేశంలోని యువతకు ఇది సహాయకంగా ఉండడమే కాకుండా శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండగలుగుతారు. ఈ ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ కింద దేశంలోని ప్రతీ బ్లాకులో రూ. కోటి 60 లక్షలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాం. దీంట్లో క్రీడా పరికరాల కోసం ఒక్కో బ్లాక్‌కు రూ.15 లక్షలు ఇవ్వనున్నాం’ అని మంత్రి సోనోవాల్ వివరించారు. అలాగే ఈ నెల 8 నుంచి 12 వరకు గువాహటిలో జాతీయ యూత్ ఫెస్టివల్ జరుగుతుందని... ఇందులో మేరీకోమ్, వీరేంద్ర సెహ్వాగ్, సుశీల్ కుమార్ పాల్గొంటారని చెప్పారు. -
జట్టు ఓడింది.. మంత్రిపై వేటు పడింది!
అక్రా: ఆటలో ఏ టీం అయినా ఓటమి పాలైనప్పుడు ఆ జట్టులో సభ్యులను మార్చడం గానీ, కెప్టన్ ను తొలగించడం గానీ తరుచు మనం చూస్తూ ఉంటాం. కాగా, జట్టు ఓటమికి క్రీడల మంత్రిని బాధ్యున్ని చేయడం ఎక్కడైనా చూసామా? ఇప్పుడు వరకూ అయితే అటువంటి ఘటనలు చూసిన దాఖలాలు లేవు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే.. ఫిఫా ప్రపంచకప్ లో ఘనా జట్టు ఘోర ఓటమికి ఆ శాఖ మంత్రిని బాధ్యున్ని చేస్తూ ఏకంగా తొలగించేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. తాజాగా బ్రెజిల్ లో జరుగుతున్న సాకర్ టోర్నీలో తొలి రౌండ్ కూడా దాటని ఘనా టీం పేలవమైన ప్రదర్శనకు గాను ఆ శాఖ మంత్రిగారిపై వేటు వేశారు. గ్రూప్-జి నుంచి బరిలోకి దిగిన ఘనా దారుణంగా ఆడి ఆదిలోనే ఇంటిముఖం పట్టింది. గత రెండు ప్రపంచకప్‌లలో అంచనాలకు మించి రాణించి ఘనా ఈసారి మాత్రం ఆకట్టుకోలేక పోయింది. అయితే ‘గ్రూప్ ఆఫ్ డెత్’లో ఉన్న తమ జట్టును ప్రోత్సహించాలని నిర్ణయించిన అక్కడి ప్రభుత్వం 500 మంది అభిమానులను ప్రత్యేకంగా బ్రెజిల్‌కు తీసుకెళ్లింది. అయితే ఘనా ప్రదర్శనతో ఉలిక్కిపడిన ఆ దేశానికి ఆశాభంగం తప్పలేదు. దీంతో ఆగమేఘాల క్రీడల శాఖను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఆలోచనలో పడి మంత్రిని తప్పించింది. అసలు రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొరువుండదనే మరోసారి తాజాగా రుజువైంది. -
సచిన్‌ను క్రీడలమంత్రిని చేయాలి: మిల్కాసింగ్
బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్‌ను క్రీడలమంత్రిని చేయాలని భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ సూచించాడు. 'భారత క్రీడారంగం అభివృద్ది చెందాలంటే సచిన్‌ను క్రీడలమంత్రిని చేయాలి. క్రీడారంగానికి అంకితభావంతో, నిజాయితీగా సేవ చేయాలంటే ఓ క్రీడాకారుడే సాధ్యం' అని మిల్కా సింగ్ అన్నాడు. సచిన్ టెండూల్కర్ ఇటీవల రిటైర్మెంట్ పలికిన సంగతి తెలిసిందే. అదే రోజు భారత ప్రభుత్వం సచిన్‌కు అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న'ను ప్రధానం చేయనున్నట్టు ప్రకటించింది. ముంబైకర్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. రాష్ట్రపతి కోటాలో ఆయనను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మిల్కాసింగ్ సచిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. భారతరత్న అవార్డు గురించి ప్రస్తావిస్తూ.. క్రీడారంగంలో తొలుత ఈ పురస్కారం అందుకోవడానికి అర్హుడైన వ్యక్తి హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ అని మిల్కాసింగ్ అభిప్రాయపడ్డాడు. -
‘మాస్టర్’ అనధికార క్రీడా మంత్రిగా ఉండాలి : పీటీ ఉష
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట పరంగానే కాకుండా తన ప్రవర్తనతోనూ సమున్నతంగా ఎదిగాడని భారత అథ్లెట్ దిగ్గజం పీటీ ఉష పేర్కొన్నారు. పాతికేళ్లుగా కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగా ఓ ఆటగాడు రాణించడమనేది మామూలు విషయం కాదని, అంత ఒత్తిడిని తట్టుకునే శక్తి మాస్టర్‌కు ఉండడం అద్భుతమని కొనియాడారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తను కెరీర్ నుంచి తప్పుకున్నాక ఇతర క్రీడల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. క్రీడలకు అనధికారిక మంత్రిగా వ్యవహరించాలని కోరుకున్నారు. ‘సచిన్.. ఓ బహుమతి లాంటివాడు. ఎంపీగా ఉన్న సచిన్ ఇతర క్రీడలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దిగ్గజ ఆటగాడి హోదాలో పతనావస్థలో ఉన్న చాలా ఆటలకు జీవం పోయాల్సిన బాధ్యత అతడిపై ఉంది. దీనికి అనధికారిక క్రీడా మంత్రిగా వ్యవహరించాలి. వివిధ క్రీడా సమాఖ్యలతో చర్చించి క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన మార్పులపై చర్చించాలి’ అని ఉష పేర్కొన్నారు.