swathi maliwal
-
బిభవ్ కుమార్‌కు బెయిల్.. ఘాటుగా స్పందించిన మలివాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో తనపై భౌతిక దాడికి దిగిన కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్‌పై మంగళవారం విడుదల కావడాన్ని బాధితురాలు, ఆప్ రాజ్యసభ సభ్యు రాలు స్వాతి మలివార్ తీవ్రంగా విమర్శించారు. తనకు ఘోర పరాభవం జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ ద్రౌపది వస్త్రాపహరణం పోస్టర్‌ను ఆమె 'ఎక్స్'లో పోస్ట్' చేశారు. మహాభారతంలో కౌరవులు జూదంలో గెలవడం ద్రౌపది వస్త్రాపహరణం వేళ కృష్ణుడు ద్రౌపదిని కాపాడటం వంటి సన్నివేశాలున్న పోస్టర్లు ఆమె షేర్ చేశారు.pic.twitter.com/7vgyFuRvqK— Swati Maliwal (@SwatiJaiHind) September 3, 2024 -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్ కుమార్‌పై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాఖలుచేసిన పటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీభవ్ కుమార్‌పైనే సుప్రీం కోర్టు ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని, నివాసంలోకి ప్రవేశించిన ఓ గూండా స్వాతి మలివాల్‌పై దాడి చేసినట్లు అనిపించిందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఢిల్లీలోని మెజిస్టీరియల్ కోర్టు కొట్టివేసింది. అయితే మెజిస్టీరియల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. బిభవ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.‘ముఖ్యమంత్రి బంగ్లా ఏమైనా వ్యక్తిగత నివాసమా? సీఎం కార్యాలయం అటువంటి గూండాలను ఉంచుకోవటం అవసరమా? ఇది సరైనా పద్దతేనా? మేము చాలా ఆశ్చర్యపోయాం. అసలు ఇది ఎలా జరిగింది’అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘బిభవ్ కుమార్ అసలు ఏమనుకుంటున్నాడు? అతని ఏం అధికారం ఉంది? ఒక గూండాలా అతన్ని తయారు చేశారు. ఓ యువతి అయిన స్వాతి మలివాల్‌పై దాడి చేయడానికి బిభవ్ కుమార్‌కు సిగ్గు ఉండాలి?’ కోర్డు అసహనం వ్యక్తం చేసింది. స్వాతి మలివాల్ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినా ఆమెపై దాడి చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసు పరిశీలన కోసం ఛార్జిషీట్‌ను తమ ముందు ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. సీఎం కేజ్రీవాల్ నివాసంలో బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ మే 13న ఆరోపణలు చేశారు. మే 16 ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా బిభవ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. -
సీఎం కేజ్రీవాల్‌కు ఎంపీ స్వాతి మలివాల్ ఘాటు లేఖ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ, స్వాతి మలివాల్ మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. తాను గత జనవరిలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆప్ ప్రభుత్వం డీసీడబ్ల్యూని పట్టించుకోవడం లేదని, మెల్లమెల్లగా అణచివేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు గుప్పించారు.లేఖలో ఢిల్లీ మహిళా కమిషన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ఆమె ఎత్తి చూపారు. తాను 2015 నుంచి నిర్మించిన వ్యవస్థను (సీడబ్ల్యూసీని ఉద్ధేశిస్తూ) ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడింది. కమిషన్ బడ్జెట్‌ను ఏకపక్షంగా కోతలు విధించినట్లు తెలిపింది.‘నా రాజీనామా తర్వాత కమిషన్‌కు జరిగిన అన్యాయం చాలా నిరుత్సాహపరిచింది. 181 మహిళా హెల్ప్‌లైన్‌ను ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం, కమిషన్‌కు నిధుల నిలిపివేత, కమిషన్‌కు బడ్జెట్లో కోత విధించడం, కమిషన్ సిబ్బందిని తొలగించడం నాయకత్వ పదవులు ఖాళీలు వంటివి కమిషన్ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లు.రేప్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా పేరొందిన నగరానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు(కేజ్రీవాల్).. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించే వ్యవస్థలను రక్షించడం చాలా కీలకం.. సీఎం, మంత్రులు తక్షణమే జోక్యం చేసుకుని రాజధాని మహిళలు, పిల్లలను ఆదుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.” అని పేర్కొన్నారు. -
బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
న్యూడిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు ఇప్పటల్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 6 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిభవ్ కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.కాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు మే 13న న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 16న కేసు నమోదు చేయగా.. మే 18న కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు అదే రోజు ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఆయన అరెస్టు కారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్లో అర్థం లేదని కోర్టు పేర్కొంది. మే 24న అతడిని నాలుగు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, మళ్లీ మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు.తరువాత జూన్ 1న14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అనంతరం జూన్ 22న వరకు కస్టడీ పొడిగించగా.. తాజాగా కస్టడీ గడువు ముగియడంతో జులై 6 వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జూన్ 13 న కుమార్ మరొక బెయిల్ పిటిషన్ వేయగా, దానిని కోర్టు కొట్టివేసింది. బిభవ్ కుమార్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. -
స్వాతిమలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి చేసిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్కు కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా బిభవ్‌కుమార్ న్యాయవాది వాదనలు వినిపించారు. బిభవ్‌కుమార్‌పై మలివాల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. మలివాల్ కావాలనే సీసీ కెమెరాలు లేని చోటే తనపై దాడి జరిగిందని కేసు పెట్టారన్నారు. అయితే బిభవ్‌కుమార్ దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని ప్రాసిక్యూషన్ వాదించింది. వాదనలు విన్న బిభవ్‌కుమార్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. తీస్‌హజారీ కోర్టు తన బెయిల్‌కు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పుపై బిభవ్‌కుమార్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో ప్రధాననిందితుడైన బిభవ్కుమార్కు కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. ఇటీవల తమ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను కలిసేందుకు సీఎం నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని స్వాతిమలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ తనను కింద పడేసి తన్నారని ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మలివాల్‌పై దాడి ఘటనపై రాజకీయ దుమారం పెద్దదవుతూనే ఉంది. -
నన్ను ఏ శక్తీ ఆపలేదు.. కేజ్రీవాల్‌కు ట్విస్ట్ ఇచ్చిన స్వాతి మలివాల్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఏ శక్తి తనను అడ్డుకోలేదంటూ కామెంట్స్ చేశారు.కాగా, ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం బిభవ్ కుమార్‌పై ఆమె కేసు పెట్టారు. ఈ క్రమంలో బిభవ్ కుమార్‌కు కోర్టు ఇటీవలే ఐదు రోజుల కస్టడీ విధించింది. దీంతో బిభవ్ కుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్వాతి మలివాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘2006లో ఇంజినీరింగ్ జాబ్ వదులుకుని వీళ్లతో చేతులు కలిపాను. అప్పుడు మేము ఎవరమో ఎవరికీ తెలీదు. అప్పట్లో ముగ్గురం మాత్రమే ఉండేవాళ్లం. అప్పటి నుంచీ నేను పనిచేస్తూనే ఉన్నా. క్షేత్రస్థాయిలో కూడా పని చేశా. ఇన్నేళ్లల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించా. వాళ్లకు ఎంపీ సీటు కావాలంటే నన్ను మర్యాదపూర్వకంగా అడిగి ఉండాల్సింది. కానీ, నాపై దాడి చేయడమేంటి?. నన్ను తీవ్రంగా గాయపరిచారు. BIG BREAKING NEWS 🚨 Swati Maliwal says she will not resign as Rajya Sabha MP no matter what 🔥🔥"My Cheer Haran happened at Kejriwal's residence. I was sla*pped & kic*ked with legs multiple times by Bibhav""I kept scre@ming but no one came to save me. Kejriwal was present at… pic.twitter.com/wizwixBkMe— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2024 నాపై దాడి జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్ అక్కడే ఉన్నారు. కనీసం అడ్డుకోలేదు. నేను రాజీనామా చేసి ఉండేదాన్ని. కావాలంటే నా ప్రాణాలైనా ఇచ్చేదాన్ని. ఎంపీ సీటు చాలా చిన్న విషయం. మీరు నా కెరీర్‌ను పరిశీలిస్తే తెలుస్తుంది.. నేను ఏ రోజూ పదవుల కోసం ఆశపడలేదు. ఏ పదవీ లేకపోయినా నేను పని చేయగలను. ఇప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ నన్ను అడ్డుకోలేదు. నేను రాజీనామా చేయను’ అంటూ తేల్చి చెప్పారు. -
‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
ఢిల్లీ: తనపై దాడి జరిగిన సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దాడికి సంబంధిచి పలు విషయాలు పంచుకున్నారు.‘‘ మే 13న సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ నాపై దాడి చేస్తున్నప్పుడు నేను అరుస్తునే ఉన్నారు. కానీ, నన్న రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాడి జరిగిన సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇంట్లోనే ఉన్నారు. ఈ దాడి విషయలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేను. నేను 9 గంటలకు సీఎం నివాసానికి వెళ్లితే డ్రాయింగ్ రూంలో నన్ను వేచి ఉండాలని ఇంటి సిబ్బంది తెలిపింది. కేజ్రీవాల్ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. సీఎం నన్ను కలవడానికి వస్తారని సిబ్బంది చెప్పింది. ఒక్కసారిగా బిభవ్ నేను ఉన్న గదిలోకి దూసుకువచ్చారు. ఏం అయింది? కేజ్రీవాల్ వస్తున్నారు. ఏం అయింది? అని ఆయన్ను అడిగాను. అంతలోనే ఆయన నాపై దాడి చేయటం మొదలు పెట్టాడు. ఏడెనిమిది సార్లు నా చెంప మీద కొట్టారు. నేను ఆయన్ను వెనక్కి నెట్టేయాలని ప్రయత్నం చేశాను. తన కాలుతో నన్ను లాగి మధ్యలో ఉన్న టెబుల్‌కు నా తలను బాదారు’’ అని స్వాతి మలివాల్ తెలిపారు.‘‘బిభవ్ కుమార్ వేరే వాళ్ల సూచన మేరకే నాపై దాడి చేశారు. దాడి కేసులో నేను ఢిల్లీ పోలీసులకు సంపూర్ణంగా సహకరిస్తా. ఈ విషయంలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వను. నాపై దాడి జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు. నేను బాధతో ఎంత అరిచినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నాపై జరిగిన దాడిలో విషయంలో నేను గళం ఎత్తుతాను.దాని వల్ల నా కెరీర్‌కు ఇబ్బందైనా వదిలిపెట్టను. సత్యానికి, నిజమైన ఫిర్యాదులకు మద్దతుగా ఉండాలని చెప్పే నేను నా విషయంలో అంతే ధైర్యంగా ఉండి పోరాడుతాను’’ అని స్వాతి మలివాల్ అన్నారు. ఈ కేసులో అరెస్టైన బిభవ్ కుమార్ ఫోన్ ఫార్మాట్, సీఎం నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి స్వాతి మలివాల్ వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
స్వాతి మలివాల్ కేసు: సీఎం నివాసంలో సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం
ఢిల్లీ: ఆప్ రాజ్యసభ స్వాతి మలివాల్‌పై దాడి జరిగిన కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ కెమెరాలకు సంబంధించి డిజిటల్ వీడియో రికార్డ్ (డీవీఆర్)లను పోలీసులు స్వాధీనం చేసకున్నారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం వెల్లడించింది. కాగా.. లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని పోలిసులు ప్రయత్నం చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. దర్యాప్తుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కట్టకథలు అల్లుతోందని ఆప్ ఆరోపణుల చేసింది. ఇక.. ఢిల్లీ పోలీసులు నుంచి ఎటువంటి సత్వరమైన స్పందన లేదని పేర్కొంది. ‘‘పోలీసులు శనివారమే కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. మళ్ల ఆదివారం కూడా సీఎం నివాసంలోని మిగతా చోట్ల ఉన్న సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ తొలగించారని పోలీసులు చెబుతున్నారు. కానీ, అప్పటికే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కావాలనే వాటిపై కట్టుకథలు అల్లుతున్నారు’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అదే విధంగా సీఎం నివాసంలోని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణను పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ఆధీనంలో ఉంటుందని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన ఆయలు పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మే 13న స్వాతి మలివాల్ నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. అయితే కొద్దిసేటికే ఈ విషయం మీడియాకు వ్యాపించింది. సెక్షన్ 354(బీ)కి కేసు నమోదైంది. ఓ మహిళకు సంబంధించిన సున్నితమైన విషయం. కానీ, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. బిభవ్‌కుమార్ నిందితుడు అయితే ఆప్ వద్ద ఎఫ్ఐఆర్ కాపీ లేదు’ అని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. -
‘‘స్వాతి మలివాల్‌కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
న్యూఢిల్లీ: ఎంపీ స్వాతి మలివాల్‌కు మే13వ తేదీ సీఎం కేజ్రీవాల్ అపాయింట్మెంట్ లేదని సీఎం సహాయకుడు బిభవ్‌కుమార్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ రోజున ఆమె సీఎం ఇంటి వద్ద భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. మలివాల్‌పై 13న సీఎం ఇంట్లో దాడి జరిగిన కేసులో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం(మే17) అరెస్టు చేశారు.బిభవ్ అరెస్టయిన వెంటనే ఆయన న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా బిభవ్‌కుమార్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎంపీ స్వాతిమలివాల్ సీఎం ఇంటికి వచ్చినరోజుకు సంబంధించి సోషల్‌మీడియాలో సర్క్యులేషన్లో ఉన్న వీడియోలను కోర్టుకు సమర్పించారు. అసలు స్వాతి మలివాల్‌పై సీఎం ఇంట్లో ఎలాంటి దాడి జరగలేదని తెలిపారు. -
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన తనపై విభవ్ దాడికి పాల్పడ్డాడని స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీ సీఎం నివాసం నుంచే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌కు ఇంటరాగేషన్ కోసం తరలించారు. అంతకు ముందు సీఎం కేజ్రీవాల్ నివాసంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు పోలీసులు. అయితే.. ఈ కేసులో పూర్తిగా సహకరిస్తామని అధికారులకు తాము మెయిల్ పంపించామని, అయినా కూడా పోలీసుల నుంచి బదులేం లేదని విభవ్ లాయర్ మీడియాకు వెల్లడించారు. -
ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు తాజాగా స్వాతి మలీవాల్ ఆరోపించారు. సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్‌లో ఉన్న కుమార్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, చెంపదెబ్బ కొట్టాడని, ఛాతిపై తన్నాడని, లాగి పడేసినట్లు ఆమె ఆరోపించారు. ఆసమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు.కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి ఆరోపించిన ఉదంతం తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ విషయంలో స్వాతి మలీవాల్ పోలీసులకు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బిభవ్ కుమార్‌ను నిందితుడిగా పేర్కొంటూ గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని కూడా రికార్డుచేశారు.పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆమె వాంగ్మూలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. సివిల్ లైన్స్‌లోని మలివాల్ సోమవారం సాయంత్ర ఆరు గంటలకు సీఎం నివాసానికి చేరుకుంది. ముఖ్యమంత్రి సహాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా. ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం డ్రాయింగ్ రూమ్‌లో వేచి ఉన్న సమయంలో బిభవ్ కుమార్ గదిలోకి చొరబడి తనను దూషించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించారు.‘కుమార్ నా ముఖంపై ఏడు,ఎనిమిది సార్లు కొట్టాడు. ‘నన్ను వెళ్లనివ్వండి’ అని చెప్పినప్పటికీ ఆయన వదలకుండా ఛాతీ, పొట్ట, సున్నితమైన భాగాలపై పలుమార్లు కొట్టాడు. హిందీలో దుర్భాషలాడాడు. 'నీ సంగతి చూస్తాం’ అంటూ బెదిరించాడు. కడుపులో నొప్పి వస్తుందని, నన్ను వదిలేయాలని వేడుకున్నాను.బిభవ్ చర్యలతో పూర్తిగా షాక్‌కు గురయ్యాను. సహయం కోసం గట్టిగా అరిచాను. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని కాలితో తన్ని దూరంగా నెట్టేశాను. నేను బయటక పరుగెడుతుంటే నాపైకి దూసుకొచ్చాడు. నా చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. ఛాతీ, కడుపు వంటి సున్నితమైన శరీరభాగాలపై పలుమార్లు దాడి చేశాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా’’ అని స్వాతి మలీవాల్వె ల్లడించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.ఈ ఘటనపై మలీవాల్ గురువారం తొలిసారి స్పందిస్తూ.. ఈ దాడితో తాను తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురయ్యాను పేర్కొన్నారు. 112 నంబర్‌కు కాల్ చేసి సంఘటనను నివేదించానని చెప్పారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. -
స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం ఇంట్లో జరిగిన దాడి, మున్సిపల్ కార్పొరేషన్‌కు దళిత మేయర్‌ను నియమించాలనే డిమాండ్లతో ఆందోళనకు దిగారు. దీంతో సమావేశాలను మరుసటి రోజుకు మేయర్ వాయిదా వేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ స్పందించారు. ‘బీజేపీ కార్పొరేటర్లు సమావేశాలను జరగనివ్వలేదు. బీజేపీ కార్పొరేటర్లు సభలో గందరగోళం సృష్టించారు. సంవత్సరంన్నర నుంచి స్టాండింగ్ కమిటీ వేయకుండా అడ్డుకున్నది బీజేపీ కార్పొరేటర్లే’అని మేయర్ తెలిపారు. -
సీఎం ఇంట్లో నాపై దాడి చేశారు: ‘ఆప్’ ఎంపీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్ సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అంతర్గత వ్యవహారాన్ని పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చినట్లు తెలుస్తోంది. సోమవారం(మే13) ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని ఎంపీ స్వాతిమలివాల్ పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్‌కు రెండుసార్లు ఫోన్ చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బైభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇంతలోనే పోలీసు బృందం ఒకటి కాల్ వచ్చిన లొకేషన్‌కు వెళ్లి ఎంపీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం సీఎం నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి లేనందున ప్రవేశించలేదని సమాచారం. ‘ఢిల్లీ సివిల్ లేన్స్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం ఉదయం 9.34 గంటలకు ఒక మహిళ ఫోన్ చేసి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.ఆ తర్వాత కొంత సేపటికి ఎంపీ స్వాతిమలివాల్ మేడం నేరుగా పీఎస్‌కు వచ్చారు. తర్వాత ఫిర్యాదు చేస్తానని చెప్పి వెళ్లిపోయారు’ అని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా,సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి ఎంపీ స్వాతిమలివాల్ ఆయన నివాసానికి వెళ్లగా సీఎం వ్యక్తిగత సిబ్బంది అనుమతి నిరాకరించారని, ఈ క్రమంలోనే గొడవ జరిగినట్లు చెబుతున్నారు. -
స్వాతి మలివాల్ వర్సెస్ రేఖాశర్మ.. సోషల్ మీడియాలో డైలాగ్ వార్
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత స్వాతిమలివాల్ ప్రమాణస్వీకారంపై వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఆమెపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ట్రోల్ చేస్తూ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. ‘స్వాతిమలివాల్ ఆందోళనల్లో నుంచి పుట్టిన ప్రోడక్టు. ఆమెకు నినాదాలు మాత్రమే తెలుసు. ఆమె తన చిన్న మెదడును అసలే వాడదు. బడ్జెట్ అంటే ఆమెకు ఏం తెలియదు. అయినా బడ్జెట్‌పై ఆమె నిపుణురాలు అనుకుంటోంది’ అని పోస్టులో రేఖాశర్మ వ్యంగ్యాస్రాలు సంధించింది.రేఖాశర్మ పోస్టుపై స్వాతిమలివాల్ అంతే ఘాటుగా స్పందించారు. ‘నేను ఆందోళనల్లో నుంచి పుట్టానని గర్వంగా చెప్పుకుంటున్నాను. నా జీవితం సామాజిక సేవకు అంకితం చేశాను.మహిళా కమిషన్ చైర్మన్‌గా మీరు ఫెయిల్ అయ్యారు. వెంటనే మీరు మీ పదవికి రాజీనామా చేసి ట్రోలింగ్ చేసుకోండి’అని రేఖాశర్మపై స్వాతి ఫైర్ అయ్యారు. జనవరి 31న రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన స్వాతిమలివాల్ చివర్లో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదమిచ్చారు.దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్ అభ్యంతరం తెలిపారు. మళ్లీ ఆమెతో ప్రమాణం చేయించారు. తొలిసారి చేసిన ప్రమాణస్వీకారాన్ని రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించారు. స్వాతిమలివాల్ గతంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేయడం గమనార్హం. -
ఢిల్లీ: కన్నీరు పెట్టుకున్న స్వాతి మలివాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తన పదవికి రాజీనామా చేశారు. స్వాతి మాలివాల్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసిన నేపథ్యంలో డీసీడబ్ల్యూ పదవికి ఆమె రాజీనామా చేశారు. అనంతరం తన చాంబర్లో తోటి ఉద్యోగులకు వీడ్కోలు పలికారు. రాజీనామా లేఖపై సంతకం చేసి వెళుతున్న క్రమంలో మలివాల్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తోటి ఉద్యోగులను హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. పలువురు మహిళలు కూడా ఉద్యేగానికి లోనయ్యారు. కొందరు స్వాతి వెళుతున్న క్రమంలో చప్పట్లు కొడుతూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | Delhi Commission for Women (DCW) Chief Swati Maliwal resigns from her post after being nominated for Rajya Sabha by Aam Aadmi Party (AAP). pic.twitter.com/yp19yGcqeT — ANI (@ANI) January 5, 2024 కాగా ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఆప్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్‌కుమార్ గుప్తాల పదవీకాలం జనవరి 27న పూర్తవనుంది. ఈ మూడు స్థానాలకు జనవరి 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తాను వరుసగా రెండోసారి నామినేట్ చేస్తున్నట్లు ఆప్ తెలిపింది. ఇక, సుశీల్ కుమార్ గుప్తా.. ఈ ఏడాది చివర్లో జరగబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని నిర్ణయించుకోవడంతో ఆ స్థానంలో స్వాతి మాలివాల్‌ను పార్టీ నామినేట్ చేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏకంగా 68 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేతల్లో పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు ఉన్నారు. window.googletag = window.parent.googletag;window.__cmp = window.parent.__cmp; window.__tcfapi = window.parent.__tcfapi;!function(a9,a,p,s,t,A,g){if(a[a9])return; function q(c,r){a[a9]._Q.push([c,r])}a[a9]={init:function(){q("i",arguments)},fetchBids:function(){q("f",arguments)},setDisplayBids:function(){},targetingKeys:function(){return[]},_Q:[]}; A=p.createElement(s); A.async=!0; A.src=t; g=p.getElementsByTagName(s)[0]; g.parentNode.insertBefore(A,g)}("apstag",window,document,"script","//c.amazon-adsystem.com/aax2/apstag.js");apstag.init({"pubID":"842701b4-f689-4de3-9ff4-bc1999093771","adServer":"googletag","videoAdServer":"DFP","gdpr":{"cmpTimeout":200},"schain":{"ver":"1.0","complete":1,"nodes":[{"asi":"vuukle.com","sid":"b020f681-0903-4e67-8436-b0208a3b3423","hp":1}]}});window.parent['__vuukleCb2cb8b3ef'](); -
భయపడేది లేదు.. ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా: స్వాతి మలివాల్
న్యూఢిల్లీ: బీజేపీ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెదిరింపులు తనను ఆపలేవని, ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.. అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం స్వాతి మలివాల్‌ను మద్యం మత్తులో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మహిళా భద్రతను పర్యవేక్షిస్తున్న క్రమంలో బుధవారం రాత్రి ఎయిమ్స్ సమీపంలోని రోడ్డు వద్ద మద్యం సేవించిన కారు డ్రైవర్ ఆమెను లైంగికంగా వేధించాడు. కారులో ఎక్కాలని బలవంతం చేశాడు. దీంతో ఆగ్రహించిన స్వాతి మలివాల్.. కారు డ్రైవర్‌ను కిటికీలోంచి బయటకు లాగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె చేయి విండోలోపల ఉండగానే డ్రైవర్ కారు అద్దాలను పైకి ఎక్కించి 15 మీటర్లు మాలివాల్‌ను లాక్కెళ్లాడు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలో మహిళా చైర్ పర్సన్‌కే భదత్ర లేకుండా సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని స్వాతి మలివాల్ అన్నారు. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపుతున్న ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్వాతి మలివాల్ ఆరోపించిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి అని పేర్కొంది. ఢిల్లీ పోలీసుల ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఆప్‌తో కుమ్మకై వీడియో తీసినట్లుగా ఉందని విమర్శించింది. ఘటన జరిగిన వెంటనే స్వాతి ఎందుకు స్పందించలేదని బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖరానా ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ ఘటన అంతా సృష్టించినట్లుగా ఉందని ఆయన విమర్శించారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్వాతి మలివాల్ ఘాటుగా స్పందించారు. బీజేపీ ఆరోపణలు పచ్చి అబద్దాలుగా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘“నా గురించి బూటకపు అబద్ధాలు చెబితే భయపెడతానని అనుకునే వాళ్ళకి ఓ విషయం చెప్పాలి. ఈ చిన్న జీవితంలో ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాను. ఇప్పటి వరకు నాపై ఎన్నోసార్లు దాడి జరిగాయి. అవేవి నా ప్రశ్నించే గొంతుకను ఆపలేదు. వాస్తవానికి నాలోని దైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. నేను బతికి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను’ అని స్పష్టం చేశారు. जिनहें लगता है मेरे बारे में झूठी गंदी बातें कर मुझे डरा देंगे उनको बता दूँ। मैंने सर पे कफ़न बांध इस छोटी सी ज़िंदगी में बहुत बड़े काम किए है। मुझपे कई अटैक हुए पर मैं रुकी नही। हर अत्याचार से मेरे अंदर की आग और बढ़ी। मेरी आवाज़ कोई नही दबा सकता। जब तक ज़िंदा हूँ लड़ती रहूँगी! — Swati Maliwal (@SwatiJaiHind) January 20, 2023 -
Delhi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు వేధింపులు.. బయటకొచ్చిన వీడియో..!
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలీవాల్‌ను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని నగరంలో మహిళల భద్రతను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఆమెను మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో 15 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇది జరిగిన మరుసటి రోజు ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో.. దేశ రాజధానిలో మహిళ భద్రతను పరిశీలించేందుకు తన బృందంతోకలిసి రోడ్డు మీదకు వచ్చారు. గురువారం తెల్లవారు జామున గంటల సమయంలో ఎయిమ్స్ ఆసుపత్రి సమీపంలో నిల్చొని ఉండగా ఆమె వద్దకు ఓ బాలెనోకారు వచ్చి ఆగింది. కార్లో వచ్చి కూర్చొమని కా వ్యక్తి స్వాతిని అడిగాడు.. దీనికి ఆమె స్పందిస్తూ.. సారీ మీ మాటలు వినిపించడం లేదు.. మీరు నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తారని అడిగింది. వెంటనే మలివాల్ కాస్తా దూరంగా వెళ్లడంతో ఆ వ్యక్తి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి యూటర్న్ తీసుకొని ఆమె వద్దకు వచ్చాడు. మళ్లీ తనను కార్లో ఎక్కమని ఒత్తిడి చేయడంతో ఆగ్రహం చెందిన మాలివాల్.. నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావ్.. నువ్వు ఇక్కడికి రావడం రెండో సారి.ఇలాంటివి వద్దని పదేపదే చెప్తున్నా’ అని అరుస్తూ కారు డ్రైవర్ వద్దకు వెళ్లారు. కారు డ్రైవర్‌ను కిటికీ ద్వారా బయటకు లాకేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె చేయి లోపల ఉండగానే కారు డ్రైవర్ విండో మూసేశాడు. దీంతో స్వాతి చేయి కారులోనే ఉండగానే నిందితుడు అలాగే 15 మీటర్లు లాక్కెళ్లారు. కాగా స్వాతి మాలివాల్ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని 47 ఏళ్ల హరీష్ చంద్రగా గుర్తించిన పోలీసులు.. ఫిర్యాదు అందిన 22 నిమిషాల్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. బాలెనో కారును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. అతడిని న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అప్పగించింది. దీనిపై స్పందించిన స్వాతి మాలివాల్..తనకు ఎదురైన అనుభవాన్ని భయనక సంఘటనగా అభివర్ణించారు. సమాయానికి తన బృందం అందుబాటులో లేకుంటే మరో అంజలి పరిస్థితి ఎదుర్కొనేదని పేర్కొంది. . దేవుడే తన ప్రాణాలు కాపాడాడని, ఢిల్లీలో మహిళా చైర్ పర్సన్‌కే భదత్ర లేకుండా సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాగా ఈ ఏడాది తొలి రోజు( జనవరి1) అంజలి అనే యువతిని కొంతమంది యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. చదవండి: Video: సచిన్ పైలట్‌ను కరోనాతో పోల్చిన సీఎం అశోక్ గహ్లోత్ Viral Video of Swati Maliwal, claiming AAP leader and Chairperson DCW staging attack on herself to defame Delhi Police and LG; Drama stands exposed. pic.twitter.com/WOZEGDpTub — Megh Updates 🚨™ (@MeghUpdates) January 20, 2023 -
Swati Maliwal: ఢిల్లీ పోలీసులకు ఎన్సీడబ్ల్యూ అల్టిమేటం
ఢిల్లీ: దేశ రాజధాని పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ తాజాగా అల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్‌ను వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యల పూర్తి నివేదికను రెండు రోజుల్లోగా తమ ముందు ఉంచాలని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ.. ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. స్వాతి మలివాల్‌తో తప్పతాగిన ఓ వ్యక్తి బుధవారం అర్ధరాత్రి పూట అనుచితంగా ప్రవర్తించాడని, కారుతో పాటు కొద్దిదూరం లాక్కెళ్లాడని మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకుంది జాతీయ మహిళా కమిషన్. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఢిల్లీ కమిషనర్‌కు రేఖా శర్మ లేఖ రాశారు. అంతకు ముందు ఇదే విషయంపై ఆమె ట్వీట్ కూడా చేశారు. కారుతో ఈడ్చుకెళ్లిన తాగుబోతు! ఇదిలా ఉంటే.. ఢిల్లీలో మహిళ భద్రతను పర్యవేక్షించే క్రమంలో ఎయిమ్స్ గేట్ వద్ద అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో తన టీంతో నిఘా పెట్టారు డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్. అయితే తప్పతాగి కారులో వచ్చిన వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ప్రతిఘటించే సమయంలో ఆమెను కారుతో పాటు లాక్కెళ్లే యత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వాతి మలివాల్.. భగవంతుడి దయతో బయటపడ్డానని, లేకుంటే తాను మరో అంజలి సింగ్‌ను అయ్యేదానిని అంటూ వ్యాఖ్యానించారు కూడా. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి.. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు కూడా. -
బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై లైంగిక ఆరోపణలు.. మహిళా కమిషన్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ డైరెక్టర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌ను విమర్శించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గతంలో మీటూలో భాగంగా ఆయనపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతని బాగోతం బయట పెట్టినందుకు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు అత్యాచార బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె వాపోయారు. (చదవండి: సాజిద్ ఖాన్ ప్రైవేట్ బాగోతంపై నటి సంచలన ఆరోపణలు) సాజిద్ ఖాన్ మైనర్లపై దురాగతాలకు పాల్పడ్డారని స్వాతి మలివాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆడిషన్స్ జరిగే సమయంలో మెనర్లను నగ్నంగా ఉంచారని ఆమె ఆరోపించారు. అలా చేస్తేనే తన సినిమాల్లో అవకాశమిస్తానని బెదిరించేవాడని స్వాతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని వెంటనే బిగ్ బాస్ హౌస్ నుంచి తొలగించాలని ఆమె కోరింది. ఆ షోను వెంటనే ఆపాలని స్వాతి మలివాల్ డిమాండ్ చేసింది. -
వారి పనితీరు అద్భుతం.. అందుకే పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ పదవీ కాలాన్ని సీఎం కేజ్రీవాల్ మరో మూడేళ్లు పొడిగించారు. ఆమె బృందం పనితీరు అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ పదవిలో 2015లో స్వాతి మలివాల్ మొదటిసారిగా నియమితురాలయ్యారు. సీఎం కేజ్రీవాల్ సహకారంతో డీసీడబ్ల్యూ ఢిల్లీలోని లక్షలాది మంది బాలికలు, మహిళల జీవితాలను మార్చడంలో విజయం సాధించిందని ఈ సందర్భంగా స్వాతి మలివాల్ పేర్కొన్నారు. 181 హెల్ప్‌లైన్ ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వేలాది మంది బాలికలను అక్రమ రవాణాదారుల నుంచి, వేశ్యావాటికల నుంచి కాపాడినట్లు చెప్పారు. -
దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందే
-
రాజ్‌ఘాట్ వద్ద స్వాతి మలివాల్ దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న దోషులకు తక్షణ శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ కొనసాగిస్తున్నారు. మంగళవారం జంతర్‌మంతర్ వద్ద దీక్షను ప్రారంభించగా పోలీసులు అనుమతి లేదంటూ ఆమెను అక్కడి నుంచి తరలించారు. దీంతో స్వాతి తన ఆమరణ నిరాహార దీక్షను బుధవారం నుంచి రాజ్‌ఘాట్ వద్ద కొనసాగిస్తున్నారు. ఆమె మట్లాడుతూ.. దిశ ఘటన యావత్తు దేశాన్ని షాక్‌కు గురి చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని, గత మూడేళ్ల కాలంలో ఇలాంటి 55 వేల ఘటనలు ఢిల్లీ మహిళా కమిషన్ దృష్టికి వచ్చాయని తెలిపారు. దిశ ఘటనలో దోషులకు తక్షణ శిక్ష విధింపు, చట్టాల అమలు, పోలీసుల్లో బాధ్యత పెంపు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసే వరకు తన దీక్ష విరమించబోనని ఆమె తెలిపారు. -
ఆరు నెలల్లో ఉరి...రేపటినుంచే దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరోసారి పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గత కొద్ది రోజులుగా నమోదైన అత్యాచార సంఘటనలతోపాటు, హైదరాబాద్‌లో చోటు చేసుకున్న దిశ హత్యాచార ఘటనతో తల్లిడిల్లిన ఆమె మరోసారి నిరహారదీక్షకు దిగనున్నారు. రేపిస్టులకు 6 నెలల లోపు మరణ శిక్ష విధించాలనేది స్వాతి మలేవాల్ డిమాండ్ చేస్తూ రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలనుంచి జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడిన నేరస్థులకు మరణశిక్ష విధించాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి కచ్చితమైన హామీ లభించేంతవరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం ఆమె చేశారు. కాగా మైనర్లపై అత్యాచార కేసుల్లో నేరస్తులకు మరణ శిక్ష వేయాలని స్వాతి గతంలో చాలా సార్లు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై గత ఏడాది ఏప్రిల్‌లో నిరాహార దీక్షను చేపట్టారు. అయితే 12 యేళ్ల లోపు బాలికలపై అత్యాచార ఘటనల్లో నిందితులకు మరణశిక్ష సహా, కఠిన శిక్షలు అమలు చేసేలా కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను పాస్ చేయడంతో 10 రోజుల తరువాత ఆమె తన దీక్షను విరమించిన సంగతి తెలిసిందే. Swati Maliwal, Chairperson, Delhi Commission for Women: I'll sit on hunger strike from 10 am tomorrow at Jantar Mantar. I won't get up until I get assurance from centre that rapists will be served death penalty within 6 months. Police accountability needs to be set. pic.twitter.com/69oauKVGnB — ANI (@ANI) December 2, 2019 -
స్త్రీలోక సంచారం
►ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎ.ఎ.ఐ.) ఇటీవల కాలంలో నియమించిన మహిళా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంఖ్య 2,000 వరకు ఉందని, ఐదేళ్ల క్రితం ఒక శాతంగా ఉన్న ఎ.ఎ.ఐ. మహిళల నియామకాలు నేటికి 10 శాతానికి పెరిగాయని.. ‘గర్ల్స్ ఇన్ ఏవియేషన్ డే – ఇండియా’ (సెప్టెంబర్ 19) సందర్భంగా గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూపేష్ సి.హెచ్.నేగీ తెలిపారు. వాస్కోలోని సెయింట్ ఆండ్రూస్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుతున్న పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థినులు హాజరైన ఈ కార్యక్రమంలో నేగీ మాట్లాడుతూ.. త్వరలోనే కోల్‌కతాకు చెందిన ఒక యువతి తొలి ‘రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటర్’గా వైమానిక దళంలో చేరబోతున్నారని, మహిళలకు ఈ రంగంలో ఇప్పుడు తమ సామర్థ్య నిరూపణకు తగిన ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ►సమాన వేతనం, సాధికారతల విషయంలో పాశ్చాత్య దేశాలు మహిళలకు సానుకూలంగా తమ ధోరణులను మార్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో కూడా స్త్రీల ఉద్దేశాలను, స్త్రీల ఉద్యమాలను గుర్తించి, గౌరవించి, వారి అభీష్టానికి తగినట్లుగా సామాజిక పరివర్తన తెచ్చుకోవడం అవసరమైన అనివార్య దశలో మనం ఇప్పుడు ఉన్నామని సెప్టెంబర్ 21న విడుదలైన తన తాజా చిత్రం ‘మాంటో’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ స్టూడియోస్‌ను సందర్శించిన ఆ చిత్ర కథానాయకుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. ‘‘శతాబ్దాలుగా మహిళల్ని మనం ఎలా అణిచివేస్తూ వస్తున్నామో ఒకసారి మననం చేసుకోవాలి. ఇప్పుడిది మారే దశ. వారి పట్ల మన సంకుచిత, ఆధిక్య దృక్పథాన్ని మార్చుకోవాలి. వారి ఆలోచనలను, కోర్కెలను, మనోభావాలను అర్థం చేసుకుని ప్రవర్తించాలి’’ అని సిద్ధిఖీ అన్నారు. ►‘ఆషా’ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్) కార్యకర్తలకు, అంగన్వాడీ కార్మికులకు పారితోషికం పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తొమ్మిది రోజులకు ఢిల్లీ రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్.. ఆ పారితోషికాన్ని తిరస్కరించింది! ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కోర్స్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో యూనియన్ అధ్యక్షురాలు శివానీ కౌల్ మాట్లాడుతూ, ‘‘అంగన్వాడీలను పర్మినెంట్ చెయ్యాలని, వారికి కనీస వేతనం ఇవ్వాలని ఏళ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం.. కంటి తుడుపుగా పారితోషికాన్ని ప్రకటించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు’’ అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ► ఘర్వాల్ ప్రాంతంలోని డెహ్రాడూన్‌లో ‘గవర్నమెంట్ డూన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (జి.డి.ఎం.సి.హెచ్.)లో పడకలు ఖాళీగా లేవని చెప్పడంతో ఆరు రోజులుగా హాస్పిటల్ కారిడార్‌లో నేల పైనే పడుకుని ప్రసవం కోసం ఎదురుచూసిన 27 ఏళ్ల ముస్సోరీ మహిళ.. నొప్పులు రావడంతో చివరికి అక్కడే ప్రసవించి, వైద్య సంరక్షణ అందక, అధిక రక్తస్రావంతో మరణించిన కొద్ది సేపటికే.. ఆమెకు పుట్టిన బిడ్డ (మగశిశువు) కూడా శ్వాస కోసం ఇరవై నిముషాలు కొట్టుకుని కన్నుమూయడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది. అయితే.. ఆమె భయంతో ప్రసూతి వార్డు నుంచి పరుగులు తీసిందని, బహుశా ఆ కారణంగానే రక్తస్రావం జరిగి ఉంటుందని వివరణ ఇచ్చిన ఆసుపత్రి మహిళా విభాగం చీఫ్ మెడికల్ సూపర్వైజర్ డాక్టర్ మీనాక్షీ జోషి.. బిడ్డ మరణానికి మాత్రం సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ►హరి యాణాలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి ఆ రాష్ట్రంలోని బి.జె.పి. ప్రభుత్వం 2 లక్షల రూపాయలను మాత్రమే నష్టపరిహారంగా ఇవ్వడాన్ని విమర్శిస్తూ.. ‘బీజేపీ నేత ఎవరైనా పదిమంది చేత దాడికి గురైతే తాను 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తానని’ ఆమ్ ఆద్మీ పార్టీ హరియాణా రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ జైహింద్ అనడాన్ని ఆయన భార్య, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. తన భర్త మాటల్లోని ఉద్దేశాన్ని తను అర్థం చేసుకోగలనని, అయితే ఆయన అలా మాట్లాడ్డం సరికాదని స్వాతి అన్నారు.