manoj tiwari
-
Ind vs NZ: రోహిత్, గంభీర్.. కామన్సెన్స్ లేదా?
న్యూజిలాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తొలి టెస్టు తాలుకు పొరపాట్లు పునరావృతం చేయకుండా.. రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పుణెలో గురువారం నుంచి మొదలుకానున్న ఈ టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేన సిరీస్ బరిలో నిలుస్తుంది. లేదంటే.. పర్యాటక జట్టుకు 0-2తో ట్రోఫీని సమర్పించుకోకతప్పదు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, బెంగాల్ రంజీ మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కివీస్ చేతిలో సొంతగడ్డపై దాదాపు 36 ఏళ్ల తర్వాత ఓటమికి ప్రధాన కారణం టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్చి నిర్ణయాలే అని ఘాటు విమర్శలు చేశాడు.కామన్సెన్స్ లేదా?ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో కొన్నిసార్లు అర్థమే కాదు. కామన్సెన్స్ లోపించిందేమో అనిపిస్తుంది. అసలు ఆ కోచ్, కెప్టెన్ ఏం నిరూపించాలనుకుంటున్నారనేది నాకైతే అంతుపట్టడం లేదు. కొత్త కోచ్ వచ్చినా.. కొత్త కెప్టెన్ వచ్చినా.. తమను తాము నిరూపించుకునే ప్రయత్నంలో ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు’’ అని మనోజ్ తివారి విమర్శించాడు.కోచ్ ఏం చేస్తున్నాడు?బెంగళూరు టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌కు ఎక్కువగా బంతిని ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘పరిస్థితిని బట్టి స్పిన్నర్లతో తక్కువ బంతులు వేయిస్తారని తెలుసు. అయితే, అందుకోసం ఏకంగా అశ్విన్‌నే పక్కనపెడతారని అనుకోలేదు. టెస్టుల్లో ఐదు వందలకు పైగా అతడు వికెట్లు తీశాడు. 107 రూపంలో కనిపిస్తున్న స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జస్ప్రీత్ బుమ్రాతో కలిపి అశ్విన్‌ను కూడా ఆడించాల్సింది.గొప్ప కెప్టెన్లుగా పేరొందిన వారు కూడా తప్పులు చేస్తారు. అలాంటి సమయంలో కోచ్ ముందుకు రావాలి. ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు నడిపించాలి. కానీ ఇప్పుడెందుకో ఇక్కడ అలా జరుగలేదు అనిపిస్తోంది’’ అని మనోజ్ తివారి గంభీర్‌ను తప్పుబట్టే ప్రయత్నం చేశాడు. కాగా కివీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచినప్పటికీ పిచ్‌ను తప్పుగా అంచనా వేసి తాము భారీ మూల్యం చెల్లించినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు. అయితే, సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉంటే.. భారత్- కివీస్ జట్ల మధ్య పుణె వేదికగా అక్టోబరు 24 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు విశేషాలు👉షెడ్యూల్: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, కర్ణాటక👉వర్షం కారణంగా బుధవారం నాటి తొలిరోజు ఆట రద్దు👉రెండో రోజు మొదలైన ఆట👉టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా👉టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 46 ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 402 ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 462 ఆలౌట్👉న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 110/2👉ఫలితం: టీమిండియాపై ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రచిన్ రవీంద్ర(134, 39*).చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ -
ఎంపీ మనోజ్ తివారీని బంధించిన మహిళ
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసితో సహా 13 లోక్‌సభ స్థానాలకు చివరి దశలో పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంపై అధికంగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వారణాసిలో పలువురు బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. వారిలో ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మనోజ్ తివారీ కూడా ఉన్నారు.తాజాగా మనోజ్ తివారీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మనోజ్ తివారీ స్వయంగా షేర్ చేశారు. దానిలో ఒక మహిళ తనను బంధించారని తివారీ పేర్కొన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆయన దాని ట్యాగ్‌లైన్‌గా ‘కాశీకి చెందిన ఒక మహిళ ఆమె కుమారునికి మనోజ్ తివారీని పరిచయం చేయడానికి బంధించినప్పుడు’ అని రాశారు. ఈ వీడియోలో ఒక మహిళ కూడా కనిపిస్తున్నారు. అలాగే ఆమె తన ఆమె తన కుమారునికి బీజేపీ ఎంపీని పరిచయం చేయడానికి కాల్ చేయడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.మనోజ్ తివారీ వచ్చి ఇంట్లో కూర్చున్నారని ఆ మహిళ ఫోనులో అవతలి వ్యక్తికి చెప్పారు. ఈ క్లిప్ తరువాత మనోజ్ తివారీ ఒక బండి దుకాణం ముందు నిలబడటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో చాలా మంది అక్కడ ఉండటాన్ని గమనించవచ్చు. గాయకుడైన మనోజ్ తివారీ పాడిన పాటలు ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఎంతో ఆదరణ పొందాయి. ముఖ్యంగా అతని భోజ్‌పురి పాటలకు లెక్కకుమించిన అభిమానులున్నారు. ప్రస్తుతం మనోజ్ తివారీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. जब मनोज तिवारी को काशी की एक महिला ने अपने बेटे से मिलवाने के लिये बनाया बंधक #ModiAgainIn2024 pic.twitter.com/U0aliTTmMY— Manoj Tiwari (मोदी का परिवार) 🇮🇳 (@ManojTiwariMP) May 27, 2024 -
BJP Vs Congress: ఈశాన్య ఢిల్లీ ఎవరిది?..
దేశరాజధాని ఢిల్లీలో అందరినీ ఆకర్షిస్తున్న సీటు ఈశాన్య ఢిల్లీ. హ్యట్రిక్‌పై కన్నేసిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై, యువనాయకుడు కన్హయ్య కుమార్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది. గత ఎన్నికల్లో బెగుసరాయ్‌లో ఓడిపోయిన కన్హయ్యకుమార్‌ను రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలో పోటీకి దింపడం చర్చనీయాంశంగా మారింది. 20శాతం ముస్లింలు, 11శాతం ఎస్సీల సమీకరణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ప్రయోగానికి దిగిందనే చర్చ జరుగుతోంది.ఈశాన్య ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. నార్త్ ఈస్ట్ సీటు భారతదేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ అత్యధిక జనాభా పూర్వాంచల్‌కు చెందినవారే. ఈ లోక్‌సభ స్థానంలో అనేక అనధికార కాలనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు స్థిరపడ్డారు. ఉత్తరప్రదేశ్‌తో ఈశాన్య ఢిల్లీ సరిహద్దు కారణంగా, ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా నుండి వలస వచ్చిన వారి జనాభా ఎక్కువగా ఉంది.ఈ లోక్‌సభ స్థానంలో భజన్‌పురా, బురారీ, తిమర్పూర్, సీలంపూర్, ఘోండా, బాబర్పూర్, గోకల్‌పూర్, సీమాపురి, రోహతాస్ నగర్, ముస్తఫాబాద్, కరవాల్ నగర్‌లతో కలిపి 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 16.3 శాతం షెడ్యూల్డ్ కులాలు, 11.61 శాతం బ్రాహ్మణులు, 20.74 శాతం ముస్లింలు, 4.68 శాతం వైశ్య (బనియా), 4 శాతం పంజాబీ, 7.57 శాతం గుర్జార్ మరియు 21.75 శాతం ఓబీసీ కమ్యూనిటీ వారి వాటాను కలిగి ఉంది.గతంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ 59.03 శాతం ఓట్లతో భారీ ఆధిక్యం సాధించగా బీజేపీకి 33.71 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 నుంచి వరుసగా బీజేపీ విజయకేతనం ఎగరేస్తోంది. 2014లో సినీ నటులు మనోజ్ తివారీకి 45.38 శాతం ఓట్లతో గెలుపొందగా, 2019లో 53.86 శాతం రెండోసారి విజయకేతనం అందుకున్నారు. ఈ సీటులో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల అభ్యర్థులకు ప్రజల్లో మంచి పేరుంది.ఒకవైపు రాజకీయాలకు అతీతంగా నటుడిగా, గాయకుడిగా మనోజ్ తివారీ బాగా పాపులర్ అయితే, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్‌గా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్హయ్య కుమార్ కూడా చాలా చురుకుగా కనిపించారు. ఈ యాత్రలతో యువతను కనెక్ట్ చేయడంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే తుక్డేతుక్డే గ్యాంగ్ నాయకుడని బీజేపీ.. కన్హయ్య కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి మారేందుకు ఈ ఎన్నిక మనోజ్ తివారీకి కీలకంగా మారనుంది. ఇప్పటికే రెండుసార్లు గెలిచి సత్తా చాటిన తివారీ మూడోసారి హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఢిల్లీ బీజేపీ అగ్రనాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీకి నాయకుడు లేక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడుతున్న పార్టీకి తివారీ సారథ్యం వహించడానికి ఇదొక అవకాశమనే అంచనాలొస్తున్నాయి.ఇటు షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ లీడర్ కరువయ్యారు. కన్హయ్య కుమార్ గనుక ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిస్తే ఆయన కూడా ఢిల్లీ కాంగ్రెస్‌కు ఫ్యూచర్ సీఎం లీడర్‌గా ఎదిగే అవకాశముంది. మరి ఈసారి ఢిల్లీ ఈశాన్యంలో కమలం ఉదయిస్తుందా? హస్త రేఖలు మారతాయా? అన్నది ఓటరు చేతిలో ఉంది. -
ఇప్పటికి బాణాలు చాలు.. అవసరమైతే త్రిశూలం తీస్తా: మాధవీ లత
దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి మాధవీ లత ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి తరపున దేశ రాజధానిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ నేత మాధవీ లత ఢిల్లీలోని బహిరంగ సభ వేదికపైకి రాగానే అక్కడున్న పార్టీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్, జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనోజ్ తివారీపై పోటీ చేస్తున్న వ్యక్తి పేరు కన్హయ్య అని, అయితే అతని దోపిడీలు చాలా క్రూరమైనవని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడిని ప్రస్తావించిన ఆమె.. వేధించిన వ్యక్తిని రక్షించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రోడ్డుపైకి వచ్చారని ఆరోపించారు. బీహార్ యువత ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మారి దేశానికి సేవ చేస్తుంటారని, అయితే ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఇలాంటి వారిని మోసం చేశారని మాధవీ లత ఆరోపించారు.ఢిల్లీలో నరకయాతన అనుభవిస్తున్న ప్రజల మధ్య, కేజ్రీవాల్ రెండు రోజులు తిరగాలని, అప్పుడే అతనికి ఇక్కడి పరిస్థితులు తెలుస్తాయని ఆమె అన్నారు. బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పనులకు కేజ్రీవాల్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఫలితంగా బురారీ ప్రజలు బురద, చెత్త మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆమె ఆరోపించారు. అయితే ఇలాంటి బురదలో నుంచి వికసించిన కమలాన్నే దేవుని పాదాల చెంత ఉంచుతారన్నారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడేందుకు మద్దతునివ్వాలని ఆమె ఓటర్లను కోరారు.తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శల బాణాలు సంధించిన ఆమె.. ప్రస్తుతానికి ఈ బాణాలు చాలని, అవసరమైతే వారిపై త్రిశూలాన్ని కూడా ప్రయోగించడానికి వెనుకాడనని హెచ్చరించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి మద్దతుగా మాధవీ లత బురారీలోని వెస్ట్ కమల్ విహార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. -
‘కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురు మద్దతుదారు’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికళ వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ మంగళవారం ఇండియా కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్ హాట్ కామెంట్లు చేశారు. కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు అని మండిపడ్డారు. మనోజ్ తివారీ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.‘తన ప్రత్యర్థి కన్హయ్య కుమార్‌తో పోటీ ఆసక్తికంగా మారనుంది. కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించటం.. ప్రతిపక్షాల కుట్రను వెల్లడిస్తుంది. ఈశాన్య ఢిల్లీలో కన్హయ్య కుమార్‌ను పోటీ చేయించి కాంగ్రెస్, ఆప్ పార్టీలు వాటి అసలు రంగు బయటపెట్టాయి. ప్రతిపక్షాల అభ్యర్థిపై గతంలో ఉన్న వివాదాలను ఓటర్లు పరిగణలోకి తీసుకుంటారు. ప్రజలు భద్రత కోరుకుంటాన్నారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎల్లప్పుడు దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటారు.కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు. గతంలో అఫ్జల్‌గురుకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను ఓటర్లు మర్చిపోతారా?’ అని ఎంపీ మనోజ్ తివారీ అన్నారు ఇక.. ఈశాన్య ఢిల్లీలో మైనార్జీ జనాభా అధికంగా ఉంటుంది. మరోవైపు.. మనోజ్ కుమార్, కన్హయ్య కుమార్ ఇద్దరూ బిహార్‌కు చెందినవాళ్లే కావటం గమనార్హం.2001 డిసెంబరు 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి దాడి జరిగింది. ఐదుగురు ఉగ్రవాదుల పార్లమెంట్‌లోకి చొరబడి తొమ్మిది మంది భద్రతాసిబ్బందిని బలితీసుకున్నారు. ఆ మరుసటి రోజే దాడికి సూత్రధారి అయిన ఉగ్రవాది అఫ్జల్ గురును పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 12ఏళ్లకు అతడు దోషిగా తేలడంతో ఉరితీసిన విషయం తెలిసిందే. -
షారుఖ్ స్టైల్లో సీఎం కేజ్రీవాల్ డైలాగ్.. సెటైర్లు వేస్తున్న బీజేపీ నేతలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ సందేశం పంపారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్టైల్లో ‘మై నేమ్ ఈజ్ అరవింద్ కేజ్రీవాల్.. ఐయామ్ నాట్ టెర్రరిస్ట్’ అంటూ పంపిన ఆ మెజేస్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. అయితే జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోపణలు, ఆయన పంపిన మెసేజ్‌పై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను తాము టెర్రరిస్టుగా పిలవడం లేదని అన్నారు. అతన్ని టెర్రరిస్టు అని ఎవరు పిలుస్తున్నారో? కేజ్రీవాల్, అతని సహచరులు అతన్ని ఉగ్రవాది అని ఎందుకు పిలుస్తున్నారో మాకు తెలియదు. మేము అతనిని అవినీతిపరుడనే అంటున్నాం. ఆయన ఢిల్లీకి శత్రువు అని వ్యాఖ్యానించారు. VIDEO | Here's what BJP leader Manoj Tiwari (@ManojTiwariMP) said reacting to Delhi CM Arvind Kejriwal sending a message to people that he's not a terrorist. "Nobody is calling him a terrorist. We're calling him corrupt. He has made senior citizens cry for pension, poor cry for… pic.twitter.com/fztGHhjCds — Press Trust of India (@PTI_News) April 16, 2024 ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై మనోజ్ తివారీ సెటైర్లు వేశారు. అతను వృద్ధుల పెన్షన్ కోసం పాటుపడ్డారు. పేదల కోసం పనిచేశారు. రేషన్ కార్డుల కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి అందించేందుకు ప్రజల కోసం కృషి చేశారని ఎద్దేశా చేశారు. దోపిడీకి పాల్పడే ముందు జైలులో సౌకర్యాల గురించి ఆప్ అధినేత ఆలోచించి ఉంటారని తివారీ అన్నారు. జైలు మాన్యువల్ అందరికీ ఒకేలా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటోంది అని ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడారు. देश के बेटे अरविंद केजरीवाल का जेल से देश की जनता को संदेश - मेरा नाम अरविंद केजरीवाल है और मैं आतंकवादी नहीं हूं। -@SanjayAzadSln pic.twitter.com/9VpPOpnLXa — AAP (@AamAadmiParty) April 16, 2024 -
కన్నయ్య కుమార్ vs మనోజ్ తివారి.. ఎవరి సత్తా ఎంత?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా బీహార్ రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించిన కన్నయ్య కుమార్ ఇప్పుడు రాజధాని ఢిల్లీలో తన హవా చాటేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై కన్నయ్య కుమార్ పోటీకి దిగారు. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం యూపీకి ఆనుకుని ఉండటానికి తోడు ఇక్కడ బీహార్, హర్యానాకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. బీజేపీ వరుసగా మూడోసారి మనోజ్ తివారీని ఇక్కడ నుండి పోటీకి నిలబెట్టింది. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. మనోజ్ తివారీ భోజ్‌పురి సినిమా నటుడు కావడంతో అతనికి జనాదరణ అధికంగానే ఉంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అతనికి పోటీగా బీహార్‌కు చెందిన కన్నయ్య కుమార్‌కు అవకాశం కల్పించింది. ఈయనకు యువత మద్దతు ఉంది. 2020 ఢిల్లీ అల్లర్లు ఈశాన్య ప్రాంతంలోనే మొదలయ్యాయి. ఈ ప్రాంతంలోని సీలంపూర్, ముస్తఫాబాద్, బాబర్పూర్, కార్గిల్ నగర్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ముస్లిం జనాభా ఉంటోంది. దీంతో ఇండియా కూటమి అక్కడి ముస్లిం ఓట్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు కన్నయ్య కుమార్ ప్రసంగాలు ఉపకరిస్తాయని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం. జేఎన్‌యూలో కన్నయ్య కుమార్ విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువతలో అతని పాపులారిటీ తారాస్థాయికి చేరింది. ఇప్పుడు అదే పాపులారిటీని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. మరి ఈశాన్య ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కన్నయ్యను ఆదరిస్తారో, బీజేపీ మనోజ్‌ను అక్కున చేర్చుకుంటారో వేచి చూడాల్సిందే! -
తారలొకచోట... మెరుపులు మరోచోట
వాళ్లంతా భోజ్‌పురీ సినీ పరిశ్రమను తిరుగు లేకుండా ఏలిన, ఏలుతున్న తారలు. వెండితెరపై కనిపించారంటే విజిళ్లు, క్షీరాభిష్కాలే. అయితే వారిపట్ల ఈ వీరాభిమానమంతా భోజ్‌పురీ సినిమాలకు పుట్టిల్లయిన బిహార్, పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌లకే పరిమితం. వాళ్లు స్థానికంగా ఎంతగా వెలిగినా బాలీవుడ్, తెలుగు తదితర సినీ పరిశ్రమల్లోనే విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించడం ద్వారానే దేశవ్యాప్తంగా ఫేమ్‌లోకి వచ్చారు. రాజకీయ రంగస్థలంపైనా ఇదే సీన్ రిపీటవుతోంది. భోజ్‌పురీ తారలెవరూ వారి స్వరాష్ట్రమైన బిహార్‌లో పెద్దగా ఉనికి చాటలేకపోతున్నారు. కారణాలేవైనా వారిని అక్కడినుంచి బరిలోకి దింపేందుకు పార్టీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేసి మాత్రమే వాళ్లు లోక్‌సభలో అడుగు పెడుతున్నారు... భోజ్‌పురీ నటీనటులకు, వారి స్వరాష్ట్రమైన బిహార్‌కు రాజకీయంగా ఎప్పుడూ చుక్కెదురే. పొరుగు రాష్ట్రాలకో, సుదూరాలకో వెళ్లి మాత్రమే రాజకీయాల్లో రాణిస్తున్నారు. పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా రాణించిన భోజ్‌పురీ సూపర్‌స్టార్ రవికిషన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ జౌన్పూర్ లోక్‌సభ స్థానంలో బరిలో దిగిన ఆయన ఘోర ఓటమి చవిచూసి ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం బీజేపీలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి 3 లక్షల ఓట్ల పై చిలుకు భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి కూడా అక్కడినుంచే బరిలోకి దిగుతున్నారు. మరో ప్రముఖ భోజ్‌పురీ నటుడు మనోజ్ తివారీ అయితే ఏకంగా ఢిల్లీని తన రాజకీయ కర్మభూమిగా మార్చుకున్నారు. బిహార్‌లోని కైమూర్ జిల్లా అతర్వాలియా గ్రామానికి చెందిన ఆయన ఈశాన్య ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ. ఈసారి కూడా అక్కడినుంచే పోటీలో ఉన్నారు. భోజ్‌పురీ నట గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్ పరిస్థితీ అంతే. గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఆజంగఢ్ నుంచి నెగ్గిన ఆయన ఈసారీ అక్కడి నుంచే పోటీలో ఉన్నారు. మరో భోజ్‌పురీ గాయకుడు పవన్ సింగ్‌కు కూడా ఈసారి పశ్చిమ బెంగాల్ లోని ఆసన్సోల్ నుంచి బీజేపీ టికెటివ్వగా రెండు రోజులకే ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు. బిహారీ బాబుగా ప్రసిద్ధుడైన బాలీవుడ్ దిగ్గజం శత్రుఘ్న సిన్హా గతంలో రెండుసార్లు బిహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచినా 2019లో టికెట్ దక్కకకపోవడంతో పశి్చమ బెంగాల్ వలస వెళ్లారు. అసన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఈసారీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇంటర్నెట్ సంచలనం, భోజ్‌పురీ గాయని నేహా సింగ్ రాథోడ్‌కు ఈసారి ఢిల్లీ నుంచి టికెట్ ఇస్తారంటున్నారు. గుంజన్.. ఒకే ఒక్కడు ఈ లోక్‌సభ ఎన్నికల్లో భోజ్‌పురి సినీ పరిశ్రమకు సంబంధించి బిహార్ నుంచి పోటీ చేస్తున్నది గుంజన్ కుమార్ ఒక్కరే. అయితే ఈ భోజ్‌పురీ/మగధీ గాయకుడు తన స్వస్థలమైన నవడా నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నారు. ‘‘అన్ని ప్రధాన పార్టీలనూ సంప్రదించా. ఎవరూ టికెటివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని వాపోతున్నారాయన! భోజ్‌పురి నటులు, గాయకులకు బిహార్‌లో లోక్‌సభ టికెటివ్వడానికి ప్రధాన పారీ్టలు వెనకా ముందాడుతున్న మాట వాస్తవమేనని భోజ్‌పురి గాయకుడు వినయ్ బిహారీ అంటున్నారు. ఆయన బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియా ఎమ్మెల్యే. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించారు. కానీ ఏ పార్టీ కూడా టికెటివ్వకపోవడంతో 2010లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థగా పోటీ చేయాల్సి వచ్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన భోజ్‌పురీ భాషకు బిహార్‌లోనే తగిన గౌరవం లభించడం లేదు. బహుశా అందుకే భోజ్‌పురీ నటీనటులు, గాయకులకు ఇతర రాష్ట్రాల నుంచే తప్ప స్వరాష్ట్రంలో పోటీ చేసే అవకాశం దక్కడం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారతాయేమో!’ అన్నారు. భోజ్‌పురీ నటీనటులు, గాయకులకు బీజేపీ మున్ముందు కచి్చతంగా బిహార్ నుంచి అవకాశమిస్తుందని తనకు నమ్మకముందని రవికిషన్ చెప్పుకొచ్చారు. -
రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. చెత్తగా ఆడతాడు!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శలు గుప్పించాడు. అతడు జట్టుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పేర్కొన్నాడు. అంచనాలకు తగ్గట్లు ఒక్కసారి కూడా రాణించడం లేదని.. కోట్లకు కోట్లు మాత్రం తీసుకుంటాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ మాక్సీ నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(20), ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్(24) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. లక్నో విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టాపార్డర్ విఫలం కాగా.. బాధ్యత తీసుకోవాల్సిన నాలుగో నంబర్ బ్యాటర్ మాక్సీ చేతులెత్తేశాడు. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 లక్నో యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహిపాల్ లామ్రోర్(13 బంతుల్లో 33) కాసేపు పోరాడినా ఆర్సీబీని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారి క్రిక్‌బజ్ షోలో మాక్స్వెల్ గురించి మాట్లాడాడు. ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు ‘‘ఆర్సీబీ గ్లెన్ మాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకుంది. సరైన సమయానికి జీతం తీసుకుంటాడు. కానీ అదే స్థాయిలో ఆట మాత్రం ఆడలేకపోతున్నాడు. ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు అన్నట్లుగా ఉంది అతడి పరిస్థితి. ఆటగాడిగా అతడికి అన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయి. కానీ వాటిని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు? ఐపీఎల్లో అతడి ట్రాక్ రికార్డు చూసినట్లయితే,, పంజాబ్ ఫ్రాంఛైజీకి ఆడినపుడు కూడా ఇలాగే ఉండేవాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే తుస్సుమనిపించేవాడు. అతడి ఆటలో నిలకడలేదు. ఇప్పటికైనా లోపాలు సరిచేసుకుంటే మంచిది’’ అని మాజీ బ్యాటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 కోసం ఆర్సీబీ రూ. 11 కోట్లకు మాక్సీని రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ తరఫున గత సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడి 400 పరుగులు చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతడికి ఏకంగా 17 కోట్లు ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ నుంచి భారీ ధర(రూ. 17.5 కోట్లు)కు ట్రేడ్ చేసుకున్న కామెరాన్ గ్రీన్ కూడా ఆర్సీబీకి పెద్దగా ఉపయోగపడటం లేదని మనోజ్ తివారి పేర్కొన్నాడు. ఏదేమైనా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ జట్టుతో లేనిలోటు ఆర్సీబీలో స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. ఆర్సీబీ వర్సెస్ లక్నో స్కోర్లు: టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ లక్నో స్కోరు: 181/5 (20) ఆర్సీబీ స్కోరు: 153 (19.4) ఫలితం: 28 పరుగుల తేడాతో ఆర్సీబీపై లక్నో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మయాంక్ యాదవ్(లక్నో- 3/14). చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్రీడా మంత్రి.. 19 ఏళ్ల కెరీర్‌కు?
టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు తివారీ ముగింపు పలికాడు. ఈ క్రమంలో తన కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన తివారీ బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ఆదివారం ఘనంగా సన్మినించింది. అతడిని గోల్డెన్ బ్యాట్‌తో బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సత్కారించారు. ఈ సందర్భంగా తివారీ మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన ఈడెన్ గార్డెన్స్‌లో రిటైర్మెంట్ అవ్వడం చాలా సంంతోషంగా ఉంది. కానీ నా కెరీర్లో బెంగాల్‌కు రంజీ ట్రోఫీని అందించికపోవడం లోటుగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు. కాగా తన కెరీర్లో 148 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తివారీ.. 47.86 సగటుతో 10,195 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 30 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 5,581, టీ20ల్లో 3,436 పరుగులు మనోజ్ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరపున 12 వన్డేలు ఆడిన తివారీ 287 పరుగులు చేశాడు. 2011లో చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో తివారీ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌లకు ఆడాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభానికి ముందే అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు మనోజ్ ప్రకటించాడు. కానీ బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సూచన మెరకు మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఒకే ఒక్కే సీజన్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత రంజీ సీజన్లో తివారీ భాగమయ్యాడు. ఇక 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేబినెట్లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: #Dhruv Jurel: రెప్పపాటులో.. మెరుపులా కదిలిన జురెల్.. ‘సెంచరీ వీరుడి’ రనౌట్ చూశారా? -
క్రికెట్‌కు మనోజ్ తివారీ వీడ్కోలు
కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఈ బెంగాలీ క్రికెటర్ 2008 నుంచి 2015 వరకు అంతర్జాతీయ కెరీర్లో 12 వన్డేలు, మూడు టి20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. కానీ మూడు టి20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్ అవకాశం దక్కగా 15 పరుగులే చేశాడు. దేశవాళీ క్రికెట్లో 141 మ్యాచ్‌ల్లో 48.56 సగటుతో 9908 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్ పుణేలకు ఆడాడు. 2012లో మనోజ్ తివారీ విన్నింగ్ షాట్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేబినెట్లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. -
కేజ్రీవాల్ ప్లాన్, సిసోడియా హత్యకు కుట్ర చేస్తున్నారా?: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు ప్రాణ హాని ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఈ ఆరోపణలపై బీజేపీ నేత ఎంపీ మనోజ్ తివారీ ఘాటుగా బదులిచ్చారు. ఢిల్లీ జైళ్లు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకే వస్తాయని, మరి సిసోడియా ప్రాణాలకు ఎవరి నుంచి ముప్పు ఉంటుందని ఎదురు ప్రశ్నించారు. సిసోడియా ప్రాణహాని.. వాళ్ల నుంచేనా ఈ అంశంపై తివారీ మాట్లాడుతూ.. “ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం విషయంలో మంత్రి మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత, అవినీతిపరులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంత కాలం అవినీతిపరులని తిట్టిన కేజ్రీవాల్ ప్రస్తుతం అవినీతిపరులను ఆలింగనం చేసుకుంటున్నారు. జైలులో మనీష్ సిసోడియా ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది, అయితే ఢిల్లీ జైలు ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో ఉంది. మరి మనీష్ సిసోడియాకి ప్రాణ హాని బీజేపీ నుంచి ఎలా ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ రహస్యాలన్నీ ఆయనకు సన్నిహితుడైన మనీశ్ సిసోడియాకు బాగా తెలుసు. మరి తన సీక్రెట్లు బయటపడకుండా సిసోడియాను చంపేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ సర్కారు పరిధిలో ఉన్న జైలులో సిసోడియా ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుంది? బీజేపీ నుంచే ముప్పు ఉందంటూ అపోహలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిసోడియాకు గట్టి భద్రత ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ట్వీట్ ద్వారా ఈ విషయాలను పేర్కొన్నారు. Is Arvind Kejriwal conspiring to kill Manish Sisodia to stop him from disclosing Arvind Kejriwal’s secrets? An impression is being created that Manish Sisodia has threats from BJP. I appeal to jail authorities to provide Manish Sisodia best security possible:Manoj Tiwari, BJP MP pic.twitter.com/D0pYOMZVGb — ANI (@ANI) March 8, 2023 -
రంజీ ఫైనల్.. బెంగాల్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న మంత్రి
బెంగాల్-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ-2023 ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 61 పరుగులు వెనుకపడి ఉంది. బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (57) షాబాజ్ అహ్మద్ (13) సాయంతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అనుస్తుప్ మజుందార్ (61) హాఫ్‌సెంచరీతో రాణించగా.. సుమంత గుప్తా (1), అభిమన్యు ఈశ్వరన్ (16), సుదీప్ కుమార్ గరామీ (14) నిరాశపరిచారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కత్ (2/47), చేతన్ సకారియా (2/50) నిప్పులు చెరుగుతున్నారు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైంది. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వనవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీతో రాణించారు. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే చాపచుట్టేసింది. ఉనద్కత్ (3/44), సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), జడేజా (2/19) చెలరేగారు. షాబాజ్ అహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
స్పోర్ట్స్ మినిస్టర్ సారధ్యంలో శతకాలతో విరుచుకుపడిన ప్లేయర్లు
Ranji Trophy 2022-23 Semi Finals MP VS Bengal: రంజీ ట్రోఫీ-2022-23 సీజన్ చివరి అంకానికి చేరింది. ఈ దేశవాలీ టోర్నీలో ఇవాల్టి (ఫిబ్రవరి 8) నుంచే సెమీఫైనల్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి సెమీస్‌లో బెంగాల్.. మధ్యప్రదేశ్‌ను ఢీకొంటుంటే, రెండో సెమీస్‌లో కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు పోటీ పడుతున్నాయి. తొలి సెమీస్ విషయానికొస్తే.. స్పోర్ట్స్ మినిస్టర్ మనోజ్ తివారి సారధ్యంలో బెంగాల్ జట్టు తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. -
ముచ్చటగా మూడోసారి తండ్రైన ప్రముఖ నటుడు.. ట్వీట్ వైరల్
భోజ్‌పూరి నటుడు, ఎంపీ మనోజ్ తివారి ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. సోమవారం ఆయన భార్య సురభి తివారీ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వార్త విన్న అభిమానులు మనోజ్ తివారికి అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్లో ఆయన రాస్తూ..' లక్ష్మి తర్వాత సరస్వతి మా ఇంటికి వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందమైన చిన్నారి జన్మించింది. మా పాపను మీరంతా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇట్లు సురభి-మనోజ్ తివారి' అంటూ పోస్ట్ చేశారు. మనోజ్ తివారి ప్రస్తుతం భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా.. గత నెలలో మనోజ్ భార్య సురభి తివారీ బేబీ షవర్‌ని(సీమంతం) నిర్వహించారు. సురభి- మనోజ్ తివారీకి రెండో భార్య కాగా.. వీరికి 2020లో కూతురు జన్మించింది. అంతకు ముందే రాణి తివారీని 1999లో వివాహం చేసుకోగా.. వారికి రితి అనే కుమార్తె ఉంది. बड़े हर्ष के साथ सूचित करना है कि मेरे घर में लक्ष्मी के बाद सरस्वती का आगमन हुआ है..आज घर में प्यारी सी बिटिया पैदा हुई है.. उसपे आप सभी का आशीर्वाद बना रहे.. सुरभि-मनोज तिवारी pic.twitter.com/JJj1H82XEr — Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) December 12, 2022 -
51 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు
యాభై ఒక్క ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్నాడు బాలీవుడ్ నటుడు మనోజ్ తివారి. తను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య సురభి తివారీ గోధ్ భారై(సీమంతం) ఫంక్షన్ వీడియోను నెట్టింట షేర్ చేశాడు. 'కొన్ని సంతోషకరమైన క్షణాలను మాటల్లో చెప్పలేం. ఈ ఆనందం కలకాలం అలాగే నిలిచిపోతుందని భావిస్తున్నాను' అని క్యాప్షన్ జోడించాడు. దీనికి మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ దీపక్ ఠాకూర్.. నిన్ను ఆ భగవంతుడు చల్లగా దీవించాలి అని కామెంట్ చేశాడు. మనోజ్ అభిమానులైతే శుభాకాంక్షలతో కామెంట్ సెక్షన్‌ను హోరెత్తిస్తున్నారు. కాగా మనోజ్ తివారి 1999లో రాణి తివారిని పెళ్లాడాడు. వీరికి రితి అనే పాప పుట్టింది. 2012లో వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత అతడు సురభిని పెళ్లాడాడు. వీరికి 2020లో పాప పుట్టింది. తాజాగా మరోసారి అతడు తండ్రి కాబోతున్నాడు. మనోజ్ హిందీ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొన్నాడు. View this post on Instagram A post shared by Manoj Tiwari (@manojtiwari.mp) చదవండి: నాపై ట్రోలింగ్‌కు అతడే కారణం: జాన్వీ కపూర్ హన్సిక ఇంట పెళ్లి సందడి -
కేజ్రీవాల్ కరెన్సీ డిమాండ్‌కు బీజేపీ కౌంటర్
-
బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీపై కేసు
రాంచీ: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీలపై కేసు నమోదైంది. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ విమానాశ్రయంలో సూర్యాస్తమయం తర్వాత వీరి చార్టెడ్ ఫ్లైట్‌ను టేకాఫ్ చేయమని అధికారులను బలవంతం చేశారనే ఆరోపణలతో ఈ ఇద్దరితో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపారు పోలీసులు. ఇప్పటికే రాజకీయ సంక్షోభంలో ఉన్న జార్ఖండ్‌లో తాజా పరిణామం చర్చనీయాంశమైంది. దేవ్‌ఘర్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది జులైలోనే ప్రారంభించారు. అయితే ఈ ఎయిర్‌పోర్టులో సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదు. కానీ అవేమీ పట్టించుకోకుండా బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గదిలోకి వెళ్లి తమ చార్టెట్ ఫ్లైట్ క్లియరెన్స్‌కు అనుమతి ఇవ్వాలని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆగస్టు 31న సూర్యాస్తమయం తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిశికాంత్ దూబె, దేవ్‌ఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మంజునాథ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎంపీ నిశికాంత్ మంజునాథ్‌పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పని తాను చేసుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్తగా యూపీఏ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని రిసార్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు జార్ఖండ్‌లో పర్యటించడం, వారిపై కేసు నమోదు కావడం రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది. చదవండి: నితీశ్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకీ ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు -
సెంచరీ చేశా.. అయినా 14 మ్యాచ్‌లకు పక్కనపెట్టారు.. నాది వరల్డ్ రికార్డు!
న్యూఢిల్లీ: ‘‘ప్రస్తుత బీసీసీఐ యాజమాన్యం ఆటగాళ్లకు అండగా నిలబడుతోంది. 4-5 మ్యాచ్‌లలో విఫలమైనా మరో అవకాశం కల్పిస్తోంది’’ అని బెంగాల్ క్రీడా శాఖా మంత్రి, వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారి అన్నారు. తాను టీమిండియాకు ఆడుతున్న సమయంలో గనుక ఇలాంటి మేనేజ్మెంట్ ఉండి ఉంటే తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కేదని అభిప్రాయపడ్డారు. ఏళ్లపాటు ఎదురుచూసి కాగా బెంగాల్‌కు చెందిన మనోజ్ తివారి మనోజ్ తివారి.. భారత్ తరఫున 2008లో అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2011 డిసెంబరులో తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసిన మనోజ్ తివారి.. ఆ తర్వాతి ఛాన్స్ కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. అజేయ శతకంతో రాణించినా దురదృష్ట వెంటాడంతో జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో శ్రీలంకతో మ్యాచ్‌తో లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మకు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మనోజ్.. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ విషయంలో నాది ప్రపంచ రికార్డు ఈ నేపథ్యంలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న మనోజ్ తివారి తాజాగా స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడారు. ‘‘వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాను. కానీ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించారు. 14 మ్యాచ్‌ల పాటు జట్టు దూరమయ్యాను. బాగా ఆడినా సరే నన్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీ. ఒకవేళ నాకు అవకాశం వస్తే అప్పుడు సెలక్టర్లుగా ఉన్నవాళ్లను కచ్చితంగా నిలదీస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. వాళ్ల వల్లే ఇదంతా అదే విధంగా.. ‘‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తర్వాత 14 మ్యాచ్‌లకు దూరమైన ఏకైక ప్లేయర్‌గా నేను ప్రపంచ రికార్డు నెలకొల్పాను. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాను. రీఎంట్రీలో 65 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీశాను. అయినా, కూడా నా కెరీర్ సాఫీగా సాగలేదు. సరైన అవకాశాలు రాలేదు’’ అని మనోజ్ తివారి సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే, వచ్చిన కొన్ని ఛాన్స్‌ల్లోనే తన ప్రతిభను నిరూపించుకున్నానన్న ఆయన.. తన జీవితంలో జరిగిన ఏ విషయానికి చింతించడం లేదని పేర్కొన్నారు. కాగా రంజీ ట్రోఫీ సీజన్ 2021-2022లో బెంగాల్ తరఫున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు మనోజ్ తివారి. సెమీస్ మ్యాచ్‌లోనూ సత్తా చాటారు. చదవండి: Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని -
టీఎంసీలో చేరిన టీమిండియా ఆటగాడు
కోల్కత్తా : టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తన స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో బుధవారం హుబ్లీలో నిర్వహించిన ర్యాలీ పాల్గొని టీఎంసీ గూటికి చేరాడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మనోజ్ రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గతకొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేంద్రంలోని మోదీ సర్కార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రో ధరలను పెంచుతోందంటూ విమర్శలు కురిపించాడు. అంతేకాకుండా సామన్యుడి నడ్డివిరిచేలా పెరుగుతున్న ధరల్లో పెట్రోల్, డీజిల్ భారీ భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. కాగా బెంగాల్లో రాజకీయ కాక తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోరు ఉత్కంఠగా మారింది. అధికార టీఎంసీ నేతల్ని టార్గెట్‌గా చేసుకున్న బీజేపీ.. విజయమే లక్ష్యంగా దూసుకుడుగా వ్యవరిస్తోంది. మరోవైపు బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేలా మమత పావులు కదుపుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని తనవైపుకు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులకు టికెట్లు కేటాయించి పార్లెమెంట్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మనోజ్ తివారీని సైతం తన గూటికి చేర్చుకున్నారు. కాగా 35 ఏళ్ల మనోజ్ తివారీ టీమిండియా తరుఫున వన్డే, టీ-20లకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో సొంత జట్టు కోల్కత్త తరఫున సుదీర్ఘంగా ఆడాడు. కొన్నాళ్ల పాటు పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రాష్ట్ర స్థాయిలో బెంగాల్ క్రికెట్‌కు సారథిగా వ్యవహరించాడు. 2008లో ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అరంగేట్రం చేసిన తివారీ.. 12 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత ఫామ్ కోల్పోవడంతో జట్టుకి దూరమయ్యాడు. ఐపీఎల్లో రాణించినప్పటికీ జట్టులో మరోసారి చోటుదక్కలేదు. ఈ క్రమంలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నకావడంతో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే టీఎంసీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తారా లేక అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
నాకు లక్ష ఇస్తే.. తనకు రూ. 25 వేలే
బాలీవుడ్ టీవీ షో కపిల్ శర్మ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బడా స్టార్స్ అంతా ఈ షోకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఈ వారం కపిల్ శర్మ షోకు భోజ్‌పురి సూపర్ స్టార్లు మనోజ్ తివారీ, రవి కిషన్ వచ్చారు. తమ జీవితాలు, కెరీర్‌కు సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. అంతేకాక ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో రవి కిషన్ నాకు సీనియర్. నేను పరిశ్రమలోకి వచ్చేనాటికే అతడు సూపర్ స్టార్. అయితే ఒక సినిమాకు రవికిషన్‌కు కేవలం 25 వేల రూపాయలు ఇస్తే.. నాకు లక్ష రూపాయలు ఇచ్చారు. అది కూడా కేవలం ఒక ఐటమ్ సాంగ్ కోసం’ అంటూ రవి కిషన్‌ని ఆట పట్టించాడు. ఈ షోలో క్రికెట్ ఆడారు. ఇలా ఇద్దరు ఒకే షోకు హాజరుకావడం చాలా గొప్ప విషయం అన్నారు. అంతేకాక ఇండస్ట్రీలో వారి ప్రయాణం.. ఎదుర్కొన్న కష్టాలు.. హార్డ్ వర్క్ వంటి విషయాల గురించి వెల్లడించారు. (చదవండి: ‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’) అభిమానులతో మాటల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఇద్దరు హీరోలు. తాను రాజకీయ నాయకుడిని అయితే.. నదులను శుభ్రం చేస్తానని తెలిపారు మనోజ్ తివారీ. ఇద్దరికి సంబంధించిన ఫోటోలను షోలో ప్రదర్శించారు. వాటిల్లో వారు సమజానికి సేవ చేస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ కాలంలో మనోజ్ తివారీ పేదలకు సాయం చేయగా.. రవి కిషన్ తన స్వస్థలం.. గోరఖ్‌పూర్‌లో వరదల సమయంలో, లాక్డౌన్ కాలంలో జనాలకు అవసరమైన వస్తువులను అందించారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. View this post on Instagram कल A post shared by Ravi Kishan (@ravikishann) on Sep 11, 2020 at 11:37pm PDT -
ఖాళీ ఉన్నా... ఆడే అవకాశం ఇవ్వలేదు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్లో ఖాళీ ఉన్నా... తనకు అవకాశం ఇవ్వలేదంటూ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అతడు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వివరించాడు. ‘2011–2012లో మేము ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత మిడిల్ ఆర్డర్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయింది. అంతేకాకుండా మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్‌మన్‌కు ఒక ఖాళీ కూడా ఉంది. టీమ్ మేనేజ్మెంట్ నాకు అవకాశం ఇవ్వాలని భావించి ఉంటే తప్పకుండా ఇచ్చేది. కానీ వారు అలా భావించలేదు’ అని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా సెంచరీతో జట్టును గెలిపించే ప్రదర్శన చేశాక ఎవరికైనా సరే జట్టులో తన స్థానం సుస్థిరం అనే అనిపిస్తుందని... అయితే తనకు మాత్రం ఆ విధంగా జరగలేదని... తర్వాత తనను ఏకంగా 14 మ్యాచ్‌లపాటు బెంచ్‌కే పరిమితం చేయడం షాక్‌కు గురిచేసిందని వాపోయాడు. ఆసీస్ పర్యటన కంటే ముందు వెస్టిండీస్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడింది. అందులో భాగంగా జరిగిన ఐదో వన్డేలో మనోజ్ తివారి శతకం (104) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది.(ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు : నెహ్రా) మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని మాత్రం మనోజ్ ప్రశంసలతో ముంచెత్తాడు. 2011 ప్రపంచ కప్‌ను భారత చేజిక్కించుకోవడంలో గంగూలీ పాత్ర కూడా ఉందన్నాడు. గంగూలీ నాయకుడిగా ఉన్నప్పుడే ప్రపంచ కప్‌ను గెలిచేలా యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, హర్భజన్ సింగ్‌లతో కూడిన జట్టును తయారు చేశాడన్నాడు. వారిని 2011 ప్రపంచ కప్‌లో అప్పటి సారథి ధోని సమర్థంగా ఉపయోగించుకున్నాడని పేర్కొన్నాడు. భారత్ తరఫున 12 వన్డేలు ఆడిన మనోజ్ తివారి 287 పరుగులు చేశాడు. -
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి
ముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్ సెలక్టర్ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే మేలు కలుగు తుందని విమర్శించాడు. సెలక్షన్ కమిటీ వైఫల్యం వల్లే గతేడాది వరల్డ్‌కప్‌లో భారత్ ఓడిపోయిందన్న తివారీ... నాలుగేళ్ల సమయం దొరికినప్పటికీ జట్టులో నాలుగో నంబర్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయిందని అసహనం వ్యక్తం చేశాడు. సిరీస్‌ల కోసం టీమిండియాను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ సమావేశాలను టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేశాడు. ఆటగాళ్లను ఏ పద్ధతి ప్రకారం కమిటీ ఎంపిక చేస్తుందో తెలుసుకోవడానికి ఇదొక్కటే మార్గమని అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పించినప్పుడు కనీసం అతనికైనా కారణం చెప్పాలని కోరాడు. ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్ర వ్యక్తి కాబట్టి హనుమ విహారికి, వెస్ట్‌జోన్‌కి చెందిన వ్యక్తి అధికారంలో ఉండగా వసీమ్ జాఫర్‌కు, నార్త్‌జోన్ వ్యక్తి సెలెక్టర్‌గా ఉన్న కాలంలో గురుకీరత్ సింగ్, రిషీ ధావన్‌లకు అవకాశాలు వచ్చాయని భారత్ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారీ ఆరోపించాడు. -
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి మార్పు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఆదేశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న మనోజ్ తివారీ స్థానంలో ఆదేశ్ గుప్తా నియమితులయ్యారు. బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆదేశ్ కుమార్ గుప్తా.. గతంలో ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా పనిచేశారు. కాగా, రెండు సార్లు ఎంపీగా ఉన్న మనోజ్ తివారి 2016లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి వైదొలగాలని భావించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే నూతన అధ్యక్షుడి ఎంపిక చేపట్టే వరకు పదవిలో కొనసాగాల్సిందిగా తివారీకి బీజేపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలిసింది. మరోవైపు ఇటీవల తివారీ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. హరియాణాలోని ఓ అకాడమీలో క్రికెట్ ఆడటం వివాదానికి దారితీసింది. -
‘లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేదు’
న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో పలు నిబంధనలు, మర్గదర్శకాలను పాటిస్తూ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ హర్యానాలోని సోనిపట్ జిల్లా షేక్‌పురాలో ఉన్న క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో సోమవారం పాల్గొన్నారు. క్రికెట్ ఆడుతున్న క్రమంలో మనోజ్ తివారి తన ముఖానికి మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాక్డౌన్ నిబంధనలను ఎంపీ ఉల్లఘించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తనపై వస్తున్న విమర్శలపై ఎంపీ మనోజ్ తివారీ స్పందించారు. ‘లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన సామాజిక దూరం నిబంధనలను పాటించాను అని తెలిపారు. ప్రేక్షకులు లేకుండా స్టేడియాలు ప్రారంభించుకోవాలని హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తాను సోనిపట్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆడినట్లు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియలో వైరల్‌గా మారిన ఫొటోల్లో ఎంపీ మనోజ్ తివారీ ముఖానికి మాస్క్ ధరించకుండా, సామజిక దూరం పాటించకూడా ఉన్నట్లు కనిపిస్తోంది. దేశంలో కరోనా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా 6,977 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,38,845కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.