Actor Manoj Tiwari Shares Wife Surabhi Baby Shower Function Video Goes Viral - Sakshi
Sakshi News home page

Manoj Tiwari: భార్య సీమంతం ఫంక్షన్‌.. వీడియో షేర్‌ చేసిన నటుడు

Published Wed, Nov 23 2022 7:26 PM | Last Updated on Wed, Nov 23 2022 8:21 PM

Actor Manoj Tiwari Shares Wife Surabhi Baby Shower Function - Sakshi

యాభై ఒక్క ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్నాడు బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ తివారి. తను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య సురభి తివారీ గోధ్‌ భారై(సీమంతం) ఫంక్షన్‌ వీడియోను నెట్టింట షేర్‌ చేశాడు. 'కొన్ని సంతోషకరమైన క్షణాలను మాటల్లో చెప్పలేం. ఈ ఆనందం కలకాలం అలాగే నిలిచిపోతుందని భావిస్తున్నాను' అని క్యాప్షన్‌ జోడించాడు.

దీనికి మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ దీపక్‌ ఠాకూర్‌.. నిన్ను ఆ భగవంతుడు చల్లగా దీవించాలి అని కామెంట్‌ చేశాడు. మనోజ్‌ అభిమానులైతే శుభాకాంక్షలతో కామెంట్‌ సెక్షన్‌ను హోరెత్తిస్తున్నారు. కాగా మనోజ్‌ తివారి 1999లో రాణి తివారిని పెళ్లాడాడు. వీరికి రితి అనే పాప పుట్టింది. 2012లో వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత అతడు సురభిని పెళ్లాడాడు. వీరికి 2020లో పాప పుట్టింది. తాజాగా మరోసారి అతడు తండ్రి కాబోతున్నాడు. మనోజ్‌ హిందీ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొన్నాడు.

చదవండి: నాపై ట్రోలింగ్‌కు అతడే కారణం: జాన్వీ కపూర్‌
హన్సిక ఇంట పెళ్లి సందడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement