
కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఈ బెంగాలీ క్రికెటర్ 2008 నుంచి 2015 వరకు అంతర్జాతీయ కెరీర్‌లో 12 వన్డేలు, మూడు టి20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. కానీ మూడు టి20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్ అవకాశం దక్కగా 15 పరుగులే చేశాడు.
దేశవాళీ క్రికెట్‌లో 141 మ్యాచ్‌ల్లో 48.56 సగటుతో 9908 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్ పుణేలకు ఆడాడు. 2012లో మనోజ్ తివారీ విన్నింగ్ షాట్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేబినెట్‌లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు.