న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు ప్రాణ హాని ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఈ ఆరోపణలపై బీజేపీ నేత ఎంపీ మనోజ్ తివారీ ఘాటుగా బదులిచ్చారు. ఢిల్లీ జైళ్లు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకే వస్తాయని, మరి సిసోడియా ప్రాణాలకు ఎవరి నుంచి ముప్పు ఉంటుందని ఎదురు ప్రశ్నించారు.
సిసోడియా ప్రాణహాని.. వాళ్ల నుంచేనా
ఈ అంశంపై తివారీ మాట్లాడుతూ.. “ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం విషయంలో మంత్రి మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత, అవినీతిపరులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంత కాలం అవినీతిపరులని తిట్టిన కేజ్రీవాల్ ప్రస్తుతం అవినీతిపరులను ఆలింగనం చేసుకుంటున్నారు. జైలులో మనీష్ సిసోడియా ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది, అయితే ఢిల్లీ జైలు ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో ఉంది. మరి మనీష్ సిసోడియాకి ప్రాణ హాని బీజేపీ నుంచి ఎలా ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ రహస్యాలన్నీ ఆయనకు సన్నిహితుడైన మనీశ్ సిసోడియాకు బాగా తెలుసు.
మరి తన సీక్రెట్లు బయటపడకుండా సిసోడియాను చంపేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ సర్కారు పరిధిలో ఉన్న జైలులో సిసోడియా ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుంది? బీజేపీ నుంచే ముప్పు ఉందంటూ అపోహలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిసోడియాకు గట్టి భద్రత ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ట్వీట్ ద్వారా ఈ విషయాలను పేర్కొన్నారు.
Is Arvind Kejriwal conspiring to kill Manish Sisodia to stop him from disclosing Arvind Kejriwal’s secrets? An impression is being created that Manish Sisodia has threats from BJP. I appeal to jail authorities to provide Manish Sisodia best security possible:Manoj Tiwari, BJP MP pic.twitter.com/D0pYOMZVGb
— ANI (@ANI) March 8, 2023
Comments
Please login to add a commentAdd a comment