సాజిద్‌ ఖాన్‌ మాయాజాలం.. కష్టాల్లో బంగ్లాదేశ్‌ | Sajid Khan Shines With Bowling Taken 6 Wickets PAK vs BAN1st Test | Sakshi
Sakshi News home page

PAK vs BAN: సాజిద్‌ ఖాన్‌ మాయాజాలం.. కష్టాల్లో బంగ్లాదేశ్‌

Published Wed, Dec 8 2021 8:37 AM | Last Updated on Wed, Dec 8 2021 8:46 AM

Sajid Khan Shines With Bowling Taken 6 Wickets PAK vs BAN1st Test - Sakshi

ఢాకా: పాక్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ సాజిద్‌ ఖాన్‌ (6/35) మాయాజాలంతో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ కష్టాల్లో పడింది. మంగళవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 76 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 188/2తో బ్యాటింగ్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 98.3 ఓవర్లలో 4 వికెట్లకు 300 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. బాబర్‌ ఆజమ్‌ (76; 9 ఫోర్లు, 1 సిక్స్‌), రిజ్వాన్‌ (53 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఆలమ్‌ (50 నాటౌట్‌; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement