delhi municipal corporation
-
ఢిల్లీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో సివిల్స్ అభ్యర్థుల జలసమాధి ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. మరణాలపై మీడియా వార్తలతో కేసును సూమోటోగా స్వీకరించింది. ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసుల జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, సంస్థల వివరాలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులు, సంబంధిత శాఖ అధికారులు వాటిపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదికలో పొందుపర్చాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడింది. పటేల్ నగర్ ప్రాంతంలో పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచి అక్కడ విద్యుదాఘాతానికి గురై సివిల్స్ అభ్యర్థి మరణించిన ఉదంతాన్నీ కేసుగా ఎన్హెచ్ఆర్సీ సూమోటోగా స్వీకరించింది. -
భయం లేకుండా స్త్రీలు పార్కులకు వెళ్లొచ్చు.. ఇవి వారికి మాత్రమే!
ఢిల్లీలో స్త్రీలకు ఉపశమనం. ఢిల్లీలోని 250 వార్డుల్లో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే ‘పింక్ పార్కు’లను ఏర్పాటు చేయనున్నారు. ఆకతాయుల వల్ల, దొంగల వల్ల పార్కులకు వెళ్లాలంటే భయపడే స్త్రీలు ఇళ్లల్లోనే మగ్గాల్సిన అవసరం లేకుండా చేసిన ఆ ఆలోచన మెచ్చుకోలు పొందుతోంది. బహుశా ప్రతి నగరంలో, పట్టణంలో ఇలాంటి పార్కులు ఉండాలేమో. ఆడవాళ్లు ఉదయాన్నే పార్క్‌కు వెళ్లి నడవాలనుకుంటారు. వారికి సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుని నడుస్తుంటారు. కాని అలా నడిచేవారిని చూడటానికి కొందరు ఆకతాయులు వస్తుంటారు. ఇంకేం నడక? పార్కుకు వచ్చి యోగా మ్యాట్ పరిచి ఆసనాలు వేద్దామనుకుంటారు. అటుగా వెళుతున్న మగవారు ఒక నిమిషం ఆగి చూసినా వారికి అసౌకర్యమే. ఆడవాళ్లు పార్క్‌లో పిల్లలతో ఆడుకోవాలనుకుంటారు. పక్కనే ఒక తండ్రి వచ్చి తన పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వారు ఉండగలరా? పార్కుకు వచ్చి ఆడవాళ్లు అక్కడున్న జిమ్ పరికరాలతో ఏవో ప్రయత్నాలు చేయాలనుకుంటారు. మగవారు కూడా లోపల ఉంటే ఎంత ఇబ్బంది. పార్క్‌కు వచ్చిన ఆడవాళ్లు ఊరికే అలా బెంచీ మీద కూచుని పాటలు వినడమో, పుస్తకం చదువుకోవడమో చేయాలనుకున్నా కావలసిన ప్రైవసీ దొరుకుతుందా? ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ ఉండే గృహిణులు, అమ్మమ్మలు, నానమ్మలు, ఉద్యోగం చేసి అలసొచ్చిన స్త్రీలు కాస్త తెరిపిన పడాలంటే ఆహ్లాదమైన, సురక్షితమైన పబ్లిక్ ప్లేస్ ఉంటే ఎలా ఉంటుంది? వీటన్నింటికి జవాబు ‘పింక్ పార్క్’. ఢిల్లీలో ఉన్న 250 వార్డుల్లో ప్రతి వార్డులోనూ తప్పనిసరిగా ఒక ‘పింక్ పార్క్’ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ‘ఢిల్లీలో కార్పొరేషన్ పరిధిలో 15000 పార్కులు ఉన్నాయి. ఇవి స్త్రీలు, పురుషులు ఉపయోగించడానికి వీలుగా మెయిన్‌టెయిన్ అవుతున్నాయి. కాని వీటిలోని జిమ్‌లను కాని, వాకింగ్ ట్రాక్‌లను కాని, పిల్లల ప్లే ఏరియాలను కాని ఉపయోగించుకోవడానికి స్త్రీలు ఇబ్బంది పడటం గమనించాం. అందుకే స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే పింక్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం’ అని కార్పొరేషన్ డిప్యూటి మేయర్ తెలియచేశారు. నేరాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో నేరాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. పార్కుల్లో ఆకతాయిల బెడద ఉంటుంది. పిల్లలను ఎత్తుకుని పోయేవారు కూడా ఉండొచ్చు. అందుకని చాలామంది తల్లులు భర్త తోడు లేకుండా రావడానికి సంశయిస్తుంటారు. వీరి కోసమే ‘పింక్ పార్కులు’ రానున్నాయి. స్త్రీల నిర్వహణ పింక్ పార్కులకు ప్రవేశ ద్వారాల దగ్గర మాత్రమే మగ గార్డులు ఉంటారు. లోపల పార్కు నిర్వహణకు, జిమ్‌కు, క్యాంటిన్ దగ్గర ఆడవాళ్లే పని చేస్తారు. ‘పదేళ్ల లోపు మగ పిల్లలను మాత్రమే ఈ పార్కుల్లో తల్లులతో పాటు అనుమతిస్తాం’ అని కార్పొరేషన్ బాధ్యులు తెలియచేశారు. సీసీ టీవీలు అడుగడుగునా ఉంటాయి. పిల్లలు ఆడుకునే చోట నిఘా ఉంటుంది. దీని వల్ల పిల్లలను ఆడుకోవడానికి వదిలి స్త్రీలు తమ వ్యాయామాలను, నడకను, జిమ్‌ను నిశ్చింతగా కొనసాగించవచ్చు. ‘అన్నింటికంటే ముఖ్యం పిల్లలతో హాయిగా ఆడుకోవాలనుకునే తల్లులు బిడియం అక్కర్లేకుండా ఆడుకోవచ్చు’ అంటున్నారు ఈ ఆలోచనకు బాధ్యులు. ప్రతి ఊరిలో అవసరం బిజీ లైఫ్‌లో స్త్రీలు కాసింత విరామాన్ని, ఆహ్లాదాన్ని కోరుకుంటే అలాంటి వారికి పింక్ పార్కులు గొప్ప ఓదార్పు అవుతాయి. పిల్లల ఆరోగ్యం కోసం, కాలక్షేపం వారిని ఆడించాలనుకునే తల్లులు కూడా వీటి వల్ల మేలు పొందుతారు. తగిన చోటు లేక కనీసం వాకింగ్ కూడా చేయలేని స్త్రీలు వీటివల్ల చురుకుదనాన్ని, ఆరోగ్యాన్ని పొందే వీలుంటుంది. ఇన్నీ ప్రయోజనాలున్న ఆలోచనను ప్రతి రాష్ట్రంలో ప్రతిపాదించవచ్చు. స్త్రీలు విన్నవిస్తే ప్రభుత్వాలు వింటాయి కూడా. త్వరలో అన్ని ఊళ్లలో ఇలాంటి పార్క్‌లు రావాలని ఆశిద్దాం. -
జై మోదీ.. కేజ్రీవాల్ జిందాబాద్.. దద్దరిల్లిన హౌజ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్(ఎంసీడీ)లోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎంసీడీ సభలో ఆప్, బీజేపీ నేతలు టేబుల్స్‌పైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో, ఆ ప్రాంతంలో రసాభాస చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎంసీడీలో ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం శుక్రవారం ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తామే గెలుపొందినట్టు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ప్రకటించారు. తమ పార్టీకి మొత్తం 138 ఓట్లు వచ్చాయని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు ఆయన తెలిపారు. చెందిన ఐదుగురు సభ్యులు ఆప్ అభ్యర్థులకు ఓటేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 స్థానాలు గెలిచింది. అయితే ఇవాళ ఒక ఆప్ సభ్యుడు బీజేపీలో చేరాడు. దాంతో ఆప్ బలం 133కు తగ్గింది. అయినప్పటికీ శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఆప్‌కు 138 మంది సభ్యుల ఓట్లు పడటంతో బీజేపీ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే గెలిచామని ఆప్ నేతలు చెబుతున్నప్పటికీ బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అయితే, ఎన్నికల అధికారులు మొత్తం ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీకి ముగ్గురు ఆప్ సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులు ఎన్నికయ్యారని తెలిపినట్టు బీజేపీ చెబుతోంది. ఆప్ తామే గెలిచినట్లు తప్పుడు ప్రకటన చేసిందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. దీంతో, స్టాండింగ్ కమిటీ గెలుపు ఎవరిదనే విషయంపై సస్పెన్స్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సభలో కొందరు కౌన్సిలర్లు జై శ్రీరామ్, జై మోదీ అంటూ నినాదాలు చేయగా.. ఆప్ కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్, కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. VIDEO | Brawl breaks out between AAP and BJP councillors in the MCD House as their tussle continues over the standing committee polls. pic.twitter.com/6dTKhAwdia — Press Trust of India (@PTI_News) February 24, 2023 ఇక, ఈ ఎన్నికల్లో ఆప్ తరఫున అమీల్ మాలిక్, రమీందర్ కౌర్, మోహిని జీన్వాల్, సారిక చౌదరిలను నామినేట్ చేసింది. మరోవైపు, బీజేపీ కమల్జీత్ సెహ్రావత్, పంకజ్ లూథ్రాలను రంగంలోకి దింపింది. కాగా, బీజేపీలో చేరిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ గజేందర్ సింగ్ దారాల్ కూడా పోటీలో ఉన్నారు. అయితే, స్టండింగ్ కమిటీకి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది నిధులను ఎలా ఉపయోగించాలి, పలు ప్రాజెక్ట్‌లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. VIDEO | MCD standing committee elections: Ruckus in the House after Delhi mayor Shelly Oberoi said an invalid vote cannot be called valid. pic.twitter.com/fnyiX9tv1j — Press Trust of India (@PTI_News) February 24, 2023 మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు చెల్లదంటూ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించడంతో సభలో బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. సభలో తన్నుకోవడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. కౌన్సిలర్లను అడ్డుకున్నారు. Breaking : Scuffle breaks out among AAP, BJP councilors during Standing Committee Election. #MCDelections #MCD #Delhi #BJP #AAP pic.twitter.com/iBwpNfKgZN — Neeraj Shrivastava نیرج سریواستو नीरज श्रीवास्तव (@NeerShrivastava) February 24, 2023 -
ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఏంది ఈ రచ్చ?
సాక్షి, న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ భవనం మరోసారి రణరంగాన్ని తలపించింది. మంగళవారం మేయర్ పదవి కోసం ఎన్నిక జరగాల్సి ఉండగా.. బీజేపీ-ఆప్ కౌన్సిలర్లు మరోసారి రచ్చ చేశారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో హౌజ్ గందరగోళంగా మారింది. ఈ తరుణంలో హౌజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ ప్రకటించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఫలితాలు వెలువడి నెల గడుస్తున్నా ఇంకా మేయర్‌ను ఎన్నుకోలేదు. జనవరి 6వ తేదీన మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఆ టైంలో ‘ఎన్నికల్లో ఓడినా కూడా తమ అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టి మేయర్ పదవి దక్కించుకోవాలని బీజేపీ చూస్తోంద’’ని ఆప్ ఆరోపించింది. ఈ మేరకు ఆప్-బీజేపీ పోటాపోటీ నినాదాలు, తోపులాటతో గందరగోళనం నెలకొని అప్పుడు ఎన్నిక వాయిదా పడింది. అయితే.. మంగళవారం ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేశారు. మరోసారి అలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఎంసీడీ భవనం వద్ద భారీ భద్రతను, హౌజ్‌లో మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. తొలుత లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన కౌన్సిలర్లతో హడావిడిగా ప్రమాణం చేయించారు ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆపై పదిహేను నిమిషాలు హౌజ్‌ను వాయిదా చేశారు. తిరిగి ప్రారంభమైన సమయంలో.. ‘మోదీ.. మోదీ’అంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు వ్యతిరేక నినాదాలతో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు బీజేపీ కౌన్సిలర్లు. ఆపై నేరుగా ఆప్ కౌన్సిలర్ల దగ్గరికి వెళ్లి.. బిగ్గరగా నినాదాలు చేస్తూనే హౌజ్‌ను వాయిదా వేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను కోరారు. ఈ తరుణంలో.. ప్రతిగా ‘‘షేమ్.. షేమ్’’ నినాదాలతో హోరెత్తించారు ఆప్ కౌన్సిలర్లు. గెలుపు కోసం నామినేటెడ్ కౌన్సిలర్లను ఓటింగ్‌లో పాల్గొనేలా చూస్తున్నారంటూ బీజేపీని ఎద్దేశా చేశారు. అదే సమయంలో నామినేటెడ్ మెంబర్లు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు. ఒకానొక తరుణంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో హౌజ్‌ను నడపడం కష్టమంటూ వాయిదా వేశారు ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ. #DelhiMayoralPolls | Presiding officer Satya Sharma said house proceedings cannot be conducted amid sloganeering from both AAP and BJP councillors#DelhiMayorElection pic.twitter.com/qmR2wVSbXV — Hindustan Times (@htTweets) January 24, 2023 ఢిల్లీ మేయర్‌ను ఎన్నికల్లో నెగ్గిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఎల్జీ నామినేట్ చేసే కౌన్సిలర్లతో పాటు ఢిల్లీ పరిధిలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. తొలి దఫాలో.. ఏ పార్టీ అయినా సరే మహిళా అభ్యర్థికే ఢిల్లీకి మేయర్ పీఠం కట్టబెడుతారు. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్, బీజేపీ 104 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 9 స్థానాలు మాత్రమే సరిపెట్టుకుంది. తొలుత ఓటమి కారణంతో మేయర్ పదవికి పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. తదనంతర పరిణామాలతో ఎందుకనో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పోటీలోకి దిగుతున్నట్లు అభ్యర్థిని నిలిపింది. ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. -
ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్! పదిహేనేళ్ల బీజేపీ అధికారాన్ని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీపురుతో ఊడ్చేసింది. ఢిల్లీ దేశ రాజధాని మాత్రమే కాదు, ఓ చిన్న రాష్ట్రం కూడా. అక్కడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, గెలిచిన పార్టీ నేత సీఎం అవుతాడు. అయితే ఇతర రాష్ట్రాల సీఎంలకున్న అధికారాల్లో కొన్ని ఢిల్లీ సీఎంకు ఉండవు. దేశ రాజధాని కావడంతో ఢిల్లీపై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విశేషాధికారాలు అనివార్యంగా దఖలు పడతాయి. దేశ పాలనకు, విదేశాంగ కార్యకలాపాలకు రాజధాని కీలకం గనుక ఇలా కొన్ని విషయాల్లో కేంద్రం మాట, లేదా అధికారం చెల్లుబాటవడం అనివార్యం, ఆమోదనీయం కూడా. కేంద్రంలో, ఢిల్లీలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ పనితీరుకు ఆస్కారముంటుంది. ఏ విషయంలోనూ సమస్యకు చాన్సుండదు. చిక్కల్లా అక్కడో పార్టీ, ఇక్కడో పార్టీ అధికారంలో ఉంటేనే! ఇది ఒక్కోసారి రాజ్యాంగ సంక్షోభానికీ దారి తీస్తుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఆప్కూ కేంద్రంలో అధికారం చలాయిస్తున్న మోదీ బీజేపీకీ మధ్య ప్రస్తుతం జరుగుతున్నదదే! ఎంసీడీపై పట్టు బిగించడంతో కేజ్రీవాల్ ఇక మరిన్ని అధికారాల కోసం కేంద్రంపై మరింత దూకుడుగా పోరాడే అవకాశముంటుంది. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ కేంద్రం ఏజెంటైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కేజ్రీవాల్ ప్రభుత్వంపైకి మరింతగా ఉసిగొల్పే అవకాశం లేకపోలేదు. ఎల్జీ, సీఎం ఆధిపత్య పోరు ప్రక్షాళన నినాదంతో చీపురు చేతపట్టి రాజకీయ కదనరంగంలోకి దిగిన కేజ్రీవాల్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తర్వాత 2020లోనూ జయభేరి మోగించాడు. ఏడేళ్లుగా కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్నాడు. సీఎం అయిన మరుక్షణం నుంచే లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆయన పోరాటానికి తెర తీశాడు. నజీబ్‌జంగ్ నుంచి ప్రస్తుత వినయ్‌కుమార్ సక్సేనా దాకా ఎల్జీగా ఎవరున్నా ఆప్‌ను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో పలు ఆప్ సంక్షేమ పథకాలను వారు అనుమతించకపోవడం చాలాసార్లు వివాదానికి దారితీసింది. మొహల్లా క్లినిక్‌లు, పాఠశాల అభివృద్ధి వంటి వినూత్న పథకాలను ఎల్జీ అనుమానపు చూపులు వెంటాడాయి. కొన్నింటిపై విచారణకు ఆదేశించేదాకా వెళ్లింది! ఆప్ అగ్రనేతలే లక్ష్యంగా ఎల్జీ పావులు కదిపాడు కూడా. ఆప్ నేతలు కూడా ఎల్జీ అవినీతికి పాల్పడుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు. ధర్నాలకూ దిగారు. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండొద్దని, మంత్రులను లెక్కచేయాల్సిన అవసరం లేదని అధికారులను ప్రోత్సహిస్తున్నాడంటూ ఆరోపించారు. ఎల్జీతో తప్పనిసరి భేటీలకు కూడా కేజ్రీవాల్ దూరంగా ఉన్న సందర్భాలెన్నో! ఎందుకింత వివాదమంటే... ఢిల్లీపై పెత్తనం సీఎందా, ఎల్జీదా అన్నదానిపై స్పష్టత లేకపోవడమే!! ఎల్జీదే పెత్తనమని ఢిల్లీ హైకోర్టు తీరి్పస్తే సుప్రీంకోర్టు దానితో విభేదించింది. ఎన్నికైన ప్రభుత్వం సూచనల మేరకే ఎల్జీ నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. చివరికి కేంద్రం పార్లమెంటులో బిల్లు ద్వారా ఢిల్లీపై ఎల్జీ పెత్తనాన్ని ఖరారు చేసింది. ఈ పెత్తనాల వివాదం నేపథ్యమే ఎంసీడీ తాజా ఫలితాలను కీలకంగా మార్చేసింది! ఎంసీడీ... గేమ్ చేంజర్! రాష్ట్రాలకు సాధారణంగా ఉండే అధికారాలు ఢిల్లీకి పూర్తిగా దఖలు పడలేదు. కీలకమైన పోలీసు, భూ వ్యవహారాల వ్యవస్థ పూర్తిగా ఎల్జీ అ«దీనంలోనే ఉంటాయి. దేశ రాజధాని గనుక ఎయిమ్స్ వంటి పెద్దాసుపత్రులు, పెద్ద పార్కులు, ఢిల్లీ గుండా వెళ్లే హైవేలు, ఢిల్లీ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ వంటివేమో కేంద్రం అ«దీనంలో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కీలకమైనవన్నీ కేంద్రం కనుసన్నల్లోనే ఉంటాయి. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యమూ చేసుకోలేదు. విద్యుత్, జలవనరులు, రవాణా వ్యవస్థతో పాటు ప్రభుత్వాసుపత్రులు, పాఠశాలు, పార్కరులు, రోడ్ల వంటివి దాని చేతుల్లో ఉంటాయి. ఈ నామమాత్రపు అధికారాలతోనే రాష్ట్ర ప్రభుత్వం పాలన చేయాల్సి ఉంటుంది. అయితే ఎంసీడీకి మాత్రం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉండే సాధారణ అధికారాలన్నీ ఉంటాయి. అదిప్పడు ఆప్ వశమవడంతో కార్పొరేషన్ పరిధిలోని అన్ని అంశాలపైనా అధికారాలు కేజ్రీవాల్ సర్కారుకు దఖలు పడతాయి. ఆ లెక్కన కొన్ని అధికారాలు చేతులు మారతాయి. కీలకమైన బిజినెస్ లైసెన్సింగ్ కూడా ఎంసీడీ పరిధిలోనే ఉండటం ఆప్‌కు మరింత పై చేయినిస్తుంది. ఎంసీడీ ద్వారా వీలైనన్ని సంక్షేమ పథకాలను జనాలకు మరింత చేరువ చేసి ఇంకా ప్రజాదరణ పొందే అవకాశం ఆప్‌కు చిక్కుతుంది. ఎల్జీతో పోరాటం కొనసాగిస్తూనే ఢిల్లీపై పట్టు మరింత బిగించడానికి తాజా ఫలితాలు ఆప్‌కు ఉపయోగపడతాయి. కొసమెరుపు: ఎంసీడీ మేయర్ ఎన్నిక ఆప్, బీజేపీ బల ప్రదర్శనకు వేదికగా మారే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా 12 మంది కౌన్సిలర్లను నామినేట్ చేసే అధికారం ఎల్జీకి ఉంది. వారంతా బీజేపీకి చెందినవారే అయ్యే పక్షంలో ఆ పార్టీ బలం ఆ మేరకు పెరుగుతుంది. పైగా ఎమ్మెల్యేల మాదిరిగా కౌన్సిలర్లకు పార్టీ విప్ గానీ అనర్హత నిబంధన గానీ వర్తించవు. కనుక ఆప్‌తో పాటు కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లతో బీజేపీ బేరసారాలాడటం ఖాయం. అదే జరిగితే మేయర్ ఎవరవుతారన్నది చివరిదాకా సస్పెన్సే. ఆ పరిస్థితుల్లో మేయర్ పదవిని ఆప్ చేజిక్కించుకుంటుందా అన్నది ప్రశ్నార్థకమే! చేజిక్కించుకోలేకపోతే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది!! ఇదీ చదవండి: ఢిల్లీపై ఆప్ జెండా -
నాన్ వెజ్‌పై ఢిల్లీ కార్పొరేషన్ సంచలన ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: నాన్ వెజ్ వంటకాలపై బీజేపీ పాలిత దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ వివాదాస్పద ఉత్తర్వులు జారీచేయనుంది. నాన్ వెజ్ వంటకాలను దుకాణాల ముందు డిస్ప్లే చేయరాదని ఆహార అవుట్లెట్లను కార్పొరేషన్ ఆదేశించనుంది. ఇటీవల జరిగిన సమావేశంలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని సభా నాయకుడు షికా రాయ్ చెప్పారు. పరిశుభ్రత, మాంసాన్ని చూడటం ద్వారా కొందరి సెంటిమెంట్ దెబ్బతినడం వంటి కారణాలతో మాంసాహార వంటకాల డిస్ప్లేను నిషేధిస్తున్నట్టు చెప్పారు. వండిన, ముడి మాంసం ఏదైనా షాపు ఓనర్లు షాపు ముందు డిస్ప్లే చేయడంపై నిషేధం విధించనున్నట్టు ఆయన తెలిపారు. నజఫ్‌గర్ జోన్ నుంచి ఓ కౌన్సిలర్ హెల్త్ కమిటీ సమావేశంలో ఈ విషయం ప్రస్తావించగా, దీన్ని ఎస్డీఎంసీ దృష్టికి తీసుకువెళ్లగా సభ ఆమోదించిందని కార్పొరేషన్ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి అనుగుణంగా ఉందా లేదా అనేది పరిశీలించి మున్సిపల్ కమిషనర్ దీనికి ఆమోదం తెలపవచ్చని లేదా తిరస్కరించవచ్చని చెప్పారు. సౌత్ ఢిల్లీలో హజ్ ఖాస్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, సఫ్దర్‌జంగ్ గ్రీన్ పార్క్, కమల్ సినిమా, అమర్ కాలనీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో మాంసాహారాన్ని విక్రయించే పలు ఈటరీలు, రెస్టారెంట్లున్నాయి. మాంసాన్ని విక్రయించే పలు ప్రాంతాల్లో కబాబ్‌లు, షావర్మాలను ప్రదర్శించడం అతి సాధారణం. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయంపై పలు రాజకీయ పార్టీలు, వైద్య వర్గాల నుంచీ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. -
రాత్రి పూట టాయ్‌లెట్ రాకూడదా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథా’ చిత్రంలోని స్ఫూర్తి ఏమిటో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు అర్థం కాకపోయి ఉండవచ్చు. అందులోని టాయ్‌లెట్ ప్రాధాన్యత గురించి, దాని అవసరం 24 గంటలపాటు ఉంటుందన్న విషయమైనా అర్థం కావాలి. అది అర్థమైతే ఢిల్లీలోని అన్ని పబ్లిక్ టాయ్లెట్లను రాత్రి 9 గంటలకే మూసివేస్తారు. రాత్రి పూటి వాటి అవసరం మనిషికి ఉండదనా, ఉండకూడదనా? అందరు ఒకే వేళల్లో పనిచేసి, అందరూ ఒకే వేళల్లో నిద్రించే పరిస్థితి ఉన్న పల్లెల్లో అది సాధ్యమేమోగానీ 24 గంటలపాటు జీవన చక్రం తిరిగే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో అదెలా సాధ్యం! దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ రెండవ తేదీన తన పరిధిలోని మున్సిపల్ ప్రాంతాన్ని బహిరంగ విసర్జన నుంచి విముక్తి పొందిన ప్రాంతంగా ప్రకటించుకుంది. మరి ఆ పరిస్థితి కనిపిస్తుందా! రాత్రిపూట ఏరులై పారుతున్న బహిరంగ మూత్ర విసర్జన తాలూకు ఛాయలు మరుసటి రోజు మిట్ట మధ్యాహ్నం వరకు కూడా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రాంతాల్లో 700 బహిరంగ మరుగుదొడ్లు కట్టించామని, 500 అడుగులకు ఒకటి చొప్పున 25 మొబైల్ మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశామని మున్సిపల్ కార్పొరేషన్ గర్వంగా చెప్పుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వాటిలో ఎక్కువ మరుగు దొడ్లకు సీవరేజి కాల్వలకు కనెక్షన్లు ఇవ్వలేదు. ఇక మొబైల్ టాయ్లెట్ల విషయం మరింత దారుణంగా ఉంది. వాటిని తీసుకొళ్లి ఓ లోతైన గోతిలో పోస్తున్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే సదుద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద టాయ్లెట్ల నిర్మాణ పథకాన్ని తీసుకొస్తే కార్పొరేషన్ మరుగుదొడ్లతో పరిసర ప్రాంతాలను చెడగొడ్తున్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా రాత్రి 9 గంటలకే మరుగుదొడ్లను మూసివేస్తే ఎలా అని మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా, శానిటేషన్ సర్వీస్‌ను కాంట్రాక్టుకు తీసుకున్న బీవీజీ కంపెనీ రాత్రిపూట సర్వీసుకు ముందుకు రావడం లేదని చెప్పారు. ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు షిప్టుల్లోనే కార్మికులను పంపిస్తున్నారని, రాత్రి షిప్టుకు పంపించడం లేదని చెప్పారు. రాత్రిపూట అల్లరి మూకలు తాగి గొడవ చేస్తాయన్న కారణంగా వీటిని మూసి ఉంచుతున్నట్లు తెలిపారు. ఇదంతా నిజమే కావచ్చు. పోలీసు భద్రతను తీసుకొనైనా వీటి సర్వీసులను కొనసాగించడం అధికారుల విధి. రాత్రి పూట కూడా శానిటేషన్ సర్వీసులను అందించే కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడం కూడా వారి బాధ్యత. ఎక్కువ వరకు ఈ ప్రభుత్వ మరుగుదొడ్లు మురికి వాడల్లో ఉన్నాయి. రాత్రి పూట వీటి బాధ్యతను స్వీకరించేందుకు స్థానిక యువకులు ముందుకువస్తే వారికి అప్పగిస్తామని మున్సిపల్ అధికారులు అంటున్నారు. అసలే మురికి వాడల్లో బతికే బడుగు జీవులు. స్వచ్ఛంద సేవకు ముందుకు రమ్మంటే ఎలా వస్తారు. వారికి నెలసరి జీతం కింద ఉపాధి కల్పిస్తే తప్పకుండా ముందుకు వస్తారు. -
పార్టీ మారనని ప్రమాణం చేయండి!
న్యూఢిల్లీ: తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో విజయం సాధించిన 48మంది పార్టీ కౌన్సిలర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ గట్టి హితబోధ చేశారు. పార్టీ నుంచి కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరించారు. నిజాయితీగా, ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా పార్టీ మారాలని బీజేపీ ఆఫర్ ఇవ్వొచ్చునని, రూ. 10 కోట్ల వరకు కూడా ఇచ్చేందుకు ముందుకురావొచ్చునని, ఒకవేళ బీజేపీ ఇలా లంచం ఇవ్వజూపితే.. దానిని రహస్యంగా చిత్రీకరించాలని ఆయన కౌన్సిలర్లకు తెలిపారు. తన హితబోధ ముగిసిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోమని కొత్త కౌన్సిలర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో గెలిచిన పార్టీ కౌన్సిలర్లను పార్టీ మారకుండా కాపాడుకునే రీతిలో ఆయన ప్రసంగం సాగింది. ఈ మేరకు పదినిమిషాల వీడియోను ఆయన యూట్యూబ్‌లో పోస్టు చేశారు. -
కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనోజ్ తివారీ మాట్లాడుతూ... ఢిల్లీని నాలుగు నెలల్లో బీజేపీ శుభ్రం చేస్తుందని అన్నారు. '4 నెలల్లో ఢిల్లీని క్లీన్ సిటీగా మార్చుతాం. పరిశుభ్రమైన, ఎలాంటి వ్యాధులు లేని ఆరోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతాం. అని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనందుకు కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆప్ విస్మరించిందని, నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రజలు కూడా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కోరుకుంటున్నారని మనోజ్ తివారీ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 'చీపురు'ను ఊడ్చేయడంతో ఆప్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
దురహంకారానికి తగిన మూల్యం: వెంకయ్య
న్యూఢిల్లీ: దురహంకారానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తగిన మూల్యం చెల్లించుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని ఆయన బుధవారమిక్కడ సూచించారు. కేజ్రీవాల్ పాలనతో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారని వెంకయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపూరిత వైఖరిని విడనాడి ఇప్పటికైనా కేజ్రీవాల్ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈవీఎంలపై నిందలు సరికాదని వెంకయ్య అన్నారు. కాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
తొలి ఆధిక్యాల్లో బీజేపీ దూకుడు
-
తొలి ఆధిక్యాల్లో బీజేపీ దూకుడు
ఎన్నికల పండితులు చెప్పినదే నిజమయ్యేలా ఉంది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. కార్పొరేషన్ ఎన్నికల్లో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం 272 స్థానాలకు గాను 270 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఉత్తర ఢిల్లీలోని సరాయ్ పిపాల్, తూర్పు ఢిల్లీలోని మౌజ్పూ్ స్థానాల్లో అభ్యర్థులు మరణించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం ఉత్తర ఢిల్లీలో బీజేపీ 69, కాంగ్రెస్ 17, ఆప్ 15, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దక్షిణ ఢిల్లీలో బీజేపీ 74, కాంగ్రెస్ 15, ఆప్ 14, ఇతరులు 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తూర్పు ఢిల్లీలో బీజేపీ 39, కాంగ్రెస్ 13, ఆప్ 10, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ చివరకు వరకు కొనసాగితే మాత్రం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ మరోసారి చేజిక్కించుకోవడం ఖాయంలాగే కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యం కనబరిచినా, తాజా కార్పొరేషన్ ఎన్నికలలో పూర్తిగా చతికిలబడుతోంది. ఈవీఎంల గురించిన వివాదాలు, ఢిల్లీలో ప్రజారోగ్యం గురించిన విమర్శలు.. వీటన్నింటి నడుమ ఈ ఎన్నికలు జరగడం, వాటిలో బీజేపీ ఆధిక్యం చూపిస్తుండటం విశేషం. -
తూర్పు ఎమ్సీడీని ప్రభుత్వానికి అప్పగించండి
సాక్షి, న్యూఢిల్లీ: సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దుస్థితికి చేరిన తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎమ్సీడీ)ను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయబోతున్నారని సమాచారం. నిర్వహణలో వైఫల్యం కారణంగా ఉత్తర, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక లోటులో కూరుకుపోయాయని ఆరోపిస్తూ ఆయన లేఖ రాయనున్నట్లు ఓ అధికారి తెలియజేశారు. సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో కార్పొరేషన్లు ఉన్నాయని, దీంతో వారు వేతనాల కోసం సమ్మెకు దిగారని అనే విషయాన్ని ఎల్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ సర్కారు ఎమ్సీడీలకు బకాయిలను చెల్లించడం లేదన్న వార్తల్లో సత్యం లేదని సిసోడియా అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లకు చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని చెప్పారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అందువల్లే ఆ కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభంలో పడి సిబ్బందికి వేతనాలు చెల్లించలేని స్థితికి చేరిందన్నారు. ‘తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి నెలా వేతనాల కింద 55 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. అయితే సిబ్బందేమో మూడు నెలలుగా వేతనాలు రావట్లేదని అంటున్నారు. మూడు నెలలుగా సిబ్బందికి వేతనాల కింద చెల్లించవలసిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయి. బీజేపీకి ఎమ్సీడీని నిర్వహించడం చేతకాకుంటే దానిని ఢిల్లీ సర్కారుకు అప్పగించాలి. తాము కార్పొరేషన్‌ను లాభాల బాట నడిపించి చూపిస్తాం’ అని మనీశ్ సిసోడియా అన్నారు. తూర్పు ఎమ్సీడీని ఢిల్లీ సర్కారుకు అప్పగించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ లేఖ రాసే విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు.