
బాలీవుడ్ డైరెక్టర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌ను విమర్శించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గతంలో మీటూలో భాగంగా ఆయనపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతని బాగోతం బయట పెట్టినందుకు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు అత్యాచార బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె వాపోయారు.
(చదవండి: సాజిద్ ఖాన్ ప్రైవేట్ బాగోతంపై నటి సంచలన ఆరోపణలు)
సాజిద్ ఖాన్ మైనర్లపై దురాగతాలకు పాల్పడ్డారని స్వాతి మలివాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆడిషన్స్ జరిగే సమయంలో మెనర్లను నగ్నంగా ఉంచారని ఆమె ఆరోపించారు. అలా చేస్తేనే తన సినిమాల్లో అవకాశమిస్తానని బెదిరించేవాడని స్వాతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని వెంటనే బిగ్ బాస్ హౌస్ నుంచి తొలగించాలని ఆమె కోరింది. ఆ షోను వెంటనే ఆపాలని స్వాతి మలివాల్ డిమాండ్ చేసింది.