షారుఖ్‌ స్టైల్లో సీఎం కేజ్రీవాల్‌ డైలాగ్‌.. సెటైర్లు వేస్తున్న బీజేపీ నేతలు | Manoj Tiwari Reacting To Delhi Cm Arvind Kejriwal Sending Message | Sakshi
Sakshi News home page

షారుఖ్‌ స్టైల్లో సీఎం కేజ్రీవాల్‌ డైలాగ్‌.. సెటైర్లు వేస్తున్న బీజేపీ నేతలు

Published Tue, Apr 16 2024 4:21 PM | Last Updated on Tue, Apr 16 2024 4:42 PM

Manoj Tiwari Reacting To Delhi Cm Arvind Kejriwal Sending Message - Sakshi

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టై జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ సందేశం పంపారు. 

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ స్టైల్లో ‘మై నేమ్‌ ఈజ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఐయామ్‌ నాట్‌ టెర్రరిస్ట్‌’ అంటూ పంపిన ఆ మెజేస్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ మీడియాకు వెల్లడించారు. అయితే జైలు నుంచి కేజ్రీవాల్‌ పంపిన సందేశంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

కేజ్రీవాల్‌ ఆరోపణలు, ఆయన పంపిన మెసేజ్‌పై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను తాము టెర్రరిస్టుగా పిలవడం లేదని అన్నారు. అతన్ని టెర్రరిస్టు అని ఎవరు పిలుస్తున్నారో? కేజ్రీవాల్, అతని సహచరులు అతన్ని ఉగ్రవాది అని ఎందుకు పిలుస్తున్నారో మాకు తెలియదు. మేము అతనిని అవినీతిపరుడనే అంటున్నాం. ఆయన ఢిల్లీకి శత్రువు అని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై మనోజ్‌ తివారీ సెటైర్లు వేశారు. అతను వృద్ధుల పెన్షన్ కోసం పాటుపడ్డారు. పేదల కోసం పనిచేశారు. రేషన్ కార్డుల కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి అందించేందుకు ప్రజల కోసం కృషి చేశారని ఎద్దేశా చేశారు.  

దోపిడీకి పాల్పడే ముందు జైలులో సౌకర్యాల గురించి ఆప్ అధినేత ఆలోచించి ఉంటారని తివారీ అన్నారు. జైలు మాన్యువల్ అందరికీ ఒకేలా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటోంది అని ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ మీడియాతో మాట్లాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement