
ఢిల్లీ : పంజాబ్‌లో ఇసుక తవ్వకాలు, బదిలీ పోస్టింగ్‌లలో భారీ అవినీతి జరుగుతుందని ఆమ్ ఆద్మీ ఎంపీ స్వాతి మలివాల్ ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. కొంతమంది పంజాబ్‌ను తమ వ్యక్తిగత ఏటీఎంలా భావిస్తున్నారు. పరిస్థితుల్ని సరిదిద్ధకపోతే ఢిల్లీలాగే పంజాబ్‌ను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఢిల్లీలో ఓటమి తర్వాత పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు, ఆప్ నేతలతో కేజ్రీవాల్ సమావేశం వంటి పరిణామల నేపథ్యంలో మలివాల్ మీడియాతో మాట్లాడారు.
‘కేజ్రీవాల్ తన గూండా బిభవ్ కుమార్‌ను భగవంత్ మాన్ ముఖ్య సలహాదారుగా నియమించారు. పంజాబ్‌లో దోచుకున్న మొత్తాన్ని ఢిల్లీకి తరలిస్తున్నారు. పంజాబ్ ఇసుక మాఫియా గుప్పిట్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో బదిలీ పోస్టింగ్‌ల విషయానికి వస్తే ప్రతి దశలోనూ అవినీతి జరుగుతుందని దుయ్యబట్టారు.
ఢిల్లీ ఓటమి తర్వాత పంజాబ్‌లో ఆప్ సీఎం,ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడాన్ని కూడా మలివాల్ ప్రశ్నించారు. ఈ అత్యవసర సమావేశం కారణంగా పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు గందరగోళం, కోపంతో ఉన్నారు. ఢిల్లీలో ఓటమి తర్వాత కేజ్రీవాల్ పంజాబ్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకి క్రేజీవాల్ పంజాబ్‌కి ఏం చేశారు?అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment