బిగ్‌బాస్‌ నుంచి పిలుపు.. ఆ అవమానాలు నా వల్ల కాదు: నటుడు | Shoaib Ibrahim Reveals Reason Behind Why He Is Not Participating In The Bigg Boss 18, Deets Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ ఆఫర్‌.. కంటెంట్‌ ఇచ్చేవాళ్లకే ప్రాధాన్యత.. నా వల్ల కాదు!

Nov 10 2024 6:39 PM | Updated on Nov 11 2024 12:19 PM

Shoaib Ibrahim Reveals Reason Behind Turning Down Bigg Boss 18

బిగ్‌బాస్‌ షోకు వెళ్లాలని ఇష్టపడేవాళ్లున్నట్లే ఆఫర్‌ వచ్చినా సరే ఒప్పుకునేది లేదని తిరస్కరించేవాళ్లూ ఉన్నారు. బాలీవుడ్‌ నటుడు షోయబ్‌ ఇబ్రహీం రెండో కోవలోకి వస్తాడు. బిగ్‌బాస్‌ బ్యూటీ దీపిక కక్కర్‌ను పెళ్లాడిన ఇతడికి ఇటీవలే హిందీ బిగ్‌బాస్‌ 18వ సీజన్‌ నుంచి పిలుపు వచ్చింది. ఈ ఆఫర్‌ను అతడు తిరస్కరించాడట!

బిగ్‌బాస్‌ షో మునుపటిలా లేదు
అందుకు గల కారణమేంటని ఓ అభిమాని అతడిని సోషల్‌ మీడియాలో ప్రశ్నించాడు. అందుకు షోయబ్‌ స్పందిస్తూ.. ఈ రియాలిటీ షోలో పాల్గొనాలనిపించలేదు. బహుశా, నేను తీసుకున్న నిర్ణయం తప్పేమో.. కానీ వ్యక్తిగతంగా బిగ్‌బాస్‌ షోపై నాకు సదభిప్రాయం లేదు. ఇప్పుడది పర్సనాలిటీ షో కాదు... కేవలం కంటెంట్‌ మాత్రమే ఇచ్చే షోగా మారిపోయింది.

అందుకే వెళ్లాలనిపించట్లేదు
మొదట్లో కంటెస్టెంట్ల వ్యక్తిత్వాన్ని చూపించేవి. కానీ ఇప్పుడు ఎవరెక్కువ కంటెంట్‌ ఇస్తే వాళ్లనే చూపిస్తున్నారు. వారే గేమ్‌లో ఓ అడుగు ముందుంటున్నారు. అందుకే నాకు వెళ్లాలనిపించలేదు. ఎప్పటికీ ఇదే నిర్ణయంపై ఉంటానని చెప్పడం లేదు. బహుశా కొంతకాలానికి నా అభిప్రాయం మారొచ్చేమో! అప్పుడు షోలో పాల్గొంటానేమో!

కంటెంట్‌పైనే ఫోకస్‌
ప్రస్తుతానికైతే అలాంటి ఆసక్తి ఏమాత్రం లేదు. షోలో కొందరిపై ఎక్కువ ఫేవరిజం చూపిస్తారు. మరికొందరిని ఎక్కువ అవమానిస్తుంటారు. ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కంటెంట్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నట్లుగా అనిపిస్తోంది అని చెప్పుకొచ్చాడు.

సీరియల్స్‌.. షో
కాగా షోయబ్‌.. సాసురల్‌ సిమర్‌ కా అనే సీరియల్‌తో ఫేమస్‌ అయ్యాడు. ఈ ధారావాహికలో నటించిన దీపిక.. తర్వాతి కాలంలో అతడి భార్య అయింది. షోయబ్‌.. కోయి లుట్‌కే ఆయా హై, జీత్‌ గయి తో పియా మోరీ, ఇష్క్‌ మే మర్జావాన్‌ వంటి సీరియల్స్‌లో యాక్ట్‌ చేశాడు. దీపిక విషయానికి వస్తే ఈమె హిందీ బిగ్‌బాస్‌ 12వ సీజన్‌లో పార్టిసిపేట్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement