కేజ్రీవాల్‌ తక్షణమే రాజీనామా చేయాలి | Kejriwal must resign, BJP will clean Delhi in 4 months: Manoj Tiwari | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ తక్షణమే రాజీనామా చేయాలి

Published Wed, Apr 26 2017 2:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Kejriwal must resign, BJP will clean Delhi in 4 months: Manoj Tiwari

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ తక్షణమే రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ డిమాండ్‌ చేశారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనోజ్‌ తివారీ మాట్లాడుతూ... ఢిల్లీని నాలుగు నెలల్లో బీజేపీ శుభ్రం చేస్తుందని అన్నారు. '4 నెలల్లో ఢిల్లీని క్లీన్‌ సిటీగా మార్చుతాం. పరిశుభ్రమైన, ఎలాంటి వ్యాధులు లేని ఆరోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతాం. అని ఆయన హామీ ఇచ్చారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనందుకు కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆప్‌ విస్మరించిందని, నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రజలు కూడా కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని కోరుకుంటున్నారని మనోజ్‌ తివారీ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ 'చీపురు'ను ఊడ్చేయడంతో ఆప్‌ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement