లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా బీహార్ రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించిన కన్నయ్య కుమార్ ఇప్పుడు రాజధాని ఢిల్లీలో తన హవా చాటేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై కన్నయ్య కుమార్ పోటీకి దిగారు.
ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం యూపీకి ఆనుకుని ఉండటానికి తోడు ఇక్కడ బీహార్, హర్యానాకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. బీజేపీ వరుసగా మూడోసారి మనోజ్ తివారీని ఇక్కడ నుండి పోటీకి నిలబెట్టింది. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు.
మనోజ్ తివారీ భోజ్‌పురి సినిమా నటుడు కావడంతో అతనికి జనాదరణ అధికంగానే ఉంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అతనికి పోటీగా బీహార్‌కు చెందిన కన్నయ్య కుమార్‌కు అవకాశం కల్పించింది. ఈయనకు యువత మద్దతు ఉంది. 2020 ఢిల్లీ అల్లర్లు ఈశాన్య ప్రాంతంలోనే మొదలయ్యాయి. ఈ ప్రాంతంలోని సీలంపూర్, ముస్తఫాబాద్, బాబర్‌పూర్, కార్గిల్ నగర్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ముస్లిం జనాభా ఉంటోంది. దీంతో ఇండియా కూటమి అక్కడి ముస్లిం ఓట్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు కన్నయ్య కుమార్ ప్రసంగాలు ఉపకరిస్తాయని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం.
జేఎన్‌యూలో కన్నయ్య కుమార్ విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువతలో అతని పాపులారిటీ తారాస్థాయికి చేరింది. ఇప్పుడు అదే పాపులారిటీని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. మరి ఈశాన్య ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కన్నయ్యను ఆదరిస్తారో, బీజేపీ మనోజ్‌ను అక్కున చేర్చుకుంటారో వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment