BAN vs PAK: Sajid Khan History Best Bowling Bangladesh All Out For 87- Sakshi
Sakshi News home page

BAN vs PAK: పాక్‌ స్పిన్నర్‌ సాజిద్‌ ఖాన్‌ కొత్త చరిత్ర.. బంగ్లాదేశ్‌ 87 ఆలౌట్‌

Published Wed, Dec 8 2021 1:36 PM | Last Updated on Wed, Dec 8 2021 1:54 PM

BAN vs PAK: Sajid Khan History Best Bowling Bangladesh All Out For 87 - Sakshi

Sajid Khan Best Bowling Vs Ban 2nd Test.. పాకిస్తాన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ సాజిద్‌ ఖాన్‌ తన టెస్టు కెరీర్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో సాజిద్‌ ఖాన్‌ 8 వికెట్లు తీశాడు. 15 ఓవర్లు వేసి 42 పరుగులిచ్చిన సాజిద్‌ ఈ ఫీట్‌ సాధించాడు. కాగా పాకిస్తాన్‌ టెస్టు చరిత్రలో సాజిద్‌ది నాలుగో అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది. కాగా పాక్‌ బౌలర్ల దాటికి నలుగురు బంగ్లా బ్యాటర్స్‌ డకౌట్‌గా వెనుదిరగడం విశేషం.

చదవండి: PAK Vs BAN: బ్యాటింగ్‌ అయిపోయింది.. ఇప్పుడు బౌలింగ్‌ చేస్తున్నావా బాబర్‌!

షకీబ్‌ అల్‌ హసన్‌ 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఫాలోఆన్‌ ఆడుతున్న బంగ్లాదేశ్‌ ఐదోరోజు రెండో సెషన్‌లో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే బంగ్లాదేశ్‌ మరో సెషన్‌ పాటు నిలదొక్కుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమనే చెప్పొచ్చు. అంతకముందు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 300 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. బాబర్‌ అజమ్‌ 76, అజర్‌ అలీ 56 పరుగులు చేయగా.. పవాద్‌ అలమ్‌ 50 నాటౌట్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ 53 నాటౌట్‌ రాణించారు. ఇక ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టును గెలుచుకున్న పాక్‌.. రెండో టెస్టులో విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది.

చదవండి: Queensland Police On England Players: ఇంగ్లండ్‌ చెత్త ఆట..  క్వీన్స్‌లాండ్‌ పోలీస్‌ విచారణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement