Sajid Khan
-
Pak vs Eng: చెలరేగిన పాక్ స్పిన్నర్లు.. ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం
Pakistan vs England, 3rd Test Day 3: పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టులో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కనబరిచింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2021లో అబుదాబి వేదికగా 72 పరుగులకే కుప్పకూలింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందగా.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఆతిథ్య పాక్ రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది.ఆరు వికెట్లతో చెలరేగిన నొమన్ అలీమూడో టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 267 పరుగులకే కట్టడి చేసిన షాన్ మసూద్ బృందం.. రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ చేసింది. పాక్ స్పిన్నర్లు నొమన్ అలీ, సాజిద్ ఖాన్ ధాటికి తట్టుకోలేక ఇంగ్లిష్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.నొమన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హ్యారీ బ్రూక్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ బెన్‌స్టోక్స్ 12 పరుగులకే వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధించిన 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించిన పాకిస్తాన్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రెండో రోజు ఆట ఇలా సాగిందిబ్యాటర్ల పట్టుదలకు, బౌలర్ల సహకారం తోడవడంతో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో పాకిస్తాన్ మెరుగైన స్థితిలో నిలిచింది. సిరీస్ నిర్ణయాత్మక పోరులో పాకిస్తాన్ ప్లేయర్లు సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 73/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 96.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ప్లేయర్ సౌద్ షకీల్ (223 బంతుల్లో 134; 5 ఫోర్లు) వీరోచిత సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొన్న షకీల్ బౌండరీల జోలికి పోకుండా ఒకటి, రెండు పరుగులు చేస్తూ ముందుకు సాగాడు. ఆఖర్లో స్పిన్ ద్వయం నోమాన్ అలీ (45; 2 ఫోర్లు, ఒక సిక్సర్), సాజిద్ ఖాన్ (48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాకిస్తాన్‌కు 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెప్టెన్ షాన్ మసూద్ (26), వికెట్ కీపర్ రిజ్వాన్ (25) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. సల్మాన్ ఆఘా (1) విఫలమయ్యాడు. సహనానికి పరీక్షగా మారిన స్లో పిచ్‌పై దాదాపు ఐదు గంటలకు పైగా క్రీజులో నిలిచిన షకీల్... నోమాన్ అలీ, సాజిద్ తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రేహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: Ind vs NZ: రోహిత్ శర్మ మరోసారి ఫెయిల్.. నీకేమైంది ’హిట్‌మ్యాన్’?! -
PAK VS ENG 2nd Test: 52 ఏళ్లలో తొలిసారి ఇలా..!
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 152 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్లు చెలరేగిపోయారు. నౌమన్ అలీ 11, సాజిద్ ఖాన్ 9 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించారు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధికి చెందిన 20 వికెట్లు ఈ ఇద్దరు స్పిన్నర్లే తీయడం విశేషం. 52 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. సాజిద్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయగా.. నౌమన్ అలీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మూడు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పాక్ సొంతగడ్డపై 11 మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్ డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తర్వాత తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పాక్ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 291 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ సెంచరీతో (114) సత్తా చాటగా.. మిగతా ఆటగాళ్లెవ్వరూ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్లు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ ఏడు, నౌమన్ అలీ మూడు వికెట్లు పడగొట్టారు.75 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. అఘా సల్మాన్ అర్ద సెంచరీతో (63) రాణించాడు. ఇంగ్లీష్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4, జాక్ లీచ్ 3, బ్రైడన్ కార్స్ 2, మాథ్యూ పాట్స్ ఓ వికెట్ పడగొట్టారు.297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను నౌమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) 144 పరుగులకే కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ టాప్ స్కోరర్‌గా (37) నిలిచాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్ గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
అంత్యక్రియలకు డబ్బుల్లేవ్.. కేవలం రూ.30తో బతికాం: ప్రముఖ దర్శకురాలు
ఫరా ఖాన్ బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ చిత్రనిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా ఫరా ఖాన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. ఆమె అందించిన చాలా పాటలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆమె 80 సినిమాల్లో దాదాపు 100 పాటలకు సంగీతమందించారు. మొదట మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఫరా ఖాన్ ఆ తరువాతే దర్శకురాలిగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె జీవితంలో ఎదురైన అత్యంత దుర్భర పరిస్థితులను వివరించారు. దాదాపు ఆరేళ్ల పాటు స్టోర్ రూమ్‌లో నివసించినట్లు వెల్లడించింది. ఇటీవలే 'ఇండియన్ ఐడల్ 13' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఫరా ఖాన్ మాట్లాడూతూ..' మా తండ్రి చనిపోయినప్పుడు కేవలం 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నాకు 18 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. తన సోదరుడు సాజిద్ ఖాన్‌కు అప్పుడు 14 ఏళ్లు. దీంతో తమ బంధువుల ఇంటిలోని స్టోర్ రూమ్‌లో ఆరేళ్ల పాటు నివసించాం. చివరకు తమకు ఇంటి స్థలం కూడా లేదని వాపోయారు. బిగ్ బాస్-16వ పాల్గొన్న ఆమె సోదరుడు సాజిద్ ఖాన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. మద్యం మత్తులో తన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు చెల్లించడానికి కూడా కుటుంబం వద్ద డబ్బు లేదని అన్నారు. ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ అంత్యక్రియలు, రేషన్, కరెంటు బిల్లుల కోసం డబ్బు ఇచ్చాడని తెలిపారు. -
ముదిరిన బాలీవుడ్ భామల వివాదం.. రాఖీ సావంత్‌పై షెర్లిన్ చోప్రా ఫిర్యాదు
బాలీవుడ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మీటు వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాఖీ సావంత్ సాజిద్ ఖాన్‌కు మద్దతుగా మాట్లాడడంతో వివాదం నడుస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో రాఖీపై ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ చోప్రా ట్వీట్ ద్వారా వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన షెర్లిన్ చోప్రా అనంతరం మీడియాతో మాట్లాడింది. కెమెరాల ముందు ఓ వీడియోను ప్రదర్శిస్తూ రాఖీ సావంత్‌పై విరుచుకుపడింది. నా గురించి కాదు బయట మాట్లాడాల్సింది.. మొదట మీ సోదరుడు రాజ్ కుంద్రా గురించి బహిర్గతం చేయి అంటూ సవాల్ విసిరింది. సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు చేసినవారు చెప్పిందంతా అబద్ధమేనా అంటూ రాఖీ సావంత్‌పై షెర్లిన్ చోప్రా ఫైరయ్యారు. రాఖీ సావంత్, ఆమె లాయర్ సైతం ఆధారాలతో సహా షెర్లిన్ చోప్రాపై కేసు పెట్టినట్లు తెలిపారు.షెర్లిన్ డబ్బు కోసం శక్తివంతమైన వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తుందని రాఖీ సావంత్ ఆరోపించింది. 2018లో సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు రావడంతో పలువురు నటీమణులు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. షెర్లిన్‌తో పాటు సలోని చోప్రా, అహానా కుమ్రా, మందన కరిమి సహా అతనిపై ఆరోపణలు చేశారు. नौटंकीबाज़ राखी सावंत तैयार हो जाए गिरफ़्तार होने के लिए। IPC 354 IPC 354A IPC 499 IPC 500 IPC 509 IPC 503 IT ACT 67A (Sec 4 of Indecent Representation Act 1999) P.S. कांउटर कंप्लेंट करने से अपराध कम नहीं होने वाले 😊@mieknathshinde @Dev_Fadnavis @CPMumbaiPolice @MumbaiPolice pic.twitter.com/czz9lfakyj — Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) November 6, 2022 -
ఒంటరిగా రమ్మన్నాడు, కొలతలు అడుగుతూ అసభ్యంగా..
బిగ్‌బాస్ షో వల్ల కంటెస్టెంట్లు మరింత పాపులర్ అవుతుంటారు. కానీ ఓ వ్యక్తి వల్ల కొద్ది రోజులుగా హిందీ బిగ్‌బాస్ షో పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. బిగ్‌బాస్ 16 వ సీజన్లో అడుగుపెట్టిన సాజిద్ ఖాన్‌పై పలువురు సెలబ్రిటీలు విరుచుకుపడుతున్నారు. షెర్లిన్ చోప్రా, కనిష్క సోని సహా పలువురు.. అతడు చేసిన అరాచకాలను బయటపెడుతూ వెంటనే సాజిద్‌ను బయటకు పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి రాణి చటర్జీ తన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. "హిమ్మత్వాలా సినిమా షూటింగ్లో సాజిద్‌ను మొదటి సారి కలిశాను. తర్వాత ఓసారి ఆయన తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఈ మీటింగ్ మనిద్దరి మధ్యే అని, నా మేనేజర్‌ను వెంటపెట్టుకుని రావొద్దని ఫోన్లో చెప్పాడు. బాలీవుడ్లో అతడు పెద్ద డైరెక్టర్, అందుకని నేను ఆయన చెప్పినట్లు చేశాను. జుహులో ఆయన ఇంటికి ఒంటరిగా వెళ్లాను. ఢోకా ఢోకా ఐటమ్ సాంగ్ కోసం నన్ను సెలక్ట్ చేసిశాడన్నాడు. ఆ పాటలో నేను పొట్టి దుస్తులు వేసుకోవాల్సి ఉంటుందని చెప్తూ నా కాళ్లు చూపించమన్నాడు. ఆయన ఉద్దేశం అర్థం కాక అతడు చెప్పింది చేశా. ఆ వెంటనే ఆయన నా చుట్టు కొలతలు అడుగుతూ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? మీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తారా? అని అభ్యంతరకరమైన ప్రశ్నలు వేశాడు. నన్ను అసభ్యంగా తాకాలని ప్రయత్నించాడు. ఈ విషయం బయటకు చెప్తే ఎక్కడ నన్ను ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తారోనన్న భయంతో ఇంతవరకు నోరు మెదపలేదు " అని చెప్పుకొచ్చింది రాణి చటర్జీ. చదవండి: ప్రపంచంలో అందమైన భామలు.. అందులో దీపికా యాంకర్‌కే కౌంటర్లు ఇచ్చిన సుదీప -
సినిమా ఛాన్స్.. నా నడుము చూపించమన్నాడు: నటి
సంచలనాలకు మారుపేరు బిగ్‌బాస్ రియాలిటీ షో. పలు ప్రాంతీయ భాషల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ షో ఇటీవలే హిందీలో 16వ సీజన్‌ను లాంఛ్ చేసింది. అయితే ఇందులో ఓ కంటెస్టెంట్ పేరు సోషల్ మీడియాలో రెండు రోజులుగా తెగ మార్మోగిపోతోంది. అతడిని బిగ్‌బాస్ హౌస్ నుంచి వెంటనే పంపించేయాలంటూ సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు దర్శకుడు, నటుడు సాజిద్ ఖాన్. మీటూ ఉద్యమ సమయంలో ఇతడిపై పలువురు మహిళల నుంచి లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాంటి వ్యక్తిని బిగ్‌బాస్ షోలోకి ఎలా తీసుకున్నారంటూ నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. తాజాగా పవిత్ర రిష్తా సీరియల్ నటి కనిష్క సోని సైతం సాజిద్ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు తనతో నీచంగా ప్రవర్తించాడని చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. '2008లో ఓ దర్శకుడు నాకు సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు తన ఇంటికి పిలిచి అక్కడ నా టాప్ పైకి ఎత్తి నడుము చూపించమన్నాడు. ఈ విషయాన్ని గత నెలలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాను కానీ అతడి పేరు మాత్రం వెల్లడించలేదు. అయితే ఇప్పుడా వ్యక్తి బిగ్‌బాస్ షోలో ఉండటం, అతడు బయటకు రావాలని సినిమా వాళ్లు కూడా డిమాండ్ చేస్తుండటంతో నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. అతడి నిజస్వరూపం బయటపెడుతున్నందుకు నాకిప్పటికీ కొంత భయంగానే ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్లు నన్ను చంపడానికి కూడా వెనకాడరు. మన భారత ప్రభుత్వం మీద నాకెలాగూ నమ్మకం లేదు కానీ ఆ భగవంతుడు నావైపే ఉంటాడని ఆశిస్తున్నాను. నాకెంతో ఇష్టమైన సల్మాన్ ఖాన్‌ను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా.. క్యారెక్టర్ చూడకుండా ఓ వ్యక్తిని బిగ్‌బాస్‌లోకి ఎలా తీసుకుంటారు? ఇది పక్కన పెడితే తన బండారం బయటపెట్టిన నేను ఇకపై భారత్‌కు తిరిగి రావాలనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్లు నన్ను బతకనివ్వరు, అలా అని నేను అంత వీకేం కాదు. ఇప్పుడిప్పుడే హాలీవుడ్లో అడుగుపెడుతూ నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా' అని చెప్పుకొచ్చింది కనిష్క. View this post on Instagram A post shared by Kanishka Soni (@itskanishkasoni) చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ రోహిత్ త్యాగం.. అతడిని ఎవ్వరూ కాపాడలేరు -
బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై లైంగిక ఆరోపణలు.. మహిళా కమిషన్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ డైరెక్టర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌ను విమర్శించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గతంలో మీటూలో భాగంగా ఆయనపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతని బాగోతం బయట పెట్టినందుకు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు అత్యాచార బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె వాపోయారు. (చదవండి: సాజిద్ ఖాన్ ప్రైవేట్ బాగోతంపై నటి సంచలన ఆరోపణలు) సాజిద్ ఖాన్ మైనర్లపై దురాగతాలకు పాల్పడ్డారని స్వాతి మలివాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆడిషన్స్ జరిగే సమయంలో మెనర్లను నగ్నంగా ఉంచారని ఆమె ఆరోపించారు. అలా చేస్తేనే తన సినిమాల్లో అవకాశమిస్తానని బెదిరించేవాడని స్వాతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని వెంటనే బిగ్ బాస్ హౌస్ నుంచి తొలగించాలని ఆమె కోరింది. ఆ షోను వెంటనే ఆపాలని స్వాతి మలివాల్ డిమాండ్ చేసింది. -
సాజిద్ ఖాన్ ప్రైవేట్ బాగోతంపై నటి సంచలన ఆరోపణలు
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాపులారిటీతో పాటు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బిగ్‌బాస్ హిందీలో 15 సీజన్లు పూర్తి చేసుకొని తాజాగా 16వ సీజన్లోకి అడుగుపెట్టింది. అయితే ఇందులో డైరెక్టర్ సాజిద్ ఖాన్‌ను కంటెస్టెంట్‌గా తీసుకోవడంపై తీవ్ర విమర్శలు రేకేత్తుతున్నాయి. మీటూలో భాగంగా పలువురు మహిళలు ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తిని బిగ్గెస్ట్ రియాలిటీ షోకు తీసుకురావడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా నటి షెర్లీన్ చోప్రా ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. ఓసారి సాజిద్ తన ప్రైవేట్ పార్టుని చూపించి దానికి 10వరకు ఎంత రేటింగ్ ఇస్తావని నాతో చీప్‌గా ప్రవర్తించాడు. ఇప్పుడు నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లి అతడికి రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నా. అలాగే సల్మాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకొని సాజిద్‌ని తప్పించాల్సిందేనంటూ కోరింది. మరోవైపు మందనా కరిమి, సోనా మహపాత్ర, ఉర్ఫీ జావేద్, నేహా భాసిన్ సహా పలువురు ఆర్టిస్టులు సాజిద్ ఖాన్‌ను వెంటనే హౌస్ నుంచి బయటకు వెళ్లగొట్టాలని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. He had flashed his private part at me & asked me to rate it on a scale of 0 to 10. I’d like to enter into the house of Big Boss & give him the rating! Let 🇮🇳 watch how a survivor deals with her molester! Pls take a stand! @BeingSalmanKhan Read more at: https://t.co/j8kPljB1s6 — Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) October 10, 2022 -
బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Pakistan beat Bangladesh by an innings and 8 runs: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 2-0తేడాతో సిరీస్‌ను పాకిస్తాన్ వైట్‌వాష్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 87 పరుగులకే బంగ్లాదేశ్ కుప్పకూలింది. ఫాలో ఆన్ ఆడిన బంగ్లాదేశ్ 205 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా పాకిస్తాన్.. ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో సజిద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా, షాహీన్ ఆఫ్రిది 2వికెట్లు సాధించాడు. కాగా అంతర్జాతీయ స్ధాయిలో తొలిసారి బౌలింగ్ చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఈ టెస్ట్‌లో వర్షం కారణంగా రెండో రోజు, మూడో రోజు ఆట పూర్తిగా రద్దుకావడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 300-4 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అదే విధంగా తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాను పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సాజిద్ ఖాన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు సాజిద్ ఖాన్ కు దక్కగా, మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌కు అబిడ్ ఆలీ ఎంపికయ్యాడు. చదవండి: ICC Test Rankings: బౌలర్‌గా,ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన అశ్విన్.. నెం2.. -
పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ కొత్త చరిత్ర.. బంగ్లాదేశ్ 87 ఆలౌట్
Sajid Khan Best Bowling Vs Ban 2nd Test.. పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ తన టెస్టు కెరీర్లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో సాజిద్ ఖాన్ 8 వికెట్లు తీశాడు. 15 ఓవర్లు వేసి 42 పరుగులిచ్చిన సాజిద్ ఈ ఫీట్ సాధించాడు. కాగా పాకిస్తాన్ టెస్టు చరిత్రలో సాజిద్‌ది నాలుగో అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది. కాగా పాక్ బౌలర్ల దాటికి నలుగురు బంగ్లా బ్యాటర్స్ డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. చదవండి: PAK Vs BAN: బ్యాటింగ్ అయిపోయింది.. ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నావా బాబర్! షకీబ్ అల్ హసన్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఫాలోఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఐదోరోజు రెండో సెషన్లో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే బంగ్లాదేశ్ మరో సెషన్ పాటు నిలదొక్కుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమనే చెప్పొచ్చు. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 300 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బాబర్ అజమ్ 76, అజర్ అలీ 56 పరుగులు చేయగా.. పవాద్ అలమ్ 50 నాటౌట్, మహ్మద్ రిజ్వాన్ 53 నాటౌట్ రాణించారు. ఇక ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టును గెలుచుకున్న పాక్.. రెండో టెస్టులో విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. చదవండి: Queensland Police On England Players: ఇంగ్లండ్ చెత్త ఆట.. క్వీన్స్లాండ్ పోలీస్ విచారణ -
సాజిద్ ఖాన్ మాయాజాలం.. కష్టాల్లో బంగ్లాదేశ్
ఢాకా: పాక్ ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ (6/35) మాయాజాలంతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. మంగళవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 76 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 188/2తో బ్యాటింగ్ కొనసాగించిన పాకిస్తాన్ 98.3 ఓవర్లలో 4 వికెట్లకు 300 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బాబర్ ఆజమ్ (76; 9 ఫోర్లు, 1 సిక్స్), రిజ్వాన్ (53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆలమ్ (50 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. -
నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్, హీరో రితేశ్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న "యారోంకి బారాత్" అనే చాట్ షోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషి.. తన చిన్నతనంలో జరిగిన ఆసక్తికర సంఘటనను వెల్లడించింది. తన సోదరుడు, బాలీవుడ్ నటుడు సకీబ్ సలీంకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణమని, ఓ సందర్భంలో అతనితో గొడవ పడ్డప్పుడు కోపంలో అతని ఆరాధ్య దైవమైన సచిన్ పోస్టర్లను చించేశానని పేర్కొంది. దీనికి బదులుగా అతను తన ఫేవరెట్ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిది ఫోటోలను చించేశాడని వివరించింది. అయితే షో హోస్ట్‌లు.. నువ్వు సచిన్ పోస్టర్లను చించావా అని ప్రశ్నించడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. తను కూడా సచిన్ వీరాభిమానినేనని.. చిన్నతనంలో అన్న చెల్లెల్ల మధ్య ఇటువంటి సంఘటనలు తరుచూ జరుగుతుంటాయని కవర్ చేసుకుంది. తను క్రికెట్‌ను ఫాలో అవుతున్న రోజుల్లో పాక్ ఆటగాడు అఫ్రిది అరంగేట్రం చేశాడని, అతని దూకుడైన ఆటతీరు, అతని హెయిర్ స్టైల్ తనను బాగా ఇంప్రెస్ చేశాయని చెప్పుకొచ్చింది. 90వ దశకంలో ఆఖర్లో అఫ్రిదికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదని, కాబట్టి తాను కూడా అతనికి అకర్షితురాలినయ్యానని తెలిపింది. కాగా, హ్యూమా ఖురేషి 2012లో విడుదలైన "గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్" సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చదవండి: ఆర్సీబీ అభిమానినే కానీ, కోహ్లి నా ఫేవరెట్ క్రికెటర్ కాదు: రష్మిక -
‘సాజిద్ ఖాన్ బలవంతం చేశాడు’
బాలీవుడ్ నిర్మాత సాజిద్ ఖాన్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని అనేకమంది మహిళలు, 2018లో ఇండియాలో #MeToo (మీటూ) ఉద్యమం తారా స్థాయిలో ఉన్న సమయంలో ముందుకొచ్చి చెప్పుకున్న విషయం తెలిసిందే. బాధితుల్లో నటీమణులు సోనాలి చోప్రా, రాచెల్ వైట్, ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి దివంగత నటి జియా ఖాన్, బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా కూడా చేరారు. గతంలో నిర్మాత సాజిద్ ఖాన్ తన సోదరిని వేధించాడని జియా చెల్లి కరిష్మా తాజాగా సంచనల వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నటి షెర్లిన్ కూడా ఈ తరహాలో నిర్మాత తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేశారు. 2005లో సాజిద్ ఖాన్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ట్విటర్ వేదికగా.. ‘'నా తండ్రి మరణించిన తర్వాత నేను అతనిని ఏప్రిల్ 2005 లో కలిశాను. కొద్ది రోజుల తరువాత అతను తన ప్రైవేట్ భాగాన్ని ప్యాంటు నుంచి తీసి చూపిస్తూ దాన్ని ఆస్వాధించాలని నన్ను కోరాడు.నేను తనను కలిసిన సందర్భం వేరు. కానీ అతను చెప్పిన మాటలు వేరు. ఆ సమయంలో ఎంత నరకం అనుభవించానో నాకు ఇంకా గుర్తుంది.’ అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా సాజిద్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో గతేడాది విడుదలైన 'హౌస్‌ఫుల్ 4' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. చదవండి: ‘కేరింత’ నటుడుపై చీటింగ్ కేసు.. కాగా జియా ఖాన్ చనిపోయి ఏడేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమె మరణం గురించి మిస్టరీ వీడడం లేదు. జూన్ 3, 2013న ముంబైలోని తన నివాసంలో జియా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్లో జియాను కొందరు మానసికంగా వేధించారని ఈమె సోదరి కరిష్మా (చెల్లి) సంచలన వ్యాఖ్యలు చేసింది. జియా ఖాన్ డాక్యూమెంటరీ లండన్‌లో ఇటీవల విడుదలైంది. ఓ ప్రముఖ ఛానెల్ ఈమె మరణంపై డెత్ ఇన్ బాలీవుడ్ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఈ సందర్భంగా జియా చనిపోయే ముందు ఆమెను ఎంత వేధించారో, ఎంత బాధపడిందో తెలుపుతూ జియా సోదరి ఈ వ్యాఖ్యలు చేసింది. హౌజ్ ఫుల్ సినిమా సమయంలో తనను వేదనకు గురి చేశారని తెలిపింది. సినిమా షూటింగ్ సమయంలో సాజిద్ ఖాన్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని వాపోయింది. చదవండి: ఆసుపత్రి పాలైన 'ఆర్ఆర్ఆర్' భామ.. ముఖ్యంగా షూటింగ్లో జియా స్క్రిప్ట్ చదివే సమయంతో.. టాప్, లో దుస్తులు తీసేయాలని సాజిద్ తనను బలవంతం చేశాడని, అది తలుచుకుని ఇంటికి వచ్చి ఏడ్చేసిందని చెప్పుకొచ్చింది. ‘ఆ సినిమాతో నాకు కాంట్రాక్ట్ ఉంది. అక్కడి నుంచి వెళ్లిపోతే నాపై కేసు పెట్టవచ్చు. ఒకవేళ వెళ్లకుంటే నేను లైంగిక వేధింపులకు బలైపోతాను. ఇది ఓడిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.’ అని తన సోదరి కన్నీరు పెట్టుకున్నట్లు గుర్తు చేసుకుంది. ఇక జియా సోదరి చేసిన వ్యాఖ్యలపై కంగన రనౌత్ కూడా స్పందించింది. సాజిద్ ఖాన్ అలాంటి వాడే అంటూ ట్వీట్ చేసింది. ‘వాళ్లు జియాను చంపారు.. సుశాంత్‌ను కూడా చంపారు. అలాగే నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు. అయినా కూడా వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతారు. ఎందుకంటే ఆ మాఫియా వాళ్లకు పూర్తి మద్దతుగా ఉంది. ప్రతి సంవత్సరం వాళ్లు ఇంకా బలంగా మారుతున్నారు. ప్రపంచం ఆదర్శంగా లేదని తెలుసుకోండి’ అంటూ వ్యాఖ్యలు చేసింది. They killed Jiah they killed Sushant and they tried to kill me, but they roam free have full support of the mafia, growing stronger and successful every year. Know the world is not ideal you are either the prey or the predator. No one will save you you have to save yourself. https://t.co/7QwHAr9BBv — Kangana Ranaut (@KanganaTeam) January 18, 2021 -
మీటూ మార్పు తెచ్చింది
‘‘మీటూ’ ఉద్యమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక నటిగా, స్త్రీగా నా అభిప్రాయమేంటంటే.. ఈ ఉద్యమాన్ని తేలికగా తీసుకోకూడదు. ‘మీటూ’ వల్ల చిత్ర పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైనది కూడా. బయటకు వచ్చి ఈ విషయాలను చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. బాధితులందరి ధైర్యాన్ని అభినందిస్తున్నాను’’ అని ‘మీటూ’ మూమెంట్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 4’ ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు పూజా. అక్షయ్‌కుమార్, సన్నీ డియోల్, పూజా హెగ్డే, రానా, కృతీ సనన్, కృతీ కర్భందా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ముందుగా ఈ చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకుడు. దాదాపు 70 శాతం సినిమాని కూడా పూర్తి చేశారు. అయితే ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రీకరణలో ఉండగానే, ఆయన మీద ‘మీటూ’ ఆరోపణలు రావడంతో దర్శకుడిగా తప్పించారు. ఆ విషయం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘సినిమా జరుగుతున్న సమయంలో దర్శకుడిని తప్పించడమంటే సినిమాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ నిర్మాణ సంస్థ ఆ ఇబ్బంది ఏం తెలియనివ్వలేదు. ఈ చిత్ర కథా రచయిత ఫర్హాద్ సమ్‌జీను దర్శకుడిగా నియమించింది’’ అని పేర్కొన్నారు. -
‘ఇప్పుడు కుంగిపోయే ప్రసక్తే లేదు’
‘ఆ చేదు అనుభవాల నుంచి నేను నుంచి పూర్తిగా బయటపడ్డాను. అతడికే జీవితం కాస్త మారి ఉంటుంది. మనచుట్టూ ఎంతోమంది నేరగాళ్లు, మోసగాళ్లు ఉంటారు. లైంగిక వేధింపులపై గళం విప్పినప్పుడు ఎంతో మంది నా క్యారెక్టర్‌ను ఇష్టం వచ్చినట్లుగా జడ్జ్ చేశారు. అవమానాలకు గురిచేశారు. అప్పుడు కాస్త బాధ పడ్డాను. కానీ ఇప్పుడు అలా కుంగిపోయే ప్రసక్తే లేదు. నాకు ఎదురైన వేధింపుల గురించి బయటపెట్టడం ద్వారా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. అయితే అందరూ నాలాగా ఉండాలని ఆశించకూడదు కదా’ అని బాలీవుడ్ నటి ప్రియాంక బోస్ తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ తనను లైంగికంగా వేధించారంటూ ప్రియాంక బోస్ మీటూ స్టోరిని బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రియాంక బోస్ ప్రస్తుతం.. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరీక్షతో పాటు మేఘా రామస్వామి ద ఆడ్స్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష గురించి మాట్లాడుతూ.. ‘ ఓ రిక్షావాలా కుటుంబం కథ ఇది. కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకునే తల్లిదండ్రులు పడే వేదనే పరీక్ష. ఇటువంటి సినిమాలో నటించడం ద్వారా నటిగా ఓ మెట్టు ఎక్కినట్టు భావిస్తున్నా అని ప్రియాంక చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయని ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు. ఇక సాజిద్ ఖాన్‌పై నటి సలోని చోప్రాతో పాటు ప్రియాంక బోస్, మందనా కరిమి, రేచల్ వైట్ వంటి పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ అతడిపై ఏడాది పాటు నిషేధం విధించింది. -
నాతో తప్పుగా ప్రవర్తించలేదు
‘మీటూ’ ఉద్యమం సమయంలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ పట్ల సాజిద్ అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ పలువురు కథానాయికలు ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో ‘హౌస్‌ఫుల్ 4’ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారాయన. సాజిద్ ఖాన్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని, అతనితో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గానే అనిపించిందని పేర్కొన్నారు తమన్నా. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హిమ్మత్వాలా, హమ్‌షకల్స్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు తమన్నా. సాజిద్ ఖాన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తమన్నా పంచుకుంటూ – ‘‘నేనెలాంటి సినిమా చేయబోతున్నా, ఆ సినిమా స్క్రిప్ట్ ఏంటి? అన్నదే నాకు ముఖ్యం. నేను, సాజిద్ ఖాన్ కలసి చేసిన రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. తనెప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తనతో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతాను’’ అని పేర్కొన్నారామె. ఇటీవల విద్యాబాలన్ ‘మళ్లీ సాజిద్‌తో కలసి సినిమా చేయబోనని పేర్కొన్నారు’ కదా అని అడగ్గా –‘‘అందరి అనుభవాలు ఒకలా ఉండవు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఒకవేళ విద్యకు బ్యాడ్ఎక్స్పీరియన్స్ ఎదురై ఉంటే ఆమె అలా రియాక్ట్ అయ్యుండొచ్చు’’ అని చెప్పారు తమన్నా. -
మరోసారి హైదరాబాద్ నవాబులు
రామకృష్ణ (ఆర్కే) స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘హైదరాబాద్ నవాబ్స్ 2’. పదేళ్ల క్రితం వచ్చిన ‘హైదరాబాద్ నవాబ్స్’ చిత్రానికి సీక్వెల్ ఇది. రామకృష్ణ, అజీజ్ నాజన్, కెబి జానీ, సాజిద్ ఖాన్, అలీ రాజా, సూఫీ ఖాన్, ఫరా కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘2006లో వచ్చిన మా ‘హైదరాబాద్ నవాబ్స్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడీ సీక్వెల్ కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. వినోదానికి పెద్ద పీట వేశాం’’ అని రామకృష్ణ అన్నారు. ‘‘పూర్తి హాస్యభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని అలీ, అజీజ్ పేర్కొన్నారు. -
రూ 100 కోట్లిస్తే అలా చేస్తావా..
సాక్షి, ముంబై : బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు బ్రేక్ పడటం లేదు. పలువురు మహిళలు సాజిద్ ఖాన్ వేధింపులపై బాహాటంగా ముందుకు రాగా, తాజాగా మరో నటి అహానా కుమ్రా సాజిద్ ఆగడాలను వెల్లడించారు. సాజిద్ వ్యవహారం తెలిసినప్పటికీ గత ఏడాది తాను ఆయనను సాజిద్ నివాసంలో కలిశానని ఆమె చెప్పారు. లైట్లు లేని గదిలోకి తనను తీసుకువెళ్లగా బయట కూర్చుందామని కోరగా, అక్కడ తన తల్లి ఉన్నారని ఆమెకు అసౌకర్యం కలిగించడం తనకు ఇష్టం లేదని సాజిద్ చెప్పాడన్నారు. సాజిద్ సరిగ్గా ప్రవర్తించాలని ఆశిస్తూ తన తల్లి పోలీస్ అధికారి అని చెప్పానన్నారు. అలా చెప్పినా జుగుప్ప కలిగించేలా సంభాషణ ప్రారంభించాడని చెప్పుకొచ్చారు. తాను రూ 100 కోట్లిస్తే శునకంతో లైంగిక చర్యకు పాల్పడతారా అని సాజిద్ అడిగారన్నారు. ఆయన వేసే జుగుప్సాకర జోక్‌లకు తాను నవ్వాలని సాజిద్ ఆశిస్తున్నట్టు గ్రహించానన్నారు. సాజిద్‌పై ఇప్పటికే పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో హౌస్‌ఫుల్ 4 మూవీ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. సాజిద్‌పై నటి సలోని చోప్రాతో పాటు ప్రియాంక బోస్, మందనా కరిమి, రేచల్ వైట్ వంటి పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. -
బలవంతంగా ముద్దు పెట్టబోయాడు!
‘‘నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’’.. మీటూ అంటూ పలువురు సినీ తారలు తమ చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ‘మీకు తోడుగా నేనున్నాను’ మీటూ.. అంటూ పలువురు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు పురుషుల కోసం ‘హీటూ’ రావాలంటున్నారు. కొందరు ‘వియ్ టు’ (వీటూ) అంటూ మగవాళ్లే ముందుకు రావాలని చెబుతున్నారు. ఎవరెవరు ఏమేం అన్నారు? ఎవరెవరు తాజాగా మీటూ అని ఆరోపించారు? అనేది తెలుసుకుందాం. బలవంతంగా ముద్దు పెట్టబోయాడు! వికాస్ బాల్, సాజిద్ ఖాన్, సుభాష్ కపూర్... ఇలా కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్లకు ‘మీటూ’ ఉద్యమ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌత్‌లో కన్నడ స్క్రీన్‌ప్లే రైటర్, డైరెక్టర్ ఎరే గౌడ ఈ జాబితాలో చేరారు. ‘తిథి’ సినిమాకి స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసినప్పుడు ఎరే తనను లైంగికంగా వేధించాడని ఏక్తా అనే యువతి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ‘‘సినిమాలపై ఆసక్తితో చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేద్దామని బెంగళూరు వచ్చాను. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి సహాయం చేస్తానంటూ, ఎరే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత అతనికి దూరంగా వెళ్లిపోయాను’’ అని చెప్పుకొచ్చారు. ఏక్తా చెప్పిన ఈ విషయాన్ని నటి శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎరేపై ఏక్తా చేసిన ఆరోపణ వెంటనే ప్రభావం చూపింది. ఎరే దర్శకత్వంలో వచ్చిన ‘భలేకెంపా’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు సైతం నామినేట్ అయ్యింది. త్వరలోనే ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితం కావాల్సి ఉంది. కానీ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ‘భలేకెంపా’ సినిమాను ప్రదర్శించడం లేదని వెల్లడించారు. అలాగే ఎరే మీద వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తెలిసే వరకు ఈ సినిమాను ఫిల్మ్ ఫెస్టివల్స్ కమిట్మెంట్స్ నుంచి విత్ డ్రా చేసుకుంటున్నాం’’ అని స్వయంగా ఈ సినిమా నిర్మాణసంస్థ జూ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు పేర్కొన్నారట. నా పోరాటం ఆగదు ‘‘అర్జున్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేయడం నా పొరపాటుగా ఒప్పుకోవాలని కొందరు నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆయనపై చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నాను. అర్జున్ పై ఆరోపణలు చేయాలని చేతన్, ప్రకాశ్ రాజ్, కవితా లంకేశ్, మరి కొందరు నన్ను ప్రోత్సహించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. చట్టపరంగా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాపై తమాషా వీడియోలను తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాళ్లు ఏమి కావాలో అది చేసుకోవచ్చు, నేనేం చేయాలో అది చేస్తాను. భట్, సంజన, మరికొందరు నటీమణులు ‘మీటూ’ ఆరోపణలు చేస్తున్నారు. వారికి భవిష్యత్ లేకుండా చేయాలని కన్నడ ఫిల్మ్ చాంబర్ ప్రయత్నిస్తున్నట్లుంది. నా పోరాటం ఆగద’’ని వివరిస్తూ శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాకది పెద్ద షాక్ – అమలాపాల్ ఇటీవల ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ లీలా మనిమేకళై దర్శకుడు సుశీ గణేశన్ తనను వేధించారని ఆరోపించారు. ఇప్పుడు నటి అమలాపాల్ కూడా సుశీపై ఆరోపణలు చేశారు. ‘‘లీలాను నేను నమ్ముతున్నాను. సుశీ డైరెక్షన్లో ‘తిరుట్టుపయలే 2’ అనే సినిమా చేశాను. సెట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడేవాడు. మహిళల పట్ల అతని ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదు’’ అన్నారు అమలాపాల్. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘‘సుశీ, ఆయన భార్య మంజరి నాకు కాల్ చేశారు. ఈ ఇష్యూ గురించి మంజరికి వివరిస్తున్నప్పుడు సుశీ తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మంజరి నవ్వడం ఆశ్చర్యంగా అనిపించింది. నాపై పగ తీర్చుకోవడానికి వాళ్లు ఏకమయ్యారు. నేను భయపడతానని వాళ్లనుకుంటున్నారేమో’’ అన్నారు. పురుషులకు ‘హీటూ’ ఉండాలి ఒకవైపు ‘మీటూ’కి పలువురు మద్దతుగా నిలుస్తుంటే బాలీవుడ్ తార రాఖీ సావంత్, కన్నడ తార హర్షికా పూనాచా మాత్రం వ్యతిరేకంగా మాట్లాడారు. ‘‘తనుశ్రీ పబ్లిసిటీ కోసమే నానాపై ఆరోపించిందని, తనకు పిచ్చి అని నేను అన్నందుకు నాపై పది కోట్ల పరువు నష్టం దావా వేస్తే, నన్ను లో క్లాస్ గాళ్ అని అన్నందుకు ఆమెపై నేను 50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. ‘మీటూ’ ఉద్యమంలో మహిళలు చెబుతున్నవన్నీ వాస్తవాలని ఎందుకు నమ్ముతున్నారు? అయోధ్యన్ సుమన్, హృతిక్‌రోషన్ ఎంతో టార్చర్ అనుభవించారు. మహిళలకు ‘మీటూ’ ఉన్నట్లే.. పురుషులకు ‘హీటూ’ లేదా ‘మెన్‌టూ’ మూమెంట్స్ ఉండాలి’’ అని రాఖీ సావంత్ అన్నారు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం హర్షిక పూనాచా ‘వీటూ’ (వియ్ టూ) మూమెంట్ రావాలని అభిప్రాయపడుతూ ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో ఉంచారు. ‘‘మీటూ’ డెవలప్‌మెంట్స్‌ను గమనిస్తున్నా. మహిళల ప్రమేయం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక స్ట్రాంగ్ ఉమెన్‌గా నా అభిప్రాయం. పబ్లిసిటీ కోసమే కొందరు నటీమణులు ఫెమినిటీని ఓ టూల్‌గా వాడుకుంటున్నారు. పదేళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు ‘యాక్టివిస్ట్ యాక్ట్రసెస్’గా చెప్పుకుంటున్న కొందరు కెరీర్ స్టార్టింగ్‌లో తమ సౌకర్యాల కోసం పురుషులకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఆ తర్వాత పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారు. ‘మీటూ’కి సంబంధించి నా దగ్గర కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు. ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఎ’ లిస్ట్ సూపర్ స్టార్స్ పేర్లు మీటూ ఉద్యమంలో ఎందుకు రావు? సూపర్ స్టార్ హీరోయిన్లు ఎందుకు స్పందించడం లేదు. ఇప్పుడు ‘మీటూ’ ఉద్యమంలో ఉన్న కొందరు తారలు హ్యాపీగా మత్తు పీలుస్తూ.. మీటూ ఉద్యమంలో ఫేమస్ పర్సనాలిటీస్‌ను ఎలా లాగాలి? అని చర్చించుకుంటున్న వీడియోను చూశాను. ఇంకో వీడియోలో అర్ధనగ్నంగా కారులో ఉన్న ఓ హీరోయిన్ ‘మీ తర్వాతి చిత్రంలో కూడా నేనే హీరోయిన్.. ఓకేనా’ అని ఓ ఫేమస్ హీరోని అడగడం చూశాను. ఒక నటిగా నన్ను కొందరు ‘ఆఫర్స్’ అడిగారు కానీ నేను నో చెప్పాను. దానివల్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో నేను చాన్సులు మిస్ అయ్యుండవచ్చు. కానీ నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. ఈ రోజు నేను చెప్పిన ఈ విషయాలను కొందరు వ్యతిరేకించవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు. ఇండస్ట్రీలో కొందరు చెడ్డ వ్యక్తులు ఉండవచ్చు. వర్క్ ఇస్తామంటూ మహిళలను ప్రలోభ పెట్టవచ్చు కానీ మహిళల ప్రమేయం ఎంతో కొంత లేకుండా బలవంతంగా రేప్ చేయలేరు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం. ‘మీటూ’ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్న మహిళలను ఒక విషయం కోరుతున్నాను. దయచేసి రియల్‌గా ఉండండి. ఇప్పుడు పురుషులు ‘వీటూ’ అనే ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నా తోటి నటీమణులకు వ్యతిరేకంగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. అయితే ఇతరులు మనల్ని, మన ఇండస్ట్రీని అపహాస్యం చేస్తున్నారు. మనకు ఇండస్ట్రీ ‘బ్రెడ్ అండ్ బటర్’ ఇస్తోంది. ఆ పరిశ్రమను అపహాస్యం కానివ్వకూడదు ’’ అని చెప్పుకొచ్చారు. సుశీ గణేశన్, అమలాపాల్ -
నిర్మాత శ్రేయస్సే ముఖ్యం
నటి తనుశ్రీ దత్తాను పదేళ్ల క్రితం లైంగికంగా వేధించారని నటుడు నానా పటేకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘హస్‌ఫుల్ 4’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఆరోపణలు క్లియర్ అయ్యే వరకూ సినిమా షూటింగ్ నిలిపివేద్దాం అని హీరో అక్షయ్ కుమార్ టీమ్‌ని కోరిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ మీద కూడా ఈ ఆరోపణలు రావడంతో దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారాయన. తాజాగా ఈ సినిమా నుంచి నానా పటేకర్ కూడా తప్పుకున్నారట. ‘‘అందరి సౌకర్యం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు నానా పటేకర్. ఈ సినిమా నుంచి తప్పుకోవడమే సరైన స్టెప్. ఎవరైనా నిర్మాత శ్రేయస్సే కోరుకుంటారు. అందుకే.. నానా కూడా సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని నానా తనయుడు మల్హర్ మీడియాతో చెప్పారు. ప్రస్తుతం నానా పటేకర్ స్థానంలో అనిల్ కపూర్ పేరుని పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. -
మీటూ : సాజిద్‌కు షోకాజ్ నోటీసు
సాక్షి, ముంబై : బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన క్రమంలో వీటిపై వివరణ ఇవ్వాలని భారత చలనచిత్ర, టీవీ దర్శకుల సంఘం సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. మీటూ క్యాంపెయిన్‌లో భాగంగా తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై వారంలోగా స్పందించాలని లేకుంటే చర్యలు చేపడతామని ఆయనకు జారీ చేసిన నోటీసులో పేర్కొంది. హమ్‌షకల్స్, హిమ్మత్వాలా మూవీల దర్శకుడిగా మీకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని వర్ధమాన నటులు రేచల్ వైట్, సిమ్రాన్ సూరిలపై లైంగిక వేధింపులకు దిగడం దారుణమని పేర్కొంది. ప్రముఖ జర్నలిస్ట్ కరిషామ ఉపాథ్యాయ్ నుంచి ఈ మెయిల్ ఫిర్యాదులు సైతం తమను దిగ్ర్భాంతికి గురిచేశాయని అసోసియేషన్ తెలిపింది. మీ అసభ్య చేష్టలతో భారత చలనచిత్ర, టీవీ దర్శకుల సంఘం ప్రతిష్టను దిగజార్చారని ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఆడిషన్ కోసం వెళితే.. సాజిద్ ఖాన్‌పై తాజాగా నటి సిమ్రాన్ సూరి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2012లో హిమ్మత్వాలా మూవీలో పాత్ర గురించి లుక్ టెస్ట్ కోసం తనను సాజిద్ ఖాన్ తన ఇంటికి రమ్మని పిలిచి తనను లోబరుచుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తాను ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో సాజిద్ ఫార్మల్ దుస్తుల్లో ట్రెడ్‌మిల్‌పై ఉన్నారని, తనను దుస్తులు తీసివేయమన్నారని చెప్పుకొచ్చారు. అందుకు నిరాకరించి తాను అక్కడి నుంచి వచ్చేశానని చెప్పారు. సాజిద్ తర్వాత పలుమార్లు ఫోన్ చేయగా తాను గట్టిగా ప్రతిఘటించానని చెప్పారు. -
#మీటూ : స్పందించిన సాజిద్ సోదరి
మీటూ ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతున్న నేపథ్యంలో..బాలీవుడ్ నటి సలోని చోప్రా డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నటులు డ్రెస్ మార్చుకునే గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని, వారి డ్రెస్ తీసి చూపించమని అడిగేవాడని, వాటిని తను అడ్డుకోబేతే బయటకు పంపేవాడని పేర్కొంది. తనను లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. సినిమాలో అవకాశం కావాలంటే తనతో గడపాలన్నాడని, చాలా మంది మహిళలను ఇలానే వాడుకున్నాడని తెలిపింది. సమయం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటపెడుతున్నట్లు సలోని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాజిద్ సోదరి ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ స్పందించారు. ‘ఇది మా కుటుంబానికి ఎంతో బాధాకరమైన సమయం. కొన్ని క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి మేం కృషి చేయాలి. ఒకవేళ నా సోదరుడు ఓ మహిళ పట్ల అలా ప్రవర్తించి ఉంటే..అతడు తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మహిళలను ఎవరైనా కించపరిచినా.. ఇబ్బందిపెట్టేటట్లు ప్రవర్తించినా..మేము బాధిత మహిళకు మద్దతుగా ఉంటాం. ఇలాంటివి సహించమ’ని ఫరా ఖాన్ ట్వీట్ చేశారు. This is a heartbreaking time for my family.We have to work through some very difficult issues. If my brother has behaved in this manner he has a lot to atone for.I don’t in any way endorse this behavior and Stand in solidarity with any woman who has been hurt. — Farah Khan (@TheFarahKhan) October 12, 2018 సలోలి చోప్రా ఆరోపణల నేపథ్యంలో సాజిద్ ఖాన్ దర్శకత్వంలో చేస్తున్నహౌస్ ఫుల్ 4 చిత్రాన్ని ఆపేస్తున్నట్లు అక్షయ్ కుమార్ ప్రకటించాడు. సాజీద్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ పూర్తైన తరువాత షూటింగ్ మొదలు పెడుదామని ట్వీట్ చేశాడు. -
#మీటూ: సలోని సంచలన ఆరోపణలు
ముంబై: భారత్‌లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కో బాధితురాలు తమకు జరిగిన చేదు అనుభవాలను తెలుపుతూ పెద్ద మనుషులగా చెలామణి అవుతున్న ఒక్కోక్కరి వ్యక్తిత్వాలను బయట పెడ్తున్నారు. ఇలా నానా పటేకర్, వికాస్, అలోక్ నాథ్, సుభాష్ ఘాయ్, రజత్ కపూర్ల చీకటి వ్యవహరాలు వెలుగులోకి రాగా.. తాజాగా డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై బాలీవుడ్ నటి సలోని చోప్రా సంచలన ఆరోపణలు చేసింది. 2011లో సాజిద్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సలోని.. అది తన జీవితంలోనే ఓ భయంకరమైన అనుభవంగా అభివర్ణించింది. ఇంటర్వ్యూలోనే ‘స్వయం సంతృప్తి పొందుతావా? వారానికి ఎన్నిసార్లు?’ అనే అసభ్యకర ప్రశ్నలతో సాజిద్ తనపట్ల అమానుషంగా ప్రవర్తించాడని తెలిపింది. ఇక అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిన తరువాత చుక్కలు చూపించాడని పేర్కొంది. తను డైరెక్టెర్ అసిస్టెంట్‌ను మాత్రమేనని, అసిస్టెంట్ డైరెక్టర్‌ను కాదని చెబుతుండేవాడని, బికీని ఫొటోలు అడిగేవాడని ఆరోపించింది. నటులు డ్రెస్ మార్చుకునే గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని, వారి డ్రెస్ తీసి చూపించమని అడిగేవాడని, వాటిని తను అడ్డుకోబేతే బయటకు పంపేవాడని పేర్కొంది. తనను లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. సినిమాలో అవకాశం కావాలంటే తనతో గడపాలన్నాడని, చాలా మంది మహిళలను ఇలానే వాడుకున్నాడని తెలిపింది. సమయం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటపెడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇక సాజిద్‌ఖాన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ జర్నలిస్టు సైతం ఆరోపించింది. ఇంటర్వ్యూలో అనవసరంగా అతని పురుషాంగం గురించి ప్రస్తావిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడని ఆరోపించింది. ఇక మరో నటి రచెల్ వైట్ సైతం సాజీద్ ఖాన్ తనను లైంగికంగా వేదించాడని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. అతన్ని తొలిసారి కలిసిప్పుడు తనని బట్టలు తీసేయమన్నాడని పేర్కొంది. I believe you @redheadchopra I was sent by my agency then to meet Sajid Khan during Humshakals. Right after my agency told me about the meeting Sajid called me within the next 5 mins and said the meeting would be at his house opp iskon Juhu. — Rachel White (@whitespeaking) October 11, 2018 షూటింగ్ రద్దు చేయండి: అక్షయ్ కుమార్ తను హీరోగా సాజీద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హౌస్ ఫుల్ షూటింగ్‌ను నిలిపేయాలని అక్షయ్ కుమార్ చిత్ర నిర్మాతలక విజ్ఞప్తి చేశాడు. సాజీద్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ పూర్తైన తరువాత షూటింగ్ మొదలు పెడుదామని ట్వీట్ చేశాడు. pic.twitter.com/deSRvNnkAA — Akshay Kumar (@akshaykumar) October 12, 2018 చదవండి: #మీటూ ఉద్యమ వార్తలు -
'రజినితో సినిమాకు 300 కోట్లు కావాలి..!'
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లిస్ట్ సామన్య ప్రేక్షకులతో పాటు టాప్‌క్లాస్ సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ కూడా రజినీకి బిగెస్ట్ ఫ్యాన్ అట. అంతేకాదు రజినీ లాంటి టాప్‌స్టార్‌తో సినిమా చేయటం అంత ఈజీకాదని, ఈ సూపర్ స్టార్‌తో సినిమా చేయాలంటే కనీసం మూడు, నాలుగు వందల కోట్ల బడ్జెట్ కావాలంటూ తన అభిమాన నటుణ్ణి ఆకాశానికి ఎత్తేవాడు సాజిద్. 'రజినీ కాంత్ ఇమేజ్‌కు తగ్గ సినిమా చేయటం మామూలు విషయం కాదు. రోబో, శివాజీ లాంటి సినిమాలతో రజినీ కాంత్‌ను అద్భుతంగా చూపించిన శంకర్‌కు హాట్సాఫ్. ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న రజినీ హీరోగా సినిమా తెరకెక్కించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా కంటే నటుడు గొప్పగా అనిపించటం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి నటుడే రజినీ. సినిమా చూడటం కన్నా, రజినీ కాంత్ ను చూడటానికే ఎక్కువ మంది థియేటర్లకు వస్తారు. అందుకు తగ్గట్టుగా సినిమా తెరకెక్కించాల్సి ఉంటుంది.' అంటూ రజినీకాంత్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు సాజిద్. -
'రజనీకాంత్.. ఆసియా సూపర్ స్టార్'
ముంబై: ప్రాంతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిన ఘనత తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్దేనని దర్శకుడు సాజిద్ ఖాన్ ప్రశంసించారు. జాకీచాన్ మాదిరిగా అమితాదరణ ఉందని, రజనీకాంత్ ఆసియా సూపర్‌స్టార్ అని అన్నారు. రజనీకాంత్ గురించి రాసిన 'ద వారియర్ వితిన్' పుస్తకాన్ని సాజిద్ ఖాన్ ఆవిష్కరించారు. రజనీని అమితంగా ఆరాధించే అభిమానుల్లో తానొకడని, రజనీకాంత్ జీవిత విశేషాలతో కూడిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. రజనీకాంత్‌ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో పోల్చారు. 'అమితాబ్, రజనీలు ఇద్దరూ లెజెండ్స్, సూపర్ స్టార్స్. అసంఖ్యాక అభిమానుల్ని సంపాదించారు. అభిమానుల నుంచి అమితాదరణ పొందారు. సినిమా స్థాయిని పెంచారు. రజనీకి నేను వీరాభిమాని అయినా మరో ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ అంటే చాలా గౌరవం. రజనీ జీవితం గురించి పుస్తకం రాసినా, సినిమా తీసినా ఆసక్తికరంగా ఉంటుంది' అని సాజిద్ ఖాన్ అన్నారు.