హౌస్‌లో జంబలకిడిపంబ.. వరుణ్‌కు దిమ్మతిరిగిపోయింది | Bigg Boss Telugu 8: Unlimited fun with Varun Tej | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: తేజ ఐటం సాంగ్‌.. వరుణ్‌తేజ్‌కు ముచ్చెమటలు.. అడ్డంగా దొరికిన దొంగలు

Published Sun, Nov 10 2024 4:36 PM | Last Updated on Sun, Nov 10 2024 4:52 PM

Bigg Boss Telugu 8: Unlimited fun with Varun Tej

బిగ్‌బాస్‌ హౌస్‌ తలకిందులైపోయింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, హౌస్‌లో ఆడ మగగా.. మగ ఆడగా మారిపోయారు. ఆడాళ్లు మగాళ్ల వేషం వేసుకుని మీసాలు మెలేస్తుంటే మగాళ్లు ఆడాళ్లలా చీర కట్టుకుని తెగ హొయలు పోతున్నారు. అక్కడితో ఆగిపోలేదు ఏకంగా ఐటం సాంగ్స్‌ కూడా చేశారు. అలా తేజ.. రంభ, ఊర్వశి, మేనక అంటూ మాస్‌ స్టెప్పులేశాడు. 

దారుణం చూడలేకపోయిన వరుణ్‌
స్పెషల్‌ గెస్టుగా వచ్చిన హీరో వరుణ్‌ తేజ్‌ ఆ దారుణం చూడలేకపోయాడు. ఇకపోతే సూపర్‌ మార్కెట్‌లో బిగ్‌బాస్‌ ఇచ్చిన టైంలోనే షాపింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే హౌస్‌మేట్స్‌ సమయం దాటిపోయాక కూడా కొంత సరుకును దొంగతనం చేశారు. తేజ, ప్రేరణ, యష్మి, నబీల్‌, పృథ్వీ, రోహిణి, నిఖిల్‌.. అంతా కూడా చేతికందిన వస్తువులు దోచేశారు. దీన్ని ఊరికే వదిలిపెట్టలేదు. ఆ దొంగతనం చేసిన సామానుకు రూ.1,85,000 బిల్లు వేసి పంపించారు. 

దొరికిపోయిన దొంగలు
ఇక ఎవరెవరు దొంగతనం చేశారు? ఏయే సామాన్లు ఎత్తుకుపోయారనేది కూడా వీడియో వేసి చూపించడంతో అందరూ బిక్కముఖం వేసుకున్నారు . ఇకపోతే చివర్లో హరితేజ, యష్మి ఇంకా నామినేషన్స్‌లో ఉన్నట్లు చూపించారు. అయితే ఈపాటికే హరితేజ ఎలిమినేట్‌ అయినట్లు వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement