పంజాబ్ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం స్థానాల గెలుపే లక్ష్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ‘మీరు మాకు 117కి 92 సీట్లు ఇచ్చారు. అందుకు మీకు నా కృతజ్ఞతలు. మళ్లీ ఇప్పుడు రెండవ పెద్ద ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మొత్తం 13 సీట్లు ఉన్నాయి. ఆ 13 సీట్లు ఆప్ కోసమే, సీఎం భగవంత్ మాన్ కోసం, మంత్రుల కోసమే, ఎమ్మెల్యేల కోసమో కాదు. లేదంటే మీకోసమో, మీ పిల్లల కోసమో కాదు. మీ కుటుంబం కోసం. పంజాబ్ పురోగతికి కోసమే. అందుకే ఈ (పార్టీని ఉద్దేశిస్తూ) 13 సీట్లు మనమే గెలవాలి.’ అని మొహాలీలో ప్రసంగించారు.
అంతేకాదు, పంజాబ్‌కు 8వేల కోట్ల నిధులను కేంద్రం నిలిపేసిందన్న కేజ్రీవాల్.. బీజేపీ తమ ఎమ్మెల్యేలను సంప్రదించి రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వ పనిని కూడా గవర్నర్ అడ్డుకుంటున్నారని వాపోయారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు అవకాశం దక్కకపోవడమే నిదర్శనమన్నారు. బీజేపీని ఉద్దేశిస్తూ వాళ్లు పంజాబ్ శకటాలను ఎలా తిరస్కరిస్తారు. ఇప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పంజాబ్‌లో ప్రతిరోజూ ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. పంజాబ్ ప్రజల ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారు అని కేజ్రీవాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment