న్యూఢిల్లీ: తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో విజయం సాధించిన 48మంది పార్టీ కౌన్సిలర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ గట్టి హితబోధ చేశారు. పార్టీ నుంచి కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరించారు. నిజాయితీగా, ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని కౌన్సెలింగ్ ఇచ్చారు.
అంతేకాకుండా పార్టీ మారాలని బీజేపీ ఆఫర్ ఇవ్వొచ్చునని, రూ. 10 కోట్ల వరకు కూడా ఇచ్చేందుకు ముందుకురావొచ్చునని, ఒకవేళ బీజేపీ ఇలా లంచం ఇవ్వజూపితే.. దానిని రహస్యంగా చిత్రీకరించాలని ఆయన కౌన్సిలర్లకు తెలిపారు. తన హితబోధ ముగిసిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోమని కొత్త కౌన్సిలర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో గెలిచిన పార్టీ కౌన్సిలర్లను పార్టీ మారకుండా కాపాడుకునే రీతిలో ఆయన ప్రసంగం సాగింది. ఈ మేరకు పదినిమిషాల వీడియోను ఆయన యూట్యూబ్‌లో పోస్టు చేశారు.
పార్టీ మారనని ప్రమాణం చేయండి!
Published Thu, Apr 27 2017 7:43 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
Advertisement